Sunday, February 6, 2011

టీ.టీ.డీ. తల తిక్క నిర్ణయం..

టీ.టీ.డీ.మంచి నిర్ణయం అని రాసిన పదహారు రోజులకే మళ్ళీ ఇలా     రాయాల్సివస్తోంది. http://andhraaakasaramanna.blogspot.com/2011/01/blog-post_21.html
తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ కి అప్పగించాలన్న బుద్ది ఎవరి పుర్రెలో పుట్టిందో కానీ నిబద్ధత గల అధికారిగా పేరున్న కృష్ణా రావు గారి హయాంలో ఈ నిర్ణయం రావడం ఆశ్చర్యం.  అనంత స్వర్ణ మయం వంటి పధకాలు ముందు ముందు రాకుండా ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. కానీ అటువంటి పధకాలు రావటానికి గల మూల కారణం ఏమిటి? సేవా తత్పరత ఏ మాత్రం లేకుండా స్వార్ధ ప్రయోజనాలకోసం తమ అధికారాన్ని దుర్వినియోగం చేసే రాజకీయుల్ని బోర్డు సభ్యులుగానూ, చైర్మన్ లు గాను నియమించ బట్టే అటువంటి పధకాలు వస్తున్నాయి. దానికి గాను ఆలయ కార్య నిర్వహణ లో రాజకీయ ప్రమేయాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి గానీ ఏకంగా పురా వస్తు శాఖకి ఆలయాల్ని అప్పగించటం పరిష్కారం కాదు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకి దర్శనం కల్పించే విషయంలో కొన్ని లోటు పాట్లున్నా ప్రస్తుతం సాఫీగానే సాగుతోంది. కోణార్క్, తంజావూర్ లాంటి ఆలయాలకి భక్తుల తాకిడి అంతగా ఉండదు కాబట్టి అవి ఎవరి ఆధీనంలో వున్నా సమస్య లేదు. కాని తిరుమల ఆలయాన్ని మిగతా వాటితో పోల్చటం వేవేక రహితం.  ఇప్పుడు తిరుమల ఆలయాన్ని చేజేతులా పురా వస్తు శాఖకి అప్పగిస్తే, రాబోయే నియంత్రణల వల్ల భక్తుల తాకిడి ని తట్టుకోవడం సాధ్యమా? ఇటువంటి చిన్న ఆలోచన పాలక మండలికి ఎందుకు రాలేదు? అలాగే ఏడాదికి ఒక్కసారే దర్శనానికి అనుమతించాలన్న ప్రతిపాదన కూడా అర్ధ రహితం. జీవితంలో ఒక్క సారి మక్కా సందర్శిస్తే తృప్తి పడే ముస్లిం ఉంటాడు కానీ ఏడాదికి ఒక్కసారే స్వామి వారిని చూసి తృప్తి పడమంటే ఏ హిందువు సంతృప్తి గా ఉండడు. వీ.ఐ.పీ. దర్శనాలు, ప్రోటోకాల్ మర్యాదలు తగ్గించి భగవంతుని ముందు అందరు సమానులే అన్న న్యాయాన్ని పక్కాగా అమలు చేస్తే ఎన్ని లక్షల మందికైన నిక్షేపంగా శ్రీవారి దర్శనం కలుగ జేయవచ్చు.  అలాగే ఆర్జిత సేవలు కొన్నే కాకుండా అన్ని సేవలు మూల విరాట్టు కి గాక ఉత్సవ మూర్తికే జరిపించేలా నిర్ణయం తీసుకుంటే ఆ సేవల సమయాల్ని కూడా సాధారణ భక్తుల దర్శనం కోసం కేటాయించవచ్చు. 

3 comments:

  1. "ఎన్ని లక్షలమందికైనా దర్శనం కల్పించవచ్చు"
    "ఎన్ని లక్షలమందికైనా దర్శనం కల్పించవచ్చు" ఇది నిజం కాదు. రోజుకు 86400సెకన్లు, సెకనుకు సరాసరి ఇద్దరికి దర్శనం కల్పించినా, రోజుకు 1.7లక్షలు మాత్రమే దర్శించగలుగుతారు. గంటలతరబడి, రోజూ దర్శనం కావాలనుకునే సంతృప్తిలేని పాపాత్ములైన హిందువులకు టి.వి/ మొబైల్ ఫోన్లలో దర్శనం కల్పించవచ్చు. ఆలయాన్ని అప్పగించినా, పోటు, లడ్లు మాత్రం పురావస్తు శాఖకు అప్పగించకూడదు. అలా చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతిని తిరుపతి రాష్ట్రం కోసం వేర్పాటువాద ఉద్యమాలు చేస్తారేమో. :P

    ReplyDelete
  2. "రోజూ దర్శనం కావాలనుకునే సంతృప్తిలేని పాపాత్ములైన హిందువులకు".

    Anonymous - 1. You dirty (పాపాత్ము) soul? Stop playing with sentiments of Hindus.

    1) Why secular Govt. manage Hindu Temples?
    2) Did they consult practicing Hindus before making any decisions about Temples?

    Shame on Hindu Caste Politicians for allowing Secular Govt. to control Hindu Temples.

    ReplyDelete
  3. nice ..baga chepparu

    ReplyDelete