ప్రజాభిప్రాయంతో పనే లేదన్నట్లుగా - దేశంలో వున్నది రాజకీయ పార్టీలే అన్న రీతిలో - కేవలం రాజకీయ పార్టీల లేఖలని ఆధారం చేసుకొని అడ్డగోలుగా ఆంధ్ర ప్రదేశ్ విభజనకి కేంద్రం పూనుకుంది. అత్యంత దుర్మార్గంగా సాగిపోతున్న ఈ విభజన ప్రక్రియలో ప్రజల గోడు చెప్పుకోవటానికి లభించిన ఏకైక అవకాశం - జీవోఎం కి పంపిన ఈ మెయిల్స్ ! అయితే ఇప్పుడు జీవోఎం నివేదిక తుది దశకి వచ్చిన వేళ, ప్రజానీకంనుండి వచ్చిన అభిప్రాయాలని అసలు వారు చదివారా లేదా - ఇంకా వారి నివేదికలో ప్రజాభిప్రాయాన్ని కూడా పొందు పరుస్తున్నారా లేదా అన్నది బ్రహ్మ రహస్యమే ! అందుకే జీవోఎం కి అందిన ఈ మెయిల్స్ విషయమై సమాచార హక్కు చట్టం కింద నేడు క్రింది విధంగా విజ్ఞాపన పంపాను.
(https://rtionline.gov.in వెబ్ సైట్ నుంచి)
1.Howmany emails were received in response to the invitation of feed back on terms of reference of Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh
2.Howmany emails supported for bifurcation of Andhra Pradesh and howmany emails opposed the bifurcation of Andhra Pradesh
3.Whether the GoM has studied all the emails received in this regard
4.Whether the response of the public vide emails is being incorported in the report of GoM
5.It is reqested to kindly provide the soft copies of the mails received or to made them accessible for public view in any website
హొమ్ శాఖ నుండి సమాధానం/సమాచారం వచ్చాక (వస్తే !) బ్లాగులో అప్ డేట్ చెస్తాను.