Monday, April 12, 2010

ఇంత హంగామా అవసరమా?

సానియా మీర్జా పెళ్లి చేసుకుంది. సంతోషం. ఐతే ఈ విషయంలో మీడియా చాలా ఎక్కువ హంగామా చేసి అనవసరమైన ప్రచారం ఈ పెళ్ళికి  కలుగ జేసింది. ప్రపంచంలో ఇంకెవ్వరూ దొరకనట్లు ఒక పాకిస్తానీని వరించి దుబాయిలో సెటిల్ అవుతానని ప్రకటించేసిన ఆమెను ఆశీర్వదించి వదిలేస్తే చాలు. అంతే తప్ప ఆమె కట్టుకున్న చీర ఖరీదెంత? కారు కలరెంటి? పెళ్ళిలో భోజనాల వివరాలు ఇత్యాదులన్నీ భారత ప్రజలకి అనవసరం. భారత దేశం నుండి విశిష్టమైన అర్జున అవార్డుని అందుకొని, ఎం.జీ.ఆర్. యూనివర్సిటీ నుండి డాక్టరేటు తీసుకొని, ఇంకా అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు సైతం కట్ట బెట్టిన దేశాన్ని కాదని వెళ్లి పోతున్న సానియాను పట్టుకొని పాకులాడటం మీడియా చేస్తున్న అతి గానే భావించాలి.

13 comments:

  1. రామన్నా!
    అవును మీడియా circus మరీ కొంచం ఎక్కువైంది!
    ఆ అమ్మాయి పెళ్లి తన ఇష్టం. ఇష్టమైన వాడిని వరించి చేసుకుంటుంది.
    incidental గా అతను పొరుగు దేశం కి చెందిన వాడు.
    అతనిని పెళ్లి చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయినంత మాత్రానికి ఇండియా కి
    ద్రోహం చేసినట్టు ఆ ఫీలింగ్ ఎందుకో?
    దేశాన్ని విడిచి వెళ్ళిపోతానని గానీ దేశాన్ని represent చెయ్యనని గానీ ఆ అమ్మాయి ఎక్కడా అనలేదే?
    మనకి ఇప్పట్నుంచే ఎందుకు అంత insecurity ?
    వేచి చూడ వచ్చు కదా?

    ReplyDelete
  2. ఇన్సెక్యూరిటీ అన్న పదం వాడారు కాబట్టి చెపుతున్నా. మొదట నేను చేసిన విమర్శ మీడియా పైన మాత్రమె. అయితే ఎవరు అవునన్నా కాదన్నా పాకిస్తాన్ మనకి శత్రు దేశమే! మన దేశంలోని అనేక నగరాల్లో తీవ్రవాదులని జొప్పించి అమాయక ప్రజలని బలిగొన్న సంఘటనలలో పాకిస్తాన్ ప్రమేయం స్పష్టంగా రుజువు అయ్యింది. అటువంటి దేశం వాడిని పెళ్లి చేసుకోవటం తప్పు కాదు కానీ పెళ్ళికి ముందు ఈ దేశం నుండి పొందిన అవార్డులు, రివార్డులు తిరిగి ఇచ్చేస్తే సానియాకి హుందాగా వుండేది.

    ReplyDelete
  3. ఆకాశరామన్న గారూ...మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. బ్లాగర్ గా మాత్రమే కాదు. మీడియా పర్సన్ గా, జర్నలిస్ట్ గా ఏకీభవిస్తున్నాను. ఇలాంటి వార్తలే జనాలు చూస్తారనే వెర్రి భ్రమలో మీడియా యాజమాన్యాలు ఉన్నాయి. దీనితో పాటు పక్క ఛానల్ వాడు వేస్తే చాలు...ఇక అందరూ వేయాల్సిందే. అదీ పరిస్థితి.

    ReplyDelete
  4. తప్పు రామన్నా. కొందరు చేసిన వెధవ పనులకి ఆ దేశ ప్రజలందరినీ responsible చెయ్య కూడదు.
    ఐనా నాకు అర్ధం కావటం లేదు......అప్పుడే సానియా భారతీయత కి గోరీ కట్టేస్తున్నావేమిటి?
    పెళ్లి చేసుకున్నంత మాత్రాన అన్నీ మారి పోయినట్టేనా?
    పెళ్లి తరువాత దుబాయ్ లో సెటిల్ అవ్వటంలో ఉద్దేశ్యం ఇండియా ని represent చెయ్యాలనే ఏమో?

    ReplyDelete
  5. ఇలాంటి సానియా మీర్జాలూ, ఎం.ఎఫ్.ఖాన్లూ ఇండియాను రిప్రేజేంట్ చెయ్యక్కర్లేదు. వదిలి పొతే అంతే చాలు.

    ReplyDelete
  6. మరీ extemist లా మాట్లాడుతున్నావు రామన్నా!
    తేనె పట్టు కదిపావు.......ఇంక చూసుకో మరి!
    హ హా హా!

    ReplyDelete
  7. వేచి చూద్దామండీ. దుబాయి లో ఉన్నా భారతదేశం తరపున ఆడుతుందేమో. మీడియా చేసే అతి వల్ల మనకి ఇలా అనిపిస్తోంది.

    శ్రీవాసుకి

    ReplyDelete
  8. అరె ఈమె తప్ప ఇండియ కి రెప్రెజెంట్ చెసె దిక్కు లెదు అన్నట్టు మట్లాడుతున్నరే, అసలు ఈమె ఇండియ కి తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్ట లెంటొ నాకు నిజంగా తెలియదు, దయచెసి ఎవరైనా తెలిస్తె చెప్పండి

    ReplyDelete
  9. If she is married to Pakistani and settled in Dubai and playing for India in US Open and Australian open.

    is that all... or any thing more...

    ReplyDelete
  10. మరి మనం చేసిందేమిటి?
    ఆ హంగామా గురించి చంకలు కొట్టుకోవటం దేనికిట??

    ReplyDelete
  11. ilaa antunnaamu kaanee mana andarikee koddo goppo kutuhalam vunde vuntundi manasulo aa news chudalani.kaadantaaraa...celebrities marriage evarikayinaa special gaave vuntundi.manamu chustunnaamu vaallu vestunnaaru anthe.

    ReplyDelete
  12. భారతదేశ ప్రజల సొమ్ముతో ఐ.ఐ.టి,ఐ.ఐ.ఎం.లు చేసి అమెరికా వైపు పరుగులు తీసే వాళ్ళను ఏమనాలి.వాళ్ళ దేశ భక్తిని శంకించనవసరం లేదంటారా?

    ReplyDelete
  13. మన దేశం లొ వుంటూ ప్రతిభ కు దగ్గ వుద్యొగం దొరక్క, వున్న కొద్ది అవకాశాల్ని రిజర్వేషన్స్ పేరుతొ అసమర్దులకి పెట్టిపొస్తుంటే.. చెమటొడ్చి సంపాదించిన డబ్బుతొ కట్టిన పన్నులు జనాలకి ఫ్రీ లక్షలగా ధారపొస్తుంటే.. ప్రతిభావంతులు అమెరికా వైపు చూడక ఏం చేస్తారు రమణా రెడ్డి గారు
    వాళ్ళ దేశ భక్తిని ఎమీ శంకించనక్కర్లేదు :-)) ఇక్కడ వుండి దేశాన్ని దోచుకుతింటున్నావారికన్నా చాలా బెటర్..

    ReplyDelete