Saturday, August 31, 2013

పిల్ల రాక్షసునికి ఇంత చిన్న శిక్షా ?

దేశాన్ని కుదిపి వేసిన నిర్భయ కేసు విచారణ లో ముద్దాయిల్లో ఒకరిని మైనర్ గా పేర్కొంటూ కేవలం మూడేళ్ళ జైలు శిక్షతో సరి పెట్టటం దారుణం.   చనిపోయే ముందు నిర్భయ మెజిస్ట్రేటు కి ఇచ్చిన  వాంగ్మూలం లో ప్రధాన నిందితుని తర్వాత తన పట్ల పాశవికంగా ప్రవర్తించింది ఆ బాలుడే (?) అని విస్పష్టంగా చెప్పింది.  ఆ తరువాత ఈ కేసు దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.  నేటి ఈ తీర్పు రావటానికి ఎనిమిది నెలల సమయం పట్టింది.  ఈ 8 నెలల కాలంలో బాల నేరస్తుల చట్టాన్ని సవరించే దిశగా ఏ చర్యలు తీసుకోక పోవటం విచారకరం.  చట్టాలని సవరించని పక్షంలో ఆ బాల నేరస్తునికి పడే శిక్ష ఇదే అనేది అందరికీ ముందే తెలుసు. చట్టంలో వున్న ఈ లొసుగు మూలంగా
ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నా ప్రభుత్వాలు మేల్కొనక పోవటం క్షంతవ్యం కాదు.  తాజాగా ముంబై లో జరిగిన సంఘటనలో కూడా ఒక మైనర్ బాలుడు వున్న విషయం తెలిసిందే. సమాచార హక్కు చట్టం నుండి తమని మినహాయించుకొనే నేర్పు రాజకీయ పక్షాలకి వుంటుంది .  నేరారోపణలు వున్న వారు చట్ట సభల్లో ఉండకూడదని కోర్టు తీర్పు ఇచ్చినా  వెసులుబాటు కల్పించుకొనే చాకచక్యం వారికి వుంటుంది.   కానీ ఒక నిర్భాగ్యురాలికి న్యాయం చేద్దామన్న చిత్త శుద్ది మాత్రం వుండదు. నిర్భయని క్షమించమని అడగటం కన్నా భరత జాతి చేయగలిగింది ఏమీ లేదు ...

ఉద్యోగులు-కార్మికులు అందుకోండి అభినందనలు ...

ఉల్లిపాయ ధర సెంచరీ కొట్టటానికి సిద్ధంగా వుంది .  సామాన్యుడి బతుకు దుర్భరమై పోయింది.  పెట్రోలు ధర సెంచరీ కొట్టటానికి సిద్ధంగా వుంది.  సామాన్యుడితో పాటు మధ్య తరగతి జీవుల నడ్డి విరుగుతోంది.  డాలరు మారకం కూడా సెంచరీ కి పరుగు పెడుతోంది.  తద్వారా దిగుమతుల భారం పెరుగుతోంది.  సరిహద్దుల్లో దాదాపు ప్రతి వారం పాకిస్తాన్, చైనాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి.ఇవే గాక సవాలక్ష సమస్యలు ముందున్నాయి.  వీటన్నిటికీ పరిష్కారం చూపాల్సిన కేంద్రం ముఖ్యమైన సమస్యలని గాలికి వదిలేసి తగుదునమ్మా అంటూ  అడ్డ గోలుగా తెలుగు రాష్ట్ర విభజనకి  సై అంటోంది. అదీ ఏక పక్షంగా కేవలం ఒక్క ప్రాంతానికే అనుకూలంగా ప్రతిపాదన చేసి సీమాంధ్రని అగ్నిగుండంగా మార్చింది.    రాష్ట్రంలోను, రాష్ట్రం బయట కూడా కొత్త సమస్యలని ఉత్పన్నం చేస్తోంది. వాస్తవానికి దేశంలో అనేక చోట్ల ప్రత్యెక రాష్ట్రాలకి ఉద్యమాలు ఉన్నాయి.   ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే  ఆ రాష్ట్ర విభజన కోసం శాసన సభలో తీర్మానం సైతం జరిగి కేంద్రం వద్ద పెండింగ్ లో వుంది.  విభజనకి ముందుకి వచ్చిన రాష్ట్రాన్ని వదిలి పెట్టి ఇక్కడ  శాసన సభ ఒప్పుకోక పోయినా విభజన చేసి తీరతామనటంలో ఔచిత్యం ఏమిటో అర్ధం కాదు.  మన రాష్ట్రాన్ని ముక్కలు చేసి తీరతామంటున్న ఇదే దిగ్విజయ సింగ్ ఉత్తర ప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎస్సార్సీ  కావాలంటాడు.   ఆంధ్ర ప్రదేశ్ ని కేకు ముక్కలా కోసేయాలని ఉత్సాహ పడే చిదంబరం తమ తమిళనాడు విభజన గురించి మాట్లాడితే 'ఆ ప్రతిపాదన మొగ్గలోనే తుంచేయాలని' సెలవిస్తాడు.  ఈ అరాచకాన్ని ప్రశ్నించాల్సిన   సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు తమ పదవులు వదలి పెట్టకుండా అధిష్టానం కనుసన్నల్లో నడుచుకుంటూ తమను ఎన్నిక చేసిన ప్రాంతాలకి ద్రోహం చేస్తున్నారు.
 మొదటే పేర్కొన్నట్లు ప్రస్తుతమున్న దుర్భర పరిస్థితుల్లో సగటు వేతన జీవికి లేదా కార్మికునికి ఒక నెల జీతం రాక పొతే ఎంత కష్టం ?   అయినా సరే అడ్డగోలు విభజన సహించేది లేదు అంటూ ఉద్యమంలోకి  దూకిన రాష్ట్ర ఉద్యోగులని, ఆర్టీసీ కార్మికులని చూసి రాజకీయ నాయకులు సిగ్గు తెచ్చుకొవాలి.  ఏ నాయకుల - జాక్ ల సహాయం లేకుండా స్వచ్చందంగా గత నెల రోజులుగా  జరుగుతున్న ఉద్యమం  కేంద్రానికి దడ పుట్టిస్తోంది అనటంలో సందేహం లెదు.  విభజన పై వెనక్కి  తగ్గేది లేదు అంటూ బీరాలు పలుకుతున్న కేంద్రం మెడలు వంచేలా,  సమైక్య రాష్ట్ర సాధనకై మొక్కవోని దీక్షతో నిబద్ధత తో ముందుకు సాగుతున్న ఉద్యోగులూ - కార్మికులూ...  అందుకోండి  సమైక్యాంధ్ర  శుభాభినందనలు.  

