Thursday, September 22, 2011

(తెలబాన్) పైత్యానికి పరాకాష్ట!


పై ఫోటో చూడండి. ఆలయాన్ని వదిలేసి   ఆడుతున్న అర్చకులని చూస్తె ఎవరికైనా ఏమనిపిస్తుంది? వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమనే కదా! దేవుడికి కూడా ప్రాంతీయ భేదాలు అంట గడుతూ ఆర్జిత సేవలు నిలిపి వేశారంటే వేర్పాటు వాద పైత్యం ఎంత ప్రకోపించిందో అర్ధం చేసుకోవచ్చు.  నర నరానా వేర్పాటు వాద విద్వేషాన్ని నింపుకున్న తెలబాన్లు సమీప భవిష్యత్తులో, సీమలో ఉన్నాడని తిరుపతి వెంకన్నను, కోస్తాలో వుందని బెజవాడ దుర్గమ్మను కూడా బహిష్కరిస్తారేమో?  పాలకుల పట్ల ధిక్కారం చూపవచ్చు. తప్పు లేదు. కానీ దేవుని పట్ల ధిక్కారమా? సహించరాదు. తెలంగాణా ప్రాంతంలో ఉన్న అన్య మతస్తులెవరైనా ఇలా చేసారా?  ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వారికి లోపించటం శోచనీయం.  ఇటువంటి విపరీత ధోరణులని కట్టడి చేయటంలో చేతకాని ప్రభుత్వమెలాగూ చేతులెత్తేసింది. ఇంక ఆ దేవుడే రక్షించాలి మన తెలుగు జాతిని, తెలుగు జాతి పరువు ప్రతిష్టల్నీ!!

27 comments:

  1. ఒక్కొక్కళ్ళు కొవ్వు పట్టి ఎలా బలసి వున్నారో photo చూస్తేనే తెలుస్తోంది వీళ్ళు చేసే పూజలేంటో...

    ReplyDelete
  2. చాలా దారుణం బాధా కరంగా ఉంది పరిస్థితి? హిందువులు అందులోనూ ముఖ్యంగా మన బ్రాహ్మలు ఇలా చేయడం మరీ దారుణంగా ఉంది. ముక్త కంఠంతో ఖండించాలి. చాలా బాధగా ఉంది,
    తెలుగు బ్లాగరులు ఎందుకని సమైక్యవాదాన్ని వినిపించడం లేదో అర్ధంకావడం ళేదు, ఎంత సేపటికీ కెలుకుడు అదీ ఇదీ అనికొట్టుకోకుండా కొంచెం పనికొచ్చేపని చేయడం అవసరం.
    ఒక కలగూరగంప, ఆకాశరమన్న లేకాకుండా సమైక్యవాదాన్ని వినిపించే బ్లాగులన్నీ మూగబోయాయి, ళేదా జగన్‌ కోసం ఒకల్ళూ, చంద్రబాబుకోసం మరొకళ్ళు, ఒకల్ల్మీద ఒక్కల్లు బురద జల్లుకుంటున్నారు.
    మనకోసం మనం దృష్టిమళ్ళీంచడంకోసం ఎన్ని ఎన్ని ఉచ్చులు వేశారొ అన్నిట్లోనూ పక్కాగా చిక్కుకున్నాం.
    ఇంక చేసేదేముంది అనుభవింద్దాం, కుళ్ళు కంపు హైదరాబాదులో, ఆంధ్రా ఉద్యోగులమీద దాడిచేసి, ఆఫీసులకి తాళాలేసి, కబడ్డీ ఆడేవాళ్ళు కొందరైతే రేపు ఈ నష్టాలకి ఒకటికి రెట్టింపు పన్నులు కట్టేవాళ్ళం మనం.
    ఉద్యోగాలుపీకేస్తే ఆఫీసులు ముట్టడించి ఉద్యోగాలు తెచ్చుకునేవాళ్ళు వాళ్ళయితే ఉన్న ఉద్యోగాలు కాపాడుకోలేక పైనుంచి కిందదాక అందరి చంకలు నాకుతూ కుమిలి కుమిలి ఏడుద్దాం కూర్చుని ..

    ReplyDelete
  3. ఆర్యా ! నా "కలగూరగంప" బ్లాగులో వేర్పాటువాద వ్యతిరేక వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. గత నెలా, ఈ నెలా "మూర్ఖ ఉద్యమాలకి మూలాలూ, విఱుగుళ్లూ" అనే శీర్షికతో టపాల పరంపర వెలువఱించాను.

    ప్రస్తుతం జఱుగుతున్న సమ్మె గుఱించి వ్రాసేదేముంది ? తెలంగాణ రాదని తె.వాదులకి తెలిసిపోయింది. ఆ సమాచారం బయటికి పొక్కట్లేదు గానీ కేసీయార్ కి తనకున్న వాహినుల ద్వారా కేంద్రం మూడ్ అర్థమైపోయింది. అందుకని ఉక్రోషం పట్టలేక "చిట్టచివఱిసారిగా ఒక దెబ్బ వేద్దాం ఆంధ్రావాళ్ళని" అని చెప్పి ఈ సమ్మెలోకి దిగారు, కేంద్రం మూడ్ తెలుసు గనుక కాంగీ జీవులు కూడా ఈ సమ్మెకి దూరంగా ఉంటున్నారు. కోస్తా-సీమ నాయకులకీ విషయం ముందే తెలుసు గనుక, కేంద్రం బుఱ్ఱ తిప్పేసింది తామే గనుక "రాని రాష్ట్రం గుఱించి మనం వ్యతిరేక ప్రకటనలు చేయడం దేనికి ? సమ్మె చేసుకుంటే చేసుకోనీలే" అని గమ్మునుంటున్నారు.

    రాబోయే రోజుల్లో తెలంగాణప్రజల చేతుల్లో దెబ్బలు పడేది TRS వాళ్ళకే ! ఎవడు గులాబీరంగు జెండా పట్టుకుని కనిపించినా ప్రజలు వాణ్ణి అక్కడికక్కడ పడేసి చావగొట్టే రోజులు అతిదగ్గఱలోనే ఉన్నాయి. కాస్త వేచి చూడండి. కడుపు మీద కొడుతూంటే ఎవఱు మాత్రం సహిత్సాతు. పనీపాటా లేకుండా వారాల తరబడి కడుపు మాడ్చుకొని బతకడానికి తెలంగాణవాళ్ళేమీ అమృతం తాగలేదుగా ?

    ReplyDelete
  4. ఆర్యా ! నా పై వ్యాఖ్యలో ఉపధా (penultimate) వాక్యాన్ని "....ఎవఱు మాత్రం సహిస్తారు ?" అని సవరించి చదువుకోవలసిందిగా ప్రార్థన. టైపాటుకు చింతిస్తున్నాను.

    ReplyDelete
  5. బ్రాహ్మణులు ఇలాంటివాటిల్లో పాల్గొనకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. పైన ఛాయాచిత్రంలోని పూజారుల ప్రవర్తన అభ్యంతరకరం.

    ReplyDelete
  6. అయ్యా సమైక్య వాదులారా ,
    పచ్చ కామెర్ల వ్యాధి వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అలా ఉంది మీ అందరి అభిప్రాయాల వ్యవహారం

    అయ్యా జాన్
    వాళ్ళు(మా పూజారులు)బలిసి ఉన్నారా !
    పాపం మీ దేవుని బిడ్డలకు విదేశాలనుండి వస్తున్న పాపిష్టి డబ్బు (మనుషులు పాపులు కదా మరి) సరిపోవడం లేదేమో పాపం బక్కచిక్కి పోయారు మరి !
    సిద్ధాంత పరంగా చర్చించు కోవడం మంచిదే కాని ఇలా వ్యక్తిగత దూషణలు మంచివి కావు నీ వ్యాక్యలతో నాకు కలిగిన ఫీలింగ్ ఇప్పుడు నీకు కలిగి ఉంటుంది,

