తెలంగాణకి అడ్డొచ్చిన సమైక్య వాదులని నరికేయాలని విజయ శాంతి తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలా నరికేస్తే సమైక్య వాదులు చేతులు ముడుచుకుని కూర్చుంటారా? ఎన్నికల కొడ్ అమలులొ వున్నప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదన్న కనీస నియమం పాటించాల్సిన బాధ్యత ఎం.పీ.గా ఆమెకి లేదా? ఇక ఎన్నికల సంఘమే కలుగ జెసుకొని ఆమె పదవినీ, అహంకారాన్నీ నరకాల్సిన బాధ్యత నిర్వర్తించాలి.
Wednesday, June 30, 2010
Monday, June 28, 2010
పీ వీ ని మరచిన దేశం!
ఈ రోజు మాజీ ప్రధాని, తెలుగు తేజం పీ.వీ. జయంతి అని గుర్తున్న వారిని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో! తెలుగు వారి నుండి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన ఏకైక వ్యక్తిని కనీసం తెలుగు వారమైన మనమైనా ఈ రోజు స్మరించుకోవడం కనీస ధర్మం. రాజీవ్ హత్య జరిగే సమయానికి దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా వుందో ఎవరికైనా జ్ఞాపకముందా? రిజర్వ్ బ్యాంకు బంగారం అమ్మి బాకీలు తీర్చాల్సిన దుస్థితిలో పీ వీ కి ప్రధాని పగ్గం చేతికి వచ్చింది. ఆయన దూరాలోచనతో అప్పటి వరకూ బ్యూరోక్రాట్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిని చేసి, సంస్కరణల అమలులో ఆయనకి పూర్తి స్వేచ్చ ఇచ్చి దేశ ఆర్ధిక పటిష్టతకి కారణమైన వ్యక్తిని కనీసం ఆయన సొంత పార్టీ మనుషులే మర్చిపోవటం దారుణం. వారు పీ వీ ని మర్చి పోయారనటం కూడా తప్పు. బాబ్రీ మసీదు నించి భోపాల్ గ్యాసు దాకా అన్ని సంఘటనలకీ బాద్యుడిని చేయటానికి కాంగ్రేసు వారికో పాపాల భైరవుడు కావాలి. ఆయనే పీ.వీ.! ఇంక ప్రతి చిన్నా చితకా సినీ తారల పుట్టిన రోజులకీ, పెళ్లి రోజులకీ రిపీటేడ్ గా ప్రత్యెక కార్యక్రమాలు ఇచ్చే మన తెలుగు టీవీ చానెళ్ళు సైతం బహు భాషా కోవిదుడైన ఈ అపర చాణుక్యుడిని విస్మరించడం విచిత్రం.
Sunday, June 20, 2010
వీ.ఐ.పీ. సేవలింక ఆపండి..
సామాన్య భక్తులకి కనీసం రెండు సెకనులు కూడా కళ్ళారా స్వామిని చూడనీయకుండా మహా లఘు అని, మహా మహా లఘు అని పేర్లు పెట్టి గెంటి వేసే టీ.టీ.డీ. అధికార గణం ఈ రోజు విజయ్ మాల్య కోసం రెండు గంటలు క్యు లైనులని ఆపెశారన్న వార్త వింటేనే పట్టరాని ఆగ్రహం వస్తోంది. ఇంక ఆ రెండు గంటలు పిల్లా పాపలతో నిలబడి పోయిన భక్తుల అవస్థలు ఆ భగవంతుడికే ఎరుక! అసలు ఒక మద్యం వ్యాపారికి ఆలయ నిర్వహణ పగ్గాలు అందించడమే తప్పు. అధికారం చేతిలో వున్నప్పుడు తోటి మద్యం వ్యాపారికి ఎర్ర తివాచీలు పరచటంలో ఆశ్చర్యం లేదు. పీ.వీ.ఆర్.కే.ప్రసాద్, కామి శెట్టి శ్రీనివాసులు వంటి నిబద్ధత గల (మాజీ) అధికారులని-- వయసై పొయిందనో లేదా కోర్టు చెప్పిందనో వంకతో వేటు వేసిన ఆలయ అధికార గణం ... ఎ అర్హత వుందని - భోగ లాలసుడిగా పేరు పడ్డ ఈ మద్యం వ్యాపారికి రాచ మర్యాదలు చేసారో అవస్థలు పడ్డ భక్త జనులకి వివరణ ఇచ్చి తీరాలి.
Subscribe to:
Posts (Atom)