Monday, June 28, 2010

పీ వీ ని మరచిన దేశం!

ఈ రోజు మాజీ ప్రధాని, తెలుగు తేజం పీ.వీ. జయంతి అని గుర్తున్న వారిని వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో!  తెలుగు వారి నుండి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన ఏకైక వ్యక్తిని కనీసం తెలుగు వారమైన మనమైనా ఈ రోజు స్మరించుకోవడం కనీస ధర్మం. రాజీవ్ హత్య జరిగే సమయానికి దేశ ఆర్ధిక పరిస్థితి ఎలా వుందో ఎవరికైనా జ్ఞాపకముందా?  రిజర్వ్ బ్యాంకు బంగారం అమ్మి బాకీలు తీర్చాల్సిన దుస్థితిలో పీ వీ కి ప్రధాని పగ్గం చేతికి వచ్చింది.  ఆయన దూరాలోచనతో అప్పటి వరకూ బ్యూరోక్రాట్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ని ఆర్ధిక మంత్రిని చేసి, సంస్కరణల అమలులో ఆయనకి పూర్తి స్వేచ్చ ఇచ్చి దేశ ఆర్ధిక పటిష్టతకి కారణమైన వ్యక్తిని కనీసం ఆయన సొంత పార్టీ మనుషులే మర్చిపోవటం దారుణం. వారు పీ వీ ని మర్చి పోయారనటం కూడా తప్పు. బాబ్రీ మసీదు నించి భోపాల్ గ్యాసు దాకా అన్ని సంఘటనలకీ  బాద్యుడిని చేయటానికి కాంగ్రేసు వారికో పాపాల భైరవుడు కావాలి.  ఆయనే పీ.వీ.!  ఇంక ప్రతి చిన్నా చితకా సినీ తారల పుట్టిన రోజులకీ, పెళ్లి రోజులకీ రిపీటేడ్ గా ప్రత్యెక కార్యక్రమాలు ఇచ్చే మన తెలుగు టీవీ చానెళ్ళు సైతం బహు భాషా కోవిదుడైన ఈ అపర చాణుక్యుడిని విస్మరించడం విచిత్రం.

5 comments:

  1. చక్కటి టపా రాశారు.

    పీవీ అంటే నాకు ప్రాణం! నిజానికి టపా రాయాలనే అనుకున్నాను గానీ పరిస్థితుల ప్రభావం వల్ల కుదర లేదు. కూడలిలో ఎవరైనా రాసి ఉంటారని చూస్తే మీ టపా కనపడింది. సంతోషం!

    పీవీని రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మర్చిపోవచ్చు! కానీ ఆయన్ని అభిమానించే ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. పోయాడు కాబట్టి,ఆరోపణలను ఖండించే వారసులెవరూ లేరు కాబట్టి, ప్రతి దానికీ ఆయన్ని బాధ్యుడిని చేయడం కాంగ్రెస్ దుష్ట సంస్కృతికి అలవాటుగా మారింది.

    మీడియా సైతం ఈయన్ని విస్మరించడం నాక్కూడా ఆశ్చర్యాన్ని,బాధను కల్గించిన విషయం!

    ప్రభుత్వం అశ్రద్ధ ఆయన అంత్యక్రియలప్పుడే బయటపడిందనుకోండి!

    ReplyDelete
  2. మనతెలుగు వారైన మొట్టమొదటి ప్రదానమంత్రి శ్రీ పీ.వీ.నరసిం హరావు గారుచనిపోయినప్పుడు డిల్లీ పెద్దలు చేసిన అవమానమానానికి మనంకాబట్టి నోరుమూసుకున్నాము . మనరాష్టంలో ఐతే సరే సరి చెప్పక్కర్లేదు .ఇక మీడియా వాళ్ళకి వాళ్ల రేటింగ్సే ముక్యం కదా.ఆయన మునిమనమడు ఆయన పేరిట డిల్లిలో స్మారక చిహ్నం ఏర్పాటుకి పీ.ఎం వద్దకెళితే ఆయన అప్పాయింట్మెంటే దొరకలేదంట అలాగుంది . ఇంక జయంతి వేడుకలు ఏమి చేస్తారు.

    ReplyDelete
  3. మీడియా కి తెలంగాణా ఉప ఎన్నికల గోల పట్టింది కానీ, పీ వీ గారి గురించి ఎందుకు? దేశం నాశనం అవుతున్నా పర్లేదు, నిజంగా దేశం కోసం అలోచించేవారు వారికి అక్కరలేదు. ఇక కాంగ్రెసు వారి విషయానికి వస్తే, అన్ని రకాల పాపాలకీ పీ వీ ని బాధ్యుడిని చేయడం ఆ సోనియా కి అలవాటే కద! ఆ దరిద్రం ఇటలీ కి పోకుండా మనల్ని పట్టుకుని వేళ్ళాడుతూ, దేశంలో మంచి నాయకులని అందరూ మరచిపోవాలని చాలా ప్రయత్నిస్తూంటే, ఆమె కాళ్ళు పట్టుకుని భజన చేసే వారు అవేమీ గ్రహించకుండా చంచాగిరీ చేస్తున్నారు ! మన మహా నాయకుడిని అవమానిస్తుంటే మనమే ఊరుకుంటున్నపుడు ఇక వాళ్ళు రెచ్చిపోరూ? ఇందాకే నా బ్లాగు లో ఆయనని స్మరిస్తూ చిన్న టపా రాసాను. వీలుంటే చదవండి.
    http://virajaaji.blogspot.com/2010/06/blog-post.html

    ReplyDelete
  4. విరజాజి గారూ.. చిన్న టపాలొనె అక్షర సత్యాలు రాసారు. చాలా బాగుంది. తెలుగు వాడు కాక పొయి వుంటె పీ వీ ఈ పాటికి గాంధీ, నెహ్రూ లతొ సమానమైన గౌరవాన్ని పొంది వుండె వాడు. తెలుగు జాతిలొ పుట్టటం ఆయన దురద్రుష్టం.

    ReplyDelete