Saturday, January 8, 2011

శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు పై దిక్కు మాలిన చర్చలెందుకు?

ఫాల్తూ కమిటీ అనీ, గడ్డి పీకుతుందా అనీ ఇంకా నానా విధాలుగా తూలనాడిన వాళ్ళ నోళ్ళు మూయించేలా సాధికారమైన గణాంకాలతో, ఋజువులతో కూడిన విష్పష్టమైన నివేదికని నిర్ణీత సమయానికే అంద జేసిన శ్రీక్రిష్ణ కమిటీకి అభినందనలు.  కొండని తవ్వి ఎలకని పట్టిందని, ఆ మాత్రం రిపోర్టు ఇవ్వడానికి కమిటీ ఎందుకని విమర్శిస్తున్న వారికి నివేదిక అర్ధం కాలేదనే భావించాలి.  రిపోర్టుని జాగ్రత్తగా చదివిన వారు ఆ నివేదికలోని ప్రతి వాక్యం వెనుక కమిటీ బృందం చేసిన పరిశోధన, విషయ సేకరణ స్పష్టంగా గమనిస్తారు.  అనుభవజ్ఞుడైన శ్రీ క్రిష్ణ సారధ్యం లోని కమిటీ ఆషా మాషీగా ఈ నివేదిక ఇవ్వలేదు. నిజానికి ఈ నివేదిక ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కే కాదు. వేర్పాటు వాదం వినబడుతున్న దేశంలోని మిగతా రాష్ట్రాలకి కూడ పనికి వచ్చేలా పరి పూర్ణంగా ఇచ్చారు.  మన రాష్ట్రం విషయానికి వస్తే, కమిటీ ఆరు ప్రతిపాదనలు చేసింది. కరక్టే. అయితే అవి ఎంత వరకు ఆచరణీయమో కూడా విష్పష్టంగా చెప్పింది.  వాస్తవానికి ఆ ప్రతిపాదనలేవీ కమిటీ స్వంత అభిప్రాయాలు కావు.  రాష్ట్రం మొత్తం నుండి వచ్చిన నివేదికల, విజ్ఞాపనల సారాంశం.........అయితే నివేదిక వెలువడిన దగ్గరనుండి మన మీడియా వాళ్ళు ఆ ప్రతిపాదనల పై సుదీర్ఘమైన, పనికి మాలిన చర్చల్ని తమ చానెల్స్ లో ప్రసారం చేస్తూ గందర గోళానికి తెర లేపుతున్నారు.  అసలు ఈ ప్రతిపాదనల పై చర్చలే అనవసరం. తమకి వచ్చిన విజ్ఞాపనలనుంచి తయారైన ఆరు ప్రతిపాదనల్లో ఏది అత్యుత్తమమైనదో కమిటీ విష్పష్టంగా చెప్పినపుడు   ఇంక ఈ చర్చలు, రచ్చలు ఎందుకు??  కేంద్రం కూడ ఇక ఎటువంటి తాత్సారం లేకుండా రాజ్యాంగ బధ్ధంగా నియమింప బడిన కమిటీ ఇచ్చిన అత్యుత్తమ సిఫార్సు అమలు చేయాలి.  రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా  తెలంగాణాతో సహా సీమాంధ్ర లో  వెనుక బడ్డ ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక మండళ్ళు ఏర్పాటు చేయాలి.  అంతే కాదు. వేర్పాటు వాదం వెర్రి తలలు వేసున్న ఇతర రాష్ట్రాల్లో కూడ ఈ  విధంగానే అభివృధ్ధి సమతుల్యత సాధించాలి.  అంతే తప్ప సెంటిమెంటు వుందనో, లేదా దొంగ దీక్షలు చేసారనో లేదా విద్యార్ధులు చదువులు మానేసి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు చేసారనో రాష్ట్రాలు ఇచ్చుకుంటూ పోతే ఈ దేశం ఎన్ని ముక్కలు చేయాలో ఎవరూ చెప్పలేరు.

22 comments:

  1. Good job by the team members. They cleared all mis-conceptions, blatant lies, hatred and malpropaganda by TRS and presented the facts with numbers.

    Great Job within such a short time of 1year.

    ReplyDelete
  2. చాలా బాగా వ్రాశారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఉత్తమంగా ఉంది. వేర్పాటువాదులకు, తెలుగు జిన్నాకు మూర్ఖంగా ఒంటెద్దు పోకడలు పోకుండా మనుషుల్లాగా ప్రవర్తించే బుద్ధి కలగాలని కోరుకుంటున్నాను

    ReplyDelete
  3. వీడికి హిట్ల పిచ్చి....!!

    ReplyDelete
  4. >>>>> తెలంగాణాతో సహా సీమాంధ్ర లో వెనుక బడ్డ ప్రాంతాల అభివృధ్ధికి ప్రత్యేక మండళ్ళు ఏర్పాటు చేయాలి.
    >>>
    శ్రీ కృష్ణ అట్లా చెప్పలేదే.
    ఒక్క తెలంగాణాకే కదా ఆయన గారు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయమన్నది.
    అదీ 1956 నాటి తుంగలో తొక్క బడ్డ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం వేయాలత.
    నువ్వేంటి కొత్త తీర్పు ఇస్తున్నావు.

    ReplyDelete
  5. @ పైన అనానిమస్: ఇది నా తీర్పేమీ కాదు. తెలంగాణాతో పాటుగ అభివృధ్ధిలో వెనుక బడ్డ రాయలసీమ,ఉత్తరాంధ్ర ప్రాంతాలకే కాక రాష్ట్రం బైట కూడా అభివృధ్ధికి నోచుకోని ప్రాంతాలకి ఇదే మంచి సొల్యూషన్ అని శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టు చాప్టర్ 9.3.01 (vi) (a) పేజీ 457లో వుంది. ప్రశాంతంగా చదువుకోవచ్చు.

    ReplyDelete
  6. Can't you see who is discussing more on this ?
    Atleast see in the blogs who is discussing more ?

    ReplyDelete
  7. Krishna comittee chaalaaaaaa chakaga ceppindani chankalu gudukune janulara mirantha mecche oka patrikalo vachina vartha chadanvandi

    పరిణామాలతో జగన్ ఎత్తులు!: తెలంగాణలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో తీవ్ర స్థాయిలో అలజడి రేగి, హింసాత్మక ఘటనలకు దారి తీసే అవకాశాలకు తోడు.. రాజకీయ కార్యకలాపాలు కూడా ప్రభుత్వ అస్థిరతకు దారితీయవచ్చునని కేంద్రం అనుమానిస్తోంది. అది తమను కుదిపివేయవచ్చునని ఆందోళన చెందుతోంది. తెలంగాణలో ఎంపీలతో పాటు కాంగ్రెస్ ప్రజా ప్రతిని«ధులు రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదని, వీరిలో కొందరికి జగన్ ప్రోద్బలం కూడా ఉన్నదని సమాచారం అందుతున్నది.

    తెలంగాణలో రేగిన చిచ్చును జగన్ రాజకీయంగా తనకు అనుకూలంగా ఉపయోగించవచ్చునని అనుమానిస్తున్నారు. టీఆర్ఎస్, జగన్ కలిసి రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించవచ్చునని కూడా సమాచారం అందుతోంది. శ్రీకృష్ణ నివేదికపై 8 పార్టీలతో మరో దఫా సమావేశం జరిగేలోపే అనేక పరిణామాలు సంభవిస్తాయని భావిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రాజ్యాంగంలోని 356 అధికరణను ప్రయోగించేందుకు కేంద్రం యోచిస్తోందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి? బడ్జెట్ సమావేశాల వరకు పరిణామాలు ఎలా ఉంటాయి? అని గవర్నర్ అంచనా వేసి నివేదిక పంపిన తర్వాతే కేంద్రం త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

    రాష్ట్రంలో రాజకీయ పరిస్థితినే కాక, కేంద్రంలో తలెత్తే పర్యవసానాలను కూడా దృష్టిలో ఉంచుకుని కేంద్రం.." శ్రీకృష్ణ నివేదికను తెలంగాణకు వ్యతిరేకంగా తెప్పించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి". తెలంగాణలోని 11 మంది ఎంపీల కన్నా.. 21 మంది సీమాంధ్ర ఎంపీల బలం తమకు కేంద్రంలో అవసరమని అధిష్ఠానం భావిస్తున్నట్లు ఐబీ వర్గాలు చెప్పాయి. నివేదిక తెలంగాణకు ఏ మాత్రం సానుకూలంగా ఉన్నా సీమాంధ్ర నేతలు జగన్‌తో చేతులు కలుపుతారని, దీనితో జగన్ బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది.

    ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల (తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికలలోపు ఎలాంటి అస్థిరత రాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ ఆలోచన. వీటిలో కనీసం మూడు రాష్ట్రాల్లో గెలిచినా నైతికంగా, రాజకీయంగా పుంజుకుంటామని, కేంద్రంలో ప్రతిపక్షాన్ని గట్టిగా ఢీకొనగలుగుతామని అంచనా వేస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ఆంధ్రప్రదేశ్ పరిణామాలను అదుపులోకి తెచ్చేందుకు అవసరమైతే ఏడాది పాటు రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్రంలో ఆత్మవిశ్వాసం పుంజుకున్నాక తదుపరి చర్యలు తీసుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలిసింది.

    ReplyDelete
  8. Instead of quoting anons ("viswasaneeya vargaalu") can you show some proof for your creative imagination.?

    ReplyDelete
  9. If seperation is a must, one alternate solution can be:

    1) Greater Hyd, Nlgd, MBngr be made UT, TEMPORARILY and as common capital.

    2) Meanwhile, a seperate NEW capital city be built for andhra-seema, with Int.airport, metro trains, Central establishments, water supply, etc, as a well planned modern city, preferably in Prakasam District, near SriSailam dam(for water).

    3)ONLY after that, the UT be merged with Tg.

    60:40 funds may be provided by State &center. It would be better if the city be within 100kms from the coast line. The city should be planned with infrastructure for ~50lakh residents - TBD

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. నేనిక్కడ ఎవర్నీ కించపరిచడానికి కాదుగానీ అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణాలో ఉండే ఇద్దరు సమాన్యుల కోణంలో ఈ క్రింది ప్రశ్నలు అడగదలుచుకున్నాను.దయచేసి ఎవరూ అసభ్య భాషలో రిటర్న్ కామెంట్లు రాయకుండా అర్ధవంతంగా చర్చకు దిగితే ఇంకా చర్చించడానికి నేనూ సిద్ధం. ముఖ్యంగా ఎనానిమస్ బాబులు, ఎనానిమస్ గా కాకుండా మీ ప్రొఫైల్తో ఎలాంటి వ్యాఖ్యలు వ్రాసినా చర్చించేందుకు నేను సిద్ధం. బాధ్యతలు లేని చోట హక్కులకు ఆస్కారం లేదు కదా!
    1.కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోకుండా ఒకే భాష మాట్లాడేటోళ్ళం విడిపోవద్దు, విడిపోతే వీకైపోతం లాంటి కుంటిసాకులెందుకు? అట్టా విడిపోతున్న మొదటి రాష్ట్రం మనదేనా? నిన్నగాక మొన్న బీహారునుండి ఝార్కండ్ విడిపోలేదా, బీహారుకు వేలాది కోట్ల డబ్బులు కాంపెన్షేషన్ ఇవ్వలేదా (నోట్: అక్కడ పాట్నా బీహార్ మద్యలో ఉంది కనుక వదిలేసి ఝార్కండ్ సొంత కేపిటల్ ఏర్పరుచుకుంది. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణా మద్యలో ఉంది కనుక వారు కొత్త కేపిటల్ కట్టుకోవాలి, డబ్బులు మేమిస్తాం:)
    ఒకే భాష మాట్లాడే రాస్ట్రాన్ని విడగొట్టడం పాపం అనే కుహనా సమైఖ్యవాదులకు హైదరాబాద్ లేకుండా తెలంగాణా తీసుకోమనేటప్పుడు ఆ బుద్ధి గడ్డికరిచిందా? విడిపోతే కేంద్రంలో వీకైపోతామనేది కూడా ఎంత అర్ధరహితం. ఇప్పుడు 33మంది ఉండికూడా (తమ స్వంత వ్యాపారాలూ, రాజకీయ బ్రోకరెజీలూ తప్ప పక్కనున్న తమిళోడు అన్నీ ఎగరేసుకుపోతుంటే మిడ్గుడ్లేసి చూడటం తప్ప) రాష్ట్రానికి ఊడబొడిచిందేమిటి?
    2."చల్లకొచ్చి ముంత దాచినట్లు” కాకుండా వారి బాదేందో డైరెక్ట్ గా జెప్పాలె. నీళ్ళ విషయంలో వారికుండే అనుమానాలు అర్ధం జేసుకో దగ్గవే, హైదరాబాదులో ఇప్పటికే ఉద్యోగాలు(ప్రభుత్వ& ప్రయివేటుకూడా) చేసుకునేవాళ్ళను కొనసాగనివ్వాలి, కొత్త కేపిటల్ కోసం డబ్బులు ఇవ్వాలి - ఇవన్నీ న్యాయమైన కోరికలేగా. మేమేమన్నా కాదన్నామా?
    ప్రభుత్వోద్యోగావకాశాలు అంతరించిపోతున్న నేటిరోజుల్లో....అంటూ ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదన్నట్టుగా కమిటీ అభిప్రాయపడటం తప్పు. ఎందుకంటే ఖాళీగా ఉన్న పోస్టుల్లో అవుట్‌సోర్సింగ్ పేరుతో పెట్టుకుంటున్న వారిలో నూటికి తొంబై మంది ఆంధ్రా వారే(వడ్డించే పై అధికారులు ఎక్కువ వాళ్ళవాళ్ళే కావడం & ఇతరత్రా ఇంఫ్లూయెన్స్‌లవల్లానూ) అన్నది ఇక్కడ గమనించాలి.
    3.ఇక హైదరాబాదును చుట్టూతా ఉన్న జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి యూటీ చెయ్యమనడం ఎంత బాద్యతారాహిత్యం? వారు మదరాసు నుండి విడిపోయి వచ్చినప్పుడుకూడా ణ్ 5 & ణ్ 205 దారిలో ఉన్న జిల్లాలన్నీ ఇలాగే యూటీలు చేయించుకుని వచ్చారా? ఇప్పుడు హైదరాబాదును మొత్తానికి మొత్తంగా వారే నిర్మించేసినట్టు హక్కులు కావాలంటున్నట్లే మదరాసును కూడా వారే కట్టుంటారే:) మరి దాన్నెలా వదులుకునొచ్చారబ్బా? తమిళ తంబీల దగ్గర పారని వారి పాచిక తెలంగాణోళ్ళ దగ్గర మాత్రం పారాల్నా?
    ఆనాడు మద్రాసు రాష్ట్రంనుండి విడిపోయి వచ్చేనాడు ఈ తెలివి ఎక్కడపోయింది? మద్రాసునుకూడా మా రక్త మాంసాలతో అభివృద్ధి చేసాం కనుక మా ప్రాంతానికి ఎత్తుకుపోతాం అనలేదే?
    అఫ్కోర్స్ వారడిగారుకూడా ఆంధ్రాలో కలపాలని(అది తలా తోకా లేని కోరిక అనేది వేరే విషయం). కానీ దాన్ని సాధించుకోకుండానే తోక ముడవలేదా?
    4.అన్నట్టు హైదరాబాదులోగానీ, అప్పుడు మదరాసులోగానీ ఎవడ్ని బాగుజెయ్యడానికి పెట్టుబడులు పెట్టారన్నా వారు? ఏ వ్యాపారి అయినా తను పెట్టిన పెట్టుబడులకు తగ్గ రాబడి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూనే ఉంటడు. హైదరాబాదులో వారు జేసిందికూడా వ్యాపారమే అయినప్పుడు మమ్మల్నేదో ఉద్ధరించినట్టు బిల్డప్పెందుకు? పైగా చుట్టుపక్కల జిల్లాలకు ఏం ఊడబొడిచారని అవికూడా కలిపి యూటీ చెయాలి? వారికి రాస్తా ఇయ్యడం కోసమా? అంటే ఏది పచ్చగుంటే అది వారికే కావాలా? ఇట్టా జేసేకదా ఆనాటి ఆంధ్రా & తెలంగాణా పెద్దలు మంచి ఉద్దేశ్యంతో పెట్టిన రూల్సన్నీ తుంగలో తొక్కబట్టేకదా ఇప్పుడు ఈ గొడవంతా?
    5. పోనీ వారి డబ్బులు, ఆస్థులు ఇంకా ఇక్కడే ఉంటాయిగదా అనుకున్నా అయ్యన్నీ మేమేమన్నా గుంజుకుంటమా ఏంటి? పాత వ్యాపారాలు కంటిన్యూ చెయ్యొచ్చు, కొత్త వ్యాపారాలూ మొదలు పెట్టొచ్చు. అప్పుడెప్పుడో బయటికొచ్చినా ఇంకా మదరాసులో వ్యాపారాలు జేసుకుంటలేరా ఏంది? ఎటొచ్చీ గవర్నమెంట్ ఉద్యోగాలు కొత్తగా వారికి రావు అంతే తేడా. దీనికి అంత బాదెందుకు. ఒకవేళ మేము మాట తప్పుతం అని వారికనిపిస్తే 1956 లో మాకు రక్షణల పేరుతో చేసుకున్న ఒప్పందం లాంటిదే ఇప్పుడు వారు చేసుకోవచ్చుగదా:)

    ReplyDelete
  12. పై వన్ని కలిసుండి కూడా చెయ్యొచు. ఇంతకీ మీ బాధేంటొ క్లుప్తంగా చెప్తే ఎవరైనా స్పందిస్తారేమో.

    ReplyDelete
  13. నాకు అర్థం కాని లాజిక్ ఏమంటే, మద్రాస్ ని ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఆంధ్రలో కలుపుకోలేదు అనేది కాలంచెల్లిన అర్థరహిత ప్రశ్న. ఏదో వాదించాలనుకుంటే ఇలాంటి ప్రశ్నలు లేవనెత్త వచ్చు.

    1. నిజాం హైద్రాబాద్ని పాకిస్థాన్లో కలుపుదామని ప్రయత్నాలు చేశాడు, మరి ఇండియాతో ఎందుకు కలిసారు? పాకిస్థాన్లో వుండి వుంటే హైద్రాబాద్ దేశంగా వుంటే ఆంధ్రలో విలీనమయ్యే ప్రశ్నే వుండేది కాదు గదా? గొప్ప ప్రభువని అంటున్న నిజాం ఆశయాలకు విరుద్ధంగా మా పంచన ఏల చేరవలె?
    2.ఆక్రమిత దేశమైన తెలంగాణా ప్రాంతానికి స్వతంత్ర భారతదేశంలోని రాష్త్ర విభజన అనే అంతర్గత సమస్య ప్రశ్నించే హక్కు ఎందుకుంటుంది? :)
    3. అప్పుడే 1953నాటికి తెలంగాణవాళ్ళు ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్త లేదు?
    4. మద్రాసు ఆంధ్రలో లేదని తెలిసీ ఎందుకు 1956లో ఆంధ్రతో కలిశారు?


    అర్థంచేసుకునేవారికి కొంచెం లాజికల్గా చెప్పాలంటే, 1953 నాటికి ఆంధ్ర మద్రాస్ రాష్ట్రంలో వుండి 5ఏళ్ళే అయ్యింది. విధివిధానాలు, చట్టాలు, అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్నాయి. మద్రాస్ తమిళులకు చెందుతుందని ఎస్.ఆర్.సి నిర్ణయించింది, ఆంధ్ర దాన్ని గౌరవించి రాజీ పడింది. తమిళ్ పేరుగల తిరుపతి తమిళు డిమాండ్ లనుంచి దక్కించుకుంది. ఇది 50ఏళ్ళ కిందటి చరిత్ర, ఆ చరిత్రనే 21వశతాబ్దానికి కూడా ప్రస్తుత ప్రస్థితులకు అతీతంగా, తు.చ. తప్పకుండా చేయాలని మేధావులు వాదించడం... :)) " పిల్ల ఏడిచిందా? వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు. మా బామ్మ మా నాన్నగార్కి అదే వాడేది" అన్న ఆడ్ లా వుంటుంది.
    స్వతంత్ర భారతంలో ఆంధ్ర మద్రాసుతో వుండింది 5ఏళ్ళలోపే, తెలంగాణ భాగస్వామ్యం 54ఏళ్ళ అని గ్రహిస్తే వితండవాదానికి తెలివితేటలు వాడాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంకా నెహ్రూ ఎప్పుడో ఏదో యధాలాపంగా అన్నది పట్టుకు వేలాడకపోతే, ఏంచేశాడు, ఇందిర ఏంచేసింది, చెన్నారెడ్డి, పివి, అంజయ్య, జలగంలు ఏంచేశారు అన్నది గ్రహించాలి.
    ప్రస్తుతం శ్రీకృష్ణ ఏమన్నారు? నిషేదిత నక్సలైట్ అజెండా అమలు చేయడానికి ఓ రాష్ట్రం ఇవ్వాలా అనేదిపై చర్చించడానికి తమ అమూల్యమైన కాలాన్న్ వృధా చేయగలరు.

    ReplyDelete
  14. >>ఆనాడు మద్రాసు రాష్ట్రంనుండి విడిపోయి వచ్చేనాడు ఈ తెలివి ఎక్కడపోయింది? మద్రాసునుకూడా మా రక్త మాంసాలతో అభివృద్ధి చేసాం కనుక మా ప్రాంతానికి ఎత్తుకుపోతాం అనలేదే?>>

    "Hyderabad State was made up of sixteen districts, grouped into four divisions. Aurangabad division included Aurangabad, Beed, Nanded, and Parbhani districts; Gulbarga (Gulbarga) division included Bidar District, Gulbarga, Osmanabad District, and Raichur District; Gulshanabad District or Medak division included Atraf-i-Baldah, Mahbubnagar, Medak, Nalgonda (Nalgundah), and Nizamabad districts, and Warangal division included Adilabad, Karimnagar, and Warangal districts."

    Why &how Telagana lost so many districts of their Exalted Nawab's Kingdom to other states?

    Got answer to your question, now? he he he

    ReplyDelete
  15. @Anonymous(January 13, 2011 1:57 AM)
    భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 371 లో వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధికోసం కొన్ని మార్గదర్శకాలను, 5వ,6వ షెడ్యూళ్ళలో షెడ్యూల్డ్ కులాల, తెగల అలాగే ఈశాన్య రాష్ట్రాల పరిరక్షణకోసం అనేక రాజ్యాంగ రక్షణలు కల్పించబడ్డాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రబ్బరు స్టాంపులుగా మిగిలిపోయిన రాష్ట్రపతుల నిష్క్రియాతత్వంవల్ల ఇవన్నీ అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద ఎత్తున రగులుతున్న అసంతృప్తి జ్వాలలకూ, ప్రత్యేకవాదనలకూ ఇదే మూలం.
    అయితే ప్రత్యేక తెలంగాణా వాదన విషయానికొస్తే ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు ఏదైనా చేసి రాష్ట్రాన్ని ఇంకా సమైఖ్యంగా ఉంచగలమేమో చూద్దామా అనే ఆశలు ఇంకేమాత్రం మిగలని స్థితికి మనం చేరుకున్నం గనుక ఇహ విభజన తప్ప మరో పరిష్కారంలేదనే వాస్థవాన్ని అందరం అంగీకరించాలి. పెద్దమనుషుల ఒప్పందం, 6 పాయింట్ ఫార్ములా, 610 జీవోలల స్పూర్థిని గౌరవించాలనే స్పృహ ఈ 54 ఏళ్ళలో కోరవడబట్టే నేడీ పరిస్థితులు దాపురించాయనేది కాదనలేని వాస్థవం.

    ReplyDelete
  16. @Snkr
    వాస్థవాలను మరచి నేననేదే కరక్టని నేనూ, మీరనుకున్నదే కరక్టని మీరూ వాదించుకుంటూపోతే ఉపయోగం ఉండదు. నేను కేసీఆర్ లాంటి తెలంగాణా వాదిని కాదు. టీఆరెస్ సపోర్టర్నీ కాదు. నిజాం విషయంలోనూ(జిన్నా విషయంలో అధ్వానీలాగే), ఆంధ్రా ప్రజలను దొంగలు అనడం లాంటివాటన్నింటిలోనూ అతన్ని నేను 100% వ్యతిరేకిస్తాను. ఈ విషయాలన్నీ నా బ్లాగులో(@http://dare2questionnow.blogspot.com/2011/01/blog-post_08.html) క్లియర్గా వ్రాసానుకూడా. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఆయన ఏదో ఒరగబెడతారన్న ఆశలుకూడా నాకు పెదగా ఏమీ లేవు. చత్తీస్ఘడ్ లో శిబూసోరెన్ దీనికి ఉదాహరణ. అయితే తెలంగాణావాదం ఆయనకేమీ పేటెంట్ చెయ్యబడలేదు. ఆయనా, ఆయనలాంటి నాయకులు గతంలో కొందరూ (జై ఆంధ్రా విషయంలోనూ) దాన్ని రాజకీయ స్వప్రయోజనాలకోసం ఎలా వాడుకున్నారో ఏవాద సమర్ధకులకైనా ఇట్టే తెలిసిపోతుంది. కానీ, ఇప్పుడు ఈ ప్రాంతపు ప్రజలందరూ, ఎందరో విధ్యాధికులూ, కొందరు ఆంధ్రాప్రాంత మేధావులు కూడా విభజన డిమాండ్ వెనకున్న సహేతుక కారణాలను అర్ధం చేసుకున్నారు. (same rule applies to support on సమైఖ్యవాదం)
    అయితే కృష్ణ కమిటీ రిపోర్ట్లోకూడా (ఆప్షన్ 1 లో) సమైఖ్యంగా ఉన్న కాలంలో నాటి పెద్ద మనుషులు ఏ విషాల ద్ర్క్పధంతో రెండు ప్రాంతాలను కలిపారో, రెండు ప్రాంతాల మద్య అప్పటికి ఉన్న వాస్థవిక చారిత్రక, సాంస్కృతిక, సామాజిక అంతరాల దృష్ట్యా ఈ ప్రాంతానికి కల్పించిన రక్షణలు సరిగా అమలుచేయబడనందువల్లే ప్రస్థుత విషమ పరిస్థితి దాపురించిందని సూటిగా చెప్పలేదా? అయితే 6వ ఆప్షన్ లో అలాంటి ప్రయోగాన్నే (మరిన్ని రాజ్యాంగ రక్షణలతో అని ఆయన ఉద్దేశ్యం కావచ్చు?) మరోసారి చెయ్యమనేవిధంగా ఉన్న సలహా మంచిదే అయినా “ఇప్పటివరకూ జరిగినవె మళ్ళీ పునరావృతం కావని ఎలా చెప్పగలం" అనే ప్రశ్నలు సగటు తెలంగాణా పౌరులందరిలోనూ ఉంది. నామటుకు నేను నిజంగా అలాంటి రాజ్యాంగ రక్షణలతోబాటూ నిజాలను అంగీకరించి వెనకబడ్డ ఏ ప్రాంతన్ని అయినా (ఉత్తర తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర....ఇలా ఉండాలి ప్రాధాన్యతలు) చిత్తశుద్ధితో అభివృద్ధి చెయ్యాలనీ, ఒక ప్రాంతంవారి అవకాశాలను మరొకరు దెబ్బతీయకుండా సహనం వహించాలనే విధంగా మనందరి (ముఖ్యంగా నాయకుల) ఆలోచనాధోరణిలో మార్పు రాగలిగితే సమైఖ్యంగా ఉండడం ఖచ్చితంగా బేస్టే.
    అయితే గిర్గ్లానీ కమీషన్ సిక్ష్ పాయింట్ ఫార్ములాకు, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యోగ నియామకాల్లో ఉల్లంఘణలు జరిగాయని నిక్కచ్చిగా చెప్పిన తరువాతా, దాన్ని సరిచేసేందుకు NTR 610 జీఓ తెచ్చిన తరువాత కూడా ఎన్ని యేళ్ళైనా తప్పులను సరిచెయ్యలేకపొగా కనీసం ఏ శాఖలో ఎంతమంది అలాంటివారున్నారన్న గణాంకాలు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం/ అధికారులు ఇన్నేళ్ళు తాత్సారం చెయ్యడంలాంటివన్నీ కూడా రాజ్యాంగ ఉల్లఘణలేగా?ఇక హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం మరో ఉదాహరణ.
    (ఎందుకంటే సిక్ష్ పాయింట్ ఫార్ములాను ఆర్టికల్ 371డి ద్వారా రాజ్యాంగ రక్షణ కల్పించారు) అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రయోగాలే చేద్దమంటే నమ్మకం ఎలా కుదురుతుంది?
    ఇందుకు ఏవైనా మార్గాలుంటే చెప్పండి. ప్రజల్ని (ముఖ్యంగా మన ఇరు ప్రాంతాల మూర్ఖ నాయకుల్నీ) అందరం కలిసి ఒప్పించవచ్చేమో చూద్దాం:) వాస్థవానికి ఇలాంటి ప్రయత్నం శ్రీ ఖ్రిష్ణ చేసియుండాల్సిందనేది నా అభిప్రాయం.

    ReplyDelete
  17. ఇక మీరు వేసిన మిగతా ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ,
    1.ఇండియాతో ఎందుకు కలిసారు? పాకిస్థాన్లో వుండి వుంటే హైద్రాబాద్ దేశంగా వుంటే ఆంధ్రలో విలీనమయ్యే ప్రశ్నే వుండేది కాదు గదా? నిజాం ఆశయాలకు విరుద్ధంగా మా పంచన ఏల చేరవలె?
    ఈ ప్రశ్న మీరడిగితే అందులో మా ప్రజల ప్రమేయం ఏమీ లేదుకదా. ఒకటి దేశంలో విలీనం, రెండోది పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం సమైఖ్య రాష్ట్ర ఏర్పాటు. మొదటిది దేశ హితంకోసం అందరంకోరుంటాం. కానీ రెండోది-సమైఖ్యం అనేది రెండు ప్రాంతాల్లో ఎన్నికలు జరిపాక మెజారిటీ ప్రజా ప్రతినిధుల అభిప్రాయం తీసుకొన్నాక నిర్ణయించాలని మొదట నిర్ణయించినా ఇక్కడి ప్రజల అభిప్రాయం అనుకూలంగా వస్తుందో లేదో అన్న భయంతో ముందే కలిపేసారన్నది ఆరోపణ.
    2."ఆక్రమిత దేశమైన తెలంగాణా ప్రాంతానికి స్వతంత్ర భారతదేశంలోని రాష్త్ర విభజన అనే అంతర్గత సమస్య ప్రశ్నించే హక్కు ఎందుకుంటుంది? :)"
    ఇది చాలా బాధ్యతారాహిత్యంతో కూడిన మాట. అప్పుడు ఆక్రమిత దేశమైనా ప్రశ్నిస్తున్నది ఇప్పుడు:) ఆ మాటకొస్తే రాజుల కాలంలో అనేక రాజ్యాలుగా విడగొట్టబడ్డ అచ్చ తెలుగు ఆంధ్రా ప్రాంతాలుకూడా బ్రిటీషువారిచేత ఆక్రమించబడిన తరువాతనే ఏకం చేయబడింది.
    3. "అప్పుడే 1953నాటికి తెలంగాణవాళ్ళు ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్త లేదు?"
    ఒక ప్రశ్న ఎప్పుడు వేశామన్నది ముఖ్యం కాదు, సమాధానం ఏమిటన్నదే ముఖ్యం.
    4. "మద్రాసు ఆంధ్రలో లేదని తెలిసీ ఎందుకు 1956లో ఆంధ్రతో కలిశారు?"
    మళ్ళీ అదే ప్రశ్న. అప్పుడు మదరాసును వదులుకుని రగా లేనిది హైదరాబాదును ఎందుకు కోరుతున్నారనేది. మదరాసు ఆంధ్రలో ఉండాలని ఆ రోజైనా ఈరోజైనా ఎవరూ అనట్లేదు. అలాగే హైదరబాదూనూ-భోగోళికంగా ఏ ప్రాంతం లో ఉండేది అక్కడే ఉండిపోవాలనేది సహజ న్యాయసూత్రం.

    @"1953 నాటికి ఆంధ్ర మద్రాస్ రాష్ట్రంలో వుండి 5ఏళ్ళే అయ్యింది. విధివిధానాలు, చట్టాలు, అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్నాయి"
    విధివిధానాలు, చట్టాలు, ఎప్పుడు రూపుదిద్దుకున్నా అవి ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, అణ్వయించుకునే తీరునుబట్టి ఉంటాయి.
    ఇప్పుడు కృష్ణ కమిటీ గొప్పది, వారు చెప్పింది తారక మంతరం అనే మనం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల వీహయంలో ఇచ్చిన తీర్పును మాత్రం వ్యతిరేకించవచ్చ? అంటే శ్రీకృష్ణకు ఉన్న విస్వసనీయత బ్రజేష్ కుమార్ కు లేదనా?
    కాదు. వాళ్ళలాంటి విజ్ఞులు చెప్పేవాటిల్లో వాస్థవాలే ఉండేందుకు అవకాశం ఉన్నా మరొక ఆచరణ సాధ్యమైన పరిష్కారం కొరకు ప్రయత్నించగలిగితే అందరికీ ప్రయోజన్ముంటుందికదా అన్న ఆతృత అందరిలోనూ ఉంటుంది. అది కృష్ణా నీళ్ళు కావచ్చు, రాష్ట్ర విభజనా కావచ్చు. అది వేరూ ఇది వేరూ అంటే ఎవర్ని ఎవరమూ బాగు చెయ్యలేం:)

    @"తెలంగాణ భాగస్వామ్యం 54ఏళ్ళ అని గ్రహిస్తే వితండవాదానికి తెలివితేటలు వాడాల్సిన అవసరం తగ్గుతుంది"
    నా ఉద్దేశ్యంలో వితండవాదం కోసం నేను ఏ అతి తెలివితేటలు వాడలేదు. ఈ 54 యేళ్ళ భాగస్వామ్యం లో నేఅక లోపాలు ఉన్నాయనేదే నేను చెప్పడానికి ప్రయత్నించాను. SKC కూడా ఆప్షన్ 1 లో చెప్పింది.

    ReplyDelete
  18. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక రంధ్రాన్వేషన చేస్తూ పోతే ఇలానే నాంచబడుతూ వుంటుంది. రాజకీయ నిరుద్యోగుల లొల్లి వల్ల, ఏ పరిశ్రమలు రావట్లేదు. లక్షలకోట్ల పెట్టుబడులు గుజరాత్ తన్నుకు పోయింది, వున్నవి వూడుతున్నాయి. బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే ఆంధ్ర ఎక్కడికో దిగజారిపోయింది.

    నా ప్రిఫరెన్స్, ఆంధ్రసీమకు ఓ మోడ్రన్ రాజధాని వచ్చేవరకూ హైద్రాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ యు.టి. ఆ తరువాత యు.టి వాళ్ళు ఇష్టపడి అప్పటికే నక్సల్స్ అజెండాతో సర్వతోముఖాభివృద్ధి చెందిన తెలంగాణాలో చేరిక. ఈలోపున కావాలంటే మహారాష్ట్ర, కర్నాటక లనుంచి పోయిన జిల్లాలకై గుంజుడు ఉద్యమాలు, పోరుబాట, భూకంపాలు, నరుకుడు, తగలెట్టుడు కార్యక్రమాలు. అపుడే నిజాం ప్రభువు ఆత్మకు శాంతి. ఏమంటారు? :)) :P

    ReplyDelete
  19. నిజానిజాలను పరిశీలించి చర్చించి ఏదిమంచో నిర్ణయించుకునే ఓపిక లేకపోతే, నే పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే మొండి ధోరణిలో ఆలోచిస్తూపోతే ఇతరుల మాటలు "రంధ్రాన్వేషణ" గానే కనపడతాయి. ఓ పేద్ద పుడింగి సీయం ఉన్నప్పుడే గ్యాస్ గుజరాత్ కు తరలిపోయింది, TATA, ఓక్స్ వ్యాగన్ లాంటి ఎన్నో సంస్థలు ఊరించి తర్వాత వెక్కిరించి వెళ్ళిపోయాయి. ఇప్పుడుపోయాయి లేదా పోతాయి అని చెప్పబడుతున్నవన్నీ ఒక్కసారి మన సమస్య పరిష్కారం కాగానే అవే వెనక్కు వస్తాయి లేదా వాటిని తలదన్నే కొత్తవి వస్తాయి. మీరు చెప్పే లాజిక్కే కరక్టయితే మత ఛాందస ముఖ్యమంత్రిగా పేరొచ్చిన, అమెరికా వీసా కూడా ఇవ్వడానికి నిరాకరించిన మోడీ రాష్ట్రంలోక్కూడా పెట్టుబడులు రాకూడదు, నక్షల్ సమస్యలున్న Chattisghad, ఝార్కండ్ లకూ రాకూడదు.
    ఇక నక్షల్ యెజండా అనేమాట ఏమంత తప్పుపట్టాల్సిన పనిలేదు. నిజంగా నక్షలిజం ఏర్పడ్డానికి కారణమైన పరిస్థితులను సరిదిద్దుతామని. చిరంజీవి కూడా సామాజిక తెలంగాణా అన్నాడు. ఇదీ అలాంటిదే. చిన్న రాష్ట్ర మైతే మత ఛాందసత్వం, నక్షలిజం పెరుగుతుందని చెప్పడం కూడా ఓ కుంటిసాకే. పెద్దరాష్ట్రమైన పశ్చిమబెంగాల్ ఎందుకు మావోయిజాన్ని అరికట్టలేక పోతుంది? పెద్ద రాష్ట్రమైన బెంగాల్ నుండి మత ఛాందసులు కాదా తస్లిమాను వెళ్ళగొట్టింది? పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కాదా తస్లిమాపై చెప్పులు విసిరింది?చిన్న రాష్ట్రమైన కేరళలొ, హర్యాణాలో మత ఛాందసం ఉందా? ఏదో మాటవరసకన్నా నిజంగానే నక్షల్స్‌లాగా ప్రవర్తిస్తామని కేసీఆర్ లాంటి నాయకులన్నా కేంద్రం చూస్తూ ఊరుకోదు. ఆ మాటకొస్తే జీవితాంతం కేసీఆరే ఏమీ సీయం కాడు, ప్రతిదీ ఆయనన్నట్లే చెయ్యడానికి. నిజంగా అధికారం చేజిక్కించుకున్న నేపాల్ మావోలుకూడా ప్రజాభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డారు తప్పితే వాళ్ళు ద్వేషించే ఇండియాపై యుద్ధం ప్రకటించలేదు.
    కనుక నేను చెప్పదలుచుకున్నది నేను చెప్పాను. మిగతాది మీ ఇష్టానికి వదిలేస్తున్నాను. కానీ, ఒక్క విషయం మీకో నాకో ఇష్టంలేదన్నంతమాత్రాన జరగాల్సినవి జరక్కమానవు. కానీ, ఎక్కడా జరగనివి, సహజ న్యాయసూత్రలకు భిన్నమైనవీ జరగాలని కోరుకోవడం మాత్రం అత్యాశే అవుతుంది-అది మీరైనా, నేనైనా:)
    (I think I have put forth whatever all is required for a nice debate. Hence, I will refrain further commenting on whatever anybody else is going to write. Bye&Thanks to All).

    ReplyDelete
  20. /చిన్న రాష్ట్రమైన కేరళలొ మత ఛాందసం ఉందా?/

    అబ్బే లేదు సార్, మీరు చెప్పినవన్నీ 'సహజన్యాయ సూత్రాలు ' కదా. మీరు చెప్పిందే కర్క్ట్. బై చెప్పారు, దానికి థాంక్సులు. ఎప్పుడైనా ఇవి చదువుకోండి.

    http://intellibriefs.blogspot.com/2007/03/jihadi-terrorism-training-camps-in.html
    http://www.youtube.com/watch?v=nqm6-d7l0T0
    http://rajeev2004.blogspot.com/2009/12/kerala-is-new-epicenter-of-terrorism.html
    http://www.prokerala.com/community/showthread.php?t=84

    ReplyDelete
  21. అంతేలే తిమ్మినిబమ్మిని చేసైనా ఆంధ్రోళ్ళు వాళ్ళకేం కావాలో అది సాధించుకుంటాండ్రు. మన నాయకులకే ఏదీ చాతకాదు. ఏం చేస్తాం మన ఖర్మ. ఇక వున్నదంతా మన విద్యార్ధుల చేతుల్లోనే ఉంది. మనమే చూసుకుందాం.

    ReplyDelete