Saturday, August 31, 2013

పిల్ల రాక్షసునికి ఇంత చిన్న శిక్షా ?

దేశాన్ని కుదిపి వేసిన నిర్భయ కేసు విచారణ లో ముద్దాయిల్లో ఒకరిని మైనర్ గా పేర్కొంటూ కేవలం మూడేళ్ళ జైలు శిక్షతో సరి పెట్టటం దారుణం.   చనిపోయే ముందు నిర్భయ మెజిస్ట్రేటు కి ఇచ్చిన  వాంగ్మూలం లో ప్రధాన నిందితుని తర్వాత తన పట్ల పాశవికంగా ప్రవర్తించింది ఆ బాలుడే (?) అని విస్పష్టంగా చెప్పింది.  ఆ తరువాత ఈ కేసు దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.  నేటి ఈ తీర్పు రావటానికి ఎనిమిది నెలల సమయం పట్టింది.  ఈ 8 నెలల కాలంలో బాల నేరస్తుల చట్టాన్ని సవరించే దిశగా ఏ చర్యలు తీసుకోక పోవటం విచారకరం.  చట్టాలని సవరించని పక్షంలో ఆ బాల నేరస్తునికి పడే శిక్ష ఇదే అనేది అందరికీ ముందే తెలుసు. చట్టంలో వున్న ఈ లొసుగు మూలంగా
ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నా ప్రభుత్వాలు మేల్కొనక పోవటం క్షంతవ్యం కాదు.  తాజాగా ముంబై లో జరిగిన సంఘటనలో కూడా ఒక మైనర్ బాలుడు వున్న విషయం తెలిసిందే. సమాచార హక్కు చట్టం నుండి తమని మినహాయించుకొనే నేర్పు రాజకీయ పక్షాలకి వుంటుంది .  నేరారోపణలు వున్న వారు చట్ట సభల్లో ఉండకూడదని కోర్టు తీర్పు ఇచ్చినా  వెసులుబాటు కల్పించుకొనే చాకచక్యం వారికి వుంటుంది.   కానీ ఒక నిర్భాగ్యురాలికి న్యాయం చేద్దామన్న చిత్త శుద్ది మాత్రం వుండదు. నిర్భయని క్షమించమని అడగటం కన్నా భరత జాతి చేయగలిగింది ఏమీ లేదు ...

6 comments:

  1. చట్టంలో లొసుగలా ఉంటే జడ్జీగారేం చేయగలడు?

    ReplyDelete
  2. చట్టం లోని లొసుగులను సరిచేసి మదమెక్కిన పిల్లరాక్షసుడికి తగినశిక్ష పడేటట్లు చేయాలి!అతడు బాలుడు కాదు,బాలకాముకుడు!చేసిన నేరాన్ని అనుసరించి శిక్ష వేయాలి కాని వయసునుబట్టి కాదు!

    ReplyDelete
  3. He deserves not any less than capital punishment

    ReplyDelete
  4. Don't be sentimental

    Even if Juvenile Act amended in last eight months, those amendment won't be applicable for this incident. Those will be applicable only to the incidents, after the date of enforcing those amendments.

    One can argue for capital punishment to that person by giving exception, for this particular incident, or by amending total Judiciary system.

    In any case of the above, later everyone starts asking exceptions, make fun of Judiciary.

    Better to regret or some take initiative to kill him and surrender himself or herself before Judiciary.

    ReplyDelete
  5. I dont think that there is a need to amend the Act to punish that fellow.In judiciary, the punishment to be commensurate to the offence. It would have been right had the capital punishment is issued.Judgement should send signals to such brutes that they dont deserve a place in society.

    ReplyDelete
  6. పిల్లవాడైనా రాక్షసుడే కదా!
    ఇకముందైనా మైనర్ వయస్సు 15 ఏళ్ళకి మార్చితే బాగుంటుంది.
    ఇలాంటి సందర్భాలలోనే, బాధితులు చట్టాలని తమ చేతులలోకి తీసుకుంటారు.

    ReplyDelete