Monday, August 26, 2013

న్యాయ వాదుల అన్యాయ వాదం !

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకై ప్రకటన జరిగింది.  అవును.. కేవలం ప్రకటన మాత్రమె జరిగింది ... అదీ ఇన్నాళ్ళూ మౌనంగా వున్న కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని తెలిపింది. అంతే తప్ప ఇంకేం జరగలెదు.   రాష్ట్రం ఏర్పడటానికి అవసరమైన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా చాలా వుంది.  కానీ తెలబాన్ల దాష్టీకం  అప్పుడే మొదలై  పోయింది.    ముఖ్య మంత్రిని టిఫిన్ సెంటర్ పెట్టుకోమనే వారొకరు.. హైదరాబాద్ గురించి మాట్లాడితే నాలుక  చీరేస్తామనే వారు ఇంకొకరు !    ఇప్పుడు తాజాగా న్యాయవాదుల వంతు !  హైదరాబాదు లోని ఏపీ ఎన్జీవో హొమ్ లో  సీమాంధ్ర  న్యాయవాదులు సమావేశం జరుపుకుంటూ వుంటే  అక్కడికి  వచ్చి తెలంగాణా  న్యాయవాదులు రెచ్చగొడుతున్నా రంటూ రభస  సృష్టించటం  అవివేకం.  నాలుగు గోడల మధ్య జరుపుకొనే సమావేశం రెచ్చగొట్టటం ఎలా అవుతుందో విజ్ఞులైన న్యాయ కోవిదులకే తెలియాలి.     రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాదు నగరం పై సర్వ హక్కులు తమకే వున్నట్లు చెలరేగుతున్న తెలబాన్ గుంపులు కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎలా పెట్రేగుటారో అన్న దానికి  సంకేతాలు ఇవన్నీ!     అసలే  తమ భద్రత గురించి ఆందోళన లో ఉన్న సీమాంధ్రులకు తగిన భరొసా కల్పించకుండా విభజనకి సహకరించాలంటూ ఫత్వాలు జారీ చేయటం తెలబాన్లకే చెల్లింది.   ఒక రాష్ట్ర విభజన జరగటం అంటే మ్యాపు మధ్యలో గీత గీసినంత తేలిక కాదు .  అన్ని ప్రాంతాల పరస్పర అంగీకారం లేకుండా కేవలం ఒక రాజకీయ పార్టీ స్వంత ప్రయోజనాల కోసం ప్రతిపాదించిన విభజన ప్రక్రియ సజావుగా ముందుకు సాగటం కల్లే! 

Wednesday, August 21, 2013

పల్లకీ మోసినందుకు ప్రతిఫలం ఇదా?


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పధకాలు :

ఇందిరా జల ప్రభ
ఇందిరా క్రాంతి పధం
ఇందిరా జీవిత భీమా పధకం
ఇందిరమ్మ ఇల్లు
రాజీవ్ గృహ కల్ప
రాజీవ్ గాంధీ అభ్యుదయ యోజన
రాజీవ్ యువ కిరణాలు
రాజీవ్ సిటిజెన్ సర్వీసెస్ (ఈ సేవ)


ఆంద్ర ప్రదేశ్ లో విద్యాలయాలు :

జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ - హైదరాబాద్, కాకినాడ,అనంతపూర్
జవహర్ లాల్ నెహ్రూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్
రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడెమీ, హైదరాబాద్
రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్, బాసర, నూజివీడు, కడప
రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజి, రాజమండ్రి
రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ , కాకినాడ
ఇంకా రాష్ట్రం అంతటా ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వ విద్యాలయం శాఖలు

ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రదేశాలు :

నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ , విజయవాడ
నెహ్రూ జూలాజికల్ పార్క్ , హైదరాబాద్
ఇందిరా పార్క్, హైదరాబాద్
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, విశాఖపట్నం
ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ , విశాఖపట్నం
రాజీవ్ గాంధీ ఎ.సీ. స్టేడియం, విశాఖపట్నం
రాజీవ్ గాంధి ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్
రాజీవ్ గాంధీ పార్క్, విజయవాడ
రాజీవ్ గాంధీ స్టేడియం, విజయవాడ
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాన్క్చురీ

ఇవే గాక రాష్ట్రం లోని  అన్ని పట్నాల్లోనూ నెహ్రూ బజార్లు, ఇందిరా కాలనీలు, రాజీవ్ గాంధీ నగర్ లు ఎన్ని వున్నాయో లెఖ్ఖే లేదు.  భారత దేశంలో ఇంకా ఏ ఇతర  రాష్ట్రమైనా గాంధీ - నెహ్రూ వంశీకులని ఇంతగా నెత్తిన పెట్టుకొని మోసిందా ?   మరి ఇంతగా మోసినందుకు మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇవ్వ చూపుతున్న బహుమతి ఏమిటి ?  అడ్డగోలు విభజన !  విభజించి పాలించు అన్న బ్రిటీష్ వారి పద్ధతిలో తెలుగు జాతిని విభజించి సవారి కొనసాగిద్దామనుకొన్న కాంగ్రెస్ ఖంగు తినక మానదు.  నెత్తిన పెట్టుకున్న తెలుగు వారే ఎత్తి కుదేస్తారని కాంగ్రెస్ తెలుసుకొనే రోజు ఎంతో దూరంలో లేదు.   

Sunday, August 18, 2013

సీమాంధ్రులపై ఒక పిట్ట కద !

ఒక కోతి (సీమాంధ్ర), ఒక మొసలి (తెలంగాణా)  56 ఏళ్లుగా స్నెహితులు.  ఈ మధ్యలో ఒక రోజు ఇద్దరూ నదీ విహారం మధ్యలో ఉన్న సమయంలో (కేంద్రం తెలంగాణా ప్రకటించిన సమయంలో)    ఆ మొసలి  నా భార్య కి  (తెలంగాణా రాష్ట్రం)  నీ గుండె కాయ (హైదరాబాదు)  కావాలని కోరికగా ఉంది.. నిజమైన స్నేహితుడివి ఐతే ఇచ్చేయి అని అడిగింది.  గుండె కాయ ఇచ్చేస్తే కోతి  పరిస్థితి ఏమిటి?    ఆ కధలో ఐతే కోతి  తెలివిగా తప్పించుకుంది.  మరి ఇక్కడ సీమాంధ్రుల పరిస్థితి ఏమిటి అన్నది వెండి తెర పై చూద్దాం...    

Saturday, August 17, 2013

తెలుగు వారి ఆత్మ గౌరవం ఇదేనా ? - 2

దేశంలో ఇప్పుడు అనేక చోట్ల ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి.  ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్ర్రాన్ని నాలుగు ముక్కలు చేయటానికి శాసన సభలో తీర్మానం కూడా జరిగి పోయింది.  ఆ తీర్మానం సందర్భంలో -  మన రాష్ట్రాన్ని కేకు ముక్కలా విభజించటానికి  ఉత్సాహం చూపుతున్న ఇదే దిగ్విజయ సింగ్ 2011 లో ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల అధిపతిగా వున్నప్పుడు ఏమన్నారో ఇక్కడ చూడండి :

http://www.hindustantimes.com/India-news/NewDelhi/UP-bifurcation-Cong-wants-second-SRC/Article1-767062.aspx

ఉత్తర ప్రదేశ్ విభజనకైతే రెండో ఎస్సార్సీ కావాలట!   ఆంధ్ర ప్రదేశ్ ని ముక్కలు చేయటానికి ఐతే ఏమీ అవసరం లేదా?  శాసన సభ అంగీకారంతో కూడా పని లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసేస్తామని ఉవ్విళ్ళూరుతున్న    కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్లా ఇదే న్యాయం ఎందుకు పాటించదు?  ఎందుకంటే ఆయా రాష్ట్రాల వ్యవహారాల్లో వేలు పెడితే కొర్రు కాల్చి వాత పెడతారు అక్కడి నాయకులు.   ఆంద్ర ప్రదేశ్ విభజన విషయంలో శాసన సభ తీర్మానం జరగనేలేదు.  కనీసం  తెలంగాణా సమస్య అధ్యయనం కోసం వేసిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సైతం ఇంత  వరకు ఏ చట్ట సభలోనూ చర్చకు రాలేదు. అయినా కూడా వాటన్నిటినీ పక్కన  పెట్టి కేవలం  ఆంధ్ర ప్రదేశ్ ని మాత్రమె ముక్కలు చేయాలని కాంగ్రెస్ ఎందుకు పరుగు పెడుతోంది ?  ఇది కేవలం సీమాంధ్ర నాయకుల/కేంద్ర మంత్రుల చేతగాని తనం తప్ప మరేమీ కాదు. మనం అంత  చేతకాని వాళ్ళం కాబట్టే గుజరాత్ నుండి గురువింద గింజ లాంటి నరేంద్ర మోడీ మన రాష్ట్ర రాజధానికి వచ్చి అన్న దమ్ముల్లా విడి పోమని ఉచిత సలహా ఇచ్చి వెళ్ళాడు. గుజరాత్ లోను సౌరాష్ట్ర ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమం ఎప్పటినుంచో ఉంది.  మన నాయకులు ఎవరికైనా గుజరాత్ వెళ్లి గుజరాత్ సౌరాష్ట్రాలు అన్న దమ్ముల్లా విడి పోమ్మని చెప్పే ధైర్యం ఉందా ?   స్వంత ఇంటి నుండి గెంటి  వేసిన చందం గా అధిష్టానం విభజన ప్రతిపాదించినపుడు తిరగబడ వలసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు ?     తమ తమ స్వంత రాష్ట్రాల్లో ఠికానా లేక కాంగ్రెస్ కోర్ కమిటీ లో కాలక్షేపం చేస్తున్న సభ్యులతో కూడిన ఆంటోనీ కమిటీ ముందు సాగిల పడుతున్నారు.  "అదియును నీ పతి ప్రాణంబు దక్క" అన్న రీతిలో కమిటీ చీదరిస్తున్నా కూడా  పదవులు వదలి పెట్టకుండా రాష్ట్ర పరిస్థితులు నివేదిస్తూ తరించి పోతున్నారు. వీరు నివేదిస్తే గాని ఇక్కడి పరిస్థితులు కేంద్రానికి తెలియవా?     మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో ప్రత్యెక వింధ్య ప్రదేశ్ కోసం ఉద్యమం వుంది.  మన మంత్రులలో ఏ ఒక్కరైన దిగ్విజయ సింగ్ ని నీ రాష్ట్రం లో విభజన వాదం పరిష్కరించలెవు గానీ మా పంచాయితీ తీర్చే హక్కు నీకెక్కడ వుంది అని అడిగే దమ్ము ఉందా?   అలాగే కర్నాటక-కేరళ సరిహద్దుల్లో  తుళునాడు ప్రత్యెక రాష్ట్రం కోసం ఉద్యమం వుంది.  దాని సంగతి ఏమిటి అని ఆ రాష్ట్రాలకి చెందిన  వీరప్ప మొయిలీ, ఆంటోనీ లని అడిగే ధైర్యం ఉందా?  కనీసం రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎన్జీఒ లకు వున్న నిబద్ధత కూడా సీమాంధ్ర మంత్రులకు, నాయకులకు లేకపోవటం తెలుగు జాతి చేసుకున్న ఖర్మం !   

Tuesday, August 13, 2013

తెలుగు వారి ఆత్మ గౌరవం ఇదేనా?

ఒక రాష్ట్రం విభజించటానికి రాజకీయ పార్టీలు లేఖలు ఇస్తే సరి పోతుందా? ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇదే!   సమాజంలో వున్నది  రాజకీయ పార్టీలేనా ?  ఇతర వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా?  సమాజంలో అన్ని వర్గాలని సంప్రదించి సాధికార నివేదిక ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుంచుకొని మళ్ళీ ఆంటోనీ కమిటి ఉద్ధరించేదేమిటి?   గతంలో కొత్తగా వచ్చిన ఏ రాష్ట్రమైన తన రాజధానిని కొత్త చోట ఏర్పాటు చేసుకుంది కానీ ఉమ్మడిగా సంపూర్ణంగా అభివృద్ది చెందిన తల్లి రాష్ట్ర రాజధానిని హైజాక్ చేసి తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలెయలెదు.  స్వతంత్ర భారతంలో చివరిగా ఏర్పడ్డ చత్తీస్ ఘర్, జ్హార్ఖండ్, ఉత్తరాంచల్ లో అదే జరిగింది.  చత్తీస్ ఘర్  రాష్ట్ర  అధికారిక వెబ్ సైట్ లో ఆ రాష్ట్ర ఏర్పాటు గురించిన సమాచారం ఏముందో ఇక్కడ చూడండి....

http://chhattisgarh.nic.in/profile/corigin.htm

CREATION OF CHATTISGARH:

The Congress Government of Madhya Pradesh took the first institutional and legislative initiative for the creation of Chhattisgarh. On the 18 of March 1994, a resolution demanding a separate Chhattisgarh was tabled and unanimously approved by the Madhya Pradesh Vidhan Sabha. Both the Congress and the Bhartiya Janta Party supported the resolution. The election manifestos of the Congress and the BJP for both the 1998 and the 1999 parliamentary elections as well as the Madhya Pradesh assembly election of 1998 included the demand for creation of separate Chhattisgarh. In 1998, the BJP led Union Government drafted a bill for the creation of a separate state of Chhattisgarh from sixteen districts of Madhya Pradesh. This draft bill was sent to the Madhya Pradesh assembly for approval. It was unanimously approved in 1998, although with certain modifications. The union government did not survive and fresh elections were declared. The new National Democratic Alliance (NDA) government sent the redrafted Separate Chhattisgarh Bill for the approval of the Madhya Pradesh Assembly, where it was once again unanimously approved and then it was tabled in the Lok Sabha. This bill for a separate Chhattisgarh was passed in the Lok Sabha and the Rajya Sabha, paving the way for the creation of a separate state of Chhattisgarh. The President of India gave his consent to The Madhya Pradesh Reorganisation Act 2000 on the 25 of August 2000. The Government of India subsequently set the First day of November 2000 as the day on which the state of Madhya Pradesh would be bifurcated into Chhattisgarh and Madhya Pradesh. Many political observers have commented on the relatively peaceful manner in which the Chhattisgarh state has been created.
There is no single factor responsible for the creation of Chhattisgarh. It is in fact a complex interplay of a combination of factors that paved the path for a separate state. The long standing demand and the movement for Uttarakhand and Jharkhand which led to the acceptance of separate states for these two regions, created a sensitive environment for the Prithak Chhattisgarh demand. Therefore, the creation of Chhattisgarh coincided with the creation of these two states and became a concurrent process. Another important factor leading to the creation of Chhattisgarh was that there was clear acceptance, within Chhattisgarh and outside that Chhattisgarh had a distinct socio-cultural regional identity that had evolved over centuries. A consensus had evolved and emerged on the distinctiveness of Chhattisgarh. The people of Chhattisgarh accepted this and saw Prithak Chhattisgarh as giving expression to this identity. A sense of relative deprivation had also developed in the region and people felt that a separate state was imperative for development to take place in the region. In a democratic polity, the people's demand has a high degree of legitimacy and weight. Therefore the people's demand voiced through democratic channels was heard and contributed immensely to the creation of Chhattisgarh.
The consensus regarding the distinctiveness of Chhattisgarh did not remain limited to its socio-cultural identity. All over Madhya Pradesh, the consensus on a need for separate Chhattisgarh was also carefully developed. This consensus cuts across geographical regions castes, classes and political parties. A strong reflection of this consensus was evident in the unanimous passing of the Chhattisgarh bill in the Madhya Pradesh Vidhan Sabha. This consensus is a pointer to the high degree of maturity of Madhya Pradesh polity and the smooth passage of the Prithak Chhattisgarh bill resulting in the peaceful and unanimous creation of a new state a tribute to this maturity.

18 మార్చ్ 1994 న పాలక-ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతుతో మధ్య ప్రదేశ్ శాసన సభలో 'ఏకగ్రీవంగా' చేసిన తీర్మానం  ఆధారంగా 1998 సంవత్సరంలో ముసాయిదా బిల్లు కేంద్రం మధ్య ప్రదేశ్ రాష్ట్ర అంగీకారానికి పంపింది.  ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా అంగీకరించిన తరువాత   2000 సంవత్సరంలో ఆ రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా చూడవచ్చు. అంతే కాదు - రెండు ప్రాంతాల వారి సంపూర్ణ అంగీకారంతో కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినట్లు అధికారిక వెబ్ సైట్ స్పష్టం చేస్తోంది. 

ఆ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? శాసన సభ తీర్మానం తో సంబంధం లేకుండా కూడా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగోట్టేయటానికి కేంద్రం పూనుకుంటే తెలుగు జాతి సహిస్తుందా? ఇది కేవలం సీమాంధ్రుల సమస్య మాత్రమె కాదు.. తెలుగు వారందరి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. తెలుగు వాడి రాష్ట్ర విభజన గురించి తెలుగు నాయకులు తప్ప అందరూ చిత్తం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మన రాష్ట్రం  వాడు ఒక్కడు కూడా లేని అంటోనీ కమిటీ మన  సమస్యలని పరిష్కరిస్తుందట!    ఇప్పుడు దేశంలో కేవలం తెలంగాణా మాత్రమె గాక చాలా చోట్ల ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాలు ఉన్నా (ఉత్తర ప్రదేశ్ విషయంలో శాసన సభ తీర్మానం కూడా జరిగి పోయింది) అక్కడ ఎక్కడా వేలు పెట్టె సాహసం కేంద్రం చెయ్యదు. ఆంద్ర ప్రదేశ్ ని ముక్కలు చెయ్యటానికి మాత్రం అత్యుత్సాహం కనపరుస్తుంది. కారణం? మన వాళ్ళ చేతకాని తనమే!

Saturday, August 10, 2013

శభాష్ "ఉండవల్లి"

అన్ని ప్రాంతాల వారికి ఆమోద యోగ్యమైన పరిష్కారం చేస్తాం అని మాయ మాటలు చెప్పి అందుకు విరుద్ధంగా  సీమాంధ్రుల నెత్తిన పిడుగుపాటులాగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన అడ్డగోలు రాష్ట్ర విభజన సరి కాదని తేలి పోయింది. అధిష్టానం నోరు నొక్కినా కూడా,  ప్రతిపాదన వచ్చిన తొమ్మిదవ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి జూలు విదిల్చి ఒక సమస్య పరిష్కారం కోసం అనేక సమస్యలను ఆహ్వానించటం సరి కాదని కుండ బద్దలు కొట్టేసారు.  పదవ రోజు రెండు కళ్ళ చంద్ర బాబు ఒక కంటిలో పడ్డ కారాన్ని తుడుచుకునే ప్రయత్నంలో ప్రధానికి లేఖ రాసి సీమాంధ్రుల అభ్యంతరాలు పరిశీలించకుండా ఏక పక్షంగా విభజన అంగీకరించేది లేదని తెల్చెసారు.  పదకొండవ రోజు కావూరి/ఉండవల్లి  కలుగులోంచి బైటకి వచ్చి తాము  కూడా రాష్ట్ర విభజనని సమర్ధించబోమని ప్రకటించారు.   అయితే ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బహుధా ప్రశంసనీయం. ఆవేశంగా మాట్లాడినా,  తెలబాన్ నాయకుని లాగే సంయమనం కోల్పోకుండా కీలెరిగి వాత పెట్టిన రీతిగా ఆయన చేసిన ప్రసంగం మెచ్చ తగింది. అంటోనీ కమిటీ ల్లాంటివి ఎన్ని వచ్చినా - రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నాయకుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగందే విభజన ప్రతిపాదన ముందుకు కదలదు అన్నది స్పష్టమై పోయింది.  అయితే అసలే గాయపడి వున్న సీమాంధ్ర ప్రజలకి - ఉద్యోగులకి ఆప్షన్ లేదనటం, ముఖ్య మంత్రిని టిఫిన్ సెంటర్ పెట్టుకోమనటం వంటి తెలబాన్ నాయకుని వ్యాఖ్యలు పుండు మీద  కారం జల్లినట్లు వుంటాయి. నదీ జలాలు,ఆదాయ వనరుల పంపిణీ, హైదరాబాదు భవిష్యత్తు వంటి అన్ని అంశాలలో మూడు ప్రాంతాల వారి పరస్పర అంగీకారం వచ్చాకే విభజన కార్యక్రమం  కొనసాగించాలి.    అంత  వరకు  యధాతధ స్థితి కొనసాగించటం కేంద్ర తక్షణ కర్తవ్యం.  

Wednesday, August 7, 2013

ధృతరాష్ట్ర అధిష్టానం !

తమ పదవులని జలగల్లా వదలి పెట్టగ పోగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలు చిర్రెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన అడ్డగోలు విభజన ప్రతిపాదన తో సీమాంధ్ర ప్రాంతాలు అట్టుడుకుతుంటే తీరికగా వాస్తవ పరిస్థితులు అధిష్టానానికి 'నివేదిస్తారట!'. వీరు నివేదిస్తే గానీ అధిష్టానానికి రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలియదు గాబోలు! సీమాంధ్ర ప్రజా ప్రతినిధులని, మంత్రుల్ని ప్రలోభాలతో/బెదరింపులతో లొంగదీసి - తెలబాన్ నాయకుడు ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న సమయం చూసి - ప్రత్యెక రాష్ట్రాన్ని సమర్ధించే బీజేపీ ఏమరుపాటు గా వున్న సమయం చూసి - ప్రత్యెక రాష్ట్రం ఇచ్చే ఘనత కేవలం తమకు మాత్రమె వచ్చేలా జాగ్రత్త పడుతూ -- పర్ ఫెక్ట్ టైమింగు తో --- సీమాంధ్రుల గుండెల్లో పిడి బాకు దించేలా విభజన ప్రతిపాదన చేసిన అధిష్టానానికి తద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతోందో / జరగబోతుందో తెలియదనుకోవాలా? అధిష్టానం పట్ల విధేయత ఉండటంలో తప్పు లెదు. కానీ తమ ప్రాంత ప్రయోజనాలకు, అభ్యంతరాలకు లేశ మాత్రం విలువనివ్వకుండా సవతి తండ్రి ప్రేమ చూపుతూ గడ్డి పోచల్లాగా తీసి పారేసినపుడు తిరగబడాల్సిన అవసరం ఖచ్చితంగా వుంది. ఈ సమయంలో కూడా తమ పదవులు,ప్రయోజనాలు కాపాడుకొనే విధంగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు వ్యవహరిస్తుండ బట్టే తెలుగు జాతి అధిష్టానానికి లోకువై పోయింది. అభ్యంతరాలను లెక్క జేయక పోగా ఏమైనా చెప్పుకుంటే అంటోనీ కమిటీ కి చెప్పుకోండి అంటూ తూష్ణీ భావం తో అధిష్టానం పెద్దలు మాట్లాడుతుంటే తెలుగు జాతి గుండె రగిలి పోతోంది. ఆంటోనీ కమిటీ లో ఒక్కడైనా తెలుగు వాడు వున్నాడా? తెలుగు వారి పంచాయితీ ఇతరులు ఎందుకు తీర్చాలి?     విభజన ప్రకటనకి ముందు కూడా ఇలాగె నివేదికలు, రోడ్ మ్యాపులు అంటూ నాటకాలాడి తమ చిత్తం వచ్చినట్లు వ్యవహరించెసారు. మళ్ళీ అదే జరగదని నమ్మకమేమిటి? శ్రీ కృష్ణ కమిటీ లో తెలుగు వారు వున్నారా అంటూ కొందరు అతి తెలివిగా వాదిస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ అన్నది వాస్తవాలని పరిశీలించి, పరిష్కారాలని సూచిస్తూ నివేదిక ఇవ్వాల్సిన కమిటీ మాత్రమె. కానీ నిర్ణాయక విధానాలు తీసుకోవాల్సిన కమిటీలో తెలుగు వారికి స్థానం లేకుండా రాష్ట్ర భవిష్యత్తుని, తద్వారా తెలుగు వారి ప్రయోజనాల్ని ఇతర ప్రాంతాల వారు నిర్దేశించాల్సి రావటం జీర్ణించుకోలేని విషయం. ఇంకా మళ్ళీ ఈ ఆంటోనీ కమిటీ కి నివేదికలు వాస్తవ పరిస్థితులు తెలియ జెప్పటానికి మన ప్రజా ప్రతినిధులు పూనుకుంటే వాళ్లకి మన జాతి ప్రయోజనాల పట్ల నిబద్ధత అనేదే లేదని భావించాల్సిందే. ఎందుకంటే కేంద్రానికి వాస్తవ పరిస్థితులు అన్నీ స్పష్టం గా తెలుసు. ఎవరూ ప్రత్యేకంగా చెప్పనవసరం లెదు. చేతనైతే ఆంటోనీ కమిటీ స్థానంలో రాష్ట్రం లోని మూడు ప్రాంతాల వారిని నియమించి అర్ధవంతమైన చర్చలు సాగించి సమస్యని పరిష్కరించేలా మన ప్రజా ప్రతినిధులు/మంత్రులు పొరాడాలి... అంటే తప్ప శుష్క నివేదికలు సమర్పించితే వాటిని బుట్ట దాఖలు చేసి కేంద్రం తన చిత్తం వచ్చినట్లు నిర్ణయిస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లెదు.

Saturday, August 3, 2013

వినాశ కాలే విపరీత బుద్ది!

2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలని ఎటువంటి అలజడి లేకుండా ఏర్పరచింది. దానికి కారణం మూడు చోట్లా కూడా ఆయా ప్రాంతాల వారి సమ్మతితో కేవలం పరిపాలన సౌలభ్యం కోసం విభజన ప్రతిపాదించటం. అంతే గాక అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలే మరో చోట రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఈ రోజు మన దగ్గర ఎం జరుగుతోంది?  పరిపూర్ణంగా అభివృద్ది చెందిన రాజధానిని హైజాక్ చేస్తూ తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలేసే పోకడకి కాంగ్రెస్ పార్టీ తెగబడింది. రాష్ట్ర విభజన వంటి సున్నితమైన వ్యవహారం పరిష్కరించే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలకి తగిన విలువనిస్తూ-సమ న్యాయం పాటిస్తూ అదే సమయంలో నదీ జలాలు/ఆదాయ వనరుల పంపిణీ, కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు వంటివి ముందుగా నిర్ణయించి అప్పుడు విభజన తలపెట్టాలి. కానీ ఆఖరి నిముషం వరకు - అన్ని ప్రాంతాలకి అనుకూలంగా సమస్య పరిష్కరిస్తాం అని మాయ మాటలు చెప్తూ సీమాంధ్ర ప్రాంతీయుల అభిప్రాయాలకి లేశ మాత్రం విలువనివ్వకుండా కేవలం రాజకీయ సమీకరణాలు దృష్టిలో వుంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన విభజన రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసింది. స్పష్టంగా తమ ప్రయోజనాలకి వ్యతిరేకంగా వ్యవహరించిన అధిష్టానం మీద తిరగబడ వలసిన మన సీమాంధ్ర నాయకులు అధిష్టానం మనసు మార్చే ప్రయత్నం చేస్తామంటూ సన్నాయి నొక్కులు వినిపించటం ఘోరం. అధిష్టానం చేసిన ప్రలోభాలకో లేదా బెదిరింపులకో లొంగి పోయిన సీమాంధ్ర రాజకీయ నాయకులు కిమ్మనక పోయినా, ప్రజల్లోంచి వచ్చిన ఆగ్రహ జ్వాలలకి వెరచి ఆలస్యంగానైనా అయిష్టంగా రాజీనామాల బాట పట్టారు. దానితో అధిష్టానం కొత్త నాటకానికి తెర లేపింది.   సీమాంధ్ర నాయకులు రాజీనామాలు చేస్తే చట్ట సభల్లో తమ వాణి వినిపించే అవకాశం కోల్పోతారట! సీమాంధ్ర నాయకుల సమస్యలు పరిష్కరించటానికి ఆంటోనీ కమిటీ వేసాం - అన్నీ చెప్పుకోండి అంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే సమస్యలు సీమాంధ్ర నాయకులకే ఉన్నాయా? ప్రజలకి లేవా?   వారు కొత్తగా చెప్ప బోయేదేమిటి?  అసలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి సమస్యలు/అభిప్రాయాలు కూలంకషంగా సేకరించి, క్రోడీకరించి, విశ్లేషించి సమగ్రమైన నివేదిక ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుండగా మళ్ళీ ఈ అంటోనీ కమిటీ ఉద్ధరించ బోయేదేమిటి? ఈ కమిటీలు, రోడ్ మ్యాపుల నాటకాలతో ప్రజలు విసుగెత్తి పోయి వున్నారు. కేంద్ర ప్రభుత్వం పంతాలకి పోకుండా తక్షణం శ్రీ కృష్ణ కమిటీ నివేదిక బూజు దులిపి పార్లమెంటులో చర్చకు ప్రవేశ పెట్టాలి. అర్ధవంతమైన చర్చల ద్వారా శ్రీకృష్ణుడు చూపిన ఆరు పరిష్కారాలలో ఒక దానిని ఎన్నుకొని ఈ సమస్యకి మంగళం పాడాలి. లేని పక్షంలో ఈ అడ్డగోలు విభజన ప్రతిపాదనతో కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమె గాక దేశ వ్యాప్తంగా ఎగసిన వేర్పాటు వాద ఉద్యమ జ్వాలలలో కాంగ్రెస్ పార్టీ మసి కావటం ఖాయం.

Thursday, August 1, 2013

సీమాంధ్రుల గుండె మంట!

ఉరి తీయబోయే ఖైదీని సైతం నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడగటం సంస్కారం, సాంప్రదాయం. (ఆ కోరిక తీరుస్తారా లేదా అన్నది వేరే సంగతి) కనీసం ఆ సంస్కారం కూడా లేకుండా సీమాంధ్రుల భవిష్యత్తు ఏమై పోతుందో అన్న ఆలోచన చేయకుండా అడ్డగోలు విభజనతో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల పై భస్మాసుర 'హస్తం' పెట్టింది.   50 సంవత్సరాలకు పైగా అనుబంధం పెంచుకోవటమే గాక తమ ఆర్ధిక వనరులు సమీకరించి, రక్తం చెమట చిందించి, మేధస్సులు రంగరించి సర్వతోముఖంగా అభివృద్ది చేసిన హైదరాబాదు నగరాన్ని అప్పనంగా తెలంగాణ కి ధారపొయమంటే సీమాంధ్రుల గుండె మండదా? పరిశ్రమలైన, వ్యాపారాలైనా, విద్యా సంస్థలైనా, ఇతరత్రా అన్ని రంగాల్లోనూ ఇన్నేళ్ళలో రాష్ట్రంలో అభివృద్ది అంతా హైదరాబాదు చుట్టూ కేంద్రీకృతమై వున్నది అన్నది వాస్తవం.   అవుటర్ రింగు రోడ్డైనా, అన్ని హంగులతో వున్న అంతర్జాతీయ విమానాశ్రయమైన, ఇంకా మెట్రో రైల్ పదకమైనా ఆంధ్ర ప్రదేశ్ లో మరెక్కడా కాక ఇక్కడే ఎందుకు అమలు పరచారు? ఎందుకంటే ఈ వసతులన్నీ 23 జిల్లాల వారికీ పనికి వస్తాయని,ఉపయోగపడతాయని! అటువంటి హైదరాబాదు నగరానికి సరైన ప్రత్యామ్నాయం చూపకుండా విభజించేయటం దారుణం. ఇదే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నిర్ణయించిన పక్షంలో తెలంగాణా ప్రాంతానికి పెద్ద "ప్యాకేజీ" ఇవ్వకుండా వుండే వారా?  కనీసం అటువంటి ప్యాకేజీ సైతం ప్రస్తావించకుండా తన్ని తగలేసిన చందంగా విభజన చేయటం అమానుషం. విభజన తప్పని సరి అని నిర్ణయించినప్పుడు రెండు ప్రాంతాల వారికీ సమ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ కేవలం రాజకీయ కారణాలతో, సీమాన్ధ్రలో తమకు ఠికానా లేదని గ్రహించి, సవతి తల్లి ప్రేమ చూపిన కాంగ్రెస్ అధిష్టానం వైఖరి అత్యంత గర్హనీయం.

నిబద్ధత కరవై నిండా మునిగాం!

కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకి పచ్చ జెండా ఊపగానే దేశంలో నిద్రాణంగా వున్న వేర్పాటు వాద ఉద్యమాలు సందడి మొదలు పెట్టేశాయి. వాటిలో పశ్చిమ బెంగాల్ లో గోర్ఖాలాండ్ ఒకటి. తెలంగాణా ప్రకటించిన నేపధ్యంలో 72 గంటల బంద్ ప్రారంభమైన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ స్పందన ఇక్కడ చదవండి: 

http://in.news.yahoo.com/mamata-rules-bengals-division-darjeeling-boil-164608312.html

రాష్ట్రాన్ని విభజించనీయమని తెగేసి చెపుతూనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకోజాలదని కుండ బద్దలు కొట్టారు మమతా బెనర్జీ!

"A union territory bypassing the state, is it so easy? Is it a lollypop in a child's hand? I will remind the central government that it has a responsibility to not disturb peace in Darjeeling," said Banerjee.


కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయం ఎలా వున్నా సరే పార్లమెంటులో బిల్లు పెట్టి రాష్ట్రాన్ని విభజించి తీరుతామని కేంద్రం తొడలు చరుస్తున్నా, చేవ చచ్చిన మన రాష్ట్ర నాయకులు స్వంత వ్యాపార/రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో వుంచుకొని నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నారు. ఇటువంటి నిబద్ధత లేని నాయకులు ఉండ బట్టే కేంద్రం తెలుగు వారిని లోకువ గట్టి 13 జిల్లాల వారి ఆలోచనలకి, అభిప్రాయాలకి వీసమెత్తు విలువ ఇవ్వకుండా - కేవలం రాజకీయ ప్రయోజనాలు దృష్టి లో వుంచుకొని అడ్డగోలు విభజనకి పూనుకుంది. ఇదంతా తెలుగు వాళ్ళ ప్రారబ్ధం/స్వయంకృతం ...