Sunday, January 23, 2011

తెలంగాణా ఇవ్వడానికి కాంగ్రేసుకి ఉన్న హక్కు ఏమిటి?

"తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010  న కే.సి.ఆర్."
ఛీ.. ఇదేనా తెలుగు వాడి ఆత్మ గౌరవం?
స్వంత కొంపలోని అవి నీతిని, అసమ్మతి సెగల్నిఅదుపు చేసుకోలేని ఇటలీ దేవతకి ఇంతలా సాగిల బడి పోవాలా? 33 మంది ఎం.పీ లని ఆంధ్ర ప్రదేశ్ అందించినా కూడా మంత్రి వర్గ విస్తరణలో మన రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యం చూస్తె కాంగ్రేసు దృష్టిలో మన రాష్ట్రానికి ఎంత విలువున్నదో ఇట్టే అర్ధమవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏ మాత్రం విలువనివ్వని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర విభజన పైన ఎలాంటి నిర్ణయం తీసుకొనే హక్కు  లేదు.అయినా చిన్నా చితకా పార్టీల మద్దతుతో తప్ప కేంద్రంలో స్వంత బలం తో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని కాంగ్రేసు పార్టీ ఒక రాష్ట్ర విభజన వంటి కీలక అంశాన్ని ఏక పక్షంగా  ఎలా నిర్ణయిస్తుంది? ఇతర భాగస్వామ్య పక్షాలతో  సంప్రదించకుండా ఏక పక్షంగా 9 డిసెంబరు 2009 నాడు చేసిన ప్రకటనకి విలువ ఉంటుందా? ఆనాడు అక్కర్లేని అఖిల పక్షం అభిప్రాయం ఇప్పుడు మాత్రం ఎందుకు? సరే, 9 డిసెంబర్2009  ప్రకటన కీలకమైనదే అనుకుందాం. మరి అదే కేంద్ర హోం మంత్రి అదే హోదాలో చేసిన 23 డిసెంబర్  2009 నాటి ప్రకటన కి కూడా అంతే   ప్రాధాన్యం వుంటుంది. ఇంకా  ఎక్కువే ప్రాధాన్యత వుంటుంది. ఎందుకంటే జరిగిన పొరపాటుని సరి దిద్దే ప్రకటన అది! ప్రకటన దిద్దుకోవడంతో సరి పోదు. తదనంతర పరిణామాల్లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూలంకషంగా స్టడీ చేసి ఇచ్చిన అత్యుత్తమ ఆరవ సిఫార్సుని వెంటనే అమలు చేయాలి.అలా చేయకుండా నాన్చినంత కాలం ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది సంవత్సరాల వెనక్కి వెళ్లి పోవటం ఖాయం.

9 comments:

  1. "తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010 న కే.సి.ఆర్."
    ఛీ.. ఇదేనా తెలుగు వాడి ఆత్మ గౌరవం?
    --------

    ఎవడు తెలుగు వాడు. కె.సి.అర్ తెలంగాణ వాడు. మా ఆత్మగౌరవం మా దగ్గరుండనివ్వండి హీన రామన్న.

    ఇట్లు
    తెలబాన్ సైనికుడు.

    ReplyDelete
  2. ఓ తెలబాన్ సైనికుడా !!! నువ్వు తెలుగు వాడివి కాదా? తెలంగాణాలో తెలుగు భాష మాట్లాడలేరా? తెలుగుని, తెలంగాణను వేర్వేరుగా చూస్తున్నావ్ ...తెలంగాణలో తెలుగు పదమున్నది చూడు తమ్ముడూ !!!!

    ReplyDelete
  3. "33 మంది ఎం.పీ లని ఆంధ్ర ప్రదేశ్ అందించినా కూడా మంత్రి వర్గ విస్తరణలో మన రాష్ట్రానికి ఇచ్చిన ప్రాధాన్యం చూస్తె కాంగ్రేసు దృష్టిలో మన రాష్ట్రానికి ఎంత విలువున్నదో ఇట్టే అర్ధమవుతోంది."

    ఉన్నవాల్లు వెలగబెడుతున్నది చాలు ఇన్కా ఎక్కువమన్దికఎన్దుకు.

    "అయినా చిన్నా చితకా పార్టీల మద్దతుతో తప్ప కేంద్రంలో స్వంత బలం తో ప్రభుత్వం ఏర్పాటు చేయలేని కాంగ్రేసు పార్టీ ఒక రాష్ట్ర విభజన వంటి కీలక అంశాన్ని ఏక పక్షంగా ఎలా నిర్ణయిస్తుంది?"

    మొన్న అసెమ్బ్లీ ఎన్నికల్లో ఎన్ని పార్టీలు తెలన్గాన ఇవ్వమన్నారు? అన్దరూ ఇస్తామన్నవాల్లేగా? ఏకపక్షమేన్టి?

    "తెలంగాణా ఇవ్వడానికి కాంగ్రేసుకి ఉన్న హక్కు ఏమిటి?"
    ఇవ్వొద్దు అనడానికి మీకున్న హక్కేమిటో?

    ReplyDelete
  4. కాడు, వీడు నిజాం తొత్తు, సోనియమ్మ చేతులో తోలుబొమ్మ. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 'న్యాయం ' కోసం ఎదురు చూసి, సంప్రదింపులకు అందరితో కాక, ప్రత్యేకంగా బేరాలు చేయాలని కోరిన అలుపెరుగని ఉద్యమకారుడు.

    ReplyDelete
  5. @"ఇతర భాగస్వామ్య పక్షాలతో సంప్రదించకుండా ఏక పక్షంగా 9 డిసెంబరు 2009 నాడు చేసిన ప్రకటనకి విలువ ఉంటుందా? ఆనాడు అక్కర్లేని అఖిల పక్షం అభిప్రాయం ఇప్పుడు మాత్రం ఎందుకు?"
    9 డిసెంబరు 2009 నాటి ప్రకటన కు ముందు 7, 8 న జరిగింది అఖిలపక్షం కాదా? అందులో పాల్గొన్నవాళ్ళు నాయకులు కాదా?? ఇస్తే మాకభ్యంతరం లేదని వారు చెప్పిన మాటలు రికార్డుల్లో లేవా??? 9 డిసెంబరు 2009 నాటి ప్రకటన తరువాత 'మేం ఓకే అన్నంతమాత్రాన ఇస్తారని అనుకోలేదు, అందుకే ఓకే అన్నామని' టీవీ ముఖంగా లగడపాటిలాంటివాళ్ళు చెప్పలేదా? తరువాత ప్రజాభిప్రాయం వేరెగా ఉంది కనుక మేమూ మార్చుకోక తప్పట్లేదని చెప్పిన ఈ నాయకులు ప్రజాభిప్రాయమేంటో తెలియకుండానే అఖిలపక్షాలకు హాజరవుతున్నారని భావించాలా? లేదా ఒక అభిప్రాయం చెప్పాక ప్రజాభిప్రాయం ప్రకారం మార్చుకోవడం కరక్టే అనేట్లయితే వీళ్ళు చేసే చట్టాలన్నీ ప్రజాభిప్రాయానికి పెట్టాకే అమలు చేస్తున్నారా? ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలచేత ఎన్నుకొనబడ్డ నాయకుల మెజారిటీ నిర్ణయమే శిరోధార్యం కాదా?

    ReplyDelete
  6. @R.S Reddy

    claps.. బాగ గడ్డి పెట్టావ్

    తెలబాన్ సైనికుడు

    ReplyDelete
  7. @ Anonymous January 23, 2011 11:19 AM

    తెలంగాణను తె"లంగా"ణ అని వెక్కిరించవచ్చు.
    తెలంగాణ ప్రజలను తెలబాన్లు అనవచ్చు.
    తెలంగాణ నాయకులని లంగా నాయకులనవచ్చు.
    మీ తెలుగు కూడ ఒక తెలుగా? యాక్ థూ అనవచ్చు.

    అవన్ని మీరు మాట్లడితె "ధర్మ" నీతులు.
    అవే మెము మాట్లడితె "కర్ణ" కఠోరం.


    తెలంగాణ సైనికుడు

    ReplyDelete
  8. @Anonymous (January 23, 2011 2:40 PM)
    Sorry. I don't entertain people clapping at others comments/ forming groups based on regionalism. Instead u too can write ur individual comments for or against the author of the blog.
    I am even against regionalism. But, coming to Telangana - it is a different issue not due to backwardness or regional discrimination etc., but the very merger of the two regions itself was questionable and the people of that region including many intellectuals from Andhra region to support it. Ultimately, there is nothing wrong in forming 2 or 3 states speaking same language (as some one rightly said there is no respect on the dialects of each other.

    ReplyDelete
  9. Telangana demand picked-up on false propaganda by TRS. After SKC, they are confuzed on next action. Just to save face they would continue for sometime. He has hopes on next expansion OR some Governor post.

    ReplyDelete