Sunday, June 19, 2011

లగడపాటి లెక్కలో తప్పేముంది?

దొంగ దీక్షలతో కేంద్రాన్ని ఏమార్చి 2009 డిసెంబరు తొమ్మిదిన తెలంగాణకి అనుకూలంగా ప్రకటన ఇచ్చిన నాడు, అందరికంటే ముందుగా అప్రమత్తమై రాష్ట్రాన్ని ముక్కలు గాకుండా కార్యాచరణకి దిగిన వాడు లగడపాటి రాజగోపాల్. ఆయన వ్యక్తిగతంగా వ్యాపారి కావచ్చు. ఆయన వ్యాపార ప్రయోజనాలు హైదరాబాదు లో విస్తరించి ఉండవచ్చు. అది వేరే విషయం. అయితే ఉత్తి పుణ్యానికే రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని జూసిన వేర్పాటు వాదుల కుట్రలు భగ్నం చేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమ నావకి చుక్కానిలా నిలిచిన రాజ గోపాల్ అంటే తెలబాన్లకి కంటగింపుగా వుండటం సహజమే. ఆనాటి నుంచి లగడపాటి ఏం మాట్లాడినా దుమ్మెత్తి పోయడం అన్నది తెలబాన్లకి అలవాటుగా మారింది.
తాజాగా-- రాష్ట్రంలో ఎన్నికలు వస్తే సమైక్య వాదులకి 240 ,వేర్పాటు వాదులకి 40 సీట్లు  వస్తాయి -- అన్న లగడపాటి ప్రకటన పై తెలబాన్ శ్రేణులు శాపనార్ధాలు పెట్టటం ప్రారంభించాయి.   తాను నిర్వహించిన సర్వే లో ఈ విషయం వెల్లడైందని రాజ గోపాల్ అంటున్నప్పుడు, చేతనైతే ఆ సర్వే అబద్ధమని నిరూపించాలి గానీ వ్యక్తిగత దూషణలకి దిగటం చేతకాని తనం.  రాష్ట్రాన్ని విభజిస్తే ఏర్పడే పరిణామాలు అంటూ రాజ గోపాల్ చెప్పినవి అన్నీ శ్రీ కృష్ణ కమిటీ 8 వ అధ్యాయంలో వున్నవే. లగడపాటి సొంత సర్వే లని పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్రంలోని పరిస్థితుల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమస్యకి తగిన పరిష్కారాలని సూచించి ఆరు నెలలు గడిచి పోయాయి.  ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించటం మాని, శ్రీ కృష్ణ కమిటీ సూచించిన ఆరవ అత్యుత్తమ పరిష్కారం అమలు పరిచే చర్యలు చేపట్టాలి. గోర్ఖాలాండ్ మాదిరిగానే రాష్ట్రంలో వెనుక బడ్డ తెలంగాణా, ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోని ప్రాంతాలకి ప్రత్యెక ప్యాకేజీలు ప్రకటించి వాటి సత్వర అభివృద్ధికి బాట వేయాలి. తద్వారా ఎటువంటి వేర్పాటు వాద ఉద్యమాలు భవిష్యత్తులో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

5 comments:

  1. ఈ జిల్లాల భౌగోళిక స్వరూపాన్ని ఎలాంటి మార్పూ లేకుండా 55 ఏళ్ళ నుంచి కొనసాగించడం వల్ల ఇవేవో పెర్మనెంట్ అనే మూర్ఖత్వంతో ఎక్కువ గొడవలు వస్తున్నాయి. ఒక ప్రాంతపు జిల్లాల్ని/ లేదా వటి భాగాల్ని ఇంకో ప్రాంతంలో కలిపేసి ఈ ప్రాంతాల సమగ్రతని చెడగొట్టాలి. అన్ని జిల్లాల రూపురేఖల్నీ గుర్తుపట్టలేని విధంగా మార్చేయాలి.

    ReplyDelete
  2. As a friend of ours said,The Districts being Geographically established for more than 55 years an therefore such problems are arising.If that is the case what is the condition of various countries established Geographically for more than 55 years ? Let Srilanka be merged with India....
    (Mr.Anonymous,This is not a trail to hurt you.I can understand the comment you made is a satire as the on which I made)

    ReplyDelete
  3. nee vishleshananta nee swardam to nindi vundi
    evadinyna nee intiki teesukeli o gadi icchi choodu... vadini mee intiki nuvvelu anu... vadu neenu vellanu... manamanta okkate annappudu neeku enta mandutundo choodu ... appudu telustundi pratyeka vadam goppatanam... bowgolikanga vidipote neelanti kuhana samykya vaadulaku emi nashtamo cheppu... dochuku tinadaniki alavatu padinavadu, hyderabad lo vundadanni amerikalo vunnamani feelaye foolse samykya vadulu.. adosari alochinchu... appudu nee pichhi raatalu rayi

    ReplyDelete
  4. Anonymous said...

    "ఒక ప్రాంతపు జిల్లాల్ని/ లేదా వటి భాగాల్ని ఇంకో ప్రాంతంలో కలిపేసి ఈ ప్రాంతాల సమగ్రతని చెడగొట్టాలి. అన్ని జిల్లాల రూపురేఖల్నీ గుర్తుపట్టలేని విధంగా మార్చేయాలి"

    A much better idea: let us do it with states so that the poison of linguistic fanaticism is buried for ever.

    ReplyDelete
  5. అవునవును వాడి లెఖ్ఖలన్నీ కరక్టే. నీకు పెళ్ళయ్యుంటే నీ పెళ్ళాన్నీ, కాకుంటే నీ చెల్లెనో అక్కనో కూడా వాడి లెఖ్ఖలోకే కడతాడు (వ్యాపారికదా), పంపించెయ్! వ్యాపారం చేసుకుంటాడు.

    ReplyDelete