లొక్ సత్తా నాయకుడు జయ ప్రకాష్ నారాయణ చెప్పినట్లు ఎస్సై పరీక్షల నిర్వహణ విషయంలొ ప్రభుత్వ వైఖరి తుఘ్లక్ పాలననే తలపిస్తోంది. శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు రాకముందే ఇంతగా పెట్రేగుతున్న వేర్పాటు వాదుల్ని అదుపు చేయలేక చెతులెత్తేసిన దారిన పోయే దానయ్య ప్రభుత్వం, కమిటీ రిపోర్టు ఇచ్చాక ఏర్పడ బోయే పరిస్థితులని ఏ విధంగానూ హాండిల్ చేయలెదని చెప్పకనే చెప్పింది. ఇప్పటికే తెలుగు వారి పరువు-ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా మంటగలిసాయి. వేర్పాటు వాదం ముసుగులొ మొదలైన వుద్యమం(?) తీవ్రవాదం స్థాయిని దాటి పోయింది. ఇంక వుపేక్షించటంలో అర్ధం లేదు. ఆపరేషన్ బ్లూ స్టార్ తొ సిక్కు తీవ్ర వాదాన్ని తుద ముట్టించినట్లు ఈ వేర్పాటు వాదాన్ని తక్షణం కూకటి వేళ్ళతో పెకలించే వైపుగా చర్యలు తీసుకోవాలి. వెంటనె రాష్ట్రంలో గవర్నర్ పాలన ప్రవేశ పెట్టి ఈ దిశగా తొలి అడుగు వేయాలి.
Sunday, November 21, 2010
Friday, November 19, 2010
మెదక్ జిల్లాకేనా ఇందిరమ్మ పేరు?? మాకూ కావాలి!
ముఖ్య మంత్రి రోశయ్య తెలంగాణా పై పక్షపాతం చూపిస్తున్నారు. మహా నాయకురాలైన ఇందిరా గాంధీ పేరుని తెలంగాణాలొని మెదక్ జిల్లాకి పెట్టాలంటూ కోస్తాంధ్రులకి, సీమ వాసులకి చాలా అన్యాయం తలపెట్టారు. రేపు ఖర్మ కాలి తెలంగాణా విడి పోతే (అదెలాగూ జరగదు!) అప్పుడు మిగితా తెలుగు వారికి ఇందిరమ్మ ని జిల్లా పేరుతో తలుచుకునే భాగ్యం వుండద్దా? కావాలంటె తెలంగాణాలొనె పుట్టి పెరిగిన తెలుగు తేజం పీవీ పేరుని తెలంగాణా వారికి అక్కర్లేక పొయినా సీమకొ,కోస్తాంధ్రులకొ ఓ జిల్లాకి ఇవ్వండి. అంతే తప్ప ప్రాంతాల మధ్య ఇటువంటి పక్షపాతం చూపవద్దని ముఖ్య మంత్రి గారికి విజ్ఞప్తి!!
Subscribe to:
Posts (Atom)