Sunday, August 10, 2014

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట ! సంప్రదాయాలని పాటించటం లేదట!  ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలోని 8వ అధికరణం ప్రకారం గవర్నరుకి విశేషాదికారాలని కట్టబెడుతూ కేంద్రం రాసిన లేఖకి తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ స్పందన అది !  దయ్యాలు వేదాలు వల్లించటం అంటే సరిగ్గా ఇదే అనాలి.  ఏ సమాఖ్య స్ఫూర్తిని పాటించి, ఏ సంప్రదాయాలు పాటించి తెలంగాణా రాష్ట్రం సాధించుకున్నారో ఒకసారి వారి అంతరాత్మలని ప్రశ్నించుకోవాలి.   సంపూర్తిగా అభివృద్ది చెందిన రాజధాని ని కబ్జా చేస్తూ, తల్లి రాష్ట్రానికే రాజధాని లేకుండా తన్ని తగలేస్తూ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయటమనే సంప్రదాయం ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా?  ఈ సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది ఇప్పుడే కదా!  అలాగే ఒక రాష్ట్ర శాసన సభ అభిప్రాయం కోసం పంపిన బిల్లుని తిరస్కరించి పంపినప్పటికీ, దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రం తాను  అనుకున్న పద్ధతిలో తెలుగు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేయటం ఏ విధమైన సమాఖ్య స్ఫూర్తి అనిపించుకుంటుందో  ఎవ్వరూ చెప్పలెరు.  అప్పుడు గుర్తుకి రాని సంప్రదాయాలు, స్పూర్తులు ఇప్పుడే వారికి జ్ఞప్తికి రావటం ఆశ్చర్యం!  అయినా కూడా, విద్వేషాల పునాదుల పై ఉద్యమం నడిపి,  ప్రత్యెక రాష్ట్రం సాధించిన తరువాత కూడా - విద్వేషాలను పెంచే రీతిలోనే పరిపాలన సాగిస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా?  చట్ట సభల్లో ఆమోదం పొందిన విభజన చట్టంలోని అంశాలని తిరస్కరించటం అంటే ఖచ్చితంగా
రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుంది.   ఓ పక్క పిల్ల నాయకులు భారత దేశంలో బలవంతంగా కలుపబడ్డామని వాపోతున్నారు!   ఇక స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన విభజన చట్టానికి వ్యతిరేకంగా ధిక్కారం చూపుతుంటే కేంద్రం చర్యలు తీసుకోక తప్పదు... 

5 comments:

  1. రాష్ట్రపతి పాలన విధిస్తే సరి.

    ReplyDelete
  2. మాకు ప్రేతాత్మలే గాని అంతరాత్మలు ఉండవు. అందుకే చనిపోయినా బ్లాగుల్లో పీడిoచాము, విడిపోయినా వేధిస్తాము.

    ReplyDelete
  3. ఇప్పుడు గొంతు చించుకొంటున్న పిట్టల దొర, ఆయన బ్లాగుల చెంచాల బ్యాచ్, మరి బిల్లు పాస్ అయినప్పుడు వెళ్లి సోనియమ్మకు ఇంటిల్లిపాది మొక్కి వచ్చినప్పుడు, సంబురాలు చేసుకొన్నప్పుడు బిల్లులో ఏముందో తెలియలేదా?

    సమాక్య స్పూర్థి అనేది, మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నా, విభజించిన విధానం అప్పుడు, గుర్తుకు రాలేదా ఈ బ్లాగు అతి తెలివి తెలబాన్ మేతావులకు?

    మనదాకా వస్తే సమాక్య స్పూర్థి, మనకు కావాల్సింది అయితే 60 ఏళ్ల వంకాయ కూర, గోంగోర కట్ట :))

    అంతే కదా మందు సూదనా, ఏడుపుముక్కలా అండ్ సచ్చిన స్రీకాంతా చారి బ్యాచ్చ్!!

    వీళ్లలో పోలవరం బిల్లు పాస్ కానప్పుడు అంటాడు, Law is Law, we have to follow, Division bill ప్రకారం follow కావాలి, దాని ప్రకారం పోలవరం అనేది ఎక్కడా clear గా లేదు కాబట్టి దాని గురించి మాట్లాడకండి అని, ఇప్పుడు bill పాస్ అయిన తరువాత అప్రాజాస్వామికం అని గొంతు చించు కొంటున్నారనుకోండి అది వేరే సంగతి,

    ఆ అతి తెలివి మేతావి ని ఇప్పుడు అడుగుతున్నా, అయ్యా మరి Law is Law అయినప్పుడు బిల్లు లో చాలా క్లియర్ గా ఉమ్మడి రాజధాని లో గవర్నర్ కు అధికారాలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఈ ఏడుపులు ఏమిటి? మీ బ్రతుకులు 24 గంటలు ఎవరో ఒకరి మీద ఏడవటానికి, దొర ఏమి చేసినా సమర్ధించటానికి అంకితం (మా దగ్గర మేకలనో, గొర్రెలనో అమ్మవారికి అంకితం ఇచ్చినట్లు) మిమ్ములను మీరు ఇచ్చుకొన్నారా?

    ReplyDelete
  4. This Gundu Madhusudan(daily poison spilling guy) has even separated Doctors of Gandhi Hospital & NIMS in the name of Telengana/Andhra. Such a fool! This will only deprive Telengana people from experts service.

    I strongly believe that in two years, experts in different fields will slowly migrate to Andhra once infrastructure development picks up.

    Bhaskar

    ReplyDelete
  5. The greatest damage to the unity and integrity is perpetrated by minority UPA govt lead by Manmohan with the connivance of BJP, speaker and spineless leaders of seemandhra by making division of AP in an arbitrary manner. This is further accentuated by Talibana party leaders and their supporters. The country shall pay price for this folly. No escape !

    ReplyDelete