Wednesday, April 13, 2011

శభాష్ దీదీ!

బెంగాల్ విభజనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టారు. గోర్ఖాలాండ్ ఏర్పాటుకి తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకమని దీదీ స్పష్టం చేసారు.  ఎన్నికల ముంగిట్లో....అందులో ప్రతి పక్షంలో ఉంటూ కూడా విధాన నిర్ణయం ధైర్యంగా ప్రకటించటం అభినందించాల్సిన విషయం.

ఈ మాత్రం చేవ, తెగువ మన వాళ్లకి వుంటే తెలంగాణా సమస్య కోతి పుండు బ్రహ్మ రాక్షసిలా తయారయి వుండేది కాదు.  అంతే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కావలసినది ఏమిటో శ్రీ కృష్ణ కమిటీ అరటి పండు వలిచి ఇచ్చినట్లు విశదీకరించాక కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోకుండా మీన మేషాలు లెక్కిస్తున్న మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకి..ఎంత సేపూ స్వంత ఎజెండాలని అమలు చేసుకుంటూ పబ్బం గడుపుకోవడమే తప్ప సమస్య పరిష్కారానికి చిత్త శుద్ధి  చూపడం తెలియదన్నది స్పష్టమై పోయింది.

4 comments:

  1. mamatha could say that because the no. of assembly seats in darjeeling is only 4 out of 294in west bengal.more over it will work out to her advantage in the rest of districts because bengalee's are possessive about darjeeling hills(so sad).it is good for all of us if we apply our mind before saying something.

    ReplyDelete
  2. అన్ని ప్రత్యెక రాష్ట్రాల సమస్య ఒక్కటే, వాళ్ళకు రాజధాని చాలా దూరం. వాళ్ళకు పరిపాలన అందట లేదు. వాళ్ళందరికీ ఇవ్వలిసిందే.

    తెలంగాణా లో వెయ్యి రూపాయల బుక్కు కొనేవాడు హైదరాబాద్ లో వచ్చి కొనుక్కుంటాడు. ఈ ఒక్క కారణం చాలు తెలంగాణా ఇవ్వక పోవటానికి.

    ReplyDelete
  3. As per the linguistic states theory (on which andhera was formed) Gorkhaland should be a seperate state because their language is Nepali, not Bangla. Ofcourse, WB & Bangladesh should be one state because they have the same "talli" LOL!

    ReplyDelete