Thursday, November 17, 2011

గుంటూరు రాష్ట్ర సాధనకై త్వరలో GRS (గుంటూరు రాష్ట్ర సమితి) పార్టీ ఆవిర్భావం!

బ్లాగు బాబ్జీకి తగరపు వలస రాష్ట్రం కావాలట!


మరి ఇంక మా గుంటూరుకేం తక్కువ!  తక్షణం గుంటూరు జిల్లాని ప్రత్యెక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండుతో G.R.S. (గుంటూరు రాష్ట్ర సమితి) పార్టీ ఏర్పాటు చేయటానికి నిశ్చయించాం.  ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ అభివృద్ధి అంతా పక్కనున్న విజయవాడకి మాత్రం చేస్తూ మా గుంటూరుని చిన్న చూపు చూడటంతో మా మనసులన్నీ గాయ పడ్డాయి. ఇంక దేబిరించితే ఏ మాత్రం ప్రయోజనం లేదని ఇక్కడి ప్రజలంతా ప్రత్యెక రాష్ట్రం ఇస్తే గానీ తమ సమస్యలు తీరవని గట్టిగా నిర్ణయించేసుకున్నారు.  ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే నాయకుల కర్తవ్యం కాబట్టి గుంటూరు రాష్ట్రం సాధించే దిశగా అడుగులు వేయాలని, పార్టీలకతీతంగా అందరు నాయకులు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీని (JAC)  ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో వున్నారు. నాగార్జున విశ్వ విద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆనంద రాం ఈ కమిటీకి సారధ్యం వహించే అవకాశం వుంది.

  మా డిమాండ్లు:
1 . గుంటూరు జిల్లాని సత్వరం ప్రత్యెక రాష్ట్రంగా ప్రకటించాలి.
2 . బ్రహ్మానంద రెడ్డి స్టేడియం లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చెయ్యాలి.
3 . శంకర్ విలాస్ సెంటర్ లో సెక్రటేరియట్, గుజ్జన గుళ్ళలో గవర్నర్ బంగ్లా కట్టించాలి.


ఇంక పార్టీకి సరైన నాయకుడు దొరకటమే ఆలస్యం...ఉద్యమం మొదలై పోతుంది.. రాష్ట్రం అగ్ని గుండమై పోతుంది.. ఆ ఉద్యమానికి విజయవాడ నుంచి లగడపాటి, జగడపాటి లాంటి వారు ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే పీకలు తెగ్గోస్తాం.. (నాలుకలు తెగ్గోస్తే రాష్ట్రం రాదని అనుభవ పూర్వకంగా తెలిసింది...అందుకని..) అయినా ఇక ఏ వాదనలు అనవసరం.. మా గుంటూరు మాక్కావాలే ..అంతే.. ప్రత్యెక గుంటూరు రాష్ట్రం తప్ప మరే విధమైన పదాన్నీ మా దగ్గర ఉచ్చరించడానికి వీల్లేదు..

16 comments:

  1. Naenu Uttarandhra National Liberation Front (UNLF) sthaapinchi 25 years ayyindi. Maaku vaere evaru vaddu. only uttarandhra. Mukhyamga, guntur, vijayawada, nellore, valasavaaduluni ikkada vundanivvakunda tarimi tarimi kottali.maa prantha daridraaaniki, naasanaaniki valle kaaranam.addosthe tagalapettadame. tvaralo choostaru.

    sreerama, chennai

    ReplyDelete
  2. why the hell we need a separate state??
    why don't you support united andhra???

    ReplyDelete
  3. u guntur people came to vizag and have colonized it like anything. we also want u to go out of vizag. we also support ur separate guntur state and will export all of u guntur people out of vizag. have fun

    ReplyDelete
  4. అంటే మీ గుంటూరులో శంకర్ విలాస్ సెంటర్, గుజ్జనగుళ్ళ లాంటి చెత్త ఎరియాలే ఉన్నాయన్న మాట. పెద్దాపురం ఆంధ్రోల్లకు వదిలేసి మీరు చిలకలూరిపేటతో సరి పెట్టుకుంటారా?

