Monday, September 9, 2013

ఇదెక్కడి (తెలబాన్) న్యాయం ?

ఎన్జీవోల సభ జరిగిన రోజు ఎల్బీ స్టేడియం బైట నిజాం కాలేజీ విద్యార్ధులని పీక కోసేస్తానని ఒక సీమాంధ్రుడు  హెచ్చరించాడంటూ తెలంగాణా మీడియా అదే పనిగా ప్రచారం చేసేస్తోంది. 

http://www.youtube.com/watch?v=O0Ws3BGK9AU

ఆ సీమాంధ్రుడు (?) ఎందుకలా అన్నాడో - అలా అనటానికి ముందు నిజాం కాలేజీ విద్యార్ధులు ఏమైనా అన్నారేమో వంటి విషయాలు ఎవరికీ పట్టవు.  కానీ గల్లీ నుండి డిల్లీ స్థాయి నాయకులందరూ ఘోరం జరిగి పోయిందని గుండెలు బాదేసుకుంటూ ఆ వ్యక్తి పై పోలీసు కేసులు బనాయించేశారు.  సైగలు  చేయటమే పోలీసు కేసు పెట్టేంత పెద్ద నేరమైతే..... 

https://www.youtube.com/watch?v=SJL_5iYUMY8

పై వీడియో లో  00.35  -  01.13  సమయంలో ఒక ఓ యూ జేఏసీ విద్యార్ధి నాయకుడు ఏమన్నాడో వినండి..         
టీవీ కెమెరాల సాక్షిగా " ఏపీ ఎన్జీవో లు దిగ్బంధనాన్ని ధిక్కరించి సమావేశానికి వస్తే తంతాం.  తన్ని తీరతాం. చెప్పేది వినకుండా బందు ని ధిక్కరించి లోనికి వస్తే తెలంగాణా వారి చేతిలో చావు దెబ్బలు తప్పవు" అని ప్రకటించిన విద్యార్ధి నాయకుణ్ణి సమావేశం రోజు ముందస్తు అరెస్టు చేసారో లేదో కూడా తెలియదు.  పోలీసులు,  కోర్టులు సు మోటో గా కేసులు ఎందుకు బుక్ చెయ్యవు? తెలంగాణా వారికొక న్యాయం - బైటి వారికొక న్యాయం అమలు జరుగుతోందా?       అలాగే  సమావేశం లో గలాటా చేసిన పోలీసు కి,  బైట గలాటా చేసిన మరో విద్యార్ధి నాయకుడి కి దెబ్బలు తగిలాయని ఆక్రోశిస్తారే తప్ప తాము  బస్సు ల పై చేసిన దాడులని , అందులో గాయ పడ్డ ఆంధ్రా ఎన్జీవో ల గురించి గురువింద తెలబాన్లు ఎందుకు మాట్లాడరు?

21 comments:

  1. తెలబాన్లు కి న్యాయం కూడానా? వాళ్ళ డిక్షనరీ లోనే లేదు.

    ReplyDelete
  2. aakaasa raamanna gaaru,

    pidamarti oka mahonnatamaina vyakti. swaatantra samara yodhudu, vidyaavantudu. eeyana ekkuvagaa chaitanya, naaraayana collegeela daggara tachchaadutuntaadu. tana M.A degreeni etti partistitulalonainaa, enni dasaabdaalu dandayaatralu chesainaa poorti cheyyaalanukune pattudala kalavaadu. raaboye maa bangari telangaanaaku kaaboye maa home minister pidamarti ravi gaare, mee kenduku anta manta.

