Saturday, September 14, 2013

విచక్షణాధికారం దుర్వినియోగం చేసి మరీ తెలంగాణా ఇవ్వాలా ?

రాజకీయ పార్టీలు అంగీకరించాయన్న నెపంతో ఆంధ్ర ప్రదేశ్ విభజనకి కేంద్రం పూనుకోవటం మూర్ఖత్వం.  అసలు స్వంత పార్టీలోనే విభజన పట్ల ఏకాభిప్రాయం లేని కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల లేఖలని నమ్మి విభజన ప్రతిపాదన పై దూకుడుగా ముందుకు వెళ్ళటం ఖచ్చితంగా కేంద్రానికి వున్న విచక్షణాధికారాలని దుర్వినియోగం చెయ్యటమే!  రాష్ట్ర  శాసన సభ అంగీకారంతో సంబంధం లేకుండా ఆర్టికిల్ 3 కింద తనకు వున్న విచక్షణాధికారంతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అది భవిష్యత్తులో ఎన్నో దుష్పరిణామాలకి దారి తీస్తుంది.   దీన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్రం లో  రాబోయే ప్రభుత్వాలు తమకు నచ్చని రాష్ట్రాలని ముక్కలు చేసి బలహీనం చేసేస్తే అడిగే వాళ్ళెవ్వరు? కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధింపు, ఇంకా గవర్నర్లకి వుండే విచక్షణాదికారాలని వివేచనతో ఉపయోగించాలి కాని పిచ్చోడి చేతిలో రాయిలాగ వాడకూడదు. రాష్ట్రంలో గత 45 రోజులుగా జరుగుతున్న సమైఖ్యాంధ్ర ఉద్యమం దెబ్బకి దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. లేఖలు ఇచ్చిన కొన్ని పార్టీలు యూ టర్న్ కూడా తీసుకున్నాయి.  అయినా రాజకీయ పార్టీల
నిర్ణయాలు రోజుకో విధంగా మారిపోతుంటాయి.  ఈ రోజు విభజనకి అనుకూలంగా లేఖలు ఇచ్చిన పార్టీలు రేపు వాటిని వెనక్కి తీసుకుంటే జరిగి పోయిన విభజన ని కేంద్రం వెనక్కి తేగలదా?    ప్రస్తుతానికి  ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ తమ రాష్ట్రాన్ని 4 ముక్కలు చేయాలని తీర్మానం  చేసి  కేంద్రానికి పంపించింది.   అంటే విభజనకి ఒక దశ ముందులో  ఉన్న ఆ ప్రతిపాదన పక్కన పెట్టి  --  విభజనకి ప్రతిపాదనకే వ్యతిరేకంగా మహోగ్రంగా ఉద్యమిస్తున్న ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కేంద్రం ముందుకి వెళ్ళటంలో ఔచిత్యం ఏమిటి?  రాజకీయ  సమీకరణాలే  పరమావధిగా మొండి గా ముందుకి సాగుతున్న కేంద్రం ప్రజాభిప్రాయమే ఫైనల్ మానిఫెస్టో అని ఎప్పుడు తెలుసుకుంటుంది? 

25 comments:

  1. అసలు నాదో ధర్మసందేహం.
    అధికారపార్టీ నాయకుల నిర్ణయాన్ని ప్రజలపై రుద్దటం ప్రజాస్వామ్యమా?

    ReplyDelete
  2. Prajaa swaamyamaa...? Adenti...? Mana desam lo allaatidi vundaa..

    ReplyDelete
  3. @jv rao garu

    claps..

    ReplyDelete
  4. విచక్షణాధికారాన్ని దుర్వినియోగ పఱచి సీమాంధ్రుల ఉత్తుత్తి ఉద్యమాలకు కాపు కాయాలా? తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమాన్ని చితకబాది, కేసులపై కేసులు పెట్టాలా? ఇడేం సీమాంధ్ర పెట్టుబడిదారి నీతి? కలిసుండాలంటే ఇద్దరి అంగీకారం కావాలి. విడిపోవాలంటే, విడి పోయేవాడి అంగీకారం ఉంటే చాలు! మేం మీతో కలిసుండం మొఱ్ఱో అంటుంటే...బలవంతంగా కలిసుండమనడం సమంజసమైన పనేనా? షాడిజం కాదా?? సీమాంధ్ర ప్రజలు ఇది గమనించి రాష్ట్రానికి అడ్డుపడకుండా, రెండు రాష్ట్రాలు సాధించుకుని, ప్రాంతాలుగా విడిపోయి, అన్నదమ్ముల్లా కలిసుండాలని విజ్ఞప్తి!!