    Anonymous of November 18, 2011 12:12 PM: శ్రీకాకుళం నుంచి తుని దాకా ఉన్న భూములన్నీ బెజవాడ-గుంటూరు కమ్మోళ్ళు కబ్జా చేసిన విషయం నీకు తెలియదా?

    ReplyDelete
  5. @ Anonymous at 12:12 PM Nov.18, 2011 :
    రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల లోను ఎటువంటి యాస లేకుండా స్వచ్చమైన తెలుగు భాష మాట్లాడే ప్రాంతం మా గుంటూరు జిల్లా. స్వచ్చమైన భాష, అంతకన్నా స్వచ్చమైన మనసులు కల వారం కనుకనే విశాఖ పట్టణమే కాదు...రాష్ట్రంలోనే, దేశంలోనే ఇంకా ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా అక్కడి ప్రాంతీయులుతో పాలు నీళ్ళ లా కలిసి మనుగడ సాగిస్తున్నాం. అయితే కుక్క మూతి పిందెల వంటి కొన్ని సంకుచిత శక్తులు స్వార్ధ ప్రయోజనాల కోసం పచ్చని రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని తల పోస్తుంటే రగులుతున్న కడుపు మంటే ఈ బ్లాగు పోస్టుల సమాహారం. మాకు నిజంగా గుంటూరు రాష్ట్రం అక్కరలేదు. మేము విశాఖ పట్టణం/హైదరాబాదు వదలి వెళ్ళం. అందరమూ ఎక్కడి వారక్కడే సఖ్యతతో, సామరస్యంతో, సమైక్యంగా జీవించడమే మేము కోరుకునేది..

    ReplyDelete
  6. గుంటూరు రా ష్ట్ర సమస్యను రెండవ ఎస్ ఆర్ సి పరిధి నుండి తొలగించాలని ఎ ఐ సి సి ని కోరుతున్నాను. అలాగే నేను గుంటూరు వాడిని కాదు గాని పుట్టింది మాత్రము గుంటూరు జిల్లాలోనే మరి నా సంగతి ఏమిటి?

    ReplyDelete
  7. Anonymous - on November 18, 2011 12:12 PM said:
    u guntur people came to vizag and have colonized it like anything. we also want u to go out of vizag. we also support ur separate guntur state and will export all of u guntur people out of vizag. have fun "


    I would like to express that The Constituion of India- vide Article 19(1)(d)and Article 19(1)(e) provide that :
    All citizens shall have the right—

    - to move freely throughout the territory of India;
    - to reside and settle in any part of the territory of India;

    ప్రత్యేక గుంటూరు రాష్త్రం కావాలా..ఏదా..అన్న విషయం వదిలేస్తే...అసలు మా ప్రాంతంలో మీరెందుకున్నారన్న ప్రశ్న రావడమే వింతగా ఉంది ....గుంటూరు లో పుట్టి...విశాఖ లో వృత్తి రీత్యా స్థిరపడిన వారిని "ఎగుమతి" చేస్తామని పలకటం అంత అవసరమా?-

    Section 2(18) of The Customs Act,1962 defines “export” - means "taking out of India to a place outside India"

    ఒకే రాష్త్రంలో విశాఖ నుండి...గుంటూరు ఎగుమతి ఎలా ఎందుకు చెయ్యాలనుకుంటున్నారో..'' అది ఎగుమతి ఎలా అవుతుందో అర్ధం కాలేదు....

    చట్ట రీత్యా విరుధ్ధమైన వ్యాఖ్యలు...చేయడం...విచారం...గర్హనీయం...
    "అంతా కలిసుందాం...ఈ చట్ట రీత్యా ఎర్పడిన రాష్ట్రం ...మనది...మనందరిదీ...మనమంతా తెలుగు వాళ్ళమే..." అని గ్రహిస్తే మంచిది...

    ఎనానిమస్ గారూ....కొంచెం ఆలోచించరా ప్లీజ్!!!

    ReplyDelete
  8. @jamaki:

    Does the constitution protect or even permit colonizing through కబ్జా?

    ReplyDelete
  9. @Aakasa Ramanna:

    మీ భాష గురించి మీ ప్రాంతం గురించి మీకు మీరే చంకలు గుద్దుకోవడం కాదు. ఆ సర్టిఫికేట్లేవే అవతల వాళ్ళు ఇస్తే బాగుంటుంది.

