Friday, October 28, 2011

దళిత వర్గాలకు నరకాసురుడి అండ! - ఇదెక్కడి చోద్యం??

నేటి ఈనాడు దిన పత్రికలో వచ్చిన ఈ వార్తని చూస్తె నవ్వాలో ఏడవాలో అర్ధం కావట్లేదు.

కులాలు మతాలూ అన్నవి మానవులు ఈ కలి కాలంలో ఏర్పాటు చేసుకున్నవి. అయితే పురాణ కాలంలో దళితులెవరున్నారో? వారికి నరకాసురుడు ఏ విధంగా అండగా నిలబడ్డాడో? ఏ అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా నరకాసురుడు పని చేసాడో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్ధం కావట్లేదు.  ఈ మధ్యనే భగవంతునికి ప్రాంతీయ విద్వేషాల రంగు అంట కట్టి సమ్మె పేరుతొ పూజాదికాలు మాని ఆటలాడిన పైత్యాన్ని చూసాం.
http://andhraaakasaramanna.blogspot.com/2011/09/blog-post_22.html

ఇక ఇప్పుడు కులాల కుమ్ములాటల్లోకి కూడా భగవంతుడిని తీసుకు రావటం శోచనీయం. అగ్ర వర్ణాలకి వ్యతిరేకంగా ఏదో ఒక పని చేసి వార్తల్లోకి ఎక్కాలన్న దుగ్ధ తప్ప వేరే ప్రయోజనమేమీ ఈ చర్యలో కనపడటం లేదు.  ప్రాంతీయ విద్వేషం తలకెక్కి, ఆలయాన్ని మూసేసి ఆటలాడుతూ చేసిన సకల జనుల సమ్మె షెడ్డుకి వెళ్లి పోవటం కళ్ళారా చూసాం. ఇప్పుడు రాక్షస సంహారాన్ని వర్ణ విద్వేషాలకు ఆపాదించిన ఈ విషయానికి భగవంతుడెలా స్పందిస్తాడో చూద్దాం.

ఇక్కడ నాకో సందేహం...నరకాసురుని వధించిన శ్రీ కృష్ణుడు యాదవ సంజాతుడని అందరికీ తెలుసు. అంటే వారి లెక్క ప్రకారం ద్వాపర యుగంలో యాదవులు అగ్ర వర్ణాలకి చెందిన వారన్న మాట! భేష్! వారికి డాక్టరేట్ ఇచ్చి తీర వలసిందే...

30 comments:

  1. //ఈ మధ్యనే భగవంతునికి ప్రాంతీయ విద్వేషాల రంగు అంట కట్టి సమ్మె పేరుతొ పూజాదికాలు మాని ఆటలాడిన పైత్యాన్ని చూసాం.//
    correct link here
    http://andhraaakasaramanna.blogspot.com/2011/09/blog-post_22.html..

    ReplyDelete
  2. @ రక్త చరిత్ర :
    Thank you..సరైన లింక్ ఇప్పుడు ఉంచాను.

    ReplyDelete
  3. ఆ రోజుల్లో దళితులకి నరకాసుర మహారాజు గారు బోల్డన్ని రిజర్వేషన్లు ఇచ్చారాయె! అలాంటప్పుడు వర్ధంతి జరిపితే తప్పేంటి ?
    ఇంకా శూర్ఫణఖ మహారాణి వారికి కూడా వర్ధంతి దినోత్సవం జరపాలన్నదే మా అభిలాష.

    ReplyDelete
  4. /దళిత వర్గాలకు నరకాసురుడి అండ! - ఇదెక్కడి చోద్యం?? /

    మేము నందంటే నంది..
    మేము పందంటే పంది..
    ఇలాంటి చెత్త లాజికల్ ప్రశ్నలడిగితేనే..మా తెలంగాణా మగ్గావాలా...అనేది...