    ఇక మిగినవారి అభిప్రాయాలు
    ఒక సంఘటనకు ఒకే దృక్కోణంలో చూస్తున్నట్లుంది, ఇప్పుడున్న ఆంద్ర ప్రదేశ్ వైశాల్యం లో రెండు లేదా ముడు నగరాలు రాజధానులుగా అభివృద్ది చెందితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది ,
    ఒక్క సారి ఆలోచించండి సహోదరులారా శ్రీకాకుళం జిల్లా నివాసికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పని ఉంటె అతను ఐదు రోజుల సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది అదే విజయవాడ కాని గుంటూరు కాని రాజధానిగా ఉంటె ఎంత సౌలబ్యంగా ఉంటుంది, ఇప్పటికిప్పుడు మన రాజధాని మనది కాకుండా పోతుందనే మనోభావాన్ని నేను గౌరవిస్తున్నా ! కాబట్టి ఒక ఏడు సంవస్తారాల కాలపరిమితితో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే నష్టమేముంది

    ReplyDelete
  7. అయ్యా "యోగ్" గారూ, పచ్చకామెర్ల వాడికి లోకం పచ్చనే కానీ కామెర్లు ఎవడికి వచ్చాయనే సంగతి ముందు తేల్చండి.

    జాన్ గారి సంగతి వదిలెయ్యండి. అది వ్యక్తిగత దూషణ. తెలబాన్ల సంగతో? కేవలం రాజధాని ఇక్కడ ఉన్న అనుకూలత కారణంగా సమైక్య ఆంధ్రకు సంబంధించిన అన్ని కార్యాలయాలను, చివరికి దేవాలయాలను కూడా స్థంభింపజేస్తారా? ఇదేం న్యాయం? రేప్పొద్దున ఆర్టీసీ కి, విద్యుత్తు వారికి కోట్లలో నష్టాలొస్తే, తెలబాన్లకు యోగ్యత ఉంటే వారినే భరించనివ్వండి. అప్పుడు మళ్ళీ సమైక్యాంధ్రలో అందరి దగ్గరా టాక్సుల కోసం వెంపర్లాడకండి. వాళ్ళ నిర్వాకం వల్లనే నష్టం వస్తూంది. చూస్తూండండి, నేడో, రేపో అలాటి ఉద్యమం సమైక్యాంధ్రలో వచ్చినా రావచ్చు.

    మీరు చెప్పే అధికారవికేంద్రీకరణ వేఱు, అందుకోసం తెలంగాణా వాదం అవసరమే లేదు.

    ReplyDelete
  8. 1. @ John above:
    తెలబాన్ల వికృత చేష్టలని ఎన్నైనా విమర్శించండి, వెక్కిరించండి కానీ వ్యక్తిగత విమర్శలు చేయవద్దు. వ్యక్తిగత దూషణ అన్నది కేవలం తెలబాన్లకే ప్రత్యేకం. ఇతరులకి అది నిషిద్ధం. మీ కామెంటుని డిలిట్ చేయను కానీ మీరే ఉపసంహరించుకుంటే బాగుంటుంది.

    2. @ Anonymous (Sep 22, 2011 1:20 PM)
    నా బ్లాగు కూడా మూగ బోలేదు. తెలబాన్లు తిక్క చేష్టలు చేసినప్పుడల్లా కలం ఝుళిపిస్తూనే వున్నాను.

    3. @ LBS తాడేపల్లి :
    మీ భావ వ్యక్తీకరణకు కృతఙ్ఞతలు. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

    4. @ Anonymous (Sep 22, 2011 2:26 PM)
    ఖచ్చితంగా నష్టాల వంకతో ప్రభుత్వం చార్జీలు పెంచుతుంది. మీరు ఊహించిన ఉద్యమం కూడా వచ్చి తీరుతుంది.

    ReplyDelete
  9. అయ్యా ఆకాశరామన్న గారూ..మీరు మీపేరు ఆకాశరామన్న అని ఎదో ఒక పేరు పెట్టుకున్నట్టు నా పేరు జాన్ అని పెట్టుకున్నాను. నాకూ నా పేరుకు ఉన్న సంబంధం అంతే...

    తెలబానులు, పూజారులు చేస్తున్న పనులు చూసి వళ్ళు మండి రాసిన వాఖ్య అది. ఐనా మీరన్నట్టు వ్యక్తిగత దూషణ అన్నది కేవలం తెలబాన్లకే ప్రత్యేకం. ఇక అలాంటివి ఇక్కడ చేయను.

    యోగ్ బాబూ...శ్రీకాకుళం జిల్లా వాసులకోసం మీరు పడుతున్న బాధ చూస్తే నా గుండె తరుక్కు పోతోంది. వెంటనే దేశరాజధానిని డిల్లీ నుండి మధ్య ఉన్న మధ్య ప్రదేష్ కి మార్చమని లొల్లి మొదలెడదాం. పన్లో పని రాజధాని డిల్లీ కొన్ని విగ్రహాలు పగలగొడదాం.

    /రెండు లేదా ముడు నగరాలు రాజధానులుగా అభివృద్ది చెందితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది , /
    వప్పుకుంటాం. వెంటనే మీరు వరంగల్ రాజధాని గా చేసుకుని రాష్ట్రాన్ని విడగొడితే..రాష్ట్రంలో అందరూ వప్పుకోవచ్చు.

    ReplyDelete
  10. వినాసకాలే విపరీత బుద్ధిః. ఈ పూజారులు తమకు ఆహారం పెట్టె భగవంతున్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంతే వీళ్లు బ్రాహ్మణులా అనే అనుమానం వస్తోంది.
    అంతే కాకుండా, తెలంగాణా బస్సులలో కండక్టర్ లు టిక్కెట్ లు కోయకుండా సగం టిక్కట్ కే డబ్బు తీసుకొని ఆ డబ్బులు తమ జేబులో పెట్టుకొనేవారు. అందుకే తెలంగాణలో ప్రైవేట్ బస్సులు ఈ రోజుకీ లేవు. 1983 కి ముందు సిటీ బస్సులలో టిక్కెట్లు తీయకుండా హైదరాబాదులో తెలంగాణా వాదులు తిరిగే వారు. కోస్తా రాయలసీమల వాళ్లు వచ్చిన తరువాత టిక్కట్లు కొనడం మొదలు పెట్టారు. అదీ ఎన్ టీ రామారావు ప్రభుత్వంలో టిక్కట్ తీయని వారి మీద కేసులు పెట్టి, ఫైన్లు వసూలు చేయడం మొదలు పెట్టిన తరువాత టిక్కట్లు కొనడం మొదలు పెట్టారు. ఇంకొక విషయం వరంగల్ లో సిటి బస్సుల మూట పడడానికి కారణం కూడా ఇదే.

    ReplyDelete
  11. Rallabhandy Ravindranath:

    "1983 కి ముందు సిటీ బస్సులలో టిక్కెట్లు తీయకుండా హైదరాబాదులో తెలంగాణా వాదులు తిరిగే వారు"

    నువ్వు అప్పుడు conductorవా? చూసినట్టే మాట్లాడుతున్నావ్!

    One guy will make wild & vague accusations. All the other andhera guys say తందానా!

    वाह रे अँधेरा प्रदेश नाम का अँधा नागरी!

    ReplyDelete
  12. >>>> వ్యక్తిగత దూషణ అన్నది కేవలం తెలబాన్లకే ప్రత్యేకం. <<<<
    మొత్తం తెలంగాణావాదులను "తెలబాన్లు" , "మూర్ఖులు" అని తిట్టడం ఆంధ్రా వాళ్ళ మహా గొప్ప సంస్కారం కదా!
    ఏం నీతులు వల్లిస్తున్నారు బాబూ.
    ఆహా ఏం సమైక్యవాదం !
    - Rajesh

    ReplyDelete
  13. tickets sangathi cheppadani ki nenu inka appatiki puttaledu kani,telangana lo current bills entha baga kadataro evaraina cheptara.. poni cheppaleni vallaki vivaramuga

    thay can't pay bill at same date moreover a public servent who is worker in current office he went to each home asking for pay the bill dora otherwise atleast pay 100/- no matter how much bill u get

    some of families paying 20/- per a month they have all facilities,other one pays 75/- from 20 years.

    ReplyDelete
  14. @ Rajesh above: (Sep 22,2011 6:51 PM)
    తెలంగాణా వాదులకీ, తెలబాన్లకీ చాల తేడా వుంది. గతంలోనే వివరించాను. ఇక్కడ చదవండి.
    http://andhraaakasaramanna.blogspot.com/2011/01/blog-post_20.html
    నా విమర్శలైనా, సీమాంధ్రుల విమర్శలైనా, తెలబాన్లకి వర్తించేవే గానీ అమాయకులైన తెలంగాణా పౌరులకి కాదు.

    ReplyDelete
  15. @yog garu
    >>ఇప్పటికిప్పుడు మన రాజధాని మనది కాకుండా పోతుందనే మనోభావాన్ని నేను గౌరవిస్తున్నా !
    మీలాగే తెలంగాణ కోసం ఉద్యమించే అందరూ పక్కవాడి మనోభావాలు గౌరించినట్లైతే తెలంగాణ ఎప్పుడో వచ్చేది.. ఇబ్బంది రాజధానితోనో లేదా నదీ జలాలతో కాదండి, అంతకంటే ఎక్కువగా ఉన్న పరస్పర ద్వేషం వల్ల.. ఎప్పుడైతే కే.సీ.ఆర్ ఉద్యమాన్ని తెలంగాణ వర్సెస్ సీమాంధ్రగా తయారు చెశాడో మన రాష్ట్ర పతనం అక్కడినుంచే మొదలైంది.. మరో వైపు కేంద్రం తాంబులాలిచ్చాం తన్నుకు చావండి అన్న ధోరణిలో ఉండటం మరింత చేటు చేస్తోంది.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరో పదేళ్ళలో మన సమాజం కూడా పాకిస్తాన్ లా మారే అవకాశం పుష్కలంగా ఉంది..

    ReplyDelete
  16. I second John, the persons in the picture deserve much more. Nothing personal in his comment.

    ReplyDelete
  17. "1983 కి ముందు సిటీ బస్సులలో టిక్కెట్లు తీయకుండా హైదరాబాదులో తెలంగాణా వాదులు తిరిగే వారు"

    నువ్వు అప్పుడు conductorవా? చూసినట్టే మాట్లాడుతున్నావ్!

    One guy will make wild & vague accusations. All the other andhera guys say తందానా!

    वाह रे अँधेरा प्रदेश नाम का अँधा नागरी!


    తమ్మి నిన్ను చుస్తే జాలేస్తుంది, తెలంగాన వాదులు వేరు తెలంగాన సోదరులు వేరు ప్రజలు అందరూ సోదరులు, వాదులు స్వార్థ పరులు. వారి గురించి అన్న చెప్పిండు, టిక్కట్లు కొనకుంట పోతరు అని, నిన్నన్నట్లు బాద పడత వేంది? నివ్వు ఆంద్ర అని వేరు చేస్తే నివ్వు వేరైపోతవా? మేం గుడ్డోల్లం గితే నివ్వేన్దిర తమ్మి?
    గైన నీ తప్పు కాదు బిడ్డ గెన్నో సంస్రాలు తురుకోడు పాలనల వాని గున్నాలే నీకు ఆచినై. తురుకొని సంగు నీకు మస్తుగా అన్తుకూన్నది బిడ్డ వాన్ని గిప్పటికి పూస్కుంట మనతోని మనం కొట్లాట పెట్టుకుంటే ఎట్లా బేటా, "నీ వాణ్ణే నువ్వు తిట్టక పొతే తెలుగువాదివే కాదు" నివ్వు నిజ్జంగా తెలుగోనివే.