    తమ హక్కుల కోసం చట్టపరంగా అడుగుతున్న వారిని "కుక్క మూతి పిందె", "సంకుచిత", "స్వార్ధ ప్రయోజనాల" లాంటి భాషతో ఆడిపోసుకోవడం చూస్తుంటే మీ (you, not your district guys) సంస్కారంపై అనుమానం రాక తప్పదు.

    "మేము విశాఖ పట్టణం/హైదరాబాదు వదలి వెళ్ళం"

    మంచిది, ఇప్పుడు మిమ్మల్ని పొమ్మన్నది ఎవరు?

    అందరమూ ఎక్కడి వారక్కడే సఖ్యతతో, సామరస్యంతో, సమైక్యంగా జీవించడమే మేము కోరుకునేది.

    మేము కాదన్నామా? సఖ్యతకు, సామరస్యానికి రెండు రాష్ట్రాలు అడ్డంకా?

    ReplyDelete
  10. సమైక్యత... సామరస్యం...అనేది ఉన్నదానిని విడగొట్టి ...రెండు చేసి...పొందటమేమిటయ్యా ??? నీ వాదన అర్థరహితమే...తాలిబాన్ నాయకుడు, మిగతా వీరులమని భ్రమపడి తోకల్లాగ తిరుగుతున్న వారూ...ఆంధ్ర ప్రజలారా...వెళ్ళండి...సినిమాలు తియ్యకండి ..అంటూ...తిక్క తిక్కగా మాట్లాడటం నీకు కనపడలేదా?వినపడలేదా?

    ReplyDelete
  11. Anonymous of November 19, 2011 4:29 PM:

    ఉన్నదానిని విడగొట్టడం మీరు 1953 లో చేయలేదా? మదరాసు రాష్ట్రం ఎన్ని ముక్కలయినా ఫరవాలేదు కానీ AP మాత్రం శాశ్వతంగా ఉండాలనే నీ వాదన మూర్కత్వమే అనిపించుకుంటుంది.

    కాంగ్రెస్ వారి పంచెలు ఊడదీస్తానని మీవాళ్ళు అన్నప్పుడు లేని రోషం, అక్క ఇంటి ముందే తొడ గొట్టి ప్రతాపం చూసినప్పుడు లేని ఆవేదన ఇప్పుడు ఎందుకో? రాజకీయ నాయకులందరూ తిక్కగానే మాట్లాడతారు, ఆమాత్రం దానికి బలవంతపు "సమైక్యత" రుద్దుతాననడం సబబా?

    ReplyDelete
  12. 1953 లో జరిగిన విభజన తెలుగు ,తమిళ భాషల ,సంస్కృతుల ప్రాతిపదికిన జరిగినది...ఇప్పుడు తమరు తెలుగు మాట్లాడేప్రజల మధ్య విభజన గురించి గంతులేస్తున్నారు...పోలికలేదు మిత్రమా!!!

    కాంగ్రెస్ పంచెలూదతీస్తాననడానికీ...తొడలుకొట్టడానికీ...సమైక్యత విషయానికీ సంభంధమేమిటన్నాయ్??
    " సఖ్యతకు, సామరస్యానికి రెండు రాష్ట్రాలు అడ్డంకా?"అని తిక్కగా ప్రశ్నించినందుకు...

    విడిపోయి, రెండుగా చీల్చి... సమైక్యత ఎమిటండీ అని అడిగాను....
    పొంతనలెకుండా మీరేమో పంచెలూ,తొడలూ అంటున్నారు....

    మీరు కొంపతీసి రాజకీయ నాయకుడవుదామనుకుంటున్నారా???

    సమైక్యంగా ఉండటమనేది సాధారణంగా గుర్తింపబడ్డ విషయం... విడిపొవడమనేది బలవంతపు ప్రహసనం.....మీరు అటుదిటు చెప్తారేమిటీ??

    ReplyDelete
  13. jamaki గారు.. Hats off...బహుశా మీరు న్యాయ శాస్త్ర కోవిదులు అయి వుంటారు..మీ అంత authentic గా చెప్పలేక పోయినా..నా అభిప్రాయం కూడా అదే!

    @ Anonymous at 03:23 PM, Nov.19, 2011:

    ముంజేతి కంకణానికి అద్దం అవసరం లేదు.. అలాగే మా భాష, సంస్కృతి ల విషయంలో ఎవరి సర్టిఫికెట్లు అవసరం లేదు.

    హక్కుల కోసం చట్ట పరంగా లేదా రాజ్యాంగ బద్ధమైన పద్ధతుల్లో అడిగినా/వుద్యమించినా సమస్యే లేదు. అది లేకనే కదా వచ్చిన చిక్కంతా!

    ఇక కుక్క మూతి పిందెలు, సంకుచిత, స్వార్ధ ప్రయోజనాలు అన్న పదాలన్నీ ఆడి పోసుకోవటం కాదు... అక్షర సత్యాలు.

    ఇంకా పోమ్మనది ఎవరా? పైన ఒక అనానిమస్ ఎవరో వాళ్ళ వైజాగ్ నుండి Export చేస్తాం అని కొంచెం మర్యాదగా చెప్పారు. కానీ ఈ కుక్క మూతి పిందెలు ఏమి వదరాయి? సీమాన్ద్రులని తరిమి కొడతాం...వాళ్ళ ఆస్తులు లాక్కుంటాం...ఇలా ఒకటా రెండా? లెక్క లేనన్ని ప్రేలాపనలు చేసిన మాట నిజం కాదా?

    సఖ్యత సామరస్యాలు వున్నప్పుడు రెండు రాష్ట్రాల అవసరం ఏమిటి? రెండు రాష్ట్రాలు వస్తే కుక్క మూతి పిందెల స్వార్ధ ప్రయోజనాలు నెరవేరడం తప్ప వేరే వొరిగేదేమీ లేదు.

    ReplyDelete
  14. LOL. Ha! Ha! Guntur bhasha swachchmaina bhasha. Bhale joke mastaaru. prapanchmlo edi swachchmaina bhasha ani vundadu.Guntur language is "shortened telugu" "kuracha bhasha, according to language scientists/linguistics.every language has its uniqueness and at the same time every language has its variations and it can never be said that any variation is better than the other.It is simple, because, the language, words used by one variation is specific to a region and for them other variations appear to be odd.Its natural.No language or accents or regional variations can claim to be pure, because there is no such concept in language.So at least after seeing all these agitations, change your attitudes and this is the attitude that is giving rise to many suspicions and disharmony.No one objects to movement of people from one place to another. But at the same, when you are going begging, you dont have any right to criticize or demean others culture or customs or language.

    sreerama, chennai

    ReplyDelete
  15. ఇంకో సారి ఆలోచించుకోండి...తర్వాత , " సమైక్య గుంటూరు " కోసం పోరాడాల్సి వస్తుందేమో ...:P :D

    ReplyDelete
  16. బకింగ్ హామ్ కాలువ మీద కట్టబోయే ప్రాజెక్ట్ మీకు ఇస్తాం...ఉద్యమాన్ని విరమించుకోండి.... ప్లీజ్. కావాలంటే మీరు కూడా సర్వకాల, సర్వావస్థల, సర్వజనుల సమ్మెలు చేసుకుంటూ దందాలు చేసుకోండి. లేదంటే మీ పిల్లల చదువులు కూడా నాశనం చేసి వాళ్ళని రోడ్ల మీద తిప్పి మీ ఇంటరు రిజల్టులు కూడా మాలాగే తగ్గించుకోండి. కావాలంటే మీ పరిధిలో బస్సులు తగలబెట్టుకోండి, ప్రజా వ్యవస్థలను నాశనం చేసుకోండి. మీ జిల్లాల్లో తెలుగువారు కాని వాళ్ళు ఉంటారు కదా వారి జోలికి మాత్రం పోకుండా మమ్మల్ని మాత్రం బూతులు తిట్టండి. అంతే కానీ అనవసరంగా మామీద పడి ఏడవటం మాత్రం న్యాయం గాది మల్లా.... -శరత్

    ReplyDelete