    ReplyDelete
  5. శ్రీ కృష్ణుడు యాదవ వంశ సంజాతుడని అందరికీ తెలుసు. నిజమే. యాదవులు అంటే యదువు అనే ఆయన వంశం వాళ్ళని అర్ధం. ఈ యదువు అనేవాడు, యయాతి మహారాజు కుమారుడు. యయాతి రాక్షసగురువైన శుక్రుని అల్లుడు. శుక్రుడు బ్రాహ్మణుడైనా కుమార్తను తక్కువ కులపు మనిషి అయిన క్షత్రియడు యయాతి అనే రాజుకు యిచ్చి వివాహం చేసాడు.
    యాదవులు అగ్ర వర్ణాలకి చెందిన వారన్న మాటే. ఇక్కడ యాదవులకు చెంది మరొక విషయం చెప్పక తప్పదు. యయాతిని శుక్రుడు ముదుసలివాడివి కమ్మని శపించాడు. నీ ముసలితనాన్ని తాను గ్రహించి నిన్ను సంతోషపెట్టే కొడుకు ద్వారా ముసలితనాన్ని వాయిదా వేసుకొమ్మని కూడా చెప్పాడు. యయాతి కొకుకు యదువు తండ్రి నుండి ముసలితనాన్ని స్వీకరంచ నిరాకరించటంతో యయతి వాడిని శపించాడు. నీకు, నీ వంశం వాళ్ళకి రాజులయే అర్హత ఉండదని. అలా యాదవులు క్షత్రియులే అయినా రాజలు కాలేక పోయారు. పలుచనయారు.

    అయతే పశుపాలకులు తాము యాదవులమని చెప్పుకోవటం చెల్లదు. వారు యాదవులు కారు. కృష్ణుణ్ణి పెంచిన నందుడు కృష్ణుడి తండ్రి వసుదేవుడి మిత్రుడు. వసుదేవుడు యాదవుడు. నందుడు కాదు.
    నందుడు యింట పెరిగి కృష్ణుడు పశుపాలన చేసాడు. కాని పుట్టువుచే గొల్లకులం వాడు కాదని గ్రహించాలి.

    యాదవులలో వృష్ణి, అంధక, భోజులని ఉపకులాలున్నాయి. కృష్ణుడు వృష్ణి వంశంవాడు. మేనమామ కంసుడు భోజకులం.

    ReplyDelete
    Replies
    1. Your argument is completely wrong.Vasudeva and Nanda are relatives.In those days all the Arya kings are elected or selected from the cowherd(Arya) people.Read Rigveda and Puranas togather.Recently it became a fashion to differentiate and establish that Yadavas and cowherds or shepherds are different.This kind of arguments based on incomplete information.

      Delete
  6. పిచ్చి వెదవలు. పని పటా లేని తిక్క సన్నాసులు.

    ReplyDelete
  7. చరిత్రని బట్టి, పురాణాల్ని బట్టి యాదవులు మొదట్లో అగ్రకులమే. సందేహం లేదు. వారు స్వతహాగా క్షత్రియులే. కానీ అదొక్కటి మినహాయిస్తే ఈ పైవాదం వాస్తవం కాదు. ఆనాటి యాదవులూ ఈనాటి పశుపాలకులూ ఒక్కరే. ఇప్పుడే కాదు, ఇక్కడే కాదు, ఏ కాలంలో నైనా ఏ రాష్ట్రంలోనైనా వీరిద్దరూ ఒక్కరే. తమ రాజ్యాలు పోయినాక యాదవులు పూర్తికాలిక పశుపాలకులుగా స్థిరపడ్డారు. గోల్కొండ హిందూ రాజులూ, దేవగిరి రాజులూ, విజయనగర సామ్రాజ్య స్థాపకులూ అందరూ యాదవులే. నెల్లూరి రాజ్యం పాలకుడైన మనుమసిద్ధితో యుద్ధం చేసిన యాదవరాజు కాటమరాజు దగ్గర లక్షలాదిగా పశుసంపద ఉండేది. మెజారిటీ యాదవులు కాలక్రమంలో చీలిపోయి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ కులాలుగా మారారు. అసలైన యాదవులు మైనారిటీ అయ్యారు. ప్రాచీన యాదవుల పేర్లే (అంకినీడు, పోలినీడు, పాపినీడు మొ.) ఈనాటి కమ్మ ఇంటిపేర్లు అని కాటమరాజు కథలు చదివితే అర్థమవుతుంది.

    http://kalagooragampa.blogspot.com/2011/02/6_18.html

    ReplyDelete
  8. విదేశీశక్తులు విదిల్చేఎంగిలిమెతుకులకాశపడిన విశ్వాసంలేని కుక్కలు ఈజాతిని,ధర్మాన్ని కాలరాయడానికి నీచమైన ప్రచారాలకు తెగబడుతున్నారు. పండుగలపట్ల,సంస్క్రుతి సాంప్రదాయాలపట్ల విద్వేషం కలిగించి అన్నదమ్ములనువేరుచేయటానికి చేయగలప్రచారాలన్నీ చెస్తున్నారు. మొన్న టీవీ చానల్స్ లో పండుగల సందర్భగంగా చర్చలు,వ్యాసాలు మొదలుకొని ఇప్పుడిలా .... ఈజాతి రక్తంలోఉన్న శాంతం వీల్లకు చేతగానితనంలా కనిపిస్తుండటంతో తెగబడుతున్నారు

    ReplyDelete
  9. యయాతి వృధ్ధాప్యం స్వీకరించింది, పురూరవుడు...

    ReplyDelete
  10. ఒక మనిషిని ఇంకొ మనిషి చంపి పండగ చేసుకొనే దుర్మార్గమైన సాంప్రదాయం ప్రపంచంలో మరెక్కడా లేదు ఒక భారత దేశంలో తప్ప. మానవుడు తన జీవిత కాలంలో ఎంతటి క్రూరుడైన తను సచ్చిన రోజు అతని గురించి కొన్ని మంచి చెబుతారు కాని ఇక్కడ వింత పోకడ ఏమిటంటే సాటి మనిషిని చంపి పండగ చేసుకొంటారు. అయినా రావనాసూరుడో, నరకాసూరుడో కొంత మంది నివాళి అర్పిస్తే మిగిలిన వారికి ఎందుకు మంట, ఈ మేధావులను బలవంతం చేయటం లేదు కదా! నమ్మే వారు నమ్ముతారు లేకపోతె మరిచి పోతారు. ఈ అనవసరపు శాపనార్థాలు, తిట్లు ఎందుకు నయానా! వందల వేల సం.లు అణగారిన వారిని చదువుకు దూరం చేసినందున వారి చరిత్రను, సాంప్రదాయాన్ని వ్రాయలేక పోయారు, అలాగే కొంత మంది చదువుకొన్న వారి అసత్యపు ప్రచారాలను వందల వేల సం. లు అమాయక ప్రజలు నమ్మి రాముడు,భీముడు, కృష్ణుడు దేవుడని నమ్మారు ఉదాహరణకు “హింస రాజు పులకేసి 23” కథ ఉదాహరణ. ఇప్పుడిప్పుడే అణగారిన(దళిత బహుజనుల) వర్గాల మొదటి తరం వారు చదువుకొంటున్నారు వారు మరియు వారి తరువాత తరం వారు వస్తే ఇంకా నరకాసూరుడు, బకాసూరుడు,మహిస సూరుడు, హిడింభి,సూర్పనక లాంటి మరెందరో చరిత్రపై పరిశోదనలు చేస్తారని నా నమ్మకం.

    ఇంకొ బ్లాగరు అన్నారు ఐకమత్యాన్ని చెడగొడుతున్నారని, ఒక్క సారి ఇప్పుడున్న హింధూ చరిత్రను పరిశీలిస్తే మతకలహాలెన్నో మనకు కనిపిస్తాయి హిందూ మతములో ప్రదానంగా రెండు భాగాలు ఒకటి శైవము-శివుని పూజించే వారు మరొకటి వైష్ణవము –విష్ణు దేవుణ్ణి పూజించేవారు. ఇందులో కూడా ఉపవిభాగాలు ఉత్తరాది-ఉత్తర భారత దేశంలో నివసించే వారు , ధక్షినాది-ధక్షిన భారత దేశంలో నివసించే వారు. ఈ ఇద్దరి మద్య మత పరమైన గొడవలు చాలా కాలం నడిచింది. ఈ వైరుధ్యానికి ప్రదాన కారణం ఏమిటంటే మందిరం ముందు ఉండే గజరాజు (ఏనుగు) కు వైష్ణవ తిలకమైన నామం పెట్టాలా లేదా శైవ తిలకమైన విభూది పెట్టాల అన్న విషయం మీద జరిగింది. ఇదే విషయం పై మద్రాసు హైకోర్ట్ లో ఒక వాజ్యం పై స్పందిస్తూ మొదటి ఆరు మాసాలు వైష్ణవ నామం మిగత ఆరు మాసాలు శైవ తిలకం పెట్టాలని తీర్పునిచ్చారు. హిందూ మతములొ ఎలాంటి ఇక్యమత్యం ఉందో అనడానికి ఇది ఒక ఉదాహరణ.

    ఇంకొ బ్లాగరు విదేశి శక్తుల పై నింద మోపారు, అంతే మన దగ్గర సరుకు లేక పొతే ఇలాంటి వాదనలే చాలా సులభం (మన ప్రభుత్వం కూడా చేతగాక పొతే మొదట చెప్పే మాట విదేశియుల కుట్ర అంటారు) ఇది ఎంతటి విచిత్రమంటే విదేశియులు చెప్పే వరకు ఇక్కడ దళితులకు మరి ఏమీ తెలియదు ఇంకా మట్టి భుర్రే అని దళితులను అవమానించి నట్లు ఉంది. ఇప్పుడు ప్రజలు అమాయకులు కారు ఎవరి వాదనలొ ఎంత నిజం ఉందో తెలుసు కుంటారు. అయినా తమ ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు ఇలాంటి ఎదురు దాడే కదా శరణ్యం ఇందుకు ఉదాహరణ ఇక్కడ ఉన్న మెజారిటీ వ్యాఖ్యలె నిదర్శనం.

