Sunday, February 13, 2011

రాజుల సొమ్ము రాళ్ళ పాలు - దేవుని సొమ్ము రైళ్ళ పాలు !

హైదరాబాదులో పాత బస్తీ అభివృద్ది కోసం ఏదైనా ముస్లిం ధార్మిక సంస్థని ఒక్క రూపాయి అడిగే ధైర్యం ప్రభుత్వం చేస్తుందా? లేదు..కానీ తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ది కి మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు కోట్లు కుమ్మరిస్తుందట! ఎవరిచ్చారు బోర్డుకి ఆ అధికారం? 33 మంది ఎంపీలు అధికార పక్షంలో వున్నా మనకి కేంద్ర మంత్రి వర్గంలో దిక్కు మాలిన శాఖలే గతి..రైల్వే వంటి కీలక శాఖలు అన్నీ బెంగాలు, బీహారు లకే..ఆదరణ వున్నా లేక పోయినా కొత్త రైళ్ళు, ప్రాజెక్టులు ఆ రాష్ట్రాలకే....లక్షలాదిగా ప్రయాణీకులు వచ్చి పోయే తిరుపతి రైల్వే స్టేషన్ పై రైల్వే కి వచ్చే ఆదాయాన్ని బెంగాల్, బీహార్ లకి తరలిస్తుంటే అడ్డుకోవటం మాని దేవుని సొమ్ముని మళ్ళింప బూనటం ఆశ్చర్యం. గతంలో కూడా ఎన్.టీ.ఆర్. హయాంలో తిరుపతి లో డ్రైనేజీ అభివృద్ది కోసం టీ.టీ.డీ. నిధుల్ని వాడుకోవాలని చూస్తె హై కోర్టు మొట్టి కాయలు వేసింది. భక్తుల విరాళాలని నిత్యాన్న దానం వంటి సేవా కార్యక్రమాలకో లేదా ధార్మిక ప్రచారానికో వినియోగించాలి గానీ సౌకర్యాల నెపంతో ఇతర శాఖలు చేయాల్సిన కార్యక్రమాల్ని నెత్తిన వేసుకోవడం దుర్వినియోగమే అవుతుంది. టీ.టీ.డీ తక్షణం ఈ ప్రతిపాదనని విరమించుకోవాలి.

6 comments:

  1. సమూహము ఇప్పుడు అత్యంత వేగవంతముగా బ్లాగర్ యొక్క పోస్టులను చూపిస్తుంది.ఎంత వేగంగా ఉందో మీరే ఒకసారి పరీక్షించండి.మీరు మీ పోస్ట్ ను ప్రచురించిన తరువాత ఒకసారి సమూహము (http://www.samoohamu.com ) వెళ్లి చూడండి.సమూహములో మీ పోస్ట్ టైటిల్ కనిపిస్తుంది.
    బ్లాగ్ మిత్రులనుండి సలహాలను , సూచనలను ,విమర్శలను ఆశిస్తున్నాము .

    ReplyDelete
  2. I think, you should ask (demand) the Secular Government to "Quit Temples" asap.

    Indian Constitution guarantees "Religious Freedom" as fundamental right. The so called Secular Government in India Controls, Manages and loot Hindu Temples. They divert Temple Funds to construct Churches and Masques. Shame.

    It is shameful of "Caste Hindu Politicians" for allowing this. Shame on Hindus for electing such useless "Caste Hindu Politicians".

    ReplyDelete
  3. "భక్తుల విరాళాలని నిత్యాన్న దానం వంటి సేవా కార్యక్రమాలకో లేదా ధార్మిక ప్రచారానికో వినియోగించాలి గానీ సౌకర్యాల నెపంతో ఇతర శాఖలు చేయాల్సిన కార్యక్రమాల్ని నెత్తిన వేసుకోవడం దుర్వినియోగమే అవుతుంది"
    ఆకాశరామన్న అభిప్రాయంతో నేను పూర్తిగా విభేదిస్తాను.సేవా కార్యక్రమాలంటే ఏమిటి? ప్రయాణ సౌకర్యం కూడా ఒక సేవా కార్యక్రమమేకదా!!!స్వామి వారికి ఇవ్వబడిన విరాళాలు, ఆ స్వామిని దర్శించడానికి రోజూ వచ్చే భక్తుల సౌకర్యానికి వాడటంలో ఔచిత్యం ఉందని నా భావన. సౌకర్యానికి ప్రభుత్వం పూనుకోవాలా లేదా అన్నది కాదు విషయం.. సౌకర్యం కావాలా వద్దా అన్నది అవసరమైన చర్చ.. భక్తుల అవసరానికి అవసరమైన ప్రయాణ సదుపాయం, ఆరోగ్యకరమైన నీటి సదుపాయం, చాలినంత వసతి సౌకర్యాలు కలుగ చేయాలిసిన అవసరం తప్పని సరిగా ఉంది. భక్తి అనేది మతపరమైన సున్నిత అంశం. సర్వ మత సామరస్యానికి ప్రతీక అయిన భారత దేశంలో ,వివిధ నమ్మకాలతో అనేక మంది తమ దేవుళ్ళను కొలుస్తారు. అది పూర్తిగా వారి వ్యక్తిగత అంశం. అలాంటి విషయాలలో పన్నుల ద్వారా వచ్చిన ప్రజా ధనాన్ని ప్రభుత్వ శాఖలు వినియోగించాలంటే కొంచెం కష్టమే. ఆ ధనాన్ని దేశంలో మనిషి కనీస అవసరాలైన తిండి,గూడు,వ్యవసాయ పురోగతికి ముందుగా ఉపయోగించాల్సి ఉంటుంది. అందువల్ల దానిని ఒక ప్రత్యేక ప్రదేశంలో భక్తుల దర్సనానికి ,వారి సౌకర్యాలకోసం తప్పనిసరిగా వాడాలి అనటం అంత సబబు కాదేమో. స్వామి వారికి అంది విరాళాలను తిరుపతి పట్టణ అభివృద్ధి కోసం వాడితే తప్పేమిటి? T T D బోర్డు వద్ద ఉన్నధనాన్ని రైల్వే స్టేషన్ బాగుచేయడం కోసం వాడటం సబబే అని నా వ్యక్తిగత అభిప్రాయం .

    ReplyDelete
  4. @jamaki: సౌకర్యాలు కల్పించే విషయంలో నేను మీతో ఏకీభవిస్తాను. కానీ నా ఆక్షేపణ అపాత్ర దానం గురించి. లక్షలాది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నప్పుడు ఆ మేరకు తప్పని సరిగా రైల్వే శాఖకి లాభం వుంది తీరుతుంది. కానీ ఆ శాఖ మంత్రులెవరైనా కూడా ప్రాముఖ్యత కలిగిన తిరుపతి వంటి స్టేషన్లకి ప్రాధాన్యం ఇవ్వకుండా తమ సొంత రాష్ట్రాలకి సౌకర్యాలు కలుగ జేసుకుంటున్నారు అన్నది కళ్ళకి కనిపిస్తున్న సత్యం. భారత దేశంలో ఏ మూలనుంచైనా దురంతో నాన్ స్టాప్ రైలు తిరుపతికి వేస్తె భక్తులు రారా? కోల్కటా నుండి పూరీ కి దురంతో ఇచ్చారు కానీ మనకి ఇవ్వలేదు.
    అలాగే తిరుపతి అభివృద్ధికి స్వామి వారి విరాళాలని వాడితే తప్పేమిటి అని అడిగారు. తప్పు కానపుడు హై కోర్టు ఎందుకు తప్పు పట్టింది?

    ReplyDelete
  5. హైకోర్టు తీర్పు పాఠం చదవాలి పూర్తిగా మనం మిత్రమా!! అప్పుడు అర్థం అవుతుందేమో ఎందుకు అలా తీర్పు ఉందో....

    ReplyDelete
  6. హిందు పొలిటికల్ లీడర్స్ కు బుద్ది లేనంతవతకు, దేవాలయాలు సెక్యులర్ ప్రభుత్వము చేతిలొ బంది అయి వుంటాయి.

    సెక్యులర్ ప్రభుత్వము లొ వరు వుంటారొ మీకు తెలిసే వుంటుంది. అందులొ తురకులు, కిరస్తానీలు, కమ్యునిస్ట్లు, ఎతియిస్ట్లు, corrupt people, extremists వుంటారు.

    So all the above people can decide the fate of Hindu Temples. How sad. Shame to హిందు పొలిటికల్ లీడర్స్.

    ReplyDelete