Sunday, June 19, 2011

వంట చేసి ఏం సాధించారు?

త్యాగాల వల్ల తప్ప వేరే విధంగా తెలంగాణా రాదని సెలవిస్తూనే వంటా వార్పూ అంటూ తెలబాన్ నాయకుడు చేసిన హడావిడికి అర్ధం పరమార్ధం ఏమిటో ఆయనకే తెలియాలి.  ఓ పక్క కాంగ్రెస్, తెదేపా నాయకులని రాజీనామాలు చేయమని హుంకరిస్తూనే, తానూ, తన తెలబాన్ చెల్లి ఈ రోజుకి కూడా రాజీనామా ఊసు ఎందుకు ఎత్తరో ఏనాడు వివరించిన పాపాన పోలేదు.  నిజంగా ఉద్యమం పట్ల చిత్త శుద్ధి, నిబద్ధత గల పెద్ద మనిషి ఐతే మొదటి సారి రాజీనామా తిరస్కరణకి గురి అయ్యాక మళ్ళీ సరైన ఫార్మాట్లో రాజీనామా ఇవ్వాలన్న విషయం ఎవరైనా చెప్పాలా?  తాను పదవిని పట్టుకుని వేళ్ళాడుతూ ఇతరులని రాజీనామా చేయాలని వత్తిడి చెయ్యటం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల కిందకే వస్తుంది.   ఇలా వంటలు చేస్తూ, వసూళ్లు చేస్తూ ఉద్యమ నాయకుడుగా చెలామణీ కావటం బహుశా వేరెవరికీ సాధ్యం కాక పోవచ్చు.  ఇక తెలబాన్ జే ఎ సి నాయకుడిదీ అదే తంతు! తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా ఇవ్వడు కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కట్టిన పన్నుల్లోంచి జీతం తీసుకుంటూ ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడతాడు. అనుకూలంగా మాట్లాడితే తప్పు లేదు. కానీ ఇతర ప్రాంతాల పై, ప్రాంతీయుల పై విద్వేషాగ్నుల్ని రగిలించడం క్షంతవ్యం కాదు.  ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొత్తగా చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసి కొరివితో తల గోక్కునే అవకాశం లేనే లేదు. అది తెలంగాణా కాంగ్రెస్ నాయకుల డిల్లీ పర్యటనలో వారి పట్ల హై కమాండ్ చూపిన మర్యాదే తెలియ జేసింది. ఇంకా వంటా వార్పూ, డెడ్ లైన్, రాజీనామా అంటూ ప్రజలని ఏమార్చడం సాధ్యం కాదు.    పైగా మిలియన్ మార్చ్ అంటూ పేర్లు పెట్టి జనాల్ని సమీకరించి రాష్ట్ర చారిత్రిక సంపద ఐన విగ్రహాలని కూల్చి వేయడం క్షమించరాని నేరం. ఇప్పటికే రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగి అభివృద్ధి అనేది ఆమడ దూరం వెళ్ళింది. ఇంకా ఇటువంటి అర్ధం పర్ధం లేని ఉద్యమాలని ప్రభుత్వం ఎంత మాత్రం సాగనీయకూడదు.   రాష్ట్ర హితానికి వ్యతిరేకంగా, ప్రజలని అసౌకర్యాల పాలు జేసే విధంగా సాగే ఎటువంటి కార్య కలాపాలని అయినా ఉక్కు పాదంతో అణచి వేస్తేనే మళ్ళీ రాష్ట్రాభివృద్ధి గాడిలో పడుతుంది.

4 comments:

  1. అతనొకపెద్ద ఊసరవెల్లి,అలాంటివాడి గురించి మాట్లాడం దండగ

    ReplyDelete
  2. What is your response to the so called samaikyandhra "vanta varpu" organized by "Professor" Samuel and his "samakyandhra JAC" on July 10?

    Will you demand the resignation of your andhera professors?

    ReplyDelete
  3. వంట చేసి ఏం సాధించామా? మీ కూష్మాండం కింద వేడి తగల్లేదా?? అదే మేం సాధించింది.

    ReplyDelete
  4. మీ మొహాలకు సరిగా తెలుగు మాట్లాడడం రాదు. చదువు రాదు, పని చేతకాదు. తాగామా, పండినామా, ఎగిరినామా

    ReplyDelete