Wednesday, January 12, 2011

శ్రీ క్రిష్ణ పైనే నిందలా? సిగ్గు చేటు..

శ్రీ క్రిష్ణ కమిటీ సభ్యులు లంచాలు తీసుకొని తమ రిపోర్టుని ఇచ్చారని ఎం.పీ. మధు యాష్కీ ఆరోపించటం సిగ్గుమాలిన చర్య.  జస్టిస్ శ్రీ క్రిష్ణ ప్రొఫైల్ తెలిసిన వారెవరైనా ఆయనని కించిత్తు విమర్శించటానికే జంకుతారు.  గతంలో ఆయన చేపట్టిన బొంబాయి అల్లర్ల పై కమిటీ, చెన్నై హైకోర్టు లాయర్ల గొడవలపై వేసిన కమిటీ గాని లేదా కేంద్ర ప్రభుత్వొద్యోగుల జీత భత్యాల కోసం వేసిన ఆరవ పే కమిషన్ చైర్మన్ గా గాని ఆయన చూపిన నిబధ్ధత, నివేదికలనివ్వడంలో ఆయన చూపిన నిష్పాక్షికత అందరికీ తెలుసు.  ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రదెశ్ పరిస్థితులని పది నెలల పాటు కూలంకషంగా అధ్యయనం చేసి సవివరంగా ఆయన అంద జేసిన రిపోర్టు వేర్పాటు వాద తెలబాన్లకి మింగుడు పడక పోవటంలో ఆశ్చర్యం లేదు.  వాళ్ళకి చేతనైతే ఆ నివేదికలో లోపాలు ఏవైన వుంటే ఆధారాలతో వాటిని నిరూపించాలి కానీ వ్యక్తిగత విమర్శలకి తెగబడటం చాల తప్పు.  అందులోనూ దొంగ పాస్ పోర్ట్, దొంగ సర్టిఫికెట్ల కుంభ కొణాల్ని నెత్తిన మోస్తున్న మధు యాష్కీ వంటి వారికి  శ్రీ క్రిష్ణ ని విమర్సించే హక్కు ఏ మాత్రం లేదు. అధికార పార్టీ ఎం.పీగా వున్న  మధు యాష్కీ తన ఆరోపణలకి రుజువులు చూపించాలి.  సిట్టింగ్ సుప్రీం కోర్టు జడ్జి హోదా కలిగిన శ్రీ క్రిష్ణ కమిటీ చైర్మన్  పైన ఇటువంటి నిందలు వేయటం కోర్టు ధిక్కారంతో సమానం.   తగిన రుజువులు చూపక పోతే మధు యాష్కీనే కాదు.. తప్పుడు ఆరోపణలు చేసే తెలబాన్లు ఎవరైనా తమ నోటి దురుసుకి మూల్యం చెల్లించుకోక తప్పదు. 

7 comments:

  1. Emi Cheste ee Telabanlaki buddi vasthundo.

    ReplyDelete
  2. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఒక జబ్బు గా మారింది . ఈ మధు యాష్కీ తో పాటు విమలక్క ఆవిడ ఇదే పాట పాడుతుంది . వీళ్ళను చూస్తే పచ్చ కామేర్లోడికి లోకమంతా పచ్చ గా కనపడుతుంది అంటారు ఆ సామెత గుర్తుకొస్తుంది .

    ReplyDelete
  3. మధుయాష్కీ తరవాత ఇవ్వబోయే స్టేట్మెంట్లు.....

    1. సహాయ నిరాకరణని చౌరాచౌరీ ఘటన వంకతో ఆపేయడానికి గాంధీ బ్రిటీష్ వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారో నా ఆధారాలున్నాయి.
    2. దండి సత్యాగ్రహం లో గాంధీజీ సాల్ట్ కంపెనీల దగ్గర్నుంచి కోట్లు దండుకున్నారు. దీనికి నా దగ్గర ఆధారాలున్నాయి
    3. ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల వాళ్ళందరూ తమ విగ్రహాలు పెట్టడానికి ఒక్కొక్కరూ ఎన్టీఆర్ కి వంద కోట్ల దాకా ముట్టచెప్పినట్టు నా దగ్గర ఆధారాలున్నాయి.

    ReplyDelete
  4. మధుయాష్కి అంత లఫంగి మరొకడు లేడు. ఇతగాడి సంగతి గోనె ప్రకాశరావును అడిగితే చెబుతాడు. ఉచితికి ఆరేస్తాడు. విమర్శకోసమే విమర్శించడం ఆ స్థాయిలో వున్నవారికి తగదు. ..

    ReplyDelete
  5. @మధు యాష్కీ ఆరోపించటం సిగ్గుమాలిన చర్య... అయితే ఇక్కడ తమరు తమ కామెంటర్లు చేసేదేంటంట మరీ?

    @జస్టిస్ శ్రీ క్రిష్ణ ప్రొఫైల్ తెలిసిన వారెవరైనా ఆయనని కించిత్తు విమర్శించటానికే జంకుతారు... అబ్బో నిజమే ఛ!

    @ఆ నివేదికలో లోపాలు ఏవైన వుంటే ఆధారాలతో వాటిని నిరూపించాలి... మళ్ళీ ఒకసారి కూర్చుని తీరిగ్గా ఆ రిపోర్టు మీరు మీ ఆంధ్రోళ్ళు మరియు సమైఖ్యాంధ్రకు అనుకూలంగా వచ్చిందనుకుని చంకలు గుద్దుకుని సంబరపడేవాళ్ళందరూ చదవండి. ఆ రిపోర్టు నిండా నిలువెళ్ళా పచ్చినిజాలేనా...? 1 నుండి 4 వరకు భలే భలే అంటునే చెత్తబుట్టలో వేయొచ్చు అని చెప్పడంలో గోప్యమేంటో. ఇక 6 కు 1 కి తేడా ఏంటి సోదరా? ఇంతకు ముందెన్నడు ఇలాంటి ఆశ చూపలేదా? తెలంగాణ ప్రాంతీయ కమిటీకి రాజకీయ అధికారాలు, నిధులివ్వాలని ఎన్ని కమిటీలు కోర్టులు చెప్పలేదా?

    ఇక మిగిలింది 5వది కాదా? ఇది మీ తెలివైన బుఱ్ఱల్లోకెక్కేంతవరకూ ఆ రిపోర్టు చదువుకోండే... ఒకే! ఆ తరువాత బ్లాగుల్లో కామెంటుదురుగాని.

    ReplyDelete
  6. @అనానిమస్:దీన్ని బట్టి మీ తెలబాన్ పీత బుర్రలకి 5వ పాయింటు కూడా సరిగ్గా అర్ధం కాలేదని స్పష్టం ఐపోయింది. హైదరాబాదుతొ కూడిన తెలంగాణని బంగారు పళ్ళెంలో పెట్టి సమర్పించమని శ్రీ క్రిష్ణుడేమీ చెప్పలేదు. తప్పని సరి అయితేనే, అన్ని ప్రాంతాల వారి అంగీకారంతోనే ఏదైనా జరగాలని స్పష్టం గా అదే 5వ పాయింటులో చెప్పారు. విభజనకి అన్ని ప్రాంతాల వారు అంగీకరించడానికి ఎలాగూ అవకాశం లేదు. కనుక తెలబాన్లు ఎగష్ట్రాలు చేయకుండా వుంటే కనీసం అభివృధ్ధి మండలి అయినా వస్తుంది. కాదంటారా వారి ఖర్మ..

    ReplyDelete
  7. "తప్పుడు ఆరోపణలు చేసే తెలబాన్లు ఎవరైనా తమ నోటి దురుసుకి మూల్యం చెల్లించుకోక తప్పదు"
    తప్పుడు ఆరోపణలు చేసిన ఆంధ్రులు కూడా మూల్యం చెల్లించు కోవాలి. ఆకాశ రామన్న ఎందుకు తాలిబాన్ల అని ప్రత్యేకించి చెప్పుతున్న డో అర్ధం కావడం లేదు. ఈ బ్లాగ్ ఆకాశ రామన్న లాగ లేదు. అక్కస రామన్న లాగుంది
    .

    ReplyDelete