Wednesday, December 30, 2009

బందు చేసి ఏం సాధించారు?


165 రైళ్ళ రద్దు. కొన్ని వందల బస్సు సర్వీసులు రద్దు. ఆఫీసుల్లో, కర్మాగారాల్లో పని గంటలు రద్దు. విద్యాలయాలు సరే ముందే సెలవు... రోజు వారీ కష్ట జీవుల నోటి దగ్గర కూడు రద్దు. సాక్షాత్తు ముఖ్య మంత్రి చెప్పినట్లు, రాష్ట్రానికి రావలసిన ఫ్యాక్టరీలు రద్దు.. ఆపై ఉద్యోగావకాశాలు రద్దు. మొత్తం మీద రాష్ట్రానికి ఉన్న మంచి పేరు రద్దు.

ఇన్ని పద్దుల రద్దుతో కూడిన తెలంగాణా మనకి వద్దే వద్దు.. సమైఖ్యాన్ద్రే మనకు ముద్దు.

6 comments:

  1. ఇక్కడ ఎవరూ కూడా తార్కికంగా ఆలోచించటం లేదు. మనం అందరం ఒక్క తల్లి బిడ్డలమే అయినా కానీ ఇలా కుక్కల్లా కోట్లాడుకోవడం మాత్రం ఏమి బావో లేదు. రాజకీయాల్లో సరైన పరిష్కారం లేదా తప్పు పరిష్కారం అంటూ ఉండవు. కేవలం మన సౌలబ్యం కోసం మనం అందరికీ అమూదయోగ్యం ఐన పరిష్కారం కనుక్కోవటం మాత్రం కావలి. ఇలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుని మనమే కరెక్ట్ అనుకునే నైజం పోవాలి. ఆంద్ర వాళ్ళు పోగారుబోతులని, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులని ఇలాంటి gross generalizations చేసుకోవటం మన అవివేకం కాదా? మనవ సంబందాలు తెగిపోయాక ఇక కలిసున్నాలేకపోయినా పెద్ద లాబం లేదు. ఉద్యోగాల్లో, నీటి వనరుల వినియోగంలో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది (వాళ్లకి తెలివితేటలూ ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే) అన్న విషయం వాస్తవం. అలాగే హైదరాబాదు అభివృద్ధిలో అందరి చేయి ఉంది, కానీ ఇప్పుడు దానిని వదిలెయ్యాలి అనటం పూర్తీ గా అన్యాయం. ఇలాంటి పరిస్తితులలో చదువుకున్న మనం ప్రస్తుతం సంయమనం పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పాటు పడేలా ప్రోత్సహించాలి. అంతే కాని రోజు రోజుకి పడిపోతున్న సౌబ్రాతుత్వాన్ని మరింత తొక్కి మనకి మనం ఏమి మంచి చేసుకోవటం లేదు. Negotiations అందరికి అన్ని లాబాలు జరగవు, మనం కొన్ని పక్కవారి విషయంలో పస ఎంత ఉంది అనేది అలోచించి సర్దుకు పోవడం ముఖ్యం. అన్నింటి కన్నా ముఖ్యం, ఇది జీవన్మరణ సమస్య కాదు. కాని మనల్ని మనం కించ పరుచుకుమ్తున్న విదానం మాత్రం హేయం. అందరం కలుద్దాం పరిష్కారం వెతుకుదాం. రాజకీయంగా కాదు. బ్లాగు పరంగా. ఏమంటారు? కనీసం ఇక్కడైనా మనం వివేకులం అని చెప్దాం. సరైన బ్లాగ్ తయారు చేద్దాం, ఫోరం తయారు చేద్దాం, అందరికి నచ్చేట్టుగా నాయకులను (moderators) ఎన్నుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా మనకి మనం పరిష్కారం చర్చిద్దాం. ఇది నేను అన్ని బ్లాగులలో పోస్టు చేస్తున్నాను. దయచేసి అందరం దగ్గరికి వద్దాం. విషం చిమ్ముకోవటం ఆపేద్దాం.

    ReplyDelete
  2. "అన్నమైతే నేమిరా
    మరి సున్నా మైతే నేమిరా
    అందుకే ఈ పాడు పొట్టకు
    అన్నమే వేతామురా...
    పరమాన్నమే వేతామురా !"

    అనే చాల్బాజీ , దగులబాజీ, బట్టేబాజీ గాళ్ళకి
    ఎంత జెప్పినా ఏం జెప్పినా దండుగే !!

    ReplyDelete
  3. @Rajanna గారు,
    మీ గురించి మీకు భలే తెలుసండి :) అలగే ఆ kcr కు కూడా తెలియచెప్పండి ప్లీజ్. :)

    ReplyDelete
  4. నిజమే నండీ నాకు కూడా విసుగు పుట్టింది హైదరాబాదు అంటే , ఏమిటీ బందులు

    ReplyDelete
  5. ఆంధ్ర ప్రదేశ్ నుండి ఆంధ్ర రద్దు అప్పుడే ఈ బందులు రద్దు......
    @విజయ్:మీ ప్రయత్నం నిజంగా అబినదనియం కానీ తెలంగాణా ప్రజలు ఆంధ్ర వాళ్ళని నమ్మే రోజులు లేవండి.....వాళ్ళు అ అవకాశాన్ని కోల్పోయారు .......