    ReplyDelete
  5. బాబు గుండు మధుసూధన్,
    పోతే పో బాబు. ఎవడికేంటి, మాకు వాటా ఉన్న హైదరాబాదు వదులుకునే ప్రసక్తిలేదు అది వచ్చాక ఎవడూ వెనక్కి తిరిగిచూడడు

    ReplyDelete
  6. అయ్యా Anonymous...
    హైదరాబాదు దోపిడీపై మమకారమున్నవారు దోపిడీ చేస్తామనే చెప్పాలి కానీ, తెలుగు వారంతా కలిసుండాలంటూ కల్లబొల్లి ఏడ్పులెందుకూ?

    ReplyDelete
    Replies
    1. " మేం మీతో కలిసుండం మొఱ్ఱో అంటుంటే...బలవంతంగా కలిసుండమనడం సమంజసమైన పనేనా? రెండు రాష్ట్రాలు సాధించుకుని, ప్రాంతాలుగా విడిపోయి, అన్నదమ్ముల్లా కలిసుండాలని విజ్ఞప్తి!! హైదరాబాదు దోపిడీపై మమకారమున్నవారు దోపిడీ చేస్తామనే చెప్పాలి కానీ, తెలుగు వారంతా కలిసుండాలంటూ కల్లబొల్లి ఏడ్పులెందుకూ? "

      పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా అన్నట్లు ఎప్పుడూ ఇదే పాచి పాట! విడి పోతాం మొర్రో అన్న వాడు ఏ వరంగల్ నో ఆదిలాబాదు నో రాజధానిగా చేసుకొని విడిపోతే ఎ సమస్యా లేదు. అయితే వుమ్మడి ఆస్తి అయిన హైదరాబాదు ని కాజేద్దామని కేంద్రం తో కలిసి కుట్ర పన్నటమే అసలు సమస్య. కుట్ర అని ఎందుకు అన్నానంటే విభజన అన్నది సాంప్రదాయ పద్ధతిలో జరగకుండా కేంద్రం తన ఇష్టానుసారం ఆర్టికిల్ 3 ని దుర్వినియోగ పరచి ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు తెలబాన్లు ఇన్నాళ్ళూ చేసిన ఉద్యమం వారికి ప్రత్యెక రాష్ట్రం కోసం కాదు... సీమాంద్రులకి ప్రత్యెక రాష్ట్రం ఇచ్చి వారిని వాళ్ళ రాష్ట్రం నుండి, రాజధానినుండి గెంటి వేయాలని జరుగుతున్న ఉద్యమం. నిజానికి కొత్తగా ఏర్పడే రాష్ట్రమే కొత్త రాజధాని ని ఏర్పాటు చేసుకోవాలి. 1956 లో జరిగింది అదే! మద్రాసు పై ఎంత మమకారమున్నా కూడా కొత్తగా వచ్చిన ఆంద్ర ప్రదేశ్ మొదట కర్నూలు ని ఆ తరువాత హైదరాబాదు ని ఏర్పాటు చేసుకున్నాయి. చరిత్ర వక్రీకరించటం లో సిద్ధహస్తులైన తెలబాన్లు దానిని మద్రాసు నుండి గెంటేస్తే కర్నూలులో పడ్డారు అంటూ చెప్పుకొస్తారు. పోనీ వారి భాషలోనే వారికి అర్ధమయ్యేలా చెప్దాం.. సీమాంధ్రులు మరోసారి గెంటించుకోవటానికి సిద్ధంగా లేరు! అయినా విభజన కోసం గుడ్డిగా ముందుకు సాగితే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు హైదరాబాదుని కేంద్రం ఎగరేసుకు పోవటం జరుగుతుందే తప్ప హైదరాబాదు తో కూడిన 10 జిల్లాల తెలంగాణా రావటం అసంభవం!

      Delete
    2. ఆంద్ర ప్రదేశ్ కు మొదట కర్నూలు రాజధానా? నీ తెలివి మండ! ఎవడ్రా నీకు చరిత్ర చెప్పింది?

      "హైదరాబాదుని కేంద్రం ఎగరేసుకు పోవటం జరుగుతుందే తప్ప హైదరాబాదు తో కూడిన 10 జిల్లాల తెలంగాణా రావటం అసంభవం!"..... ఎంత కుళ్ళూ? మాకు దక్కనిది మీకూ దక్కగూడదనేగా! ఇందుకేరా మిమ్మల్ని తమిళులు తరిమికొట్టిందీ!

      Delete

    3. యనానిమస్ అన్నయ్యా, అంధ్రా ప్రాంతం మద్రాసు నుండి విడిపొయినపుడు కర్నూలే రాజధాని. 1956 లో తెలంగాణ తో కలిపినపుడు హైదరాబాదుకు మార్చబడింది. కావాలంటే నీకు చరిత్ర చెప్పినవాళ్ళనడుగు...

      Delete
  7. గుండు మధుసూదన్ గారో

    claps...

    ReplyDelete
  8. ఇట్టట్టు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాట్ట మీలాంటి వాడొకడు! బతకడానికి వచ్చింది మీరు. తెలంగాణతో కలిసింది మీరు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కింది మీరు. ఆరు సూత్రాల పథకాన్ని అమలుకానివ్వంది మీరు. మా ఇంటికొచ్చి, మా నీళ్ళ్ళు, ఉద్యోగాలు, నిధులు....దోచుకున్నది మీరు. మా ఇంట్లో ఉండి, మమ్మల్నే వెళ్ళిపొమ్మంటున్నారంటే..మిమ్మల్నేమనాలి? ఎంతకైనా తగినవాళ్ళే. హైదరాబాదును నువ్వు నిర్మించావా! ఎన్ని కోట్లు పెట్టి నిర్మించావు? సీమాంధ్రులంతా కలిసి, రక్తాన్ని నీళ్ళుగా మార్చి నిర్మించారా? ఐదువందల ఏళ్ళ చరిత్రలో నువ్వెక్కడున్నావు, శ్రీరామ చింతల్లో బోడకోతిలా! వాపారాల కోసం పెట్టుబడులు పెట్టుకోన్నారు కొండరు పెట్టుబడిదారులు! భూములు తక్కువ ధరకు కొని, ఉచితంగా పొంది, వ్యాపారాలకై నిర్మాణాలు చేసి, లక్షలకోటు గడించి, కోటీశ్వరులయ్యారు. మీరా...సామాన్య జనులా...ఎవరు? రాజకీయనాయకులు...పెట్టుబడిదారులు! దోపిడీని అరవై ఏళ్ళుగా ఓర్చుకునీ ఓర్చుకునీ..పోరాటాలు చేసీ, చేసీ..కేంద్రాన్ని ఒప్పించగలిగాం. తీరా రాష్ట్రం ఏర్పడే సమయానికి అడ్డుపడుతున్నారు...ఎవరు...వీళ్ళే. తమ దోపిడీ సామ్రాజ్యం ఎక్కడ కూలిపోతుందోనని! మిమ్మల్నెవరు హైద్రాబాద్ లో ఉండవద్దన్నారు? సామాన్యులను ఎవరినీ పొమ్మనడంలేదే! ఆ మాటకొస్తే మా తెలంగాణా జిల్లాలలో గుంటూరు పల్లెల పేరిట ఏర్పాటు చేసుకుని మాతో సహజీవనం చేస్తున్న సీమాంధ్రసోదరులను మేమేమన్నా అంటున్నామా? వీళ్ళకు లేని భయం మీకెందుకు? మీరేమన్నా మమ్మల్ని దోపిడీ చేశారా? చేసినవాళ్ళకే ఉలుకు...మీకెందుకు ఉలుకు? పది జిల్లాలతో కూడిన తెలంగాణా ఏర్పడుతుంది! అసంభవం... సంభవ మవుతుంది...వేచిచూడండి...! అరిచి గీ పెట్టినా కేంద్రం వినదు...అరవై ఏండ్లనుండి వింటొంది...ఇక మీ దొంగవేషాలేం సాగవు..వేచిచూడండి...

    ReplyDelete
    Replies
    1. " మా ఇంటికొచ్చి, మా నీళ్ళ్ళు, ఉద్యోగాలు, నిధులు....దోచుకున్నది మీరు. మా ఇంట్లో ఉండి, మమ్మల్నే వెళ్ళిపొమ్మంటున్నారంటే..మిమ్మల్నేమనాలి? ఎంతకైనా తగినవాళ్ళే. హైదరాబాదును నువ్వు నిర్మించావా! ఎన్ని కోట్లు పెట్టి నిర్మించావు? సీమాంధ్రులంతా కలిసి, రక్తాన్ని నీళ్ళుగా మార్చి నిర్మించారా? ఐదువందల ఏళ్ళ చరిత్రలో నువ్వెక్కడున్నావు, శ్రీరామ చింతల్లో బోడకోతిలా! మిమ్మల్నెవరు హైద్రాబాద్ లో ఉండవద్దన్నారు? సామాన్యులను ఎవరినీ పొమ్మనడంలేదే! ఆ మాటకొస్తే మా తెలంగాణా జిల్లాలలో గుంటూరు పల్లెల పేరిట ఏర్పాటు చేసుకుని మాతో సహజీవనం చేస్తున్న సీమాంధ్రసోదరులను మేమేమన్నా అంటున్నామా? వీళ్ళకు లేని భయం మీకెందుకు?"

      తెలంగాణా ప్రాంతం వారు ముందుగా రెండు భ్రమల నుండి బయట పడాలి ! ఒకటి - హైదరాబాదు వారిది అనే భ్రమ ! భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన హైదరాబాదు పై హక్కులు వారికి దాఖలు పడి ఉన్నాయనే భ్రమలోనుండి బయట పడాలి. అది వారి ఇల్లు కాదు. అక్కడ ఉండమనటానికో వెళ్ళిపోమనటానికో ఎవరికీ ఏ విధమైన హక్కు/అధికారం లేవు. వున్నాయని భ్రమిస్తే అది వారి అమాయకత్వం లేదా మూర్ఖత్వం. హైదరాబాదు ఎవరు, ఎప్పుడు నిర్మించారు అన్నది చరిత్ర పుస్తకాలు చూస్తె తెలుస్తుంది. కానీ చరిత్ర చదివే అలవాటు తెలబాన్లకి లెదు. కేవలం చరిత్ర వక్రీకరణ మాత్రం బాగా తెలుసు. అందుకే 500 ఏళ్ళ చరిత్ర అంటున్నారు.. హైదరాబాదు వయసు 400 ఏళ్లే! స్వాతంత్ర్యం వచ్చే సమయానికి తెలంగాణా ప్రాంతం వారు నిజాం నవాబు కి సలాం కొడుతూ గులాములు గా వున్నారు. పోలీసు చర్యతో భారత దేశంలో కలపక పొతే ఈ పాటికి ఏ పాకిస్తానుకి బ్రాంచి ఆఫీసుగానో వుండే వాళ్ళు. ఇక 1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసినపుడు తెలంగాణాని ప్రత్యెక రాష్ట్రం గా 5 సంవత్సరాలు వుంచి ఆ తరువాత అవసరమైతే ఆంధ్రతో విలీనం చెయ్యమని ప్రతిపాదించారు. అయితే ఐదేళ్ళు కూడా ఆగలేం అంటూ వారి శాసన సభలో తీర్మానం పెట్టి మరీ వెంటనే ఆంధ్రతో విలీనం జరిపారు. మళ్ళీ ఇన్నేళ్ళకి పూర్తిగా స్వయం సమృద్ధం అయిన రాజధానిని కొట్టేద్దామన్న దుర్బుద్ధితో కేంద్రం తో కుమ్మక్కు అయి అడ్డగోలు గా రాష్ట్రం సాధించేద్దామని కల గంటున్నారు.

      ఇక రెండవ భ్రమ --

      " పది జిల్లాలతో కూడిన తెలంగాణా ఏర్పడుతుంది! అసంభవం... సంభవ మవుతుంది...వేచిచూడండి...! అరిచి గీ పెట్టినా కేంద్రం వినదు...అరవై ఏండ్లనుండి వింటొంది...ఇక మీ దొంగవేషాలేం సాగవు..వేచిచూడండి..."

      ఇప్పటి వరకు జరిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మాత్రమె! ఇంకా రాష్ట్ర విభజనకి అవసరమైన రాజ్యాంగ ప్రక్రియ మొదలే కాలేదు. అందుకే విభజన ప్రతిపాదనకి వ్యతిరేకంగా వేసిన రెండు కేసులని కోర్టులు కొట్టివేయటం కూడా జరిగింది. 1984 లో ఎన్టీఆర్ ని అక్రమంగా పదవీచ్యుతుడిని చేసినపుడు తెలుగు వారి దెబ్బ ఏమిటో కేంద్రం చవి చూసింది. కాక పొతే ఆ రోజుల్లో రాజకీయాల్లో కొద్ది పాటి విలువలు వున్నాయి కాబట్టి నెల రోజుల లో కేంద్రం తన తప్పు తెలుసుకొని నిర్ణయం వెనక్కి తీసుకుంది. అంతే తప్ప శాంతి భద్రతలు లేవన్న సాకుతో రాష్ట్రపతి పాలన విధించేసి తామే పరిపాలిద్దామనుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. శాసన సభ అంగీకారం లేకపోయినా రాష్ట్రపతి పాలన విధించైనా సరే తాను అనుకున్నది చేద్దామన్న దుష్ట తలంపుతో కేంద్రం పావులు కదుపుతుండ బట్టే మళ్ళీ తెలుగు వాడు స్వచ్చందంగా వుద్యమిస్తున్నాడు. కేంద్రం మెడలు వంచి నిర్ణయం వెనక్కి తీసుకొనేలా చేసే సత్తా తెలుగు వాడి సొంతం! ఇల్లలుకగానే పండుగ కాదు.. ముందుంది ముసళ్ళ పండుగ!

      Delete
    2. Rahu and Kuja are two planets causative for divisive forces, explosion, rebellion and partion. It is in these sub periods that the actual formation of Telangana State will materialize. Andhra State indicates that January 2014, when Sukra-Rahu period will be coming to a close, separation of State is possible. Andhra Pradesh chart indicates tat in the dasa of Sani and Rahu bhukthi ie., during September 2013, Telangana will be formed. This period will be a testing time for Andhra Pradesh State, as once again many controversial issues regarding Hyderabad, security to settlers etc., will crop up. Large scale public unrest, disturbance to public life and loss of many lives are indicated. Over all it is indicative that separate Telangana State will be announced during June 2013 to January 2014 and there is every possibility of Andhra Pradesh is going to loose Hyderabad.

      Delete
  9. బుల్లబ్బాయ్September 15, 2013 at 12:10 PM

    మీరింకా గమనించినట్టు లేరు...

    తెలంగాణా లొల్లి కంపు కంపు చేసినందుకు, దిగ్గీ రాజాని సాగనంపారు...
    ఆడి సొంత ఊర్లో కాంగ్రేస్ నాయకత్వం జ్యోతిరాదిత్య సింధియా కి ఇచ్చారు.

    http://articles.timesofindia.indiatimes.com/2013-09-12/india/42007072_1_digvijaya-singh-jyotiraditya-scindia-congress-workers

    ఈ మధుసూదను ఆ చెక్కముక్కల జై, మొండిచేతులోడు ఎంత గోలెట్టినా... నున్న గుండే!....పాయే తెలంగాణా పాయే!

    ReplyDelete
    Replies
    1. తమిళులతో మొదట గుండు కొట్టించుకొన్న సీమాంధ్రులు తెలంగాణవాళ్ళ చేత JAN 2014 లోగా మరోమారు గుండు కొట్టించుకోవడం ఖాయం!!!

