Monday, August 26, 2013

న్యాయ వాదుల అన్యాయ వాదం !

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకై ప్రకటన జరిగింది.  అవును.. కేవలం ప్రకటన మాత్రమె జరిగింది ... అదీ ఇన్నాళ్ళూ మౌనంగా వున్న కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని తెలిపింది. అంతే తప్ప ఇంకేం జరగలెదు.   రాష్ట్రం ఏర్పడటానికి అవసరమైన రాజ్యాంగ ప్రక్రియ ఇంకా చాలా వుంది.  కానీ తెలబాన్ల దాష్టీకం  అప్పుడే మొదలై  పోయింది.    ముఖ్య మంత్రిని టిఫిన్ సెంటర్ పెట్టుకోమనే వారొకరు.. హైదరాబాద్ గురించి మాట్లాడితే నాలుక  చీరేస్తామనే వారు ఇంకొకరు !    ఇప్పుడు తాజాగా న్యాయవాదుల వంతు !  హైదరాబాదు లోని ఏపీ ఎన్జీవో హొమ్ లో  సీమాంధ్ర  న్యాయవాదులు సమావేశం జరుపుకుంటూ వుంటే  అక్కడికి  వచ్చి తెలంగాణా  న్యాయవాదులు రెచ్చగొడుతున్నా రంటూ రభస  సృష్టించటం  అవివేకం.  నాలుగు గోడల మధ్య జరుపుకొనే సమావేశం రెచ్చగొట్టటం ఎలా అవుతుందో విజ్ఞులైన న్యాయ కోవిదులకే తెలియాలి.     రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాదు నగరం పై సర్వ హక్కులు తమకే వున్నట్లు చెలరేగుతున్న తెలబాన్ గుంపులు కొత్త రాష్ట్రం ఏర్పడితే ఎలా పెట్రేగుటారో అన్న దానికి  సంకేతాలు ఇవన్నీ!     అసలే  తమ భద్రత గురించి ఆందోళన లో ఉన్న సీమాంధ్రులకు తగిన భరొసా కల్పించకుండా విభజనకి సహకరించాలంటూ ఫత్వాలు జారీ చేయటం తెలబాన్లకే చెల్లింది.   ఒక రాష్ట్ర విభజన జరగటం అంటే మ్యాపు మధ్యలో గీత గీసినంత తేలిక కాదు .  అన్ని ప్రాంతాల పరస్పర అంగీకారం లేకుండా కేవలం ఒక రాజకీయ పార్టీ స్వంత ప్రయోజనాల కోసం ప్రతిపాదించిన విభజన ప్రక్రియ సజావుగా ముందుకు సాగటం కల్లే! 

17 comments:

  1. @ ముఖ్య మంత్రిని టిఫిన్ సెంటర్ పెట్టుకోమనే వారొకరు...

    అయ్యా!!ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దోచుకు తినేది...రాజకీయ నాయకులే...ఆ తిన్నా, మా తెలంగాణా నాయకులేగా పర్వాలే అంటారు...మన సొదరులు...
    సామాన్యుడికి జీవితం ఎప్పుడూ దుర్బరమే!!ఇలా రాష్ట్రాలు..తర్వాత జిల్లాలు కూడా విభజన తప్పదు...ఎందు కంటే ఇక్కడి మా మూడు జిల్లాల్లో...ఇళ్లూ...భూములూ కొంటున్నది...పై జిల్లాల నుండి వచ్చిన వారే!!ఇంకో పదేళ్ళు పోతే మేమూ...ప్రత్యేక రాష్ట్రం కావాలని గొడవ మొదలెడతాం..మా భూములూ...ఉద్యోగాలు దొబ్బేసారని ఉద్యమం చేస్తాం...ఏం పీక్కుంటారో పీక్కోండి...నేనూ ఓ పార్టీ పెట్టి జనాన్ని పోగు చేయగలను!!నాకూ మాంచి పదవులు పొందాలని ఉంది మరి!మావి ఎవడో దొబ్బేస్తుంటే చూస్తూ కూర్చున్న మా నాయకులవి,మేము ఏమీ పీకలేం!!ప్రపంచమంతా ఒక్కటయి పోతుందని వచ్చినోళ్ళని మాత్రమ్ దొబ్బి.దొబ్బి వదలగలం!కబడ్దార్!!!

    ReplyDelete
    Replies
    1. what is ur problem? clear ga ledu.

      Delete
    2. @kvsv

      ని భాద చూస్తుంటే బలే మజాగా ఉంది :)

      Delete
  2. Antha nonsense. mee apoha. mukyamantri ni inthakumundu chala mandi thitaru. kcr kuda thitadu. adi rajakiyam. tappu ledu. meru mee media ni matrame chusi mosa potunaru. Rechagotti elagaina godavalu srushtidamani chustunnadi andhra ngo le.

    ReplyDelete
    Replies
    1. సమ్మె చేయటం , నిరసనలు తెలపటం అన్నది ప్రాధమిక హక్కు. ఆ హక్కుని తెలంగాణా ప్రాంత ఉద్యోగులు వినియోగించుకున్న సమయంలో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు సహకరించి తమ హుందా తనాన్ని తెలియజెప్పారు. మరి ఇప్పుడు నిరసనలు తెలియ జేయాల్సిన అవసరం సీమాంధ్ర ఉద్యోగులకి వచ్చింది. కానీ వారి నిరసన కార్యక్రమాలకి అడుగు అడుగునా అడ్డు తగులుతూ, పోటీ కార్యక్రమాలు చేస్తూ గలాటా సృష్టిస్తూ రెచ్చగొడుతోంది ఎవరో కనపడుతూనే వుంది .

      Delete
    2. నా పక్కోడు వానికి ఇష్టం లేకపోయినా నాతోనే కలసి ఉండాలి అని తలకాయ లేని సమ్మెలు, నిరసనలు చేస్తే తెలంగాణా వాళ్ళు కాబట్టి ఒర్చుకుంటున్నారు, వేరే వాళ్ళయితే ఈ పాటికి తన్ని తరిమేసే వారు. మీ లాంటి వాళ్లకు కెసిఆర్ కరెక్ట్.

      Delete
    3. ఇష్టం లేక పోవటం అన్న దానికి ఒక ప్రాతిపదిక అన్నది వుండాలి . ఉమ్మడిగా వున్న ఆస్తిని కాజేయాలని చూస్తూ - నాకు ఇష్టం లేదు బైటకు పో అంటే కుదురుతుందా ? కావాలనుకుంటే ఇష్టం లేని వారే బైటకి వెళ్లి ఆస్తులు సంపాదించుకొని అభివృద్ది చెందితే అందరికీ సంతోషం .

      Delete
    4. ఉమ్మడిదా? వచ్చేటప్పుడు నువ్వేమయినా హైదరాబాదు వెంట బెట్టుకు వచ్చావా? మాద్రాసులో తంతే ఇక్కడ పడ్డావు,బయటకు నడవాల్సింది నువ్వే, అదే దేశమంతా కూడా చెపుతుంది. రాజధాని లేక గుడారాలలో ఉన్నాం బాబో రక్షించండి అంటే సరే పాపం అని మా హైదరాబాదును మీతో ఉచితంగా పంచుకోవడానికి ఒప్పుకున్నాం, రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి మేము హైదరాబాడునిస్తే మీరు మీ అప్పులను వెంట బెట్టుకు వచ్చారు.

      ఉమ్మడిది అయితే దైర్యంగా మీకు హైదరాబాదు కావాలని అడగండి, లేదా చేతనయితే అందులో వాటా అడగండి, అంతే కాని అటూ'ఇటు కాని వాళ్ళలా మేము లేకపోతె మీరు బతకలేరు అన్నట్లు మమ్మల్ని మీతో కలసి ఉండమని బలవంతం ఏంటి? రోషం ఉన్నవాడు వాని సొంత రాజధాని నిర్మించుకొని చూపించుకోవాలి, పక్కొని రాజదాని మిద కన్ను వెయ్యటం కాదు, ఆ నాడు మద్రాసు మీదే అన్నారు, అదే పద్దతిలో ఈ రోజు హైదరాబాదు మీదే అంటున్నారు, అప్పుడు తన్నించుకొని మద్రాసు నుండి వెల్ల గొట్టించుకున్నారు, చూస్తుంటే ఇప్పుడు కూడా అదే పరిస్తితి, పాపం.