    ReplyDelete
  11. /ఒక మనిషిని ఇంకొ మనిషి చంపి పండగ చేసుకొనే /


    "మనిషిని" ???????????????!!!!!!!!!!!!!

    ReplyDelete
  12. @aravam:
    కృష్ణుడు యాదవుడని, యాదవులు ఒకప్పుడు అగ్ర వర్నమని కొంతమంది రాసిన ఉబుసుపోక కట్టుకథల గురించి మీ అభిప్రాయమేమిటి? కృష్ణుడు జన్మతః క్షత్రియుడు కానీ నందుని ఇంట పెరిగాడనే విషయం వీరికి తెలియదు పాపం :)

    ReplyDelete
    Replies
    1. yadavulu chndravamsa kshtriyulu purushottamudu, chandragupta mouryudu, ashoka chakravarthi,srikrishnadevarayulu,katamaraju modalaina rajulu, kakatiyulu ,chanikyulu, mysore rajavamsam,travacore rajulu....yadava kulanikicchendina chandravamsa kshatriyulu puli yadav

      Delete
    2. chandravamsam lo devamedudu anu yadavarajunaku iruvuru bharyalukalaru. pradamabharya kshatriya kanya marisha rendava bharya vaisya kanya gunavati . devamedunaku pradama bharya valana kaligana surasenuni kumarude vasudevudu. rendava bharya kaligina parjunyuni kumarude nandudu. kabatti nandudu vasudevudu sodarulu. gollalu yadavrajulu okkare.

      Delete
    3. Chief mimistergaa chesina Chandrababu nayudu kamma.Adhe kulaniki chendhina aneka mandhi graamaalalo vyavasaayam chesukuntunnaru,C.M ayinatha matrana chandrababu nayudu vyavasayadaaruduga vunna aathani bandhuvulu oke kulaniki chendhinavaaru kaadhaa? Idhe sambandham Kshatriyulaku mariyu( Golla)yadavulaki madhya vunnadhi.

      Delete
  13. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది . ఇంతకూ రావణుడు ఏ కులం ?
    ఈనాడులో ఆ వార్త చదివి ఆకాశరామన్న గారు ఆశ్చర్య పోవడం ఎందుకో. బహుశా తెలంగాణకు చెందిన దళితులూ కాబట్టి అలా అనిపించినట్టు ఉంది. ఇప్పుడేమిటి ఈ వాదన కోస్తాకు చెందిన నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చేశారు. రావణుడిని రవాణా బ్రహ్మ అంటూ అతని గుణగణాలు పొగుడుతూ సినిమా తీశారు. అలానే అంతా విలన్లుగా చూసే దుర్యోధనుడిని హిరో చేసే తెలుగువారితో ఒప్పించారు. అనుమానం ఉంటే దానవిర శురకర్ణ ఓ సారి చూడండి

    ReplyDelete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. ఇప్పటి యాదవులు అప్పటి యదువు వంశీయులో కాదో చెప్పలేము . కమ్మ కులం వారు, యాదవులు ఒకటే అని కొందరు అంటున్నారు. ఉత్తరభారతదేశంలోని యాదవుల్లో ఇక్కడి కమ్మ కులానికి చెందినవారికి ఉన్నట్లే చౌధురీ ( చౌదరి ) అనే నామం ఉంటుంది. కొందరు జాట్ కులస్తులకు కూడా చౌధురీ అని ఉంటుంది. కొందరు ముస్లిం మతస్తులలో కూడా చౌధరి అని పేరు వస్తుంది. కొంతకాలం క్రిందట ముస్లిముల పాలనాకాలంలో ప్రజలవద్ద పన్నులు వసూలు చేసే ఉద్యోగులకు చౌధరీ అనే బిరుదు ఉండేదంటారు. మరి ఈ చౌధరి అన్న పేరు ఎలా వచ్చిందో తెలియటల్లేదు. ఓరుగల్లును పాలించిన కాకతీయులు కూడా కమ్మ కులానికి చెందినవారని కొందరు చరిత్రకారులు అంటారు. ఒకే పేరు గల ఇంటి పేర్లు వేరేవేరే కులాల వారికి ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు.