      Delete
  10. మీకు దినాలు దగ్గర పడ్డాయి. అందుకే సొల్లువాగుడు వాగుతున్నారు. తెలంగాణా ప్రజలని తెలబాన్లు అన్న ఆ కొజ్జా వెధవ ఎవడో వాడు ముందు ముందు గుండు కొట్టించుకోవాల్సిందే...! భ్రమలు అంటున్నారు...మావి భ్రమలుకావు. చదువు రాని ఎడ్డి కాలంలో మా తాతల్ని బుట్టలో వేసుకొని ఆనాడు మీ పబ్బం గడుపుకున్నారు! ఇప్పుడాకాలం పోయింది. ఇక మీ పప్పులు వుడకవు...

    ReplyDelete
    Replies
    1. శ్రీరామచింతల్లో బోడకోతులెవరో

      శతకోటి గుండుల్లో బోడి'గుండు'వి

      నువ్వు చెప్తే కానీ అర్ధంకాదనుకున్నావా బెదరూ

      Delete
    2. తెలబాన్ అన్నది ఈ శతాబ్దం లోనే కనిపెట్ట బడిన అతి గొప్ప పదం! దానిని అంత తేలిగ్గా తీసి పారేయ్యకు గుండూ!

      Delete
    3. బామ్మర్ది కదా అని ఇంట్లోకి రానిస్తే ఇల్లే నాదన్నాడట "సాలేగాడు". హైదరాబాద్ మాది అంటున్న సీమాంధ్రులకు మేం పెట్టిన పేరు.... స'మెక్కు' సాలెగాళ్ళు. ఇది వెయ్యేళ్ళలో కనుక్కొన్న మహా గొప్ప పదం.

      Delete
  11. నువ్వెన్నడూ గుండు కొట్టించుకోలేదా? ...కోవా? జ్ఞాపకం చేసుకో..శతకోటి గుండుల్లో నీదీ ఒక గుండని! ఎఱ్ఱ గురివింద తన నలు పెఱుగనట్లు..చెప్పుచున్నారు సీమాంధ్ర గొప్పలన్ని! చాలు లేవయ్య...బెదరూ...

    ReplyDelete
  12. గుండన్నా
    ఇంతకీ ఏంటంటావ్?
    గుండు లందు సీమాంధ్ర గుండ్లు వేరయా అనా?

    ReplyDelete
  13. ఈ తెలబాన్ అన్న మాటతో నాకు సంబంధం లేదు కానీ గుణ్డు మధుసూధన్ అన్నా .. నా బాధ అంతా సీమాంధ్ర దోపిడీదార్లు, ఐదరాబాదు మాది అంటేనే

    the following comments are mine-
    AnonymousSeptember 15, 2013 at 12:03 AM
    AnonymousSeptember 15, 2013 at 5:33 PM
    AnonymousSeptember 15, 2013 at 7:47 PM

    it is me ..

    ReplyDelete
  14. భయ్యా! నిన్నెవరన్నారు దోపిడీదారని! దోచుకున్నవాడి నన్నాను! తెలియకుంటే ఊరుకోవాలి గానీ, వాదన లనవసరం! మమ్మల్ని వెటకారంగా తెలబాన్లనడం మాకెంత బాధాకరమో గమనించారా? మీరు మా సోదరులు! దోపిడీదార్లు కారు! దోపిడీదార్లు వేరే వున్నారు. వాళ్ళ పైనే మా అభ్యంతరం. సెలవు!

    ReplyDelete

  15. వెళిపోతావేంటన్నా .. నీమాదిరిగా పాయింట్ టూ పాయింట్ లాజిక్ తో వాదించే వారు చాలా అరుదుగా కనిపిస్తారు ఈ బ్లాగులోకంలో .. మీరు ఇలాగే అన్ని తెలంగాణా సమైక్యవాద వాదనల్లో చర్చించాలని విన్నపం.

    ReplyDelete
    Replies
    1. మీ సీమాంధ్రులు పాయింట్ టూ పాయింట్ లాజిక్ తో వాదించే సత్తా లేక "గుండు కొట్టడం", "తెలబాన్లు" అని వెటకారాలు చేస్తరు. బురదల రాయి వేసుడెందుకని తెలంగాణవాళ్ళు వెళ్ళిపోతరు.

      Delete