      Delete
    5. ఖచ్చితంగా ఉమ్మడి దే ! ఇందులో ఎవరూ ఎవరికీ ఇచ్చింది లేదు. పక్కోడి రాజధాని అంటూ ప్రత్యేకంగా ఏమీ లెదు. హైదరాబాదు అన్నది తెలుగు వారందరి సొత్తు. వాటా సంగతి కూడా మాట్లాడటం అనవసరం. హైదరాబాదు మీది, మాది మన తెలుగు వారందరిది. మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు దీక్ష చేసి అమరుడైన మాట వాస్తవం. అయితే అప్పుడు ఇదే కాంగ్రెస్ కుయుక్తుల వల్ల తెలుగు వారు మద్రాసుని వదులుకోవలసి వచ్చింది. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అన్న హోదాలో అభివృద్ది చెందిన హైదరాబాదుని ఈ రోజు ఎ ఒక్క ప్రాంతానికో పరిమితం చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లెదు. కొత్త రాష్ట్రం కావాలనుకునే వారే కొత్త రాజధాని ని వెతుక్కోవాలి తప్ప ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధాని ని తేరగా కొట్టేద్దామన్న దురాశ ఫలించదు. సీమాన్ధ్రులు మరోసారి మోస పోవటానికి సిద్ధంగా లెరు. అయినా ఇక్కడ వంటకి ఏర్పాట్లు కూడా చేయకుండా విస్తరి పరిచేసింది కాంగ్రెస్ ! లొట్టలు వేసుకుంటూ కూర్చోవటమే తెలంగాణకి మిగిలేది !

      Delete
    6. ఖచ్చితంగా ఉమ్మడిదే అనుకుంటే అలాగే అనుకో, హైదరాబాదు కోసం ఇష్టం వచ్చినన్ని రోజులు ఉద్యమాలు చేసుకో ఎవరొద్దన్నారు? కాని మద్యలో ఈ సమైక్యం ఏంటి అసహ్యంగా ? ఓ ... అర్థం అయ్యిందిహైదరాబాదు మాకు కావాలి అని ఉద్యమిస్తే దేశం అంత ఉమ్మేస్తుంది అనా భయం ?? I see.

      రాష్ట్రము ఏర్పడినప్పటి ఒప్పందాలు సదవలేదేమో, ఒక సారి సదవండి. హైదరాబాదు తెలంగాణా లో అంతర్భాగం, అందులో వచ్చే ఆదాయం అంతా తెలంగాణకే చెందుతుంది అని రాసిన ఒప్పందంలో మీ నాయకులు చాలా చక్కగా సంతకం చేసారు, ఈ ఒప్పందాన్ని తిరగ దొడి హైదరాబాదులో దొబ్బెసిన డబ్బు వసూలు చేస్తే మీకు గోచి కూడా మిగలదు. పోనీ పాపం అని ఓదిలేసాం, మీ రాష్ట్రం వెళ్ళిపోయి బతికేయ్యండి

      Delete
    7. రాజధాని కొచ్చే ఆదాయాన్ని తమ ప్రాంత ఆదాయంగా పరిగణించటం వాపుని చూసి బలుపు అని భ్రమించటమే.. అసలు ఇన్నాళ్ళూ ఇలాగే వాస్తవాల వక్రీకరణ జరిగి వేర్పాటు వాదం వేళ్ళూనుకుంది. కర్నూలు రాజధానిగా కొనసాగి వుంటే ఈ అభివృద్ది , ఆదాయం ఆ ప్రాంతానికే వచ్చెది.. ఇక హైదరాబాదు మాకు కావాలి అని ఉద్యమించాల్సిన పని లెదు. ఆ నగరం తెలుగు వారందరిదీ.. ఆ హక్కుని కోల్పోకూడదనే ఉద్యమం నడుస్తోంది కానీ ఆ నగరం పై పెత్తనం కోసం ఎవరూ ఉద్యమించటం లెదు.

      Delete
    8. అవును మరి, హైదరాబాదు ఆదాయం తెలంగానదే అని వాళ్ళే ప్రతిపాదించి సంతకాలు చేసిన మీ నాయకులు వాస్తవాల వక్రీకరణ చేతనే మీరు హైదరాబాదు మాదే అనుకునేంతకు వచ్చారు, పలితం అనుభవిస్తున్నారు.

      హైదరాబాదు ను మిరోచ్చి చేసింది ఏమి లేదు, అప్పుడు దేశంలో అయిదవ స్తానమె ఇప్పుడు అదే స్తానం, అదే కాక హైదరాబాదు చుట్టుపక్కల సెంటు ప్రభుత్వ భూమి లేకుండా అమ్ముక తిన్నారు.