    ReplyDelete
  6. విజయ్ గారు,
    చాల బాగా చెప్పారు. ఎంత సరైన బ్లాగు, ఫోరం తయారు చేసినా ఇవేవి రాష్ట్ర ప్రజలందరకు అందుబాటులో లేవన్న విషయము గుర్తుంచుకోవాలి. కాని మీరలాంటి బ్లాగు మొదలెడితే ఉడతా భక్తిగా నా వంతు తప్పకుండా కృషి చేస్తాను. మంచి అలోచన.

    ఇకపోతే ఆకాశరామన్న గారు,
    నేను వ్యక్తిగతంగా హింసాయుత ఉద్యమానికి చాలా దూరం. మీరడిగిన ప్రశ్న మంచిదే - కాని దాంట్లో తెలంగాణ ప్రజల పట్ల వెటకారం పొంగి పొర్లుతోంది. ఈ బందు వలన జరిగిన నష్టంపై మీరెంత భాధను ప్రదర్శించినా అది మొసలి కన్నీరే అవుతుంది తప్ప - బూటకమైన సమైఖ్య ప్రేమ ఏమాత్రం కాదు కాబోదు. వాస్తవ్యమైన విషయమేమిటంటే ప్రజల మద్దత్తు లేకుండా మీరు చెప్పిన ఈ పరిమాణమములో బందు జరగడానికి వీలులేదు. ఇకపోతే రాష్ట్రానికి రావలసిన ఫ్యాక్టరీలు రద్దు... అని సాక్షాత్తు ముఖ్యమంత్రి పచ్చి అబద్దం చెప్పినట్లుగానే మరి వొక్స్-వ్యాగను వాళ్ళు కూడా ఈ బందుకు భయపడి రెండేళ్ళకు ముందే వెళ్ళిపోయారు అనడం అంతే నిజమౌతుంది.

    గత 20 ఏళ్లుగా అభివృద్ధి పేరిట హైదరాబాదులో జరుగుతూ వస్తున్నది నిజంగా ప్రజల కొరకేనా? అయితే ఏ ప్రజలు? కంప్యూటర్లమీద మాత్రమే పనిచేయగలిగినవారు. సేద్యం తప్ప మరొకటి ఎరుగని రైతులు, వడ్రంగి, కుమ్మరి, మంగళి, చాకలి మొదలైయిన వృత్తిపనులనుంచి బయటపడలేక మగ్గుతున్నవారు, తాటి చెట్లు ఎక్కడం మాత్రమే తెలిసిన కల్లు కార్మికులు... హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ది ఈ స్థానికులలో ఎవరికి ఉద్దేశించిందో చెప్పగలరా?

    పైగా రాష్ట్రానికి ఎక్కడ మంచిపేరుందో నాకు చెప్తారా? "आन्ध्र प्रदेश का नाम अन्धेरा प्रदेश होना चाहिये" అని నిండు లోకసభలో సిగ్గుతీసేలా ఇతరులు వ్యాఖ్యానించే రీతిలో ఏడ్చింది మన గౌరవం. అంతర్గతంగా తన్నుకు చచ్చే మనం ఏనాడు ఐఖ్యంగా లేమన్నది జగమెరిగిన సత్యం.

    సమైఖ్యం కొరకు ఇప్పటిదాకా ఏర్పరుచుకున్న ఉమ్మడి ఒప్పందాల అమలులో తెలంగాణేతర సీమాంధ్ర ముఖ్యమంత్రుల, నేతల బాధ్యతారాహిత్యం లేదా లేక ఇకపై ఉండదా? ముల్కీ ఒప్పందం అమలుకు రాష్ట్రం ఏర్పడిన తొలి రోజునుంచే తూట్లు పడ్డాయని ఆధారాలు కూడా బలంగా ఉన్నాయి. 'ముఖ్యమంత్రి పదవిలో నేనుండగా ఉపముఖ్యమంత్రి పదవి చేతికి ఆరోవేలు లాంటిది ఎందుకు దండగ' అని సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి స్వయంగా తోసిపుచ్చారంటేనే ఈ సమైఖ్య ఉమ్మడి ఒప్పందం ఎంత ఘనంగా అమలయిందో తెలుస్తూనే ఉంది. ఇక వలసొచ్చి ముఖ్యమంత్రయిన జలగం వెంగళరావు గారు, పి.వి.నరసింహారావు గారు పరితపించిన స్థానిక పరిపాలనా కమిటీలను రద్దు చేస్తూ మరొక సమైఖ్య ఒప్పందం తుంగలో తొక్కినప్పుడు ఏమయింది ఈ పద్దుల లెక్క.

    తెలంగాణా ప్రజల ఆకాంక్షను బయట ఉన్న ఎవ్వరం కూడా అగౌరవర్చకూడదు. తమకు అన్యాయం జరుగుతోందన్న ప్రజల ఆకాంక్షల బలం ప్రాతిపదికనే ఉద్యమాలను నడిపి సొమ్ము చేసుకుంటున్నారు తప్ప ఇదంతా కేవలం నాయకుల స్వార్థం మాత్రమే అని కొట్టి పారేయకూడదు.

    ఇకపై విధ్వంసం జరగదని, మరిన్ని బందులు జరగకూడదనే ఆశిస్తున్నాం. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత మళ్లీ ఏర్పడుతోంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి. నేను బయటినుంచి పలుకుతున్న నీతివాఖ్యాలే అనుకోండి లేక విమర్శలే అనుకోండి. ఒకరినొకరు రెచ్చగొట్టే బ్లాగులు వ్యాఖ్యలు వద్దని నా విజ్ఞప్తి. అందరూ క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాను.

    ReplyDelete