    ReplyDelete
  3. తెలంగాణపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ల్ లో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామన్నారు ఎపిఎన్జీవో అధ్యక్షుడు....
    అసెంబ్లీలో తీర్మానం వీగిపోయేలా చేయాలి, అప్పటికీ ఢిల్లీ నిర్ణయం మారకపోతే తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామన్నారు సీమాంధ్ర మంత్రులు.....
    మొదటిది బలప్రదర్సన....
    రెండోది రాజకీయ వ్యూహం.....
    ఈ రెండూ తెలంగాణ ప్రజలను సమైక్య భావనకు ఒప్పించే విధానాలు కావు....
    లొంగదీసుకునే విధానాలు మాత్రమే.....
    సమైక్యత అన్నది ఆధిపత్యానికి సంబంధించిన విషయం కాదు....
    అనుబంధానికి సంబంధించిన విషయమని గుర్తించకపోవడమే
    సీమాంధ్ర రాజకీయ నాయకుల వైఫల్యం. ...
    విభజనకు కారణలను గుర్తించడానికి అహంకరించేవారికి సమైక్యతను కోరే అర్హత ఎక్కడిది???
    సీమాంధ్ర నాయకత్వం తెలంగాణను లొంగదీసుకునే రాజకీయాలకు పాల్పడుతున్నంత కాలం విభజనవాదం బలపడుతూనే ఉంటుంది.....
    సమైక్య రాష్ట్రం అందరికీ మంచిదని వారు చెప్పలేకపోతున్నారు....
    తమకు అవసరమని మాత్రమే చెబుతున్నారు......
    అవసరాలు తీరడానికి ప్రత్యామ్నాయాలుంటాయి.....
    ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి మాత్రం విడిపోవడమొక్కటే మార్గం.....

    ReplyDelete
    Replies
    1. సీమాంధ్ర రాజకీయ నాయకులు వైఫల్యం చెందారన్న మాట వాస్తవం ... అయితే ఎందులో వైఫల్యం చెందారు? ఆధిపత్యాలు, దోపిడీలు అంటూ అబద్ధాలతో, అసత్యాలతో కూడిన తెలబాన్ల ప్రచారాలని ఖండించటంలో! అమాయకులైన తెలంగాణా ప్రజలలో, విద్యార్ధులలో విద్వేష భావాలు నింపుతూ వేర్పాటు వాదాన్ని పెంచడాన్ని ఆపలేక పోయారు. సాంప్రదాయ పద్ధతిలో విభజన కోసం శాసన సభలో తీర్మానం పెడితే మెజారిటీ తమదే కదా తేలికగా కొట్టి వేయచ్చన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో నిద్ర పోయారే గానీ కేంద్రం తో కుమ్మక్కు అయి దొడ్డి దారిలో రాష్ట్రాన్ని, రాజధానిని కాజేస్తారని ఊహించడం లో విఫలం అయ్యారు. మరి ఇప్పుడు కేవలం ఒక రాజకీయ పార్టీ స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు బల ప్రదర్శనలు, రాజకీయ వ్యూహాలు తప్పవు.

      Delete
  4. ఆకాశ రామన్న తెలబాన్ అంటే ఏంది? ఎందుకు రెచ్చ కొట్టే రాతలు రాస్తారు?

    ReplyDelete
    Replies
    1. తెలబాన్ అంటే ఏమిటో ఇక్కడ చదవండి ...
      http://andhraaakasaramanna.blogspot.in/2011/01/blog-post_20.html

      Delete
  5. ఏందన్నా ఇది??
    నువ్వు చరిత్ర తెలుసుకోకపోతివి
    నేంజెప్తే ఇనకపోతివి
    చెప్పిందే చెప్తా ఉంటివి
    అరిగిపోయిన ఐకమత్యపు పాటే మల్ల మల్ల పాడుతుంటివి.

    ఇష్టం లేకున్నా కలిపిండ్లన్నా అని నేనంటే
    మేమే నిన్ను పైకి తీస్కచ్చినమని నువ్వంటివి.

    పెద్దమనుషుల ఒప్పందం పక్కకు పెట్టిండ్లన్నా అని నేను మొత్తుకుంటే
    మాకు పెద్ద మనసు లేకనే ఇడగొడుతున్నమని నువ్వంటివి.

    ఉపముఖ్యమంత్రి అనేది ఉత్తుత్తి మాట లెక్క చేసిండ్లన్నా అని నేనంటే
    మా నాయకులు చేతగానోల్లని నువ్వంటివి.

    కలిపినప్పుడు అనుకున్న ఆరు సూత్రాలను అంగట్ల అమ్మేశిండ్లన్నా అని నేనంటే
    గా ముచ్చటే సమజ్ జేస్కోకుండా హైదరాబాద్ పై హక్కుల గురించి నువ్ మాట్లాడుతుంటివి.

    మా నౌకర్ల మాకు కాకుండా జేసిండ్లన్నా అని నేనంటే
    సర్కారు కొలువుల లెక్కలు చిక్కులు అర్థం జేస్కోకుండా
    ఎవలు సదువుకుంటే వాల్లకే నౌకర్లస్తయని సొక్కంపూస లెక్క జెప్తుంటివి.

    ముల్కి నిబందనలు మట్టిల కలిపిండ్లన్నా అని నేనంటే
    ఆ మతలబు ఏందో అడుగకుండా ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నానని నువ్వంటివి.

    తెలంగాణ నిధుల పైసలు తెల్వకుండా పట్టుకపోతుండ్లన్నా అని నేనొర్రుతుంటే
    ఇనిపించుకోకుండా కలసి ఉంటే కలదు సుఖం అని చిలక పలుకులు పలుకుతింటివి.

    దేశమంతా మాట్లాడుకునే ఎన్నో ఏండ్ల హైదరాబాద్ చరిత్ర గురించి నేంజెప్తుంటే
    రియల్ ఎస్టేట్లు, కార్పొరేట్ దందాలే హైదరాబాద్ అభివృధ్ధి అన్నట్లు నువ్ జెప్తుంటివి.

    మా చరిత్ర గురించి భాష గురించి ఎక్కడ జెప్పకుండా
    మాది సక్కటి భాష కాదని మాకే అనిపించేటట్లు సదువులు మార్చేసిండ్లన్నా అని నేనంటే
    వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అంటూ అసలు విషయం పక్కన బెడితివి.

    నువ్ తెలంగాణ చరిత్ర తెలుసుకోకపొతివి..
    సాయుధ పోరాటం గురించి సదవకపోతివి..
    చరిత్ర కాయితంపై తెలంగాణ అమరవీరుల రక్తపు సంతకాలు సూడకపోతివి..
    సమైక్యత ఇకమత్యం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటివి..
    సందు దొరికితే మమ్మల్ని ఆగం జేద్దామని సూత్తాంటివి..

    గందుకే అన్నా.. గుండె మండి జెప్తున్నా..
    నిజాలు మాట్లాడితే ఇనేటోడు,
    అన్యాయాల్ని అర్థం జేస్కునేటోడు,
    అందరి చరిత్రని,సంప్రదాయాల్ని పట్టించుకునేటోడు
    ఏ ఊరోడైనా నావోడే..

    నా ఉనికిని గుర్తించనోడు,
    నా బతుకుని పట్టించుకోనోడు,
    నిజమైన ఉద్యమాన్ని గౌరవించనోడు,
    నా పక్కనోడిగా ఉన్నా ఒకటే!
    పక్క రాష్త్రంల ఉన్నా ఒకటే!!

    Mi hakkula kosam poradadandi brother...
    Ma kadupulu kottadanki kaadu...

    E nalluga Kalisunnavallam Vidipodam antunnam...
    ante Samasyundi...
    ah samasyalu toliginche prayatnam,,,
    meeru gatha 10 yella ga chesunte...
    nenu Samaykyanne Korukune Vaadni...
    But no more Sacrificies..
    it's time for Justice....
    Let's hope for Good Man...

    ReplyDelete
    Replies
    1. విడి పోతాం.. విడి పోతాం అంటే ఎవరూ వొద్దనరు.. అయితే ఉమ్మడి ఆస్తిని కాజేస్తూ విడి పోతాం, మీరు బైటకి పొండి అంటే అది జరిగే పని కాదు

      Delete
    2. తెలబానుల రంగు అద్దాల్లో నుండి కాకుండా నీ కళ్ళతో సూసి సమజ్ జేసుకోమంటే
      నాకు అద్దాలు పెట్టుకునే హక్కు కూడా లేదా అని తిరగబడితివి

      అమ్మ అన్నా నీ యమ్మ అన్నాడని నా నా యాగీ సేయబడ్తివి
      అన్నదమ్ముల మధ్యల చిచ్చు పెట్టెటొల్లు నా వాళ్ళు అనబడ్తివి
      ఇంగెట్లన్న నీకేమైనా జెప్పేది.

      Delete
    3. Akasa Ramanna Gaaru... Vaadevado Gani Correct gaane Adigaadu... Vaadi Questions ki Answers Cheppandi Sir... Meeru Politician La Escape I pothunnaru... U Dint Gave answers to His Questions...
      Meeku Answers Telida Naa Laage??

      Delete
    4. Evadni Evadiki Anna Antunnav Brother....
      OU Students ni ah Roju Pichi Kukkalni Kottinattu Kodthunte a Andhra anna... Vaallu Telangana Korinantha Maatrana... Ma Tammulani Kodthara ani... a anna Prema Panchaledanna.. mi Nayakulani miru niladiyyaledanna... e roju manam Anna Tammulam ane Naithika Hakku niku Ekkadi danna...

      Dis is My Last Comment... Nenu Adigina A Prashnaki
      E Akasa Ramanna.. Samadanam Ivvakapoga... Comments anni Delete Chesesthunadu.. Naaku ardamaindayya Ramayya... Prashnalaki Ni daggara Samadanalu Levani.. Ninnu Prashnichadam Vyardamani... ippudu ni ishtamochindi Raasuko...

      Delete
  6. అంటే ఈ లెక్కన తెలంగాణా వాదులు మరియు సమైక్య వాదులు ఇద్దరూ తెలబాను లే. సరిపోయింది, ఇంకేంటి ప్రాబ్లం ?

    ReplyDelete
  7. దోపిడీదార్లమని ఒప్పుకొన్నట్టె కద! సిగ్గు! సిగ్గు!!

    పదమూడేళ్ళుగ తెలంగాణ వాళ్ళు సమైక్య రాష్ట్రంలో మా నీళ్ళు, నిధులు, నియామకాలు దోపిడీకి గురవుతున్నయంటే ససేమి కాదని వితండ వాదం చేస్తున్న సీమాంధ్రులు ఇప్పుడు తెలంగాణ ఏర్పడితే నీళ్ళ జగడాలు మొదలవుతయి అంటున్నరు.
    అంటే ఇన్నాళ్ళు నీళ్ళ విషయంలో ఏదొ కిరికిరి ఉన్నట్టె కద!
    హైదరాబాదు లేకపోతే మాకు నిధులు సరిపోవు అంటున్నరు. అంటే ఇన్నాళ్ళు నిధుల విషయంలో ఏదొ గడబడ్ చేసినట్టె కద!
    మా ఉద్యోగాలకు భద్రత లేదు అంటున్నరు. మా పిల్లలకు ముందు ముందు ఉద్యోగాలు రావు అంటున్నరు. వీధుల్లో పడి విధ్వంసం సృష్టిస్తున్నరు. అంటే ఇన్నాళ్ళు నియామకాల విషయంలో మోసం చేసినట్టె కద!
    ఇప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భారత దేశంలోనే ఉన్నది. రేపు కొత్తగ ఏర్పడె రెండు రాష్ట్రాలు భారత దేశంలోనే ఉంటయి. అప్పుడైన, ఇప్పుడైన భారత రాజ్యాంగానికి లోబడె పని చేస్తయి. మరి్ ఇప్పుడు కొత్తగ రెండు రాష్ట్రాలు ఏర్పడితె, రాజ్యాంగ బద్ధంగ వచ్చేటివి ఎందుకు రావు? అంటే ఇన్నాళ్ళు రాజ్యాంగానికి అతీతంగ అక్రమంగ అవన్ని సీమాంధ్రులు దొబ్బుతున్నట్టె కద!

    ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళు వేరొక ప్రాంతం వాళ్ళని EXPLOIT చెయ్యక పోతె .... ఒక ప్రాంతం వాళ్ళు మేం వేరుపడుతం అంటె వేరొక ప్రాంతం వాళ్ళు అంతే పౌరుషంగ "పోతె పొండి. మేం గూడ వేరు పడుతం" అనాలె. ఎందుకంట లేరు?
    అసలు తెలంగాణతో విడిపోతె మా బతుకులు కుక్క బతుకులవుతయి అంటున్నరంటే ఇన్నాళ్ళు తెలంగాణను జలగల్లాగ పట్టి పీక్క తిన్నట్టె కద!

    ఇంత సిగ్గు, లజ్జ లేకుండ నడి వీధులలో నగ్నంగ నిల్చుని, మేం అరవై ఏళ్ళనుండి దోపిడి చేసినమని చాటుకోడం ఏంది? ఇదంత ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రి సపోర్ట్ చేసుడేంది? సిగ్గు చేటు!

    ఏమన్నంటే ... హైదరాబాదుని మేం డెవలప్ జేసినం అంటరు. ఏం? మా తెలంగాణవాళ్ళు టాక్సులు కట్టలేద? ఎప్పుడైన కలిసి ఉన్నప్పుడు అందరు కలిసె కట్టుకొంటరు. విడిపోయినాక ఎవరిది వాళ్ళు కట్టుకొంటరు. ఇది ఒకడు చెప్పాన్నా? సీమాంధ్రుల దిమాఖ్ కెక్కద?
    అయినా ఏం డెవలప్ జేసినరు? లగడపాటి లాంకో హిల్స్ లొ తెలంగాణ పేదోడికేమన్న ఇచ్చినడా? కావూరి కట్టిన రోడ్లలో తెలంగాణ వాళ్ళకి ఏమన్న టోల్ టాక్స్ ఫ్రీయా? మీ వ్యాపారాలు, మీ డబ్బులు మీరు చూసుకొన్నరు.

    మీ సిగ్గు లేని వాదనలు విన్న దేశంలోని అన్ని పార్టీల ముందు మీరు నవ్వులపాలయితెనె గదా.... తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. ఇంకెంత కాలం ఇజ్జత్ తీసుకొంటరు?

    ReplyDelete
  8. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగి(కానిస్టేబుల్ శ్రీనివాస్) మరొకచోట డ్యూటీ ఉండగా సమైక్యాంధ్ర సభకు వచ్చి జై తెలంగాణ అని నినాదాలు చేయటం అల్లరిమూకలు చేసేపని. ఇదే పనిని తెలంగాణసభలో ఎవరైనా సమైక్యాంధ్ర వ్యక్తి చేస్తే అతనికి పుట్టగతులుంటాయా!

    ఇకపోతే ఆ కానిస్టేబుల్ ను, దేశానికి ప్రాణాలర్పించిన, లేదా సర్వశక్తులూ ఒడ్డి దేశాన్ని కాపాడిన వ్యక్తిలాగా చిత్రిస్తూ, తెలంగాణ రాజకీయ నాయకులు పొగడటం సరే, ఒక బాధ్యత గల వార్తా పత్రిక - నమస్తే తెలంగాణ తమ పతాక శీర్షికలో, బ్యానర్ ఐటమ్ ప్రదేశంలో ఫోటో పెట్టడంకంటే దారుణం మరొకటి ఉంటుందా! ఇది సమాజంలోకి ఏ విధమైన సంకేతాలు పంపుతోంది అనేది ఆ పత్రిక సంపాదకవర్గం కొద్దిగానైనా ఆలోచించిందా! ఆ కానిస్టేబుల్ కు వచ్చిన కీర్తిని చూసి ఇతర తెలంగాణ వాదులు ఇంకా రెచ్చిపోయి మరింత దారుణాలకు పాల్పడితే దానికి ఈ పత్రిక కారణం అవదా!

    తెలంగాణవాదులు రానురానూ తాలిబన్లుగా మారుతున్నారనటంలో ఎటువంటి సందేహంలేదు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది, ఉద్యోగావకాశాలు పెరగటమేమోగానీ, స్వతహాగా అమాయకులు, కల్లాకపటం తెలియని తెలంగాణ ప్రజలపై నాయకులవల్ల చెరగని మచ్చ ఏర్పడుతోంది. తెలంగాణ ఎలాగూ వెనక్కు వెళ్ళిపోయిందని కన్ ఫర్మ్ అయిపోయింది, కానీ ఇలాంటి ఉద్యమ నాయకులవల్ల ఆ ప్రాంతం మరింత వెనక్కు వెళ్ళటం ఖాయం.

    ReplyDelete
  9. ? ఆధిపత్యాలు, దోపిడీలు అంటూ అబద్ధాలతో, అసత్యాలతో కూడిన తెలబాన్ల ప్రచారాలని ఖండించటంలో! అమాయకులైన తెలంగాణా ప్రజలలో, విద్యార్ధులలో విద్వేష భావాలు నింపుతూ వేర్పాటు వాదాన్ని పెంచడాన్ని ఆపలేక పోయారు....


    అదీ అసలు విషయం... ...పైగా ప్రపంచమంతా కుగ్రామంగా మారుతున్న సమయంలో.......మల్టీ నేషనల్ కంపెనీ లే ప్రపంచాన్ని మొత్తం ఆరగించేస్తున్న వేళలో..ఈ దోపిడీ అన్న పదం డ్రమటిక్ అయిపోయిందనుకుంటున్నపుడు...కేవలం ఎంపీ లను గెలిపించుకోవడానికి...బుర్ర తక్కువ సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం ఇది...ఎవడిని ఎవడు దోచుకో గలడండీ...ఈ కాలంలో...ప్రతీ ఒక్కళ్ళూ...ముక్కు పిండి, తమ శ్రమకు తగ్గ ఆదాయ్యాన్ని, ముక్కు పిండి వసూలు చేసుకుంటున్నారు....ఉద్యో గాలు మొత్తమ్ నాయకులు ,అధికారంలో ఉన్న వాళ్ళు..అమ్మేసుకుంటున్నారు.....అందరికీ అన్నీ తెలుసు...నేను డబ్బు చెల్లించి కొనుక్కున్న భూమి పై ఇరవై ఏళ్ల తర్వాత...ఆక్రమించారని దొంగ ఆరోపణలు చేసి...మింగేద్దామని చూస్తే...నేనేం జవాబు చెప్పగలను...


    గ్లోబల్స్ ప్రచారం అన్న పదం తర్వాత...చరిత్రలొ....అన్ని అసత్యాలు...తెలంగాణా పేరుతో జరిగినన్ని...మరెక్కడా జరిగి ఉండవేమో?


    ReplyDelete
  10. ఈ మానసిక వికలాంగులు సత్యవాణి గారినీ వదల్లేదు!!

    ReplyDelete


  11. - నాకు బాగానే అర్ధం అవుతుంది, మరి నీకవుతుందా?
    - ఢిల్లీ దేశంలో అందరిదీ, వెల్లి ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకంగా సభ పెట్టి చూడు....ఇదీ తాలిబన్ వాదన...


    మొత్తం విషయాన్నే తప్పు దారి పట్టించి...బురద జల్లడమే...తాలిబన్ పని...సేవ్ ఆంధ్రా అని ... సమైక్యాంధ్ర అని సభ పెట్టారు గానీ...తెలంగాణా ని ఖండించండి అని పెట్టలేదుగా!ఇంత మూర్ఖపు గుంపుని ఎన్నడూ చూసి ఉండరు...

    ReplyDelete
  12. ఇకపోతే ఆ కానిస్టేబుల్ ను, దేశానికి ప్రాణాలర్పించిన, లేదా సర్వశక్తులూ ఒడ్డి దేశాన్ని కాపాడిన వ్యక్తిలాగా చిత్రిస్తూ, తెలంగాణ రాజకీయ నాయకులు పొగడటం సరే, ఒక బాధ్యత గల వార్తా పత్రిక - నమస్తే తెలంగాణ తమ పతాక శీర్షికలో, బ్యానర్ ఐటమ్ ప్రదేశంలో ఫోటో పెట్టడంకంటే దారుణం మరొకటి ఉంటుందా! ఇది సమాజంలోకి ఏ విధమైన సంకేతాలు పంపుతోంది అనేది ఆ పత్రిక సంపాదకవర్గం కొద్దిగానైనా ఆలోచించిందా! ఆ కానిస్టేబుల్ కు వచ్చిన కీర్తిని చూసి ఇతర తెలంగాణ వాదులు ఇంకా రెచ్చిపోయి మరింత దారుణాలకు పాల్పడితే దానికి ఈ పత్రిక కారణం అవదా!
    జనాన్ని రెచ్చ గొట్టి పబ్బం గడుపుకోవాలన్నదే వాళ్ళ వ్యూహం....ఇప్పటి వరకూ పదేళ్ళకు పైగా ఇదే విధనం లో పక్కాగా తమ ప్లాన్ ను అమలు చేసారు కానీ...సగటు మనిషికి ...పది సార్లు ,ఒకే అబద్దాన్ని చెప్తే నమ్మి తీరుతాడు...ఇప్పటికీ సగటు పౌరుడు కుమిలి పోతున్నాడు తన పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలూ,రౌడీయిజాన్ని చూసి...



