Sunday, January 26, 2014

కేంద్ర హొమ్ శాఖ ద్వంద్వ ప్రమాణాలు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో ఆర్టికిల్ 371 (D) విషయమై అటార్నీ జనరల్ సలహాని కేంద్రం కోరిన విషయం తెలిసిందే.  ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమిటి అన్నది ప్రజానీకానికి  వెల్లడించకుండా కేంద్రం హడావిడిగా బిల్లు తయారు చేసేసి రాష్ట్ర శాసన సభకి పంపేసింది.  ఇదే విషయంలో సమాచార హక్కు చట్టం కింద కేంద్ర హొమ్ శాఖని 2013 డిసెంబర్ 7 వ తేదిన నేను అడిగిన ప్రశ్నలు  ఇవి:   

1.Whether any report has been submitted by the Attorney General of India to the Group of Ministers (GoM) constituted for bifurcation of Andhra Pradesh regarding dealing with status of Article 371 (D) of Constitution of India for bifurcation of the Andhra Pradesh .. 

2.If submitted, what is the report submitted by the Attorney General in this regard and whether GoM has incorporated the suggestion given by the Attorney General in their report ..

49 రోజుల తరువాత నిన్ననే అందిన, కేంద్ర హొమ్ శాఖ తాపీగా ఇచ్చిన సమాధానం ఇది ! 

I am directed to refer to your RTI appiication No....dated 07.12.2013 (received by the undersigned on 10.12.2013) . 

Point no. 1 & 2 : No information is available with the CPIO. 

If you are not satisfied with the reply, you may make an appeal to the First Appellate Authority viz., Shri S. Suresh Kumar, J.S.(CS), Ministry of Home Affairs, NDCC II Bldg., Jaisingh Road, New Delhi. 


అయితే నిన్ననే శాసన సభలో ముఖ్య మంత్రి ప్రసంగిస్తూ ఇదే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితె - అది privileged information, ఇవ్వటం కుదరదు అని కేంద్రం బదులిచ్చినట్లు సభా ముఖంగా తెలియజెసారు. అంటే ఏదో ఒక విధమైన సమాచారం వారి వద్ద ఉన్నట్లే కదా ! ఒక సామాన్య పౌరుడిగా నేను అడిగితె ఏ విధమైన సమాచారం లేదని బదులిచ్చిన కేంద్ర హొమ్ శాఖ ముఖ్య మంత్రికి వేరే విధంగా సమాధానం చెప్తోందని తేట తెల్లమై పోతోంది. అసలు రాష్ట్ర విభజనకి ఎటువంటి ప్రాతిపదిక లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో విభజనకి సంబంధించిన సమస్త సమాచారం ప్రజలకి తెలియజెప్పి కేంద్రం ముందుకి సాగాలి. రాష్ట్ర విభజన విషయమై వున్న ఒక న్యాయపరమైన చిక్కుముడి విషయంలో ముఖ్యమంత్రికే సమాచారం ఇవ్వటానికి నిరాకరించటం రాష్ట్రాల అధికారాలని కేంద్రం కబ్జా చేయటమే అవుతుంది. అలాగే సామాన్య పౌరులకి సమాచారాన్ని తెలుసుకొనే హక్కుని నిరాకరించటమే అవుతుంది. 

(ఈ విషయంలో కేంద్ర హొమ్ శాఖ నుండి సమాధానం రాకముందే 30 రోజుల మొదటి గడువు ముగిసాక మొదటి అప్పీలు వేయటం జరిగింది. అప్పీలుకి సమాధానం వచ్చాక బ్లాగులో పొందుపరుస్తాను.)

10 comments:

  1. ఈ మధ్యనే తెలంగాణాకు చెందిన వ్యక్తి మాడభూషి గారు సమాచార హక్కు చట్టానికి ధిల్లీ లొ పెద్ద దిక్కుగా ఎంపిక కాబడ్డారు. ఆయనను సంప్రదించండి, మీకు సరైన సమాధానం, ఎ జి గారి ఉత్తరం కాపీ కూడా పంపుతారు. ఆయన చాలా మంచి మనిషి

    ReplyDelete
    Replies
    1. అమ్మయ్యా బ్రతికించారు.లేకపోతే, ఈపాటికి ఆ పదవి కూడా ఆంధ్రులకే ఇచ్చారు అని తెలబాన్లు చెలరేగిపోయేవారు.ఆయన పూర్వీకులు ఆంధ్రులా ఏమొ? ఒక సారి చూడండి. ఎందుకంటే, అనంతశయనం అయ్యంగార్ ఇంటి పేరు కూడా మాడభూషి.ఈ మధ్య రేవంత్ రెడ్డి, ఆయన స్నానం చేసే చెరువు ఎండిపోవడానికి కారణం ఆంధ్రులే అని సెలవిచ్చారు.

      Delete
    2. అవునా?నిజమేనా?హతవిధీ!

      Delete
  2. మీరే కాదు చాలా మందికి ఇదే పరిస్థితి యెదురవుతున్నది.ఒక రాష్ట్రాన్ని విభజించటం అనే రాజ్యాంగ బధ్ధమయిన విషయాన్ని అంతటి అతి రహస్యమయిన ప్రక్రియగా మార్చేసింది డిల్లీ నుంచి పంపే తాఖీదుల తోనే అంతా జరిపించాలనుకుంటున్న కాంగ్రెసు అధిష్టానం.

    కానీ రాజ్యాంగ పరమయిన సాంకేతికమయిన విషయాలతో సంబంధం లేనివే అయినా రాజకీయ సమీకరణాలలో పెను వేగంగా సంభవించే మార్పుల వల్ల 2014 యెన్నికల లోపు విభజన జరగక పోవచ్చు.2014 యెన్నికలు సమైక్య రాష్ట్రం లోనే జరుగుతాయని బలంగా అనిపిస్తున్నది.

    ReplyDelete
  3. మాస్టారు దేనికోసం ఈ వెంపర్లాట? మనకొద్దీ వెధవ తెలబాన్ సావాసం.విడిపోవడమే మంచిది. నిన్న కాంగ్రెస్ సెగట్రి ఏమన్నాడు? విడిపోతే ఆంధ్రులు అభివృద్ది చెందుతారు.కలిసివుంటే ఏడుపు, అసూయా, మన శక్తి, శ్రమ, కరంట్,నీళ్ళు దోపిడి తప్ప వేరె ఏం ఉండదు. భవిష్యత్తరాలకు అన్యాయం జరగ కూడదు. ఇప్పడికైనా మేలుకోండి."తెల"పాములకు ఇంకా పాలు పొయ్యొద్దు.విషం పెంచకండి.

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజమే మాష్టారు! కానీ విడి పోదామనుకున్న వారు ఏ నిజామాబాదునొ లేదా ఆదిలాబాదునొ రాజధానిగా చేసుకొని విడి పొతే ఎవరికీ అభ్యంతరం వుండదు కానీ ఉమ్మడిగా అభివృద్ది చెందిన హైదరాబాదుని కబ్జా చేస్తూ విడి పోతానంటే కుదరదు! పైగా ఈ పరిస్థితుల్లో తెలంగాణా వస్తే ఇన్నాళ్ళూ సీమాంధ్రుల దోపిడీ, దగా అంటూ వారు చేసిన అసత్య గోబెల్స్ ప్రచారాలు భవిష్యత్ తరాలు నిజం అని భావించే ప్రమాదం వుంది. తెలంగాణా ఆకాంక్షని గౌరవించ వలసిందే! కానీ అందుకోసం సీమాంధ్ర ని బలి పెట్టటం తగదు. దేశంలో మిగతా రాష్ట్రాలు ఏర్పడ్డ విధంగానే శాసన సభలో తీర్మానం ద్వారా విభజన ప్రక్రియ ప్రారంభించి, సీమాన్ధ్రకి సరైన ప్రత్యామ్నాయాలు చేస్తాం, చూస్తాం అని కాకుండా బిల్లులోనే సరైన ప్రత్యామ్నాయాలు చూపితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

      Delete
  4. ఒక నరాధమ తెలబాన్ ప్రేలాపన చూడండి " బిల్లు పాసై రాష్ట్రపతి సంతకం అయ్యే వరకు వేచి చూస్తున్నాం. తరువాత మీకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అనువైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం.

    ఇంకొక తెలపాము కుత్సితుడి బుద్ది ఇది."తెలంగాణవారు వెనుకబడినది వాస్తవమైతే, ఆ మేరకు సీమాంధ్ర వాసులు అదనపు అభివృద్ధి చెందడమూ, చెందే శక్తి కలిగినవారు కావడమూ అంతే వాస్తవం... ప్రత్యేకవాదులు తమకు అన్యాయం జరిగిందంటూ విమర్శలు చేస్తే అర్థం చేసుకోగలం కానీ, కలసి ఉండడం అనే ఉదాత్త భావనను చెప్పే సమైక్యవాదులు ద్వేషభావంతో ప్రసంగాలు చేయడం వాంఛనీయం కాదు."

    అవే కుట్రలు, కూహకాలు, అబద్దాలు, విషం, విద్వెషం.నేను బూతులు తిడతాను. మీరు మాత్రం నోరు మూసుకోండి.ఈ తెలపాము వ్యభిచారులు చేసేదంతా శృంగారమే!! ! ఈ విషప్పురుగులతోనా కలిసుండేది.

    ReplyDelete
  5. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఉద్యమ నేత అల్రెడీ 'మేం మీకు యెగువ రాష్ట్రంగా ఉంటాం,ప్రాజెక్టుల గేట్లు మూసేస్తాం నదుల్ని కూడా పారనివ్వం' అన్నాడుగా!

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. తెలంగాణవారు వెనుకబడినది వాస్తవమైతే, ఆ మేరకు సీమాంధ్ర వాసులు అదనపు అభివృద్ధి చెందడమూ
    -----
    మహా భారతంలో ధృతరాష్ట్రుడూ ఇలాగే కూశాడు.కృష్ణ రాయబారం రెండోది. మొదట ధర్మరాజు ధౌమ్యుల వారిని పంపించాడు. దానికి బదులుగా గుడ్డి రాజు సంజయుణ్ణి పంపించాడు. సరిగ్గా ఇలాంటి సందేశమే - "మావాడు యెలాగూ దుర్మార్గుడే,నువ్వు మంచివాడివి కదా అందులోనూ వనవాసం అలవాటయి పోయే ఉంటుంది; రాజ్యం అడక్కుండా మళ్ళీ అడవులకే పోరాదా?!" అని.
    అప్పుడే -అలుగుటయే యెరుంగని అజాతశత్రుడు - ధర్మరాజుకే పిచ్చ కోపమొచ్చింది మొదటిసారిగా.దాంతో దుర్యోధనుడు మట్టమయి పోయాడు.మరి ఇవ్వాల్టి అంధ్ర మహా భారతంలో యేమవుతుందో?

    ReplyDelete