Sunday, July 24, 2011

స్పీకర్ తప్పుడు నిర్ణయం!

భావోద్వేగాలలో చేసిన రాజీనామాలుగా చిత్రీకరిస్తూ తెలంగాణా ప్రాంత శాసన సభ్యుల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించటం సరైన చర్య కాదు.  గతంలో కూడా స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి వున్నప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. దొంగ దీక్షలతో మభ్యపెట్టి, అన్ని పార్టీల అంగీకారం ఉందన్న తప్పుడు సమాచారం అందించి రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఒక్కసారిగా వచ్చిన భావోద్వేగ పరిణామమే సీమాంధ్ర శాసన సభ్యుల, ఎంపీల రాజీనామాలు! కానీ ఇప్పటి పరిస్థితి వేరు.. తెలంగాణా రావటంలేదన్న నిస్పృహ కావచ్చు.. లేదా నియోజక వర్గాల్లో తిరగనివ్వమన్న వేర్పాటు తీవ్ర వాదుల ఫత్వాలకి భయపడి కావచ్చు..రాజీనామా ఇచ్చిన వారంతా ఫలానా తేదీన ఇస్తామని ముందే చెప్పారు. ఆ విధంగానే చేసారు. ఇంక ఇందులో భావోద్వేగాలకు చోటెక్కడ?  రాజీనామాలు తిరస్కరించటం అన్నది స్పీకర్  విచక్షణాదికారమే  కావచ్చు. కానీ దానికి భావోద్వేగాల ముద్ర వేయటం తప్పు. ఇలా నిర్ణయించే ముందుగా శాసన సభ్యులందరినీ విడి విడిగా స్పీకర్ విచారించి వుంటే, వారిలో ఎందరు స్వచ్చందంగా రాజీనామా ఇచ్చారో, ఎంత మంది ఒత్తిడి కి లోనై ఇచ్చారో తేట తెల్లమయ్యేది!   అలాగే కృత్రిమంగా కొనసాగింప బడుతున్న తెలంగాణా ఉద్యమం పట్ల ఆ ప్రాంత శాసన సభ్యుల నిబద్ధత కూడా బయట పడేది! రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలిస్తున్న ఉద్యమం పట్ల ఒక అంచనాకి వచ్చే అరుదైన అవకాశాన్ని స్పీకర్ చేజేతులా జార విడిచారనటంలో  ఏ మాత్రం సందేహం లేదు.

8 comments:

  1. ఇదొక్కటి కరెక్ట్ జెప్పినవ్ర భయ్.

    ReplyDelete
  2. Krishna Mohan:-
    ఒక విషయం చెప్పండి, గుండు చేయించుకుంటే అసలు నక జుట్టు రాదు అనుకుంటే ఎంత మంది గుండు చేయించుకుంటారు ?

    Vijay Bhaskar Chaganti:- ఒక్కడు కూడా చేయిన్చుకోడు

    Krishna Mohan:- ఇది కూడా అంతే రాజీనామాలు రిజెక్ట్ అవుతాయి అని తెలుసు కాబట్టే అందరూ చేసారు..

    rakthacharithra..

    ReplyDelete
  3. DrVvln Sastry
    Aakasa Ramanna,As responsible people our intention is not to find out whose Deeksha is correct and whose Deeksha is wrong?? It is not a point to be discussed at all. T-Area people are very good people, only leaders are playing with them in the name of sentiment. To that extent only our concern is. Our request should always be with the T-Area people to live life happily like brethern and our intention never is to antagonize them. I personally like T-Area people. But I hate T-Area leaders as they are creating confusion for their political future. So our comments should be restricted to that extent. I feel Speaker acted more responsibly by rejecting the resignations. Appreciate Speakers action as he is also a lawyer by education. Also Appreciate T-Area leaders as they also got a respite now to tell people that though they have resigned the Speaker Rejected, hence they are continuing like the erstwhile Coastal and Andhra Leaders. Hence it is a win-win in the best interests of the state as a whole. Let peace come back fast to the STATE. That should be the slogan of any UAP Commandos like you. But not antagonizing statements against our own brethern of T-Area Public. I love Telangana,Coastal and Rayalaseema, these three only makes beautiful Andhra Pradesh.
    My F.B Profile:-
    http://www.facebook.com/profile.php?id=100000894689250

    forwarded by rakthacharithra

    ReplyDelete
  4. DrVvln Sastry
    http://www.youtube.com/wat​ch?v=0YPtaX1fguo&feature=r​elated.

    This is my spirit. Love All Telugus. Love Other Languages, Love India.

    ReplyDelete
  5. DrVvln Sastry
    Telugu Jati Manadi, Ninduga Veluga Jati Manadi, Telangana Nadi, Rayalaseema Nadi, Circar Nadi, