Thursday, September 5, 2013

ఉద్యోగుల సమావేశం పై ఉలుకెందుకు ?

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం ప్రకటన చేసింది. కేంద్ర ప్రకటన మాత్రమె జరిగింది. ఇంకా రాష్ట్రం ఏర్పాటు కాలేదు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరగ వలసిన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా చాలా వుంది. అందు వల్లనే రాష్ట్ర విభజన పై కోర్టు ముందుకి వెళ్ళిన రెండు కేసులని కొట్టి వేయటం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగానే వుంది. పాలనలో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం వుంది.  ఈ పరిస్థితిలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు చర్చించుకోవటానికి తమ రాజధాని నగరం లో ఒక సమావేశం పెట్టుకుంటే తెలబాన్ గుంపులకి ఉక్రోష మెందుకో అర్ధం కాదు.  సమావేశం జరగనివ్వమంటూ హెచ్చరికలు చెయ్యటంతో పాటు ముందురోజు నుండి 48 గంటల బంద్ ప్రకటించేశారు! పోటీ గా శాంతి ర్యాలీ అంటూ చేయబోతే పోలీసు అనుమతి ఇవ్వలేదని నానా యాగీ చేస్తున్నారు.  గతంలో మిలియన్ మార్చ్ పేరుతొ ప్రశాంతంగా ర్యాలీ చేస్తామని మభ్య పెట్టి టాంకు బండ్ పై విగ్రహాలు కూల్చిన చరిత్ర వారిది!  ఇటువంటి చరిత్ర వున్న వారికి అనుమతి వస్తుందని ఎలా భావిస్తారు?     ఈ రోజు  సాక్షాత్తూ కేంద్రమే తెలంగాణా ఏర్పాటుకు శర వేగంతో చర్యలు జరుపుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండకుండా ఇలాంటి  రెచ్చగొట్టే చర్యలు చెయ్యబట్టే సీమాంధ్రుల-ఉద్యోగుల ఆందోళనలు   మిన్నంటుతున్నాయి.  ఓ పక్క విద్వేషాగ్నిని ఎగదోస్తూ  విభజనకి సహకరించాలని కోరటం తెలబాన్లకే  చెల్లింది.  కీలకమైన ఈ సమయంలో సంయమనం పాటించి సహకరించక పొతే విభజనకి సీమాన్ధ్రులు ఒప్పుకుంటారా?  నిజం చెప్పాలంటే ఇప్పటి వరకూ తెలబాన్లు జరిపిన ఉద్యమం వారికి ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం  కోసం కాదు.    సీమాన్ద్రులకి ప్రత్యెక రాష్ట్రం ఇచ్చి తమ ప్రాంతం నుండి గెంటి  వేయాలని జరిగిన ఉద్యమం అది.   కేంద్రం కూడా  సీమాంధ్ర కి సరైన న్యాయం చెయ్యకుండా విభజన ప్రతిపాదించినప్పుడు నిరసన లు తెలిపే హక్కు అన్ని వర్గాల వారికీ వుంటుంది.  నిరసనలు తెలపటానికి కూడా అనుమతించమంటూ రగడ సృష్టిస్తే  విభజన ప్రక్రియ ముందుకు సాగటం అసంభవం... 

7 comments:

  1. ఇంతకు ముందు జరిగిన తెలంగాణా ఉద్యమానికీ ఇప్పుడు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికీ హస్తిమశకాంతరం ఉంది.ప్రత్యేక తెలంగానా ఉద్యమం మొదలై ఈ మధ్య వరకూ నేను తెలంగాణా ఉద్యమాన్ని న్యాయబధ్ధమైనదని అమాయకంగా నమ్మి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కామెంట్లు గూదా ఇచ్చాను.కానీ ఉద్యమాన్ని వాళ్ళు నదిపించిన తీరూ, ప్రతేక రాష్ట్ర ప్రకటణని వాళ్ళు సాధించుకున్న తీరూ, ప్రకటన వొచ్చి ఇక ప్రతేక తెలంగాణా ఖాయమైందని తెలిసాక వాళ్ళ్ ధోరణీ చూసాక వీటన్నితినీ మదింపు చేసుకున్నాక నా అభిప్రాయాలు తప్పని అనిపిస్తున్నది. వాళ్ళ కొరికలో న్యాయం ఉంటే దాన్ని చాలా న్యాయమైన పధ్ధతి లో అసెంబ్లీలో చర్చ జరిపించి ఇక్కడి నుంచి విభజనకి ప్రపోజల్ పంపించే పధ్ధతి నే యెన్నుకునే వాళ్ళు.
    జై గొట్టిముక్కల చాలాసార్లు విడిపోవటానికి యేకాభిప్రాయం దేనికి అని చాలా తెలివిగా కనబడే ఒక దుర్మార్గమైన వాదన చేస్తూ ఉందేవాడు. ఈప్పటికీ అలాగే వాదిస్తూ ఉన్నాదనుకుంటాను మొదతి నుంచీ వాళ్ళ పాను అంతా ఇక్కద చర్చ జరగదం తో పని లేకుండా కాంగ్రెసుతో లోపాయకారీ బేరసారాలతో సాధించుకోవాలని.
    తెలంగాణా ని తెచ్చ్కుకోవడానికి కచరా దగ్గిర్నించీ గొట్టిముక్కల వరకూ యెన్నుకున్న దారి యేమిటంటే, యెన్నికల్లో యెక్కువ సీట్లు గిలిచి ఆ బలం తో కాంగ్రెసు(వీళ్ళూ మాకు జరిగినయ్యని చెబుతున్నా అన్ని అన్యాయలకీ - పెద్దమనుషుల ఒప్పనదాన్ని ఉల్లంఘించదం నుంచీ మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను నీ దిక్కున్న చోట చెప్పుకో అనటం వరకూ వాళ్ళని అణిచివేసిన, అవమానించిన పార్టీ) తో బేరసారాల ద్వారా తెచ్చుకోవటం.అందుకోసం వాళ్ళు వాళ్ళ్ అత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టేసారు.
    పత్రికల్లో వొచ్చిన వార్తల ఆధారంగానే కొన్ని విషయాల్ని మీకు గుర్తు చేస్తున్నాను. తెలంగాణా సాధన కోసమని పెట్టిన పర్ట్య్ ప్రతినిధిగా కేంద పరభుత్వం తో సంప్రదింపులు జరపాలంటె యేం చెయ్యాలి?తం న్యాయమైన కోరికలతో ఒక గ్రూపు ని సరన పధధతి లో అపాయింట్మంతు తీసుకుని వెళ్ళి కలవాలి, కాని యెప్పుడు ఢిల్లీ వెళ్ళినా కచరా ఒక్కడే వెళ్ళేవాడు. అక్కద యేం మాట్లాదే వాడో తెలియదు గానీ వొచ్చాక మాత్రం , "అంతా అయిపోయింది వొచ్చే నెలలోనే ఇవ్వడానికి వాళ్ళొప్పేసుకున్నారు" అని వాగే వాడు. ఆ తర్వాత తను యెవర్ని కలిసానని చెప్పాడో వాళ్ళని జర్నలిస్టులు వివరాల కోసం అడిగితే కేసీ ఆర్ నాన్ను కలిసాడా అని హాచ్చెర్య పడిపోవతమో లేదా కలిసిన మాట నిజమే కాని మా మధ్యన తెలంగాణా ప్రస్తావన రాలేదే?! అనో అంటూ ఉండదం మీకందరికీ గుర్త్రు ఉందే ఉంతుంది. దానర్ధం యేమిటి? ఒక ఉద్యమానికి సారధ్యం వజిస్తూ ఆ పర్య్ తరపున సంప్రదింపులు జరపటానికి వెళ్ళిన మనిషికి అలాంటి ప్రతిస్పందన ఋఆవటం అంటే యేమితో మీరు వూహంచుకోండి.
    తనేప్పుడూ కనీసం తెలంగాణా గురించి మాట్లాదడానికి వెళ్ళాల్సిన పధ్ధతి లో వెళ్ళలేదనేది తేలిపోవటం లేదా?రహస సంభాషణల తో లోపాయకారీఎ ఒప్పందాలతో సాధించిన దాన్ని న్యాయమార్గంలో సాధించిన దానితో సమాన్మైన గుర్తింపుని మనం ఇవ్వాలా? యెట్టి పరిస్తితుల్లోనూ విపుల ప్రజా పర్యోజాలకు సంబంధించి విషయాల్లో అలాంటి వాటికి చట్టబత్తత కల్పించజూదదు.
    ఉద్యమం మొదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ వళ్ళు కక్కిన విషాన్ని బట్టి చూస్తే ఇలాంటి పొరుగు రాష్త్రం చాలా ప్రమాదకరమైనది.

    ReplyDelete
    Replies
    1. లెస్స పలికారు. చివరి వాక్యం అక్షర సత్యం..

      Delete
    2. ఔ లెస్స పలికిన్రు..ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో మీరు కక్కిన విషం వల్ల..మీరు చేసిన హింస వల్ల ఆంధ్ర ఎంత ప్రమాదకర ప్రాంతంగా తయారయిందో చూస్తనే ఉన్నం.

      Delete
    3. ఇంకా నయం ఔరంగజేబ్ కాలం నాటి హింస గురించి మాట్లాడలేదు మీరు.

      Delete
  2. "ఇంతకు ముందు జరిగిన తెలంగాణా ఉద్యమానికీ ఇప్పుడు జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికీ హస్తిమశకాంతరం ఉంది"

    హరీష్ గారూ, నేను బెజవాడకు స్వయంగా వెళ్లి చూస్తె అక్కడ ఆరు షామియానాలు, ఒక్కొక్క దాంట్లో ఇరవైకి లోపు మనుషులు కనిపించారు.

    "జై గొట్టిముక్కల చాలాసార్లు విడిపోవటానికి యేకాభిప్రాయం దేనికి అని చాలా తెలివిగా కనబడే ఒక దుర్మార్గమైన వాదన చేస్తూ ఉందేవాడు"

    దీంట్లో దుర్మార్గం ఏముంది? BTW I have always believed Andhra agreement is nice to have but not essential for Telangana formation.

    "తెలంగాణా ని తెచ్చ్కుకోవడానికి కచరా దగ్గిర్నించీ గొట్టిముక్కల వరకూ యెన్నుకున్న దారి యేమిటంటే, యెన్నికల్లో యెక్కువ సీట్లు గిలిచి ఆ బలం తో కాంగ్రెసు తో బేరసారాల ద్వారా తెచ్చుకోవటం"

    నేనవ్వరినో కూడా మీకు తెల్వదు కానీ నేను కాంగ్రెసుతో బేరం ఆడినట్టు మాత్రం తెలుసు. Tusi great ho!

    ReplyDelete
  3. Harish babu garu..inthaka mundu telangana ku maddathu ichinanduku thanks. ipudu maata marchataniki..sry ade..abiprayam marchataniki meeru chepina karanalu sahetukam ga levu. kcr rajakiyalu chesadu kabatti telangana nu samardhinchara! goppa nyayame meedi. chandrababu chikatlo chidambaram ni kalisadu kabatti samikyandhra ku kuda maddatu ivvara? leda mee nytikata telangana ke parimitama? vibajanaku ekabiprayam avasaram ledani antharjathiya chattalu chebutunnayi. meru daniki kuda athithama? inthaka munupu telanagana nu encourage chesina naadu ekabiprayam gurinchi meku telvada? kothaga nerchukunnara? Andhra nayakula maddatu tho rashtram sadinchukovatam sadyamani meru aathma sakshi ga nammuntunnara? natistunnara? Article 3 ni pani leka ambedkar rasada? Ituvanti jatila samasyalanu telchavalsindi kendra prabutvam kada? kendram lo unnadi congress kada? jathiya party lu matrame..leda adhikaram lo unna party lu matrame ..rashtra sarihaddulu marchagalavani meku telvada? leka meru anti congress vaada? edaina party ki pani chestunara? Ante telangana prajalu eddi valla laga congress lo oka vedava andhra nayakudu avamaninchadani panthaniki poyi maro party vachedaka maro 50 yellu agalani mee viluvaina salahanaa?

    ReplyDelete
  4. అయ్యా ఆజ్ఞాత గారూ,
    నేను మాట మార్చానని యెలా అర్ధమయ్యింది?నేను బ్లాగుల్లో కామెంట్లు వెయ్యతం మొదలు పెత్తిందే మిమ్మల్ని సమర్ధిస్తూ.కాని అక్కడ నాకు తమాషా అయిన ప్రతిస్పందన వొచ్చింది. చిన్న చిన్న కామెంట్లు మినహాయిస్తే ఒక ఖచ్చ్గితమైన ప్రతిపాదనల తో నేను చెసిన పోస్టులు నాలుగే నాలుగు. అందులో రెండు మిమ్మల్ని సమర్ధించుతూ రాసాను. మూడోది ఉద్యమం లో లీనమయి మీరు గమనించలేదేమో అనుకుని కొన్నింటిని మీ దృష్టికి తీసుకు రావాలని వేసాను.మిమ్మల్ని సమర్ధించటం మాత్రమె మీకు కనబడింది వాటిల్లో, అందువల్లనే నేను మాట మార్చినట్టుగా నన్ను నెపం యెంచగలిగారు. కావాలంటే నేను రాసిన ప్రతి పోస్టుకు సంబంధించిన వాటిని పునర్ముద్రించ గలను. నా లోకల్ హార్డ్ డ్రైవ్ లో సేవ్ అయి ఉన్నాయి. మీ న్యాయమైన కోరికని సూటిగా రాజమార్గం లో నెరవేర్చుకోమని అన్నాను. నన్ను మీరడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం "ఉద్యమం దిస యెటువైపు ఉండాలి" అనే తలకట్టు తో ఉన్న బ్లాగులో వేసిన నా రెండో కామెంటే చెబుతుంది.(సాక్ష్యానికి చూపిద్దామంతే ఇప్పుదక్కడ నా కామెంటు కనబడ్డం లేదు, కానీ ప్రతిస్పందన గుర్తుంది - మొత్తం పది పాయింట్లతో కాంగ్రెసు మీకు చేసిన ద్రోహాలని అంత కష్తపడి రాసి యెందుకు ఆ కాంగ్రెసు సప్పోర్టు తోనే రాష్ట్రాన్ని సాధించుకోవాలనుకుంటున్నారని అక్కడే అడిగాను. దానికి మాత్రం జవాబు చెప్పకుండా శత్రువు బహు రూపాల్లో ఉన్నాడు గాబట్టి గుర్తు పట్టటం కష్టంగా ఉందన్నాడు. పిచ్చ నవ్వొచ్చింది.)
    ఇప్పుడు కూడా అంతే, నా అసలు ప్రశ్నకి జవాబు చెప్పకుండా దాట వేస్తున్నారు. ఇప్పుడు మీరెంచుకున్న దారిలో ఉన్న ఇబ్బందికరమైన విషయం యేమిటో చెబుతున్నాను.కాంగ్రెసులో ఒక వెధవ కాదు ఆ మాట అన్నది. వాళ్ళు యేరికోరి చెసిన ముఖ్యమంత్రి.మరో యాభయ్యేళ్ళు ఆగమనటం లేదు, ఇప్పుడే సాధించుకోమంటున్నాను - న్యాయమైన పద్ధతిలో. ఇప్పుడు మీరు చేస్తున్న దానిలో ఉన్న అసంబధ్ధత గురించి అడుగుతున్నాను. విడిపోవడానికి యేకాభిప్రాయం అక్కరలేదని అంతర్జాతీయ సూత్రాలు చెబుతున్నయ్యన్నారు. ఆ అంతర్జాతీయ న్యాయసూత్రాలు విడిపోవటానికి మీకన్యాయం చెసిన వాణ్ణి వొదిలేసి నిర్దోషులిని దోషులుగా నిలబెట్టే వికృతమైన పధ్ధతిని కూడా చెప్పాయా? యాభయ్యేళ్ళుగా మీరు మీకు జరిగాయని చెబుతున్న వాటన్నింటికీ కారణమైన వాళ్ళ సాయం తీసుకుంటూ ఆంధ్రోళ్ళు అట్లాంటోళ్ళు ఇట్లాంటోళ్ళు అని తిట్టిన తిట్లు యెవరికి తగుల్తాయి? మీకు అన్యాయం చెసిన వాళ్ళని అంతగా క్షమించెశాక ఇక వెనుకబాటు తనం నుంచీ ఆత్మగౌరవం వరకూ విడిపోవడానికి కారణాలుగా చెబుతున్నవన్నె అబధ్ధాలని తెలియడం లేదా? మీ న్యాయమైన కోరికని న్యాయబధ్ధమైన దారిలో వెళ్తేనే సమర్ధిస్తాను గానీ తెలంగణా వాళ్ళంతా దగా పడ్డవాళ్ళు, అంధ్రా వాళ్ళంతా దగా చేసిన పెద్దన్నలు అనే విధంగా మాట్లాడి విడిపొమ్మని యే అంతర్జాతీయ న్యాయసూత్రం చెప్పింది మీకు? మీ ప్రశ్న లన్నింటికీ నేను జవాబు చెప్పాను. నేను అడిగినది కూడా చాలా సూటైన ప్రశ్న. మీ న్యాయమైన కోరికని నెరవేర్చుకోవదానికి మీకు జరిగిన అన్యాయానికి కారణమైన వాళ్ళని వొదిలేసి ఆ అన్యాయాలతో యెటువంటి సంబంధమూ లేని ఒక ప్రాంతం మొత్తానికి దోషాన్ని అంటగట్టే వికృతమైన దారిలో వెళ్ళడం యాదృచ్చికమా ఐచ్చికమా?
    నీ చేతికర్రని నువ్వు గాలిలో గిరగిరా నీ ఇష్టమొచ్చినట్టుగా తిప్పుకో - యెవడైనా అడ్డమొస్తే నీ తరపున అతడితో పోట్లాడతాను, అతడు నీ స్వేచ్చకి భంగం కలిగిస్తున్నాడు కాబట్టి: అయితే నీ చెతికర్ర యెవడి ముక్కుకైనా తగిలితే అప్పుడు అతని తరపున నీతో పోట్లాదతాను - అని అన్నది కూదా ఒక అంతర్జాతీయ మేధావే! మీర్రు న్యాయమైన పధ్ధతిలో పోరాడితే సమర్ధిస్తానని చెప్పానే గానీ అడ్డగోలుగా నా ఆత్మాభిమానాన్ని గాయపరిచినా సహించి ఊరుకుంటానని మీకు నేనేమైనా వాగుదానం కానీ చెరువుదానం కానీ చేసానా?లేదే!యేదో మొక్కుబడిగా ఒకసారి చెప్పి ఊరుకోలేదు, చాలాసార్లు చిన్న చిన్న కామెంట్లుగా చెప్పాను.ఐనా మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు నా పేరు పెట్టి అడిగిన మీకు మీరడిగిన ప్రతి ప్రశ్నకీ జవాబు చెప్పాననుకుంటున్నాను.యేదైనా వొదిలేసాననిపిస్తే అదగండి. వాటికీ జవాబు ఇస్తాను. నేను మాట్లాడే ప్రతి మాటకీ నేను నూటికి నూరుపాళ్ళూ బాధ్యత తీసుకుంటాను. నా ప్రశ్నలకి మీరూ జవాబు చెప్పండి.అజ్ఞాతంగా అడిగారు కాబట్టి మీరే కాదు మీలో యెవరైనా జవాబు చెప్పవచ్చు. ఐతే జవాబు చెప్పే వాళ్ళకి ఒక కండిషన్. నేను కామేంటు వేసినా, ఒక ప్రశ్న అడిగినా ఒక పధ్ధతిని యెంచుకున్నాను - సూటిగా చెప్పు సుత్తి లేకుండా - అని. మీ నుంచి నేనూ అదే ఆశిస్తున్నాను. జవాబు చెప్పండి.

    ReplyDelete