    ReplyDelete
    Replies
    1. kakatiyulu yadavkulaniki chendinavaru yaduvamsamloni kukura shakaku chendinavaru google lo yadav history home chudandi puli yadav

      Delete
    2. Kakatiyas are not kammas.It is the Kammas promoting this argument for their greatness.Kakatiyas are as per history yadavas.

      Delete
    3. epati yadav apati yadav saperate kadu kani yadav caste lo tegalu unai kamma vallu apatilo yadavs deggara postman work chesevaru sanskrit lo kamma ante postman ani meaning.choudary ante landlords ni antaru caste tu paniledu ok adi any caste kavatchu.warangal kakatiyas caste yavariki teliyadu ekkada rayaledu adi kondha mandhi poets ki money etichi rayuchukunnaru

      Delete
  16. aravam,
    ఒక మనిషిని ఇంకొ మనిషి చంపి పండగ చేసుకొనే దుర్మార్గమైన సాంప్రదాయం
    nasarakarudu rakshsudu kada
    వందల వేల సం.లు అణగారిన వారిని చదువుకు దూరం చేసినందున వారి చరిత్రను, సాంప్రదాయాన్ని వ్రాయలేక పోయారు
    can you give me some approximate figure like how many hundred thousands years??
    ఇప్పుడిప్పుడే అణగారిన(దళిత బహుజనుల) వర్గాల మొదటి తరం వారు చదువుకొంటున్నారు
    are you saying dalits who born before 2000 year dont have any educational background even reservations are there from 50 years before
    ఒక్క సారి ఇప్పుడున్న హింధూ చరిత్రను పరిశీలిస్తే మతకలహాలెన్నో మనకు కనిపిస్తాయి
    who said no?? in fact that is how hindu its rules according to society needs
    హిందూ మతములో ప్రదానంగా రెండు భాగాలు ఒకటి శైవము-శివుని పూజించే వారు మరొకటి వైష్ణవము –విష్ణు దేవుణ్ణి పూజించేవారు
    from my understanding, you are talking about veerashaiva!! please search for it, why it is started and what are all its goals.
    ఇది ఎంతటి విచిత్రమంటే విదేశియులు చెప్పే వరకు ఇక్కడ దళితులకు మరి ఏమీ తెలియదు ఇంకా మట్టి భుర్రే అని దళితులను అవమానించి నట్లు ఉంది. ఇప్పుడు ప్రజలు అమాయకులు కారు ఎవరి వాదనలొ ఎంత నిజం ఉందో తెలుసు కుంటారు.
    let me phrase it in another way.
    చిత్రము ఎమిటి అంటె వీల్లు చెప్పే వరకు పురాణాల గురుంచి మిగతా ప్రజలకి ఎమి తెలియదు ఇంకా మట్టి బుర్రే అని మిగతా ప్రజలని అవమానించినట్లు ఉంది

    అయినా తమ ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు
    are you from separate planet??

    the reason behind deepavali might be narakasura vadha!! but there is much more tradition and culture associated with it. And people who are praising narakasure dont have anything as such

    ReplyDelete
  17. 1920 parlament rule yadavulu srikrishudi vamsaniki chendina kshatriyulu ani unnadi puliyadav

    ReplyDelete
    Replies
    1. kshitriyuda nenu yaduvamsa sambavunda..... bhagavan srikrishnuni uvacha puliyadav

      Delete
  18. kshatriyuda nenu yaduvamsa sambavunda.... ani bhagavan srikrishnuni uvacha harivamsam

    ReplyDelete
  19. kshatriyuda nenuyaduvamsa sambavunda... ani bhagavan srikrishnuni uvacha harvamsam puliyadav

    ReplyDelete
  20. kshatriyuda nenuyaduvamsa sambavunda... ani bhagavan srikrishnuni uvacha harvamsam puliyadav

    ReplyDelete
  21. yadavulu kshathriyuleeeeee...............

    ReplyDelete
  22. నరకాసురుడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎంతమంది స్త్రీలను చెరపట్టాడు?ఇవేవీ పాపం వీరి కంటికి కనిపించవు.ఈ నరకాసుర వారసులమని చెప్పుకునేవారితో సమాజం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారసులు ఏమేమి తాతలు చేసిన 'ఆ'ఘనకార్యాలు వెలగబెడతారో? పాపం 'అరవన్' అంటారు, అవాకులూ చెవాకులూ అరుస్తూనే ఉంటారు.

    ReplyDelete