Thursday, April 14, 2011

కళ్ళు తెరిచిన ప్రభుత్వం!

ఇన్నాళ్ళకి రాష్ట్రంలో ప్రభుత్వం నేనున్నాను అంటూ అస్తిత్వం చూపింది.. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమంటే లెక్కే లేనట్లు ఇష్టానుసారం చెల రేగుతున్న వేర్పాటు వాద శక్తులకి ముకు తాడు వేసే దిశగా జీవో 177  విడుదల చేసింది. ఈ  జీవో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ వర్తిస్తుంది. అయినా కూడా దీని పై తెలబాన్ నాయకులు, తెలంగాణా ప్రాంత ఉద్యోగులు గుమ్మడి కాయ దొంగ బుజాలు తడుముకున్నట్లు రచ్చ చేస్తున్నారు.  అసలు ప్రభుత్వోద్యోగులందరికీ కాండక్టు రూల్సు, డిసిప్లినరీ రూల్సు అనేకం వుంటాయి. అవన్నీ సక్రమంగా అమలు జరిపితే  ఇలాంటి జీవో ఇవ్వాల్సిన అవసరమే వుండదు. అయినా కూడా ఇన్నాళ్ళు సహనం వహించిన ప్రభుత్వం ఇప్పటికైనా కొరడా ఝుళిపించడం అభినందనీయం.  రాజకీయ నాయకులు ఉద్యమాలు, ఆందోళనలు చేసారంటే అది వారి వ్యాపకం కాబట్టి ఆక్షేపించాల్సిన పని లేదు. అయితే తాము చేస్తున్న ఉద్యోగాలతో ఏ  మాత్రం సంబంధం లేని ఆందోళనల కోసం విధులు ఎగ్గోట్టేసి తేరగా ప్రజల సొమ్ము భోం చేద్దామనుకొనే ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్య సముచితమే. తెలబాన్  దొర  వెంటనే స్పందిస్తూ ఈ జీవో ఇవ్వడానికి తెలంగాణా మంత్రుల ఆమోదం ఉందా అంటూ రంధ్రాన్వేషణ  మొదలు పెట్టేసాడు! అంతే కాదు! తెలంగాణా మంత్రులంతా రాజీనామా చేయాలని హుకుం జారీ చేసేసాడు! నిజమే...తెలంగాణా మంత్రులే కాదు..తెలంగాణా ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కూడా (కోదండ రాం తో సహా) తమ తమ కొలువులకి రాజీనామాలు ఇచ్చేసి ఉద్యమంలో పాలు పంచుకుంటే ఎవరికీ ఏ విధమైన అభ్యంతరాలు ఉండబోవు. ప్రభుత్వానికి కూడా ఇలా కర్ర పట్టుకోవాల్సిన పని కూడా వుండదు.

5 comments:

  1. రామన్నా బాగా సెలెవిచ్చ్హావు. అంత విచక్షన వుంటె వారు తెలాబానులు ఎందుకు అవుతారు. ముఖ్యంగా కొదంద రాం తొ సహా అందరు రాజీనామ ఇవ్వాలి. ఇంకా ఎ మొహం పెత్తుకుని సర్కారి సొమ్ము తింటూ సర్కారు కి వ్యతిరీఖం గా పొరాడు తున్నడు. రాజ కీయ నాయకుల కన్న హీనం కదా. పౌరుషం వుంటె ఇప్పటికె రాజినామ చెయ్యాలి

    ReplyDelete
  2. పొరపాటు పడుతున్నారు. ఇది కేవలం కడప ఉపయెన్నిక ట్రిక్‌ మాత్రమే, కడపలో సమైక్య వాదుల మద్దత్తుకోసం. ఉపయెన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, సర్వే సత్తిబాబునో మధుయాష్కీ నో నిరాహార దీక్షక్కూర్చోపెట్టీ రద్దు చేస్తారు చూడండి.

    ReplyDelete
  3. కో-దందా రాం కేమి డోకాలేదు, నాలుగు సంబురాలు, ఎనిమిది వసూళ్ళుగా దందా సాగుతోందిగా!

    ReplyDelete
  4. @Anonymous: it is already put on hold, so much for your andhera pradesh Govt!

    ReplyDelete
  5. "తెలంగాణా ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కూడా (కోదండ రాం తో సహా) తమ తమ కొలువులకి రాజీనామాలు ఇచ్చేసి ఉద్యమంలో పాలు పంచుకుంటే ఎవరికీ ఏ విధమైన అభ్యంతరాలు ఉండబోవు"

    Did your tegulu employees, teachers etc. resign (or apply for leave) during the "udyamam" of Dec 10-23 (or in 1972)? Wahre andhera pradesh, tussi great ho LOL!

    ReplyDelete