Saturday, August 3, 2013

వినాశ కాలే విపరీత బుద్ది!

2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలని ఎటువంటి అలజడి లేకుండా ఏర్పరచింది. దానికి కారణం మూడు చోట్లా కూడా ఆయా ప్రాంతాల వారి సమ్మతితో కేవలం పరిపాలన సౌలభ్యం కోసం విభజన ప్రతిపాదించటం. అంతే గాక అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలే మరో చోట రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి. కానీ ఈ రోజు మన దగ్గర ఎం జరుగుతోంది?  పరిపూర్ణంగా అభివృద్ది చెందిన రాజధానిని హైజాక్ చేస్తూ తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలేసే పోకడకి కాంగ్రెస్ పార్టీ తెగబడింది. రాష్ట్ర విభజన వంటి సున్నితమైన వ్యవహారం పరిష్కరించే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలకి తగిన విలువనిస్తూ-సమ న్యాయం పాటిస్తూ అదే సమయంలో నదీ జలాలు/ఆదాయ వనరుల పంపిణీ, కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు వంటివి ముందుగా నిర్ణయించి అప్పుడు విభజన తలపెట్టాలి. కానీ ఆఖరి నిముషం వరకు - అన్ని ప్రాంతాలకి అనుకూలంగా సమస్య పరిష్కరిస్తాం అని మాయ మాటలు చెప్తూ సీమాంధ్ర ప్రాంతీయుల అభిప్రాయాలకి లేశ మాత్రం విలువనివ్వకుండా కేవలం రాజకీయ సమీకరణాలు దృష్టిలో వుంచుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన విభజన రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసింది. స్పష్టంగా తమ ప్రయోజనాలకి వ్యతిరేకంగా వ్యవహరించిన అధిష్టానం మీద తిరగబడ వలసిన మన సీమాంధ్ర నాయకులు అధిష్టానం మనసు మార్చే ప్రయత్నం చేస్తామంటూ సన్నాయి నొక్కులు వినిపించటం ఘోరం. అధిష్టానం చేసిన ప్రలోభాలకో లేదా బెదిరింపులకో లొంగి పోయిన సీమాంధ్ర రాజకీయ నాయకులు కిమ్మనక పోయినా, ప్రజల్లోంచి వచ్చిన ఆగ్రహ జ్వాలలకి వెరచి ఆలస్యంగానైనా అయిష్టంగా రాజీనామాల బాట పట్టారు. దానితో అధిష్టానం కొత్త నాటకానికి తెర లేపింది.   సీమాంధ్ర నాయకులు రాజీనామాలు చేస్తే చట్ట సభల్లో తమ వాణి వినిపించే అవకాశం కోల్పోతారట! సీమాంధ్ర నాయకుల సమస్యలు పరిష్కరించటానికి ఆంటోనీ కమిటీ వేసాం - అన్నీ చెప్పుకోండి అంటూ మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే సమస్యలు సీమాంధ్ర నాయకులకే ఉన్నాయా? ప్రజలకి లేవా?   వారు కొత్తగా చెప్ప బోయేదేమిటి?  అసలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారి సమస్యలు/అభిప్రాయాలు కూలంకషంగా సేకరించి, క్రోడీకరించి, విశ్లేషించి సమగ్రమైన నివేదిక ఇచ్చిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక చేతిలో వుండగా మళ్ళీ ఈ అంటోనీ కమిటీ ఉద్ధరించ బోయేదేమిటి? ఈ కమిటీలు, రోడ్ మ్యాపుల నాటకాలతో ప్రజలు విసుగెత్తి పోయి వున్నారు. కేంద్ర ప్రభుత్వం పంతాలకి పోకుండా తక్షణం శ్రీ కృష్ణ కమిటీ నివేదిక బూజు దులిపి పార్లమెంటులో చర్చకు ప్రవేశ పెట్టాలి. అర్ధవంతమైన చర్చల ద్వారా శ్రీకృష్ణుడు చూపిన ఆరు పరిష్కారాలలో ఒక దానిని ఎన్నుకొని ఈ సమస్యకి మంగళం పాడాలి. లేని పక్షంలో ఈ అడ్డగోలు విభజన ప్రతిపాదనతో కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమె గాక దేశ వ్యాప్తంగా ఎగసిన వేర్పాటు వాద ఉద్యమ జ్వాలలలో కాంగ్రెస్ పార్టీ మసి కావటం ఖాయం.

9 comments:

  1. ఇప్పొడొచ్చిన నష్టమేమీలేదు, ఈ మాత్రం నిబద్దత చూపిస్తే కొత్త రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు

    - ఇంకో ఆకాశరామన్న

    ReplyDelete
  2. కొత్త రాష్ట్రం వస్తే రెండు ప్రాంతాల సామాన్య ప్రజలకి ప్రత్యేకంగా వొరిగేదేమీ లెదు. కేవలం రాజకీయ నిరుద్యోగులకి పదవులు రావటమే జరుగుతుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయటానికి అయ్యే ఖర్చుని ప్రస్తుత రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తే అది నిబద్ధత అనిపించుకుంటుంది. అంతే కానీ సెంటిమెంటు వుందని విభజనలు చేస్తూ పోవటం సమస్యకి పరిష్కారం కానే కాదు.

    ReplyDelete
    Replies
    1. hear hear spend the money on the development, o! foolish politicians

      Delete
  3. "రాజధానిని హైజాక్ చేస్తూ తల్లి రాష్ట్రాన్నే తన్ని తగలేసే పోకడకి కాంగ్రెస్ పార్టీ తెగబడింది"

    "అంతే గాక అప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలే మరో చోట రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి."

    ఈ ఉదాహరణలు చూసాక మళ్ళీ చెప్పండి: Nagpur (MP), Shillong (Assam), Lahore (Punjab) & Simla (post-independence Punjab).

    "సమ న్యాయం పాటిస్తూ అదే సమయంలో నదీ జలాలు/ఆదాయ వనరుల పంపిణీ, కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు వంటివి ముందుగా నిర్ణయించి అప్పుడు విభజన తలపెట్టాలి."

    నదీజలాల పంపిణీకి ట్రిబ్యూనల్ వేయాలి. విభజన తరువాత రాష్ట్రం ఫిర్యాదు చేస్తే ట్రిబ్యూనల్ వేస్తారు. ఇంకా ఏర్పడని రాష్టంపై ఫిరియాదు చేసే హక్కు చట్టం ప్రకారం లేదు.

    కొత్త రాజధాని తేల్చాల్సిందే. ఈ విషయంలో ఆంద్ర సీమ ప్రాంత నాయకులు ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుంది. 1953-56 మధ్యలో కర్నూల్ బెజవాడ మధ్య జరిగిన గొడవలు పునరావృత్తం కాకుండా చూసుకుంటే మంచిది.

    "మళ్ళీ ఈ అంటోనీ కమిటీ ఉద్ధరించ బోయేదేమిటి?"

    ఆస్తులు, అప్పులు, నియామకాల వాటాలకు బిల్లుతో సంబంధం లేదు. శ్రీకృష్ణ కమిటీ పంపకాల గురించి కాదు. అంటోనీ పంపకాల గురించి ఇరు రాష్ట్రాల నాయకులతో చర్చిస్తుంది. గత అరవై ఏళ్లుగా ఈ పంపకాల ప్రక్రియ గురించి బోలెడు అనుభవం ఉంది. ఆ అనుభవం ఇప్పుడు అంటోనీ గారికి పనికొస్తుంది

    "శ్రీకృష్ణుడు చూపిన ఆరు పరిష్కారాలలో ఒక దానిని ఎన్నుకొని ఈ సమస్యకి మంగళం పాడాలి."
    Option 5 has just been decided.

    ReplyDelete
    Replies
    1. Option 5 has just been decided. అవునా!?
      Option 5 ఏమి చెప్పింది?

      "నిశితంగా పరిశీలించిన అనంతరం ఈ సూచన పూర్తి ఆచరణ యోగ్యమైనది కాదని కమిటీ భావిస్తోంది. అయితే ఇది రెండవ ఉత్తమ సూచన. విధిలేని పరిస్థితుల్లో మాత్రమె మూడు ప్రాంతాల సంపూర్ణ అంగీకారంతో ఈ సూచనను అమలు చేయవచ్చు."

      "రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టటం ఆంధ్ర ప్రదేశ్ వెలుపల కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. రాష్ట్రాల విభజన ఇది మొదటి సారి కాక పోయినా, ఒకే భాష కింద ఏర్పడ్డ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడం కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలనుండి చిక్కులని తెప్పించ వచ్చు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వాళ్ళ సమన్వయం యాజమాన్య నిర్వహణ వంటి సమస్యలు తలెత్తుతాయి."

      కానీ ఏమి జరిగింది? అంగీకారం కాదు కదా, అభిప్రాయాలకి సైతం విలువనివ్వకుండా కేవలం రాజకీయ సమీకరణాలు దృష్టిలో వుంచుకొని అడ్డగోలు విభజన ప్రతిపాదన జరిగింది.

      ఒకటి మాత్రం నిజం. సీమాంధ్ర నాయకుల చేతకాని తనం వల్ల తెలుగు వారిపై తెలంగాణా బలవంతంగా రుద్దబడింది. ముఖ్యంగా రాజధాని విషయంలో సీమాంధ్రుల గుండె రగులుతోంది. దాని తదనంతర పరిణామాలు (రాష్ట్రం లోపల-బయట) కూడా శ్రీ కృష్ణ కమిటీ నివేదికలో ప్రస్తావించినట్లుగానే అక్షరం పొల్లు పోకుండా జరుగుతున్నాయి. ఇంతటి సాధికార నివేదికని తుంగలో తొక్కి చిత్తం వచ్చినట్లు విభజన ప్రతిపాదించటం కేంద్రం అహంకారానికి నిదర్శనం. ఇల్లలుకగానే పండుగ కాదు.

      Delete
  4. banned congress party 20 years in seemaandhra

    ReplyDelete
  5. Oke bhaasha naa.. naaku navvu vasthundi. TG SA lu okela anipinche rendu veru veru bhaashalu . 1956 lo jarigina mosam ide . Ledante TG matlaade okka padaaniki ayina SA vaallaki ardham theliyadu. TG vaallaki SA vaala bhaashani ruddi ruddi neripinchaaru .. TG lo vaalla bhaasha vaallu matlaadithe SA vaallaki navvulaata .. adento raa adedo bhaasha matlaaduthunnadu ( EG yasa) lo anukuntaru .. malli manadi same laguage antaaru.

    Nijam ippatiki ayina oppukoni vidipothe rendu pranthaalu baagu padavacchu .. SA ki manchi package thecchukoni .. rendu state lu marintha strong ga avvavocchu .

    Vidipoyaaka asthullu thagalesukovadam , pagala kottukovadam anavasaram .. think about future and complete the bifurcation quickly so that we can see a quicker new beginning ..towards the glory .

    Abaddham lo brathakatam ippatikyna maneddham .. haayiga Ilaath kaayalu thintu future gurinchi plan chesukunte baaguntadi .

    ReplyDelete
    Replies
    1. యాసలు వేరుగా వున్నత మాత్రాన మాది వేరే భాష అనటం ఒంటెత్తు పోకడని సూచిస్తుంది. అటువంటి ఒంటెత్తు పోకడలు గల నాయకుల సారధ్యంలోనే ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం తప్పుదోవ పట్టింది. తెలుగు జాతి చేసుకున్న ఖర్మ ఏమిటంటే తండ్రిలా చూడవలసిన కేంద్రం రాజకీయ సమీకరణాలు లెక్క వేసుకొని సీమాన్ధ్రకు ద్రోహం తలపెట్టింది. ఇప్పుడు పోరాడ వలసినది తెలంగాణాకి వ్యతిరేకంగా కాదు... అహంకార పూరితంగా వున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మీద..

      Delete
  6. nijaniki meeru poradavalasindi mee ahamkaram meda.

    ReplyDelete