Saturday, June 11, 2011

దళిత కార్డు దుర్వినియోగం కాకూడదు..

ఎంపీ నన్న అహంకారంతో విద్యుత్ శాఖ ఉద్యోగి పైన నోరు పారేసుకున్న సర్వే సత్య నారాయణ ఉద్యోగుల సంఘీభావానికి తోక ముడిచి క్షమాపణ చెప్పారు.  ప్రోటోకాల్ విషయమై తప్పు జరిగిందని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగి పై బూతుల పంచాంగం విప్పిన పార్లమెంటు సభ్యుడు,   ఆ శాఖ ఉద్యోగులు అందరూ  సంఘీభావంతో 
ఒక్కటిగా నిలబడటంతో దిక్కు తోచక కులం కార్డుని వెలికి తీసారు.  ఎస్.సి. ఎస్.టీ. చట్టం కింద కేసు పెడతాననీ, స్పీకర్ కి ఫిర్యాదు చేస్తాననీ పరి పరి విధాల బెదిరించారు. అయినా కూడా ఉద్యోగులు వెరవక పోవటంతో తప్పని సరై క్షమాపణలు చెప్పారు. ఎంపీ స్థానంలో ఉన్న వాడే ఉచితానుచితాలు గ్రహించకుండా స్వల్ప వివాదానికి సైతం దళిత కార్డుని వాడ బూనటం ఔచిత్యం అనిపించుకోదు.   ఎంపీ గారే కాదు. చాల మంది మన దేశంలో ఒక దళితుడిని తప్పు పడితే చాలు..అంబేద్కర్ ని అవమానించినంత హడావిడి చేస్తారు. పుట్టుక రీత్యా దళితుడైనంత మాత్రాన అన్ని తప్పులనించి ఇమ్యూనిటీ వున్నట్లు ప్రవర్తించటం మంచిది కాదు.  రాజ్యాంగం తమకి కల్పించిన వెసులుబాటుని తమ పురోభివృద్ధికై వాడుకోవాలి గానీ ఇలా దుర్వినియోగం చేయడం కూడదు.

5 comments:

  1. బాగా చెప్పారు. ఎస్సీ ఎస్టీలతో గొడవ పెట్టుకుంటే వాళ్లు మొదటగా బయటకు తీసే పాశుపతాస్త్రం SC ST atrocity act.

    ReplyDelete
  2. Well said
    This is how this stupid atrocity act is used, (not misused)
    They use it as "Trumph card" every stupid thing they do..
    They think they are above everything.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete