Thursday, December 31, 2009

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.


Wednesday, December 30, 2009

బందు చేసి ఏం సాధించారు?


165 రైళ్ళ రద్దు. కొన్ని వందల బస్సు సర్వీసులు రద్దు. ఆఫీసుల్లో, కర్మాగారాల్లో పని గంటలు రద్దు. విద్యాలయాలు సరే ముందే సెలవు... రోజు వారీ కష్ట జీవుల నోటి దగ్గర కూడు రద్దు. సాక్షాత్తు ముఖ్య మంత్రి చెప్పినట్లు, రాష్ట్రానికి రావలసిన ఫ్యాక్టరీలు రద్దు.. ఆపై ఉద్యోగావకాశాలు రద్దు. మొత్తం మీద రాష్ట్రానికి ఉన్న మంచి పేరు రద్దు.

ఇన్ని పద్దుల రద్దుతో కూడిన తెలంగాణా మనకి వద్దే వద్దు.. సమైఖ్యాన్ద్రే మనకు ముద్దు.

Monday, December 28, 2009

తెలంగాణా అరాచకత్వం పై అడిగే వాడు ఎవరు?

ఈ క్రింది వీడియో చూడండి.. ఇలా గట్టిగా అడిగే వాడు లేక నేడు రాష్ట్రంలో అరాచకత్వం (అంటే ప్రభుత్వం వున్నా లేనట్లు వుండే స్థితి ) దాపురించినదని నా అభిప్రాయం... మీరేమంటారు?

Sunday, December 27, 2009

కే సి ఆర్ పుష్కర పురాణం


ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చ గోట్టటంలో దిట్ట ఐన కే సి ఆర్ ఈ మధ్య ఓ పుష్కర పురాణం చెప్పాడు. అదేమిటంటే కృష్ణ పుష్కరాలు వస్తే విజయవాడ కే పోవాల? గోదావరి పుష్కరాలు ఐతే రాజమండ్రి కే వెళ్ళాలా? మా దగ్గర ఆ నదులు లేవా..అంటూ సాగింది ఆ పురాణ కాలక్షేపం..
ఇక్కడ ఓ సంగతి గమనించాలి. ప్రాంతాలకి అతీతంగా ఎవరికైనా వీసా కావాలి అంటే అందరం చిలుకూరు బాలాజీ గుడికి వెళ్తున్నామా లేదా ? పిల్లలు గొప్ప చదువులు పొందాలని అక్షరాభ్యాసం బాసరలో చేయిస్తున్నాము కాదా? అలాగే ప్రతి ఊళ్ళోనూ రామాలయం వున్నా భద్రాచలం ఎందుకు వెళుతున్నాం? ఇంకా వేములవాడ, యాదగిరి గుట్ట , మెదక్ చర్చి, మక్కా మసీదు ..ఇవన్నీ జగత్ ప్రసిద్ధాలు కాదా?? అవన్నీ తెలంగాణా ప్రాంతంలోనే కదా వున్నాయి.. దీన్ని బట్టి అర్ధం ఏమిటంటే, పురాణ ప్రాశస్త్యం, ప్రజల నమ్మకాలను బట్టే ఆయా ప్రదేశాలకు యాత్రికులు వెళతారు మరియు ప్రభుత్వం కూడా ఆ ప్రాధాన్యతని బట్టి ఏర్పాట్లు చేస్తుంది.
ఈ చిన్న విషయాన్నీ కూడా వేర్పాటువాద దృష్టితో చూస్తూ విషం చిమ్మే కే సి ఆర్ మాటల్ని లైవ్ లో ప్రసారం చేస్తున్న మీడియా కూడా దోషి అని చెప్పి తీరాలి.

హద్దు మీరుతున్న తెలంగాణా ఉద్యమం

భారత దేశంలో ఎవరైనా ఎక్కడైనా స్వేచ్చగా జీవించే హక్కు భారతియులందరికి వుంది. అలాగే భావ ప్రకటన స్వేచ్చ కూడా అందరికి సమానమే. ఐతే ఇప్పుడు జరుగుతున్నదేంటి? హైదరాబాద్ లో గీతా ఆర్ట్స్ భవనాన్ని మూకుమ్మడి దాడి చేసి స్వాధీనం చేసుకొని ఆ భవనానికి తెలంగాణా జే ఎ సి బ్యానర్ తగిలించారంటే వీళ్ళ వేర్పాటు వాదం తీవ్రవాదానికి తక్కువ కాదు.. కే సి ఆర్ బాహాటంగా తెలంగాణాని సమర్దిస్తున్నట్లే .. సమైఖ్య రాష్ట్రాన్ని కోరే హక్కు చిరంజీవికి కానీ మోహన్ బాబు కి గాని ఖచ్చితంగా వుంది. అభిప్రాయం చెప్పినంత మాత్రాన ఆస్తులు ఆక్రమిస్తారా? ధ్వంసం చేస్తారా? వీళ్ళకి పాలన పగ్గాలు అప్పగిస్తే జరగబోయేది ఏమిటో ఈ చర్యలే సూచిస్తున్నాయి. అలాగే నిమ్సులో వైద్యం చేయించుకోవటానికి కే సి ఆర్ అర్హుడే కాని లగడపాటికి వీలు కాదన్నట్లు ఫత్వాలు జారీ చెయ్యటానికి వీళ్ళకేం అధికారం వుంది? అసలు ఇంత అరచాకత్వాన్ని సహిస్తూ ప్రభుత్వం ఏమి చోద్యం చూస్తోంది? బ్లూ స్టార్ ఆపరేషన్ లాగ మిలిటరీ చర్య తీసుకుంటే గాని పరిస్థితులు చక్కపడవు...

నరం లేని కే సి ఆర్ నాలుక

టీ డీ పీ, కాంగ్రెస్స్ పార్టీలకు ఆంధ్ర, తెలంగాణా రెండు చోట్ల బలమైన కేడర్ వుంది కాబట్టి అవి డబుల్ గేమ్ ఆడుతున్నాయి .. చిరంజీవి వెర్రి వాడు కాబట్టి ఒక ప్రాంతానికే సపోర్ట్ అన్నాడు.. చంద్ర బాబుని చూసి ఐన నేర్చుకోడు.. ఓకే.. కాని అసలు కేడర్ అంటూ లేని కే సి ఆర్ మాటలు చూద్దామ్.
9 వ తేది చిదంబరం కేంద్ర హోం మంత్రి హోదాలో ఒక ప్రకటన చేయగానే తెలంగాణా వచ్చేసిందని చంకలు గుద్దుకుని దొంగ దీక్ష విరమించేసాడు కదా! మరి అదే కేంద్ర హోం మంత్రి, అదే హోదాలో అందరి అభిప్రాయాలూ తీసుకుందామని ప్రకటిస్తే ఇప్పుడు విషం కక్కుతున్నాడేందుకు? ముందు ఆయన నాలుక తెగ్గోస్తే ఎవ్వరికీ ఎ సమస్యా రాదు..