    ReplyDelete
  13. Orai Annayalu Koncham Alochinchandra...
    Evadu Jai Telangana anna...
    Evadu Samiakyandra anna...
    Bokka Manake Ra...
    Deenamma MNC lo New projects a raavatledra Hyd Ki...
    E roju E KCR Gaadi Gonthu nokkesina..
    Repu Inkokadu evado Raakapothada ide Telangana Antu...
    Appudu Kuda ide Godava malli First Nunchi Modaledthaara...
    1969 lo Hyderabad lo em Pettubadulu pettamani Vaalu Seperate Telangana Adigarra...
    Manam Chadivina a Academic Books Lonaina Telangana Saayuda Poratam Gurunchi Unda...
    379 mandini Ekkado Jalianwala Bagh Incident lo Champesthe mana Patya Pusthakallo Cherchaaru.... 372 Students ni 1969 lo mana State lo Akramanga Ketayinchina Udyogulani Ventane Toliginchali ani varu udyamam chesthe Champesaru... Idenduku Pusthkallo Ledu... Naadi Bhimavarame Bayya... Naaku Mana Nayakulu chesina tappulaki manam innalu anubavinchina telangana sommuki penality chellinche tym kachitanga eppudo kappudu vasthundi... manam entha ginjukunna telangana ivvadame Darmam naithikanga ithe...
    Seperate Telangana Ni Ivvalani Korukune Vaadaina...
    Samaikyangane Unchali Anukune Vaadaina...
    Mundu manam Telusukovalsindi
    Vadu Telangana Ani Enduku Aduguthunnnadu..
    Idi okka KCR ki Sambandinchina Samasya Kaadu...
    Telangana Charitra Veru... Mana Charitra Veru...
    Valla Charitra Mana Paatya Pusthakallo Ekkada Ledu...
    Enduku Ledu??????
    A Oppandaala Meeda Telangana ni Andhrani Kaliparo..
    Manam Tekusukovali Mundu...
    To Talk About Dis...
    Manam Apani Cheyam...
    Mana Prantham Vaadu
    Kulam Vaadu
    Matham Vaadu
    adi manadi ante adi manadi....
    Entha Chaduvkunna Manam Gorralame...
    Andhra Vaadiga Puttinanduku..
    E Samaikya vaadanni Chusi Siggupadthunna...
    Manaki mana Avasarale Mukyam Gaani
    Telangana Valla Samasyala patla Gouvravam Ledu...
    we r not treating them as part of our State...
    dinne vaalu 10 years nunchi Adipatyam Antunnaru...

    ReplyDelete
  14. అక్కడ విషయముందికాని వివరణ లేదు. ఆత్మ పరిశీలన అంత కన్నా లేదు. సోదరభావం, సమైక్యమనేవాళ్లు ,క్రమశీక్షణ మరిచి (చదువుకున్న ఉద్యోగులై) పాశవికంగా, మూకుమ్మడిగా, దాడి చేయరు (ఎదుటివాడిది తప్పయినప్పటికీ).

    తెలంగాణా వాదులు కూడా అక్కడ మీ సందేశాన్ని వినిపించ వచ్చు అని సభకి సహకరించమని సభా పెద్దలే అన్నట్టు గుర్తు. (హైకోర్టు తీర్పుకు మునుపు)

    పైగా వెంట్రుక కూడా పీకలేరు కాని మేము మాత్రం పీకలు కోస్తామని సైగలతో సందేశాన్నిచ్చే చదువుకున్న మూర్ఖులు ఓవైపు.

    కళ్ల ముందరే నాలుగు దాడులు జరిగిన తరువాత కూడా కానిస్టేబుల్ నినాదమందుకున్నాడు. అహింసా యుతంగానే నిరసన తెలిపాడు. దాడిచేస్తున్నా ఎక్కడా ప్రతిఘటించలేదు. విధిలో వున్న తనపైనే సభలోంచి ఓ మూర్ఖుడు బయలుదేరి అదే సభ క్రింద దాడి చేయడం, కొంత సమయం తర్వాత ఆదే సభ వెనకాల సి.ఐ పైకూడా దాదాపు 14 మంది దాడి చేయడం. గాయపరచడం.