    ReplyDelete
  18. are bhai vaallu balupu taggadaanike paapam
    aata adite ainaa taggutaamani aadutunnaaru paapam
    tinnadi aragaka poojalu pakkaki petti aadutunnaaru paapam
    Rama

    ReplyDelete
  19. @rama:

    "నీ వాణ్ణే నువ్వు తిట్టక పొతే తెలుగువాదివే కాదు"

    నేను వాణ్ని తిట్టలేదు, వాడే తెలంగాణాలో తిరిగే బస్సులన్నింట్ల conductor గా పని చేసి, ఎవ్వడు టికెట్లు తీసుకోలేదని చూసినట్టు రాసిండు.

    If this is not stereotyping, I don't know what is. ఇది సామూహిక దూషణ కాకపొతే మరేంటి?

    టికెట్లు కొనకుండా తిరిగే మోసగాల్లతోటి Rallabhandy Ravindranath, తాగుబోతులతోటి "ఆడవాళ్ళు మినహాయింపు కాదు" LBS తాడేపల్లి కలిసి ఉండామనుకోవడం చూస్తె వాళ్ళ మీద జాలేస్తది.

    ReplyDelete
  20. పైన రాళ్ళబండి రవీంద్రనాథ్ గారు రాసినదాన్ని విమర్శించే అనామక జనానికి:

    "తెలంగాణ వాళ్లు మాత్రం పన్నులు బుద్ధిగా కడతారు, కోస్తా సీమల జనం ఎగ్గొడతారు."
    "కోస్తా సీమల జనం రాక్షసుల వారసులు"

    ఈ బాపతు వాగుడు వాగిన సన్నాసెదవల దగ్గరికిపోయి "రేయ్ విషం కక్కడం తప్పురా" అని మీ తర్కాన్ని వినిపించండి. ఆ తరవాత కూడా బతికుంటే అప్పుడు ఇక్కడికొచ్చి నీతులు చెప్పండి.

    ReplyDelete
  21. శంకర్ గారు ధన్యవాదాలు , వాదనలు వేరైన మనషుల మధ్య ఉండాల్సిన కనీస మర్యాదలు ఉంటాయి అవి మిరనంతవరకు వాదోపవాదాలు మన మానసిక స్థాయిని అభివృద్ధి పరచడంలో తోర్పడతాయి అవి దాటిన నాడు వైషమ్యాలు ఏర్పడతాయి ఆ పరిధిలో ఉంది మన చర్చ ను కొనసాగిద్దాం ,

    అయ్యా జాన్ గారు
    పరిచయం లేని వ్యక్తిని "బాబూ" అని పిలిచే సంస్కారం నాకు లేదు , ఇక పొతే మీ వాదన నేను పట్టిన కుందేలుకు ముడే కాళ్ళు అనే దోరణిలో ఉంది దేశం వేరు , రాష్ట్రం వేరు ఈ తేడాను తమరు గమనించాల్సి ఉంది , అయిన తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ అన్ని విధాలుగా center Point కాని మన రాష్ట్రము మొత్తాన్ని తీసుకుంటే అలాంటి పరిస్థితి ఉండదు ఈ విషయాన్ని అర్థం చేయించడం కోసమే శ్రీకాకుళం జిల్లా ను ఒక ఉదాహరణగా చూపించడం జరిగింది కాని తమరు ఇలా అర్థం చేసుకుంటారని నేను ఉయిన్చాలేకపోయాను క్షమించండి ,
    మీరు అంటున్న రెండు లేక ముడు జాతీయ రాజధానుల సిద్ధాతం దేశ ద్రోహనేరం కింద IPC గుర్తిస్తుంది దీనిని గమనించాలి మీరు పది సంవస్తరాల కాలపరిమితో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఓ(పో)రుగల్లు ను రాజధానిగా అభివృద్ది చెయ్యండి సంతోషిస్తాం ,
    మిగతా చర్చ కై మరో పోస్ట్ లో కలుద్దాం ,
    "" దేవుడు ఈ పాపిని (ఇనంనేనోయి) శిక్షించుగాక "

    ReplyDelete
  22. @చదువరి:

    "ఈ బాపతు వాగుడు వాగిన సన్నాసెదవల దగ్గరికిపోయి "రేయ్ విషం కక్కడం తప్పురా" అని మీ తర్కాన్ని వినిపించండి"

    I will do that if you post the link (unless the blog disables comments like the "great" కలగూరగంప)

    How can you justify Rallabandy & Tadepalli making wild unsubstantiated allegations just because (as you claim) someone else did so.

    ReplyDelete
  23. /పరిచయం లేని వ్యక్తిని "బాబూ" అని పిలిచే సంస్కారం నాకు లేదు ,/

    ఏంటో ఈ కామెడీ..అర్ధమైతే గాని నవ్వురాదు.

    /మీరు అంటున్న రెండు లేక ముడు జాతీయ రాజధానుల సిద్ధాతం /

    నేనెప్పుడు అన్నానో..అది ఈ yog బాబు ఎపుడు విన్నాడో..ఏమిటో...అంతా విష్ణు మాయ

    /దేశ ద్రోహనేరం కింద IPC గుర్తిస్తుంది /

    షివరింగ్ వచ్చేస్తందండీ...ఎవరైనా బయటపడే మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండీ please...please...

    /"" దేవుడు ఈ పాపిని (ఇనంనేనోయి) శిక్షించుగాక " /
    తిరుపతి దేముడితో పెట్టుకుని ఒక మహానేత గాల్లో కలిసిపోయాడు. ఇపుడు అన్ని దేముళ్ళను కలిసికట్టుగా మీకు పూజలు చేయం అని బెదిరిస్తున్న తెలబాన్లు ఏమవ్వుతారో...

    /తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఓ(పో)రుగల్లు ను రాజధానిగా అభివృద్ది చెయ్యండి సంతోషిస్తాం ,/

    అంతేనా...రోజూ పొద్దున్నే వచ్చి తెలబాన్లకు పళ్ళుతోమి, స్నానం చేయించి, etc etc కూడా..చేయించాలా ?

    ReplyDelete
  24. "I will do that if you post the link" - అనామకంగా ఉండటంతో మీరెలాగూ మాకు కనబడ్దం లేదు సరే.. ప్రపంచం మీకు కనబడకుండా పోయింది కూడానా ఏంటి? కేసీయారనే ప్రబుద్ధుడు ఆ విషం గక్కగా పేపర్లూ టీవీలూ ఘోషించాయి. ఏవీ ఆ లింకులు ఇలా ఇవ్వండి అని నన్ను అడక్కండి, ఇప్పుడూ నేను వాటిని చావబెట్టలేను.

    "How can you justify .." - ఆడెవడో అమ్మనాబూతులు తిడుతూంటే మేమూ అన్నాం. అంటాం గూడా! దీనికి జస్టిఫికేషనేంది? అసలు తెలంగాణ ఎందుకురా మీకు అనేదానికి అబద్ధపు కూతలు తప్ప, జస్టిఫికేషను చెప్పేవాడు లేడు గానీ, మేమన్న దానికి జస్టిఫికేషను చెప్పాలా? ఏమి తెవాదంరా బాబూ..!

    ReplyDelete
  25. బొమ్మలో క్రికెట్ ఆడుకుంటున్న పూజారులు కొంచెం కండపుష్టితో బలంగానే ఉన్నారు. చక్రపొంగళ్ళు, పులిహోర పెరుగన్నాలు కారణం కావచ్చు. (no disrespect intended please) పాపం వాళ్ళకి వ్యాయామం చేసే అవకాశం ఉండదు. తెలబాన్ ముండమోపి ఉద్యమంతోనైనా కొంచెం ఆడుకుని సరదా తీర్చుకుంటున్నారు. అర్చనలు, పూజలు ముగించుకొని ఆడుకోండి బాబూ.

    ReplyDelete
  26. This photo is really disgusting to see... because it is related to T strike. If there was some other reason , ( like eclipse ..) nobody would comment ( except in a funny way ). So, they being fat or lean is not the question. Any how, the person who made it regretted his comment.
    We should only ponder on the point , whether it is right to close the temple for political reasons. The discussion should be only in those lines , irrespective of regions.

    ReplyDelete