రోజు రోజుకీ తెలబాన్ నాయకుని నోటి దురుసు హద్దులు మీరుతోంది. తాజాగా ఆయన దేశ ప్రధానిని సైతం చప్రాసీ కున్న జ్ఞానం కూడా లేని వాడంటూ దూషించటం సహించరానిది. వినే వాళ్ళుంటే ఎన్ని పిట్ట కధలైనా చెప్తాడీ పిట్టల దొర! పార్లమెంటులో చప్రాసీలందరూ జై తెలంగాణా అంటున్నారట! ప్రధాన మంత్రికే ఆ జ్ఞానం లేదట! శభాష్.. పార్లమెంట్ ఎందుకు...ఐక్య రాజ్య సమితిలో చప్రాసీలు ఎవరైనా కూడా జై తెలంగాణా అంటున్నారేమో ఎవరైనా విచారించి పిట్టల దొరకి చెప్తే మంచిది కదా....
Tuesday, November 29, 2011
Thursday, November 17, 2011
గుంటూరు రాష్ట్ర సాధనకై త్వరలో GRS (గుంటూరు రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావం!
బ్లాగు బాబ్జీకి తగరపు వలస రాష్ట్రం కావాలట!
మరి ఇంక మా గుంటూరుకేం తక్కువ! తక్షణం గుంటూరు జిల్లాని ప్రత్యెక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండుతో G.R.S. (గుంటూరు రాష్ట్ర సమితి) పార్టీ ఏర్పాటు చేయటానికి నిశ్చయించాం. ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ అభివృద్ధి అంతా పక్కనున్న విజయవాడకి మాత్రం చేస్తూ మా గుంటూరుని చిన్న చూపు చూడటంతో మా మనసులన్నీ గాయ పడ్డాయి. ఇంక దేబిరించితే ఏ మాత్రం ప్రయోజనం లేదని ఇక్కడి ప్రజలంతా ప్రత్యెక రాష్ట్రం ఇస్తే గానీ తమ సమస్యలు తీరవని గట్టిగా నిర్ణయించేసుకున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే నాయకుల కర్తవ్యం కాబట్టి గుంటూరు రాష్ట్రం సాధించే దిశగా అడుగులు వేయాలని, పార్టీలకతీతంగా అందరు నాయకులు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీని (JAC) ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో వున్నారు. నాగార్జున విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆనంద రాం ఈ కమిటీకి సారధ్యం వహించే అవకాశం వుంది.
మా డిమాండ్లు:
1 . గుంటూరు జిల్లాని సత్వరం ప్రత్యెక రాష్ట్రంగా ప్రకటించాలి.
2 . బ్రహ్మానంద రెడ్డి స్టేడియం లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చెయ్యాలి.
3 . శంకర్ విలాస్ సెంటర్ లో సెక్రటేరియట్, గుజ్జన గుళ్ళలో గవర్నర్ బంగ్లా కట్టించాలి.
ఇంక పార్టీకి సరైన నాయకుడు దొరకటమే ఆలస్యం...ఉద్యమం మొదలై పోతుంది.. రాష్ట్రం అగ్ని గుండమై పోతుంది.. ఆ ఉద్యమానికి విజయవాడ నుంచి లగడపాటి, జగడపాటి లాంటి వారు ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే పీకలు తెగ్గోస్తాం.. (నాలుకలు తెగ్గోస్తే రాష్ట్రం రాదని అనుభవ పూర్వకంగా తెలిసింది...అందుకని..) అయినా ఇక ఏ వాదనలు అనవసరం.. మా గుంటూరు మాక్కావాలే ..అంతే.. ప్రత్యెక గుంటూరు రాష్ట్రం తప్ప మరే విధమైన పదాన్నీ మా దగ్గర ఉచ్చరించడానికి వీల్లేదు..
Wednesday, November 9, 2011
ఆంధ్ర ప్రదేశ్ పై కాంగ్రెస్ భస్మాసుర హస్తం!
సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా సకల జనులు సమ్మె చేసారు..కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ రాజధానిలో, కోమటి రెడ్డి నల్లగొండ లో దీక్షలు చేసి విరమించేసారు. ఇన్ని జరిగినా కాంగ్రెస్ కి చీమ కుట్టినట్లయినా లేదు. అసలేమీ జరగనట్లే ఆజాద్ జాదూ అంటూ కాలక్షేపం చేస్తోంది. విచిత్రంగా తెలబాన్ శ్రేణులు కూడా ఉద్యమం మానేసి కాంగ్రెస్ నిర్ణయం కోసం చాతక పక్షుల్లా ఎదురు చూస్తున్నాయి. అసలు తెలంగాణా ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అంత ముఖ్యమా అన్నది ఎవరూ ఆలోచించట్లేదు. కేంద్రం లో పూర్తి మెజారిటీ రాక చిన్న చితకా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చేస్తున్న కాంగ్రేసు పార్టీ ఒక రాష్ట్ర విభజన వంటి ముఖ్యమైన విషయంలో భాగస్వామ్య పక్షాలని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోజాలదు. ఐతే డిసెంబరు 9 ప్రకటన ఎందుకు ఇచ్చినట్లు? రాజశేఖర రెడ్డి చని పోయిన తరువాత సానుభూతి అంశంతో జగన్ పైకి వస్తాడన్న అనుమానంతో ఇతర పార్టీలని కనీసం సంప్రదించకుండా కాంగ్రెస్ తెలంగాణా తేనె తుట్టెని కదిపింది. ఉవ్వెత్తున ఎగసిన నిరసనలకి వెరచి మళ్ళీ డిసెంబరు 23 ప్రకటనతో వెనక్కి తగ్గింది. కానీ జరిగిందేమిటి? రెండేళ్ళ పాటు రాష్ట్రం తగల బడింది. అభివృద్ది విషయంలో దశాబ్దాల వెనక్కి వెళ్లాం. ఇంక ఇప్పుడేమో జగన్ తన మీద సీబీఐ దాడులతోనూ, కేసులతోనూ ఉక్కిరి బిక్కిరి అవుతుండటంతో పాటు మరో రెండున్నరేళ్ళ పాటు ఎన్నికలు రావని చంద్ర బాబు భరోసా ఇవ్వటంతో రాష్ట్రంలో ఏమి జరిగినా కాంగ్రెస్ పట్టించుకోవటం మానేసింది. 33 మంది ఎంపీ లని కేంద్రానికి అందించిన రాష్ట్రం పట్ల ఇంత నిర్లక్ష్య పూరితంగా ప్రవర్తిస్తున్నా ఇదేమని అడిగే దమ్ము మన నాయకులెవరికీ లేదు. తృణమూల్ కాంగ్రెస్ సంగతే చూస్తె, కేవలం 19 మంది ఎంపీ లని సంకీర్ణానికి అందించినా కూడా రైల్వే శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖని పట్టు బట్టి సాధించుకోవటమే కాక మమతా బెనర్జీ బెంగాల్ కి వెళ్ళినా కూడా ఆ మంత్రిత్వ శాఖ తమ చేజారకుండా చూసుకున్నారు. ఎన్నికలకి ముందు ప్రతి పక్షంలో వున్నప్పుడు కూడా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ నుండి గోర్ఖా లాండ్ విభజనకి అనుమతించేది లేదని తెగేసి చెప్పేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల మన నాయకులకి ఆ పాటి నిబద్ధత కొరవడటమే మనకి శాపం. లక్షలాది రూపాయలు వెచ్చించి, రాష్ట్రం నలు మూలలా పర్యటించి, రాష్ట్రంలో పరిస్థితులని శాస్త్రీయంగా విశ్లేషించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏ చెత్త బుట్టలో దాఖలు అయ్యిందో ఏ నాయకుడూ పట్టించుకోవట్లేదు. పైగా కోర్ కమిటీ అని, జాదూ చేస్తారనీ మసి పూసి మారేడు కాయ చేస్తూ ప్రజల్ని వెర్రి వాళ్ళని చేస్తున్నారు. రాష్ట్రం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగడాల్ని ఇంక ఎంత మాత్రం సహించరాదు. సత్వరం శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన అత్యుత్తమ ఆరో పరిష్కారం అమలుకై మన నాయకులు వత్తిడి తేవాలి. లేని పక్షంలో అకారాది క్రమంలో ముందున్న మన రాష్ట్రం అభివృద్ది విషయంలో చిట్ట చివరికి వెళ్లి పోవటం ఖాయం.
Subscribe to:
Posts (Atom)