Sunday, July 17, 2011

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!

సీమాంధ్ర మంత్రి తోట నరసింహం పై తెలబాన్లు దౌర్జన్యం చేసిన దరిమిలా తమకు రక్షణ కరువైందని వాపోయిన మంత్రి టీజీ వెంకటేష్ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ హరీష్ రావు చేసిన ప్రకటన దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉంది.   ఆయన పై సు మోటో గా కేసు బుక్ చేయాలనీ, మంత్రి పదవినుంచి తొలగించాలనీ ఇంకా చాల డిమాండ్లు చేసారు.  గురువింద గింజ మాదిరిగా ఆరోపణలు చేసే ముందు తమ కింద ఎంత నలుపు వుందో తెలుసుకోక పోవటం ఆశ్చర్యకరం! 
ఆంధ్రా వాలే భాగో....నాలుకలు కోస్తాం.. సీమాంద్రులని తరిమి కొడతాం... వారి ఆస్తుల్ని లాక్కుంటాం..ఇలా ఒకటా రెండా? ఎన్నెన్ని ప్రేలాపనలు! ఉద్యమం ముసుగులో ఏమి చేసినా, ఏమి వాగినా చెల్లి పోతుందన్న ధీమాలో చేసిన అకృత్యాలు ఎన్ని? 
సు మోటో గా కేసులు బుక్ చేయాల్సి వస్తే ముందు తెలబాన్ల పైన బుక్ చేయాల్సిన కేసులు లెక్కకి అందవు.
 గీతా ఆర్ట్స్ కార్యాలయాన్ని ఆక్రమించి తెలంగాణా బేనర్ కట్టటం... మర్యాద రామన్న షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో బలవంతంగా జై తెలంగాణా అనిపించటం...అదుర్స్ సినిమాని ఆడనివ్వబోమని బెదిరించడం...వాహనాలపై టీజీ స్టికర్లు వుండాలని హుకుం లు జారీ చేయటం...రాష్ట్రం రాకుండానే రాజ ముద్రని చలామణీ లోకి తేవటం..ఇలా చెప్పుకుంటూ పొతే కేసులు బుక్ చేయాల్సిన సంఘటనలు కోకొల్లలు. 
అవన్నీ ఒకెత్తు. శాసన సభ్యుడైన నాగం ని (తెలుగు దేశంలో వుండగా) చితక్కొట్టటం, నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడినందుకు టీవీ కెమెరాల సాక్షిగా కొట్టండి రా వాణ్ని అంటూ జే పీ పై భౌతిక దాడికి దిగటం, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలని ద్వంసం చేయటం ఆటవిక చర్యలు కావా? వాటి పై చర్యలు తీసుకోకూడదా ?
అన్నిటికన్నా దారుణం..తెలుగు జాతి చరిత్రకి సగర్వ సాక్షులైన టాంకు బండ్ విగ్రహాల్ని ద్వంసం చేయటం. అందుకుగాను మిలియన్ మార్చ్ నిర్వాహకులని శిక్షించటం...ఆధ్వర్యం వహించిన పార్టీని నిషేధించటం చెయ్యాలి. కానీ అటువంటి చర్యలేమీ తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చో బట్టే నేడు తెలబాన్లు ఉద్యమం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలుసు పెచ్చు మీరటంతో, ప్రభుత్వంలో భాగమైన మంత్రినే వేలెత్తి చూపుతున్నారు. కానీ ఒక వేలెత్తి చూపితే, నాలుగు వేళ్ళు తమకేసే చూస్తాయన్న నిజం మూర్ఖ తెలబాన్లకి ఎప్పుడు అర్ధం అవుతుందో?

11 comments:

  1. avunu gurigimajaki G kimda nalupu teliyadu veedoo imte

    ReplyDelete
  2. నిజం చెప్పిన్రు. ఈ సిగ్గుమాలిన నాయకులకి, తెలంగాణా ప్రజలకన్నా తెలుగోళ్ళని ముక్కలు చెయ్యటం మీదే ఇంట్రస్టు. విడగొట్టుడు ఉద్యమం పేర్ల గీ కేసీయార్ అండ్ కంపెనీ మస్తుగ చేస్తున్న వసూళ్ళ సంగతి ఎవ్వలకి తెల్వదు? వసూళ్ళు చేసి మాకెవ్వలికైనా ఇస్తుండా? నాగం నీ, గా పెద్ద మనిషి జేపీ గారినీ కొట్టమని మేమన్నమా? పదిమందిలో తెలంగాణా ప్రజలు గిట్లంటోళ్ళనుకునేలా చేస్తుండు గీ దరిద్రపోడు. మా తెలంగాణా అత్మాభిమానం కాపాడుకుంటనే తెలుగోల్లందరూ కలిసే ఉండాలె. మంచిగ చెప్పినవ్ తమ్మీ.

    ReplyDelete
  3. What about the following incidents?

    - Attack on actor Narayana Murthy in AU
    - Attack on BJP meeting in Vijayawada
    - Sridhar Babu's convoy attacked in Chittoor
    - Harish Rao attacked on Tirumula Hills
    - Juloori attacked by "samakyavadis" in Berhampore Telugu mahasabha
    - HSBC & Kapil Chits offices stoning
    - Lagadapati attacking Congress worker in Vijayawada pallebata
    - YS Viveka beating up Gali inside the assembly
    - Parakala Prabhakar & co. throwing out a young lady during the VMS meeting in Delhi
    - Teegala & co. attacking lawyers in Hyderabad under Babu orders
    - Dr. Praveen Togadia attacked by Congress & Majlis goons when he came on a private visit

    There are hundreds of such examples but your myopic (andha) guys are silent about it.

    Another interesting contradiction:

    As we want to seperate, some of our people may hate your guys. But you want (or claim) to stay together. Why do you hate us then? What kind of sick person wants to stay with those whom they hate?

    ReplyDelete
  4. Jai,
    Good to know that Samaikya vadi's are also attacking. They might have learnt this attacking from Telangana vadis. There's nothing sick in wanting to stay with those whom we hate. It's (Samaikya vaadam) only strategical. Nobody is dying to be to be united with sick hate mongers, and egotists like you. We'll depart once we extract our pound of flesh. Afterall the hate mongering was started by the envy of Telangana vaadis. It has to be paid in the same coin.
    If we quote the voilence perpetrated by Telangana vaadis like you have done here, it will run into hundreds at the least and thousands possibly.

    ReplyDelete
  5. ఘట్ల గాదు తమ్మీ, పైన చెప్పిన నీ చిల్లర సామను మొత్తం టోటల్ జేసినా, గీ టీయారెస్సోళ్ళు నాగం ను తన్నినంత గావు, గా జేపీని కొట్టినంతట్ల పావు గాదు, ఇగ ఆ టేంకు బండు విగ్రహాల దాన్లనైతే ఇంతంత గూడ గాదు. నేను మంచిగ తన్నిన్నా, నీవు మస్తుగ తిట్ట్నవా గాదు తమ్మీ మనకి కావలసింది. ప్రజలు ఎవ్వరెవ్వరినీ తిట్టుకుంటలేరు కొట్టుకుంటలేరు చూసినవా! 2009 దాంకా మంచిగనే ఉన్నరు. ఈ ముక్కు నాయల జేరిండు, మన తరఫున అందరినీ తిట్టుడు షురు జేసిండు. ఇంకొకటి, ప్రజలే గాదు, ఇంతవరకూ ఏ పార్టీ కూడా ఈ టీయారెస్సోడు తిట్టినంత తిడుతలేరు. ఇప్పటికే మన ప్రమేయం లేకుంటనే మన పరువు తీసిండు. వీని తోక పుచ్చుకొని పోతే వీడు మనల్ని ఒక్క తెలుగోళ్ళకే కాడు, మొత్తం దేశ ప్రజలకే శత్రువులని జేస్తడు. మనం పరువు కోసం తెలంగాణా అడుగుతున్నం. వీడు ఉన్న పరువు కూడా తీస్తుండు. ఇక తెలంగాణా ఏడికెల్లొస్తది? గిసుమంటోళ్ళ చెతిల తెలంగాణా తెచ్చుడు కంటే, ఈ రాష్ట్రం లనే మనకి కావలసినయి రాబట్టుకొనుడు మంచిది. జర సోంచాయించుండ్రి.

