Saturday, January 29, 2011

తెలబాన్ నాయకుని దురహంకారం!

" రైతుల గురించి అడగరు, కరెంటు గురించి అడగరు, తెలంగాణ గురించి అడగరు, ఇంకెందుకున్నట్లు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు? ఆంధ్రోళ్ల బూట్లు నాకడానికా? "

"మన కళాకారుల పాటలు వింటే రేషం (రోషం) ఉన్నోడైతే తిరిగి సూడకుంట పోతడు. ఇన్ని తిట్లు తినుకుంట, ఇజ్జత్ ఇడిసిపెట్టి మన సూరు పట్టుకుని వేలాడుతున్నరు. ఈ తిట్లకు తెలంగాణోళ్లయితే భూమికి తలగొట్టుకుని సచ్చేటోళ్లు. ఎన్ని తిట్లు తిడుతున్నా, ముఖం మీదనే ఊంచుతున్నా (ఉమ్ముతున్నా) ఎందుకు వదిలిపోతలేరు?’’

"కలియుగంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంటుంది. అక్కడ మీరు (రాక్షసులు)  ఆంధ్రావారిగా పుట్టి తెలంగాణను పీక్కుని దోచుకు తినం డని వరమిచ్చాడట (శ్రీరాముడు). అలా తెలంగాణను పీక్కు తినడానికొచ్చినవారే ఇప్పుడు ఆంధ్రోళ్లయ్యారు’’
 
<==తెలంగాణ అధికారులు, ఎన్‌జీఓలు హైదరాబాద్‌లో 28Jan. నిర్వహించిన దీక్షా శిబిరంలో కే.సి.ఆర్.==>

ఇవి ఒక ప్రజా ప్రతినిధి మాట్లాడే మాటల్లా  ఉన్నాయా? ప్రత్యెక రాష్ట్రం ఇక మిధ్య అని ఖాయమై పోయిన ఫ్రస్టేషన్ లో మతి భ్రమించి వదరుతున్న ప్రేలాపనలివి.. చూరు పట్టుకు వేళ్ళాడటం, దోపిడీ, పీక్కు తినటం వంటి పస లేని వాగుడు గురించిన నిజా నిజాలన్నీ శ్రీకృష్ణుడు నిగ్గు తేల్చేసాడు.  చేతనైతే కమిటీ ఇచ్చిన రిపోర్టు సరిగా లేదని నిరూపించి అప్పుడు ఏమైనా మాట్లాడాలి కానీ ఇలా నోరు పారేసుకోవటం తెలబాన్ నాయకుని దురహంకారానికి నిదర్శనం.  అయినా పిట్ట కధలు చెప్పే పిట్టల దొర మాటలకి మీడియా కూడా ప్రాధాన్యత నివ్వటం మానేయాలి. అసలు రాజీనామా సరైన ఫార్మాట్ లో ఇవ్వటం తెలీని ఈ పెద్ద మనిషి కరెక్టుగా ఎలా రాజీనామా ఇవ్వాలో జగన్ దగ్గర శిక్షణ పొందాలి. ఆ తరువాత తానూ, తన చెల్లి సక్రమంగా రాజీనామాలు చేసి ఆ తరువాత ఇతర పార్టీల వారిని డిమాండ్ చేస్తే అర్ధవంతంగా వుంటుంది.  ప్రభుత్వం కూడా పిట్టల దొర మాటల్ని సీరియస్ గా తీసుకొని రెచ్చగొట్టే దూషణలు చేసిన నేరం మీద అరెస్టు చేయాలి. ఆ పని చేయలేక పొతే కనీసం ఇటువంటి ప్రేలాపనలు మళ్ళీ చేయకుండా ఆయనకి మానసిక వైద్య శాలలో చికిత్స అయినా చేయించాలి.

8 comments:

  1. ఒకడు బజార్న పడి ప్రాంతం పేరుతో అయిదుకోట్లమంది సహ-తెలుగువాళ్ళని అసహ్యమైన పదజాలంతో బహిరంగంగా దూషిస్తూంటే అందుకతన్ని పట్టుకొని బొక్కలో తోసి చావా చితకా కొట్టి శిక్షించలేని ఈ పాయింట్ ఫైవ్ వ్యవస్థని అనాలి. అందుకు చప్పట్లు కొట్టే అతని పశుప్రాయులైన అనుచరుల్ని అనాలి.

    వస్తుంది, ఆ రోజూ వస్తుంది. తప్పకుండా వస్తుంది. ఈ రోజు "అనగలిగాం" అని మురిసిపోవడం కాదు.

    ReplyDelete
  2. ఈ దేశంలో వాక్‌ స్వాతంత్ర్యం ఎంత దారుణంగా దుర్వినియోగమతోందో దానికి ఈ తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇదే బాపతు జనం సిగ్గులేకుండా "అన్నదమ్ములుగా విడిపోదాం - తెలుగువారిగా కలిసుందాం" అని బ్యానర్లు పెట్టుకొని పూలదండలు మెడలో వేసుకొని రిలే నిరాహారదీక్షకు కూర్చున్నారు, హైదరాబాదు కూడళ్ళలో ! నవ్వొస్తోంది.

    వాళ్ళ నోట్లో చొంగా, తెమడా ఎక్కువై, మదమెక్కువై వాళ్ళు ఎక్కడ పడితే ఉమ్ములేస్తారట. ఆ మాత్రం దానికే ఆంద్రోల్లు హైదరాబాదు ఖాళీ చేసి వెళ్ళిపోవాలట. అన్నదమ్ములమవడం సంగతలా ఉంచి, ఏ ప్రొవొకేషనూ లేకుండా తోటి తెలుగువాడి మీద నిష్కారణంగా ఉమ్మేసేవాడూ, తెలుగుతల్లి విగ్రహాలు కూల్చేవాడూ - వాడు ఒక మనిషేనా ?

    ReplyDelete
  3. మద్యమకారుడు--క్షుద్రమదేవి ఇద్దరు వాక్కాలుష్యం తో తెలుగు వారి చెవులను బద్దలుకొడుతున్నారు. తెలుగుజిన్నాకు త్వరలోనే తగినశాస్తి జరుగుతుంది. హరగోపాల్,వేణు గోపాల్ లాంటీ so called తెలంగాణా మేధావులు కనీసం ఇటువంటి ప్రేలాపనలను ఖండించకపోవటం దారుణం.

    ReplyDelete
  4. ఆంద్రోల్లు రాక్షసులైతే వీడిలా ఉమ్ములేయగలిగేవాడేనా ? వాళ్ళు రాక్షసులైతే వీడిలా నోటికొచ్చినట్టు కూయగలిగేవాడేనా ? ఎంత బాధ కలిగినా, "అందరం తెలుగువాళ్ళం, మనలో మనకెందుకు ?" అని శాంతంగా తలొంచుకు పోతున్నందుకా ఈ నోటివాటం ? వాళ్ళు మాట్లాడితే అది ఉద్యమం. మనం మాట్లాడితేనేమో అది సమైక్యత విఫలమైందనడానికి గుర్తు.

    ReplyDelete
  5. మౌనం వీడాలంటూ నువ్వు తెగ డిమాండ్ చేసావ్‌గా:) తీరా వీడాక మరిప్పుడు బాధపడతావెందుకు?

    ReplyDelete
  6. విజయ్ మంచిగా జోకారు సారు. నిజమే మౌనం వీడటం అంటే, (పెంట)కుళాయిని ఓపెన్ చేయటమే అని ఆకాశరామన్న గారికి తెలియకపోవటం వలన అనుకొంటా మౌనం వదలమన్నారు ;) తెలబానులు నోళ్ల గురించి, మెదడులగురించి ఈపాటికి తెలియకపోవటం తప్పే.

    ReplyDelete
  7. పిచ్చికుక్క కూతలను అహకారం అనుకోకూడదు. అలగా జనాన్ని ఆకట్టుకోవాలని వాడలా చిల్లర జోకులేస్తుంటాడు. ఏమైనా శ్రీకృష్ణ రిపోర్ట్తో వాడి బ్రతుకు కుడితిలో పడిన ఎలుకలా తయారయ్యింది.

    ReplyDelete
  8. అలగా జనాన్ని ఆకట్టుకోవాలని... అంటూ వ్రాసిన ఎనానిమస్సూ ఏం సంస్కారమయ్యా నీది? ఆయన ఆకట్టుకోవాలని చూసేది తెలంగాణా జనాన్నేగా- అంటే తెలంగాణా జనాలంతా అలగా జనాలా? మీరా మమ్మల్ని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పుకునేది? సంస్కారం, భాషల గురించి నీలాంటోడు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిమ్హినట్టుంటది గానీ ఆపెయ్ బాబూ:)

    ReplyDelete