    దీనిని బట్టి సభ ఏపునాదుల మీద కట్టబడిందో తెలుస్తున్నది.

    యాభై ఏళ్లనుండీ ఇదే తీరు, సమైక్యం లో సమ్యమనం లేదు బ్రదర్!

    ఇంత జరిగినా సభ విజయమంతమైందనీ, సభలో అందరూ సమ్యమనం పాటించారని మీడియా కధనాలు!

    అర్థం చేసుకోవడం ఇష్టం లెకపోయినా అంతరంగం ఊర్కోదు బ్రదర్. ఆ చైతన్యం ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటది.

    చదువున్నవాళ్లై , చట్టాన్ని చేతిలోకి తీసుకొని,నైతికంగా ఓడిపోయారు బ్రదర్ !

    ReplyDelete
  15. వెళ్లి మీ ఉస్మానియా అంకుల్స్ కి, అచ్చోసిన తెరాస తెలబాన్ గ్యాంగ్ కి చెప్పండి ఇవన్నీ. ఇంత వక్ర దృష్టా.
    వాళ్ళు ఉన్న చోటుకు వెళ్లి దాడి చేశారా ? తిక్క కాకపోతే అక్కడికి వెళ్లి సభకి ఆటంకం కలిగించాల్సిన అవసరం ఏమొచ్చింది. సరే నినాదాలు చేసాడు ఏమొచ్చింది? అంటే వీళ్ళు సభలో ఏమి చేసినా మూసుకుని ఉండాలా ? ఇలా ఉండే మేము చేసేది అంత కరెక్ట్ మీరు చేసేది తప్పు అనే స్టేజి కి వచ్చారు మీరు. దాడి చేయడం అంటే వాళ్ళ మానాన వాళ్ళు వస్తుంటే చిల్లర మూకలు రాళ్ళతో బస్సుల మీద దాడి చేశారు చూడు అది దాడి చేయడం అంటే. తమ తప్పుని భావోద్వేగం అనడం , ఎదుటివాడు తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా అర్థ సత్యాలతో తప్పుని మోపి నానా యాగీ చేయడం తెరాస కి వెన్నతో పెట్టిన విద్య . దాన్ని చూసి మీలాంటి వాళ్ళు భావోద్వేగానికి గురి అయ్యి ఎదుటోడి లో ఎప్పుడూ తప్పుడు ఎతకడమే వాళ్ళకి కావాల్సింది

    ఇక తెలబానుల బంద్ మీకు కన్పించలేదా? చదువుకున్న ఉస్మానియా గాడిదలు భౌతిక దాడులు చేస్తాం అని మీడియా ముఖంగా హెచ్చరించడం కన్పించలేదా (సైగ చేయడమే తప్పయితే)? LB స్టేడియం ని బద్దలు కొడతాం అని ఉత్తర ప్రగల్భాలు పలకడం కన్పించలేదా? ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఒక సైడ్ పూర్తిగా ఆఫ్ చేసేసి, తర్కం అనేదే లేకుండా వాదించడం నేర్చుకున్నారు.
    ఇక దాడి చేసారు దాడి చేసారు అంటున్నారు. సభకి వెళ్లి ఎవరు అడ్డు పడమన్నారు. వీళ్ళ ర్యాలీ వెళ్తుంటే రాళ్లు, చెప్పులు ఎవరు వేయమన్నారు? నినాదాలు ఎవరు చేయమన్నారు? బస్సుల మీద దాడులు ? ఇన్ని వందల సభలు సమావేశాలు పెట్టుకున్నారు ఒక్కరోజైనా మీ సభలని సమైక్యాంధ్ర వాదులు అడ్డుకున్నారా? నినాదాలు చేశారా ? ఇన్ని జరిగినా కేవలం దాడి జరిగింది దాడి జరిగింది అని ఓ చించుకుంటున్నారు. ఇదెక్కడి మూర్ఖ వాదన రా బాబూ.

    ReplyDelete