Wednesday, November 9, 2011

ఆంధ్ర ప్రదేశ్ పై కాంగ్రెస్ భస్మాసుర హస్తం!

సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా సకల జనులు సమ్మె చేసారు..కొండా లక్ష్మణ్ బాపూజీ దేశ రాజధానిలో, కోమటి రెడ్డి నల్లగొండ లో దీక్షలు చేసి విరమించేసారు.  ఇన్ని జరిగినా కాంగ్రెస్ కి చీమ కుట్టినట్లయినా లేదు. అసలేమీ జరగనట్లే ఆజాద్ జాదూ అంటూ కాలక్షేపం చేస్తోంది. విచిత్రంగా తెలబాన్ శ్రేణులు కూడా ఉద్యమం మానేసి కాంగ్రెస్ నిర్ణయం కోసం చాతక పక్షుల్లా ఎదురు చూస్తున్నాయి.  అసలు తెలంగాణా ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అంత ముఖ్యమా అన్నది ఎవరూ ఆలోచించట్లేదు. కేంద్రం లో పూర్తి మెజారిటీ రాక చిన్న చితకా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చేస్తున్న కాంగ్రేసు పార్టీ ఒక రాష్ట్ర విభజన వంటి ముఖ్యమైన విషయంలో భాగస్వామ్య పక్షాలని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోజాలదు.  ఐతే డిసెంబరు 9 ప్రకటన ఎందుకు ఇచ్చినట్లు? రాజశేఖర రెడ్డి చని పోయిన తరువాత సానుభూతి అంశంతో జగన్ పైకి వస్తాడన్న అనుమానంతో ఇతర పార్టీలని కనీసం సంప్రదించకుండా కాంగ్రెస్ తెలంగాణా తేనె తుట్టెని కదిపింది. ఉవ్వెత్తున ఎగసిన నిరసనలకి వెరచి మళ్ళీ డిసెంబరు 23 ప్రకటనతో వెనక్కి తగ్గింది. కానీ జరిగిందేమిటి? రెండేళ్ళ పాటు రాష్ట్రం తగల బడింది. అభివృద్ది విషయంలో దశాబ్దాల వెనక్కి వెళ్లాం. ఇంక ఇప్పుడేమో జగన్ తన మీద సీబీఐ దాడులతోనూ, కేసులతోనూ ఉక్కిరి బిక్కిరి అవుతుండటంతో పాటు మరో రెండున్నరేళ్ళ పాటు ఎన్నికలు రావని చంద్ర బాబు భరోసా ఇవ్వటంతో రాష్ట్రంలో ఏమి జరిగినా కాంగ్రెస్ పట్టించుకోవటం మానేసింది. 33 మంది ఎంపీ లని కేంద్రానికి అందించిన రాష్ట్రం పట్ల ఇంత నిర్లక్ష్య పూరితంగా ప్రవర్తిస్తున్నా ఇదేమని అడిగే దమ్ము మన నాయకులెవరికీ లేదు.  తృణమూల్ కాంగ్రెస్ సంగతే చూస్తె, కేవలం 19 మంది ఎంపీ లని సంకీర్ణానికి అందించినా కూడా రైల్వే శాఖ వంటి కీలక మంత్రిత్వ శాఖని పట్టు బట్టి సాధించుకోవటమే కాక మమతా బెనర్జీ బెంగాల్ కి వెళ్ళినా కూడా ఆ మంత్రిత్వ శాఖ తమ చేజారకుండా చూసుకున్నారు. ఎన్నికలకి ముందు ప్రతి పక్షంలో వున్నప్పుడు కూడా మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ నుండి గోర్ఖా లాండ్ విభజనకి అనుమతించేది లేదని తెగేసి చెప్పేశారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల మన నాయకులకి ఆ పాటి నిబద్ధత కొరవడటమే మనకి శాపం.  లక్షలాది రూపాయలు వెచ్చించి, రాష్ట్రం నలు మూలలా పర్యటించి, రాష్ట్రంలో పరిస్థితులని శాస్త్రీయంగా విశ్లేషించి ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏ చెత్త బుట్టలో దాఖలు అయ్యిందో ఏ నాయకుడూ పట్టించుకోవట్లేదు. పైగా కోర్ కమిటీ అని, జాదూ చేస్తారనీ మసి పూసి మారేడు కాయ చేస్తూ ప్రజల్ని వెర్రి వాళ్ళని చేస్తున్నారు. రాష్ట్రం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగడాల్ని ఇంక ఎంత మాత్రం సహించరాదు. సత్వరం శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన అత్యుత్తమ ఆరో పరిష్కారం అమలుకై మన నాయకులు వత్తిడి తేవాలి. లేని పక్షంలో అకారాది క్రమంలో ముందున్న మన రాష్ట్రం అభివృద్ది విషయంలో చిట్ట చివరికి వెళ్లి పోవటం ఖాయం.

4 comments:

  1. ఓ పులి .. ఏ జంతువుని
    చంపనని ప్రతిఙ్ఞ చేసిందట..

    ఓ నక్క ... ఏ గోవుని
    మాయం చేయనని శపథం చేసిందట..

    ఓ ముక్కోడు ...తెలంగాణా సాక్షిగా
    తల నరుక్కొంటానని శపథం చేసాడంట..

    కానీ...2ఎస్సార్సీ సాక్షిగా ...
    వేర్పాటు గొర్రెలింక పుర్రెలూపుతూనే వున్నాయి..
    పాపం చచ్చిన prof.జయశంకర్ ఏ లొకాన వున్నాడో..

    ReplyDelete
  2. ‘ ఓరి వెర్రి వాళ్ళల్లారా! మీకు ఏమి కావాలో మీకు తెలియదు. మీ అంతట మీరు ఆలోచించుకోలేరు.అందుచేత మీకు ఓ 2ఎస్సార్సీ కమిటీ వేసి వాళ్ళచేత నీతి చెప్పిస్తాము వాళ్ళుచెప్పినదాన్ని మీరు ఆలోచిస్తూవుండండి. మేము కాలయాపన చెస్తూ వుంటాము.’ అని మాత్రం కాదని భగవంతుడిని ప్రార్ధిస్తాను.

    ReplyDelete
  3. మన వేర్పాటు వసూళ్ళ తెలబాన్ నిజాం వెర్రి గొర్రెలకు ప్రత్యేక రాష్ట్రం కావాలో వద్దో మనకు తెలియదా? శ్రీ కృష్ణుడిదో 6 వ గీతోపదేశం అమలు చెయ్యకుండా మళ్ళి ఈ సెకండ్ ఎస్సార్సీ కమిటి లొల్లి ఏంటి?... గడ్డి పికటానికా? లేక వేర్పాటు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమడానికా?...

    ReplyDelete
  4. Do you support formation of TRC with constutional status and other proposals of option 6?

    Don't try to fool us. What you guys want is option 1:)

    ReplyDelete