      కర్నూలు రాజదాని అని మిరే అనుకోని ఉంటె మాకు ఈ దరిద్రం ఉండేది కాదు, అది చేత కాకనే ఇక్కడికి వచ్చిండ్రు అనేది మొదటి SRC సదివితే మీకే అర్థం అవుతుంది , కాని చరిత్ర సదివి నిజాలు తెల్సుకునే మంచి ఆలోచన దుర్బుద్దులకు ఎలా వస్తుందిలే,

      నగరం కోల్పోవటం ఇష్టం లేకపోతె నగరం కోసం ఉద్యమం చెయ్యండి అంతే కాని మీరు చెయ్యాల్సిన ఉద్యమం సమైక్యం కాదు/

      విషయం మీకు, మాకు మరియు దేశ ప్రజలకు బాగా తెలుసు , సమైక్యం వదిలి హైదరాబాదు కోసం ఉద్యమం చేస్తే అందరు ఉమ్మేస్తారని .. అందుకే చెయ్యరు. చేతకాని దాని గురించి వాదన అనవసరం.

      Delete
    9. ప్రస్తుత వాస్తవాలనే కాదు చరిత్రని కూడా వక్రీకరించటమే వేర్పాటు వాదులు చేస్తోంది !

      1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించే వాటికి తెలంగాణ రాష్ట్రం అంటూ ఏదీ లేదు.
      ఉన్నదల్లా హైదరాబాద్ స్టేటు. పూర్వం నిజాం నిరంకుశాధిపత్యంలో ఉండేది. పోలీసు యాక్షను తరవాత పౌర ప్రభుత్వం కిందికి వచ్చింది. ఆ స్టేటులో తెలంగాణ, మరాఠ్వాడ, కర్నాటక అనే మూడు ప్రాంతాలుండేవి. వాటిలో మరాఠ్వాడాను మహారాష్టల్రోనూ, కన్నడ ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలోనూ కలిపివేయాలని, తెలంగాణ మాత్రం ఐదేళ్లపాటు ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని, ఐదేళ్ల తరవాత అది కోరుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కలిసి పోనివ్వాలని జస్టిస్ ఫజలాలీ నేతృత్వంలోని మొదటి ఎస్సార్సీ చెప్పింది.
      ఆ ప్రకారం జరిగి ఉంటే - హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేది... ఐదేళ్ల తరవాత - ఎస్సార్సీ నిర్దేశించినట్టు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండు వంతుల సభ్యులు సమ్మతి తెలిపితే ఆంధ్ర రాష్ట్రంలో అది విలీనమై ఉండేది. భారత రిపబ్లిక్‌లో సమాన ప్రతిపత్తి, రాజ్యాంగ ప్రతిపత్తిగల రెండు రాష్ట్రాలు ఐచ్ఛికంగా విలీనమయ్యే అపూర్వ, అసాధారణ సందర్భంలో విలీనానికి షరతులను, మునుముందు తన హక్కులకు చిక్కు రాకుండా అవసరమైన రక్షణలను, ఒకవేళ విలీనం రద్దు చేసుకోదలచుకుంటే అందుకు అవసరమయ్యే ప్రొవిజన్లను సమాన ఫాయాలో ముందే మాట్లాడుకుని... విలీన చట్టంలోనో, చట్టబద్ధమైన ఒడంబడికలోనో వాటిని పొందుపరచుకోవటానికి వీలయ్యేది. ఆ విధంగా విలీనం జరిగి ఉంటే ఇవాళ హైదరాబాదు మీద సకల హక్కులనూ తెలంగాణ మాత్రమే క్లెయిము చేయగలిగేది.
      కాని - 1956కు పూర్వపు పరిస్థితి వేరు. అప్పుడు తెలంగాణ విచ్ఛిన్నమవబోతున్న హైదరాబాద్ రాష్ట్రంలోని ఒక భాగం! చట్టపరమైన అస్తిత్వం ప్రత్యేకంగా లేని ఒక ప్రాంతం. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనానికి ప్రాతిపదిక 1955 నవంబర్ 28న హైదరాబాద్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రతిపాదించిన తీర్మానం. ఎస్.ఆర్.సి. నివేదికను జాగ్రత్తగా పరిశీలించిన మీదట హైదరాబాదు ప్రస్తుత రాష్ట్రాన్ని విడగొట్టటాన్ని శాసనసభ స్వాగతిస్తున్నదని, తెలుగు మాట్లాడే ప్రజలున్న హైదరాబాదు రాష్ట్ర ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రానికీ... మరాఠీ మాట్లాడే ప్రజలున్న హైదరాబాదు రాష్ట్ర ప్రాంతాన్ని మహారాష్టక్రు... కన్నడ మాట్లాడే ప్రాంతాలను కొత్తగా ఏర్పడే కర్నాటకలోనూ విలీనం చేయాలనీ మాత్రమే అందులో ప్రతిపాదించారు. ఆంథ్ర అనే ఎగ్జిస్టింగ్ స్టేట్‌లో తెలంగాణ అనే ప్రాంతం బేషరతుగా విలీనమై, ఆంధ్రప్రదేశ్ అనే విశాల రాష్ట్రంలో అంతర్భాగమై, సదరు విశాల రాష్ట్రానికి హైదరాబాద్ అనే నగరం రాజధానిగా ఏర్పడినప్పుడు- అరవై ఏళ్ల తరవాత సదరు తెలంగాణ ప్రాంతానికి మనసు విరిగి విశాల రాష్ట్రంతో తెగతెంపులు చేసుకుని ప్రత్యేక రాష్ట్రంగా మనదలచితే- హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంతంలోనిది కనుక, దాన్ని తనకు వదిలిపెట్టి ‘‘ఎగ్జిస్టింగ్ స్టేటు’’ తన రాజధానిని ఖాళీ చేసి, పదేళ్లలో తట్టాబుట్టా సర్దుకుని పోవాలని తెలంగాణ వాదించటం న్యాయబద్ధమేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదే శాశ్వత రాజధాని అన్న భరోసాతో ఆ రాష్ట్రంలోని దశదిశల నుంచీ లక్షల కుటుంబాలు వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడి, విశాల రాష్ట్ర ప్రజలందరికీ అది గుండెకాయలా అభివృద్ధి చెందాక - హైదరాబాద్ నగరం పూర్తిగా తెలంగాణకు మాత్రమే హక్కు భుక్తమని, అక్కడే ఉండిపోదలిస్తే ముఖ్యమంత్రి అంతటి వాడైనా కర్రీ పాయింట్లు పెట్టుకుని బతకాల్సిందేనని తెలంగాణ నాయకులు వాదించటం సమంజసమేనా?
      Source:
      http://andhrabhoomi.net/content/telugu-tagavu-8

      Delete
    10. అబద్దాలకు అలవాటు పడిన వాళ్లకు ఎంత చెప్పి ఎం లాబం?

      తెలంగాణ రాష్ట్రం ఉందని ఎవ్వరు అనటం లేదు కాని తెలంగాణా ప్రాంతం అంటూ ఒకటి ఉందనే అంటున్నారు. ఏంటి తెలంగాణా ప్రాంతానికి చట్ట బద్దత లేదా? మరి 'పెద్ద మనుషుల' ఒప్పందం ఎవ్వనితో చేసుకున్నరు మీరు? హర్యానా తోనా? తెలంగాణా ప్రాంతం, ఆంద్ర రాష్ట్రం తో బేషరత్తు విలనం అంట, అంత కన్నా అబద్దం ఏముంది? 'సమైక్యం' అనే పదానికి ఆల్రెడీ నిఘంటువు మీనింగ్ మార్చేసారు, ఇప్పుడు 'బెశరత్తు'కు కూడా అర్థం మార్చేసే పనిలో ఉన్నారన్న మాట, వెరీ గుడ్.

      తెలంగాణా బేషరత్తుగా ఆంధ్ర రాష్ట్రంతో కలిస్తే పెద్ద మనుషుల ఒప్పందం తమిళనాడు కర్నాటక మద్య జరిగిందా? హైదరాబాదు రాష్ట్రం లో విలీనం కు సంబందించిన ప్రతిపాదన మీద చర్చ మాత్రమె జరిగింది, ఓటింగ్ జరగనే లేదు, జరిగిందని మీరు చేసిన అబద్దపు ప్రచారం దేశం అంతా చూసిందే. ఇక ఆంద్ర రాష్ట్రం విషయంకు వస్తే తెలంగాణా నిధులు, ఉద్యోగాలు, వనరులు ముట్టుకోనే ముట్టుకోము అని ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ లో ఏకాభిప్రాయంతో తీర్మానం పాస్ చేసింది మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది.

