Friday, January 21, 2011

టీ.టీ.డీ. మంచి నిర్ణయం!

ఆనంద నిలయం అనంత స్వర్ణ మయం పధకాన్ని రద్దు చేయాలన్న టీ.టీ.డీ పాలక మండలి నిర్ణయం అభినందనీయం. పాలక మండలి మాజీ అద్యక్షుడు ఆది కేశవులు నాయుడు సొంత ప్రయోజనాలు ఆశించి తలపెట్టిన ఈ పధకం భక్తులు నిరసించినా ఆగలేదు కానీ హై కోర్టు అక్షింతలు వేయడంతో అటకెక్కింది.  అసలు టీ.టీ.డీ వంటి ధార్మిక సంస్థకి ఒక మద్యం వ్యాపారిని చైర్మన్ గా నియమించడమే తప్పు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చుండ బెడితే ఏమి చేస్తుంది? తోటి మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కి ప్రత్యెక దర్శనం కల్పించడం కోసం గంటల కొద్దీ ఇతర భక్తులని ఇబ్బంది పెట్టడానికి కారణం సొంత వ్యాపార ప్రయోజనాలు కావా? అంబానీ ల వంటి పారిశ్రామిక వేత్తలు వచ్చినపుడు వారికి ప్రత్యెక సౌకర్యాలు కలుగ జేసి ఈ పధకానికి బంగారం ఇవ్వమని దేబిరించటం ఏ మాత్రం సమంజసం?  భగవంతుడేమీ వారిచ్చే బంగారానికీ, నగదు విరాళాలకీ మొహం వాచి లేడు.  ఏమైనా పధకం ఎలాగూ రద్దు అయింది కాబట్టి ఇప్పటి వరకు ఈ పధకం కింద వసూలైన 95కిలోల బంగారం, పన్నెండు కోట్ల రూపాయల నగదుని నిత్యాన్నదానం వంటి సామాన్య భక్తుల సౌకర్యాలకై వెచ్చిస్తే సముచితంగా వుంటుంది.

1 comment: