Monday, February 14, 2011

వాలెంటైన్స్ డే అయితే వర్రీ ఎందుకు?

ప్రేమికుల రోజు (Valentines Day) గురించి భజరంగ్ దళ కార్య కర్తల ఆగడాలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. కేవలం ప్రచార ఆర్భాటం కోసం సంప్రదాయ పరి రక్షకులుగా అవతారం ఎత్తి చేతికి దొరికిన జంటలకి పెళ్ళిళ్ళు చేయటం మూర్ఖత్వమే. మీడియా కూడా అటువంటి వార్తలకి ప్రాధాన్యం ఇవ్వడంతో వారు మరింత రెచ్చి పోతున్నారు.  లౌకిక రాజ్యమైన మన దేశంలో ఇటువంటి చర్యలు దేశ గౌరవానికి మచ్చ తెస్తాయి.  ప్రపంచమే కుగ్రామంగా మారిన నేటి రోజుల్లో ఒక దేశం వారి పండగలు మరో చోట జరుపుకోవటం సర్వ సాధారణం. మన దేశానికి సంబంధించిన దీపావళి, గణేష్ చతుర్ధి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవట్లేదా? అలాగే ఇష్టమైన వారు ప్రేమికుల రోజు జరుపుకుంటే తప్పు ఎందుకు అవుతుంది? కొన్ని జంటలు ప్రేమికుల రోజు కానుకలు ఇచ్చి పుచ్చుకున్నంత మాత్రాన దేశ సంస్కృతి మంట కలిసి పోతుందా?  కొన్ని తరాల పాటు ముస్లిముల పాలనా,   ఆ తరువాత ఆంగ్లేయుల పాలన సాగినా కూడా తట్టుకొని నిలబడిన మన సంస్కృతి ఆఫ్ట్రాల్ వాలెంటైన్స్ డే సంబరంగా జరుపుకుంటే నిలబడదా?మన సాంప్రదాయాల ప్రకారం వాలంటైన్స్ డే పనికి రానపుడు జనవరి ఒకటో తేదీ ఆంగ్ల సంవత్సరాది కూడా నిషిద్ధమే అవాలి.  కానీ ఆ రోజు హేపీ న్యూ ఇయర్ చెప్పుకోని భజరంగ్ దళ సభ్యుడు ఎవరైనా ఉంటాడా?

4 comments:

  1. భజరంగ్ దళ్ చేసిన పనిలో తప్పేమీ లేదు
    అనేక దేశాలు ఇప్పటికే వాలెంటైన్స్ డే పై నిషేధం విధించాయి

    వారి కార్యాల వలననే

    ఈ రోజు జరిగే విచ్చల విడి లైంగిక అకృత్యాలు ఆగాయి

    ReplyDelete
  2. నిజమే! అర్థం పర్థం లేని ,కేవలం ఉనికిని చాటుకోవడానికి రోడ్డు మీద పడి కన్పించిన జంటలను ఇబ్బంది పెట్టె అధికారం ఎవరిచ్చారో వీళ్ళకు? వ్యక్తిగత స్వేఛ్చ కు భంగం కలిగేలా ప్రవర్తిస్తామని ప్రజలను భయపెట్టే ఈ సంస్థలపై చట్ట బద్ధ్హంగా చర్యలు తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం సిద్ధం కావాలి.

    ReplyDelete
  3. మచ్చల మనిషిFebruary 14, 2011 at 8:23 PM

    ఈ వాలెంటైన్స్ డే మరో రోజు పెట్టుకోమనండి.. భగత్ సింగ్ త్రయాన్ని ఉరి తీసిన రోజు మరిచి పోయేలా చేసింది ,,, పరాయి వారి ముందు చేతులు కట్టుకున్న గాంధీ ని హీరో చేశారు,..

    ReplyDelete
  4. my bad... some websites still says Bhagat singh's death was on Feb 14th. & Wikipedia says its on Mar 13

    ReplyDelete