    ReplyDelete
  6. http://pachchinijaalu.blog​spot.com/2011/07/blog-post​.html ...

    తిక్కలోల్లకు తిక్కలోడే కరెక్ట్ బలే కుదిరినాడు

    టి.జి.వెంకటేష్ స్టేట్‌మెంట్‌కి తెలంగాణ వాదులంతా ఓ................... అని తెగ నలుపుకుంటనారే ఏందబ్బా ఏమి జరిగినాది? అవును గాని నాకు తెలీక అడుగుతనా ఈ టి.జి.వెంకటేష్ ఏం తిట్టినాడని అట్లా అరుస్చనారే? అసలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యుక్షులు ముక్కులోడు తిట్లకన్న అద్వానంగ తిట్టలేకపోయినాడేని నేను బాదపడ్తాంటే వీళ్ళేంది ఇట్లా గీరుకుంటనారు. అవును తెలంగాణ సాములు ఒక పెశ్న అడుగుతా జవాబు సెబ్తారా?

    మీ ముక్కోడు సీమాంధ్రోల్లను ఎట్లబడ్తే అట్లన్యాడే గుర్తు రాలా? దొంగబాడ్కోవులన్న్యాడు. బొంద పెడ్తా దోపిడి దారులు అదేందో బాగో జాగో అన్న్యాడు గుర్తు రాలా నాకు హింధి సరిగ్గా రాదులే ఏమనుకోకాండి ఇంగ సీమాంద్రలున తరిమి తరిమి కొడ్తామని బో అర్సినారు. సాయుధ ధళం ఏర్పాటు సేస్చనాం అని కూడ సెప్పిండ్లా మీముక్కోడు? మూర్ఖంగా మాట్లాడనామని అప్పుడు గుర్తురాలేదా? అప్పుడూ మీలాగ మేము ఈడ ఏమి నలుపుకోలాబ్బా. ఎదురు తిట్లు కూడ తిట్ల్యా. మీరు అన్ని అన్న్యా కూడ మేము అన్ని భరించినాము. మీలాగ ఆవేశపడ్ల మరెందుకు అట్లా గీరుకుంటనారు? మీ ముక్కులోడులాగే ఈ టి.జివెంకటేష్ కూడ పెద్ద తిక్కలోడు అసలు ఈయప్పని రాయలసీమలో ఎవ్రూ లీడర్‌గా జమకట్టరు. లెఖ్క కూడ జేయరు అట్టాంటోడు మీరు బాగా పట్టించుకున్యారే..బాగా సరిపోయిందిపోండి మీ ముక్కు తిక్కలోడికి కరెక్ట్ మొగుడు ఈ టి.జి తిక్కలోడు. ఇంగ మీ ముక్కులోడి సంగతి పెద్ద జాదు మాకు తెల్సు సెంద్రబాబు మంత్రి పదవి ఇయ్యకుంటే ఆడ్నుంచి బయటకొచ్చి పార్టి పెట్టిండ్లా ఇంగెట్ల గొప్ప నాయకుడు అయితాడు? ఆ సంగతంతా మాకు తెల్సు మా బుర్రలో మట్టి లేదబ్బా.

    అవునూ శ్రీకాంతాచారని ఒక పెద్ద మూర్ఖశిఖామణి ఉండాడు బ్లాగుల్లో ఆయప్ప అడిగే క్వశ్చన్స్ సూడండి ఎట్లా ఉండాయో?
    " సమైక్యవాదమంటే పొరుగు ప్రాంతంలో ముష్కర మూకలను ఉసిగొల్పి భయభ్రాంతుల్ని చెయ్యడమన్న మాట! పదవుల్ని అడ్డం పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్న ప్రజల్ని జైల్లలో తోసి రాక్షసంగా అణచి వెయ్యడమన్న మాట. సమక్యవాద సిద్ధాంతమే వేరొక ప్రాంతంపై దోపిడీ, గుత్తాధిపత్యాన్ని లక్ష్యాలుగా చేసుకొని ఊపిరి పోసుకున్నప్పుడు వారి ఆలోచనలు ఇంతకన్నా గొప్పగా ఉంటాయనుకోవడం ముర్ఖత్వమే. "

    మీరు సేసింది ఏందప్పా? మీరు మాట్లాడింది ఏంది సెప్పు? మీ ముక్కోడు సాయుధదళాలను స్తాపిస్తా అన్నెప్పుడూ ఏమయ్యింది మీ తెలంగాణ వాదం? మమ్మల్ని దోపిడి దారులనడం గొప్పనా? మమ్మల్ని తరిమి తరిమి కొడ్తాం అనడం గొప్పనా ఏంది? మీ తెలివి కాకులెత్తుకెల్లా ఎవ్రు సెప్పినారు సమైఖ్యవాదమంటే వేరొక ప్రాంతాన్ని దోపిడీ సేయడమని? మీ ముక్కోడు సెబ్తే అదే కరెక్టా? ల్యాక తెలంగాణ పజలంతా మంచోళ్ళు, నిజాయితీ పరులు, ఒకరిజోలికి పోరు. సానా బుద్దిమంతులు ఒక్క సీమంద్ర పజలే దొంగలు దోపిడి దారులు లఫంగా వెదవలు అని దేవుడు సెప్పినాడా? ల్యాక మీ ముక్కోడు సెబ్తే అదే నిజమయితాదా? పెపంచంలో యాడన్నా ఇట్లా ఏకపక్షంగా ఉంటాదా సెప్పండి ఎవ్రున్నా. ఒకే ఒక పాంతంలో మాత్రమే మంచోళ్ళు ఉండి దాని సుట్టూ పెపంచంలో చెడ్డోళ్ళు ఉండేకి అయితాదా? ఎవ్రున్న వచ్చి న్యాయం సెప్పండబ్బా?

    ఇంగా ఈ హెచ్చరిక సూడండి
    " టీజీ, బతకడానికి నువ్విక్కడికొచ్చావు గానీ, మేం నీదగ్గరికి రాలేదని తెలుసుకో. "
    ఏంది హైదరాబాద్ మీ ఒక్కరి సొత్తా? అట్లయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కాప్టెల్ సిటి ఎందుకు సేసినారు? అక్కడికొచ్చినారంటే అది తెలుగోళ్ళ రాజధాని కాబట్టి వచ్చినారు ఏ కర్నాటక రాజధానికో తమిళనాడు రాజధానికో పోలా కదా? రాజధాని మీ ఏరియాలో ఉంది కాబట్టి మా దగ్గరికి వచ్చినారనంటే మీ అంత మూర్ఖులు ఎవ్రూ వుండారబ్బా..? అదే రాజధాని కర్నూల్ ఉండుంటే వైజాగోళ్ళు సర్కారోళ్ళు తెలంగాణోళ్ళు కూడ కర్నూల్ రాజధానికే బతకడానికి వచ్చేటోళ్ళు కదా? అప్పుడూ మేము కూడ మీరన్నట్లే బతకడానికి మీరు మాదగ్గరికొచ్చినారంటే కరెక్ట్ అయితాదా? సెప్పు ? అదే రాజధాని ఏ వైజాగో ల్యాక విజయవాడో అయ్యుంటే అందరు ఆ రాజధానికే పోవాల బతకడానికి అట్లా పోయినోళ్ళు బతకడానికొచ్చినారంటే ఎవ్రూ మూర్ఖులు అయితారబ్బి? ఇప్పుడూ నీవు మూర్ఖుడు అయినావు కదా? ఒక సారి నీ వీపు నీవే సూస్కో తెలుస్చాది.

    ReplyDelete
  7. తిక్కలోల్లకు తిక్కలోడే కరెక్ట్ బలే కుదిరినాడు

    ఈ భూమి నీది కాదు నాది కాదు బతికినన్నాళ్ళు ఉంటాము ఆయుష్షు తీరినాక పోతాము దీనికే బో మిడిసి పడ్తనారే తెలంగాణ వాదులంతా? అసలు ఈ భూమిని ఎట్లా భాగాలుగా పంచుక్ఉన్యారో తెలుసా అని. నిజాం రాజు ఎవడబ్బు సొమ్మని రాయలసీమను "సీడడ్" పేరు పెట్టి బ్రిటీష్ దొరలకు అమ్మినాడు? 1970లో జరిగిన 3వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయినాడు అప్పుడు బ్రిటీషోళ్ళకు నిజాం నవాబుకు సంధి జరిగిందిలే దాంతో రాయలసీమ మళ్ళీ నిజాంకు దక్కింది. నిజాం నవాబు మరాఠాలకు సర్దేశముఖిలకు పన్నులు బలంతంగా సెల్లించేవాడు. ఇంగ మరాఠాలనుండి నిజాం రక్షించుకోల్యాకపోయినాడు. వాళ్ళ పోరు పడల్యాక 1800లో బ్రిటీషోళ్ళతో సైన్యసహకార సంధి సేసుకొని మరాఠాలు దాడి సేస్చే ఆయప్పకు రక్షణగా బ్రిటీషోళ్ళు సహాయం సేయాలి దానికి ప్రతిఫలంగా రాయలసీమను బ్రిటేఏషోళ్ళకు దత్తతకు ఇచ్చేసినాడు. మేమేమన్న వస్తువులమా ఏంది? ఎవడబ్బ సొమ్మని? వాడికేమన్న బానిసలమా మేము. లాస్ట్‌కి దత్త మండలాలు అని పేరు పెట్టినారులే. ఇంత సంగతి వుంది దీని వెనుక మీరేమో మాది మాది అంటారు ఇంతకు ఈ భూమి ఎవర్దబ్బా?

    అయినా ఏమన్యాడనీ టి.జి మీద బో పన్నారు? తెలంగాణ హోం మంత్రి కాబట్టి ఆమెకు ఇబ్బందులుంటాయి అదే నేనైతేనా విధ్వంసకారులని జైళ్ళొ పడేసేవాడ్ని అన్యాడు అంతే కదూ! యాడ ఉద్యమకారుల్ని జైళ్ళో పెడ్తానని అన్లేదే ? రాజకీయంగా ఉద్యమాల్ని సేసుకొండి సెప్పినాడు ఇంగయాడన్నాడు ఉద్యమం సేసే పజల్ని జైళ్ళో పెడ్తానని? ఏమన్న తెలంగాణ వాదుల్ని మీ ముక్కొడిలాగ దోపిడి దారులని దొంగబాడ్కోవలని తిట్టినాడా ఏంది సెప్పండ్రి? ఊర్కే లొల్లి సేస్చనారు. రోంత కూడ మీమీద ఎవ్రూ అనకూడదా. ఎవ్రన్న మిమ్మల్ని రోంత సిన్న ఇమర్శ గుడ్క సేయకూడదు సేస్చే సాలు బో పొడుసుకొస్చాదే పౌరుషం? మీకేనా పౌరుషం మాకులేదా? మేము మనుషులం కాదా? మీరేమో మమ్మల్ని దోపిడి దొంగలు. లఫింగిగాళ్ళంటే ఊరికే పడుండాలా?

    మీ అంత గొప్పోళ్ళు మంచోళ్ళు పెపంచంలో ఎవ్రూ లేరా ఏంది? సూడు మీ తెలంగాణ కవులు ఎట్లా తిడ్తనారో మమ్మల్ని సూడ్లేదా?

    ఒక కవేమో మమ్మల్ని ఆంధ్ర కీటకం అంటాడు మరొకడు " దెంగేయ్ " అన్యాడు ఇంగొకడు ఒగలెందుకురా నగదు దొంగల్లారా! అన్యాడు. బొండిగ పిసుకుతం అంటా! మరో గాడిదకొడుకు ఎడం కాలుతో తంతా! అంటా ! ఏది తన్నమను సూద్దాం? మీరో మేమో ఉండాల ఇంగ సూస్కుందాం.

    ఊర్కొండే కొద్దీ బో రెచ్చిపోతనారు మీరు మాత్రమే మొనగాళ్ళా ఏంది? మాకు సేతకాదా..ఈడ ఎవ్రూ గాజులు తొడ్కోని లేరు మీది పోరాటాల గడ్డ అయితే ఏంది గొప్ప మాది కూడ పౌరుషాల గడ్డ ఎవ్రూ సేతనయితే వారు సూసుకుందాం రండి. మాకు బుద్ది సెప్పి గూడ్సులో కర్నూల్‌కి పంపుతారట..రాండి తాడో పేడో తేల్చుకుందాము ఎవ్రి సేతనయితే వాల్లే మిగులుతారు.
    rakthacharithra

    ReplyDelete
  8. Anonymous said...

    "There's nothing sick in wanting to stay with those whom we hate. It's (Samaikya vaadam) only strategical. Nobody is dying to be to be united with sick hate mongers, and egotists like you. We'll depart once we extract our pound of flesh"

    आगया अपनी औकाद पे!We know the pound of flesh is Hyderabad but remember it did not work with Madras either.

    "If we quote the voilence perpetrated by Telangana vaadis like you have done here, it will run into hundreds at the least and thousands possibly"

    Your andhera guys are the original violent lot. Violence after podugu cheeramlu died, Bejawada rowdyism & seema factions are the hallmark of the tegulu culture!

    ReplyDelete
  9. గట్లుండదుబై, అంధ్రోల్లంతా చెడ్డోల్లు, తెలంగాణోల్లంతా మంచోల్లని ఉండదు. ఏం సదువురాబై మీది? అక్కడోల్లు ఇక్కడోల్లంతా ఒక్కళ్ళిద్దరు మనిషులన్నట్టు చెప్తున్నవ్. గుడ్డిగా ఆ ముక్కోడు చెప్పినట్టు పోతే గా టీయారెస్సు పార్టీల జేరాలె గాని, బైట ఖతమైతం. గిప్పుడు, నీ ఇంట్ల ఒక తెలంగాణ దొంగ పడితే సంకలు గుద్దుకుంటవా ఏంది? మంచోళ్ళందరు ఒకదగ్గర, చెడ్డోళ్ళందరూ ఒకదగ్గరా ఉండర్రాబై. గీ తెలివితక్కువ మాటలు బంద్ చేయుండ్రి.

    ReplyDelete
  10. అవునవును మీ ఆంధ్రా లంజకొడుకులేం చేసినా తప్పుకాదు. తెలంగాణోళ్ళు ఏదన్నా అంటెనే తప్పు. కేశవులు గాడు ఆత్మాహుతి దాడులు చేస్తామనడం కూడా ప్రజాస్వామ్యయూతమే గదరా భూమ్మీద తిరగలేక్ ఆకాశంలో తిరిగే రామన్నా? థూ నా కొడకా! నిజాల్ని నిజాలుగా చూడలేని నీకెందుకురా బ్లాగు. మూసుకో నా కొడకా.

    ReplyDelete
  11. @కేశవులు గాడు ఆత్మాహుతి దాడులు చేస్తామనడం....ఎవరూ కూడా అలాంటి ప్రకటనలను..సమర్దించరు...గవురవించరు...దయ చేసి సీమాంద్ర వాళ్ళు ఈ విషయాన్ని స్పష్టపరచాలి...

    ReplyDelete