      ఇక ఆ పెద్ద మనుషుల ఒప్పందం చూస్తే, అదంతా తెలంగాణా హక్కుల గురించే చెపుతుంది కాని, సిమండ్రుల హక్కుల గురించే చెప్పనే చెప్పాడు. ఎవడయినా ఒప్పందం చేసుకుంటే రెండు పక్కల హక్కుల గురించి రాసుకుంటారు, కాని ఆ ఏక పక్ష ఒప్పందం ప్రతిపాదించింది సిమాంద్రులే, సంతకాలు పెట్టింది సిమంద్రనే. దానిని బట్టే అర్థం చేసుకోవచ్చు తెలంగాణతో కలసి హైదరాబాదు ఆక్రమించాలని ఎంత తహ తహ లాడారో, చేసినదానికి ఇప్పుడు అనుభవిస్తున్నరు.

      కన్నడ, మరాట ప్రాంతాలు వదిలి హైదరాబాదు రాజధానిగా కలిగిన హైదరాబాదు రాష్ట్రం ఆ రాష్ట్రాన్ని రద్దు చేసుకొని, అప్పటికే ఉన్న ఆంధ్ర రాష్ట్రం కూడా తమ రాష్ట్రాన్ని రద్దు చేసుకొని రెండు కలసి ఒక కొన్ని ఒప్పందాల మీద ఆంధ్ర ప్రదేశ్ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఇంకా చెప్పాలంటే మేము మా రాజధాని అంతకు ముందు, ఆ తరువాత అక్కడే ఉంది, మీరే అయిదేళ్ళలో మూడు రాజధానులు మార్చారు. ఎప్పుడయితే ఒప్పందాలు అమలు కాలేదో అప్పుడే ప్రాంతాల విలీనం కూడా రద్దు కావలసిందే. హైదరాబాదు మీరు తీసుకొస్తే మీరే తీసుకెల్లండి ఒద్దనం. తెలంగాణా నిధులు సిమాన్ద్రలో, సిమాంద్ర నిధులు తెలంగాణాల ఖర్చు చెయ్యవద్దని ఒప్పందాలు చెపుతున్నాయి. అంటే ఆ ప్రకారం సిమంద్ర తెలంగాణాలో, అందులోను హైదరాబాదులో ఖర్చు పెట్టి ఉంటె అది చట్ట వ్యతిరేకం. అయినా పిచ్చి కాని ఉద్యోగుల జితాలకే అడుక్కునే స్తాయిలో ఉన్న సిమాంద్ర ప్రాంతం(అది మీ నాయకులు చెప్పిందే) తమ నిధులను తెలంగాణాలో ఖర్చు చేసిందంటే ఎవరు నమ్ముతారు? తెలంగాణా నిధులే సిమంద్రలో చట్ట వ్యతిరేకంగా ఖర్చు పెట్టిండ్రని భార్గవ కమిషన్ ఎప్పుడో చెప్పింది మీరు దొంగలని. అది చరిత్ర చెప్పే నిజం.

      ఎవ్వడిని హైదరాబాదు నుండి పోమ్మనటం లేదు, ఉండాలనిపించినోల్లు చెన్నై లో , బెంగుళూరులో ఎంట్లున్తున్నారో హైదరాబాదులో కూడా అట్లనే ఉండొచ్చు. అంతే.

      లేదు హైదరాబాదు లో భాగం కావాలంటే నీకు ఓపిక ఉన్నంత వరకు కొట్లాడు, కాదన. కాని 'సమైక్యం', 'గిమైక్యం' అంటే ..... తెల్సు కదా. ఎంత అరచి గిపెట్టినా సమైక్యం లేదా హైదరాబాదులో భాగం కాని పని కాని ... మీ హక్కుల గురించి కొట్లాడితే ఏమయినా పలితం ఉంటుంది, లేదనే ఒక్క సారి పార్లమెంటులో బిల్లు అయిపోయినాక మీరు తల కిందులుగా తపస్సు చేసినా మిమ్మల్ని దేకేటోడు ఉండడు. ఆ జగన్ మిగిలిన సిమంద్రను ఆసాంతం నాకేస్తాడు.

      Delete
    11. మళ్ళీ చరిత్రకి వక్రీకరణే ! పెద్దమనుషుల ఒప్పందమని గొంతు చించుకుంటున్న మీకు ఆ ఒప్పందం గురించి అసలు తెలుసా ?

      దేశం మొత్తంమీద రాష్ట్రాలను ఎలా పునర్విభజించదగునో సూచించటానికి స్వతంత్ర భారత ప్రభుత్వం జస్టిస్ ఫజలాలీ అధ్యక్షతన ఒక కమిషన్‌ను వేసింది. హైదరాబాద్ స్టేట్‌లోని మరఠ్వాడాను మహారాష్టల్రోనూ, కన్నడ జిల్లాలను మైసూరులోనూ కలిపివేయాలని ఎస్సార్సీ చెప్పింది. అదే ప్రకారం తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయటం అభిలషణీయమే అయినా ఆ విషయంలో తెలంగాణ వారికి కొన్ని అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నందున ఐదేళ్లపాటు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని, తదుపరి ఎన్నికల తరవాత ఆ రాష్ట్ర అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మంది శాసనసభ్యులు కోరుకుంటే దాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చేయవచ్చని 1955 సెప్టెంబర్‌లో సిఫారసు చేసింది.
      ఐతే ఐదేళ్లదాకా ఆగకుండా- ఆంధ్ర రాష్ట్ర నాయకులూ, తెలంగాణ నాయకులూ ఢిల్లీ చొరవతో పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకుని అప్పటికప్పుడే విలీనం జరిపించారు. తెలంగాణ ఆంధ్రలో కలిసిపోయి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినది లగాయతు హైదరాబాద్‌కు సీమాంధ్రులు పెద్దసంఖ్యలో వచ్చి స్థిరపడ్డారు. ఆ రీతిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడటమే పెద్దమోసమని నేటి తెలంగాణవాదులు అంటారు. తెలివిమీరిన సీమాంధ్రులు తెలంగాణవారిని మాయజేసి మభ్యపెట్టి, బూటకపు పెద్దమనుషుల ఒప్పందంతో వంచించి, తెలంగాణలోకి చొరబడ్డారని, ఎడాపెడా తెలంగాణను దోపిడి చేయసాగారని వారి ఆక్షేపణ. నిజానికి తెలంగాణ విలీనం అనేది ఢిల్లీలో ఇటు నలుగురు, అటు నలుగురు పెద్ద మనుషులు కూడబలుక్కుని ఒక ఒప్పందానికి వచ్చీ రాగానే జరిగిపోలేదు. ఆంధ్రలో కలవటం మంచిదా కాదా, దానివల్ల పర్యవసానాలేమిటి, ప్రయోజనాలేమిటి అన్నది హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు బహిరంగంగా, సాకల్యంగా చర్చించాకే విలీనం జరిగింది. కలవటం తెలంగాణకు మంచిదికాదని మొదట్లో వాదించిన హైదరాబాద్ ముఖ్యమంత్రికూడా తరవాత మనసు మార్చుకుని విలీనాన్ని గట్టిగా బలపరిచారు.
      Source: http://andhrabhoomi.net/content/telugu-tagavu-6

      చరిత్ర ఇంత స్పష్టంగా వుంటే ఎందుకీ వక్రీకరణ ? నిజంగానే తెలంగాణకి అన్యాయం జరిగితే ఆ ప్రాంతానికి ఉన్న వంద మంది శాసన సభ్యులు ఇన్నాళ్ళూ ఎం చేసారు ?
      ఇంక పార్లమెంటులో తెలంగాణా బిల్లు వస్తుందనే మీరు అనుకొంటున్నారా ? నేను పైన చెప్పినట్లు వంటకు అసలు ఏర్పాటే చేయకుండా విస్తరి పరిచేసింది కాంగ్రెస్! లొట్టలు వేసుకుంటూ ఎదురు చూడటమే తెలంగాణకి మిగిలేది ..

      Delete
  3. " ఆ జగన్ మిగిలిన సిమంద్రను ఆసాంతం నాకేస్తాడు "
    Munmundu emi jarigina jaragakapoina Anonymus garu cheppina Pi quotation maatram jarigi teerutundi. Ikkada Seemaandra prajalanta daani kosame eduru chustunnaru. 6 years valla naannato nakinchukundi inka chaalaledanta ikkadi janaliki.

    ReplyDelete
  4. HAHAHA Besharathu ga anta.:-) Meku evaru history chepindo kani ayanako dhandam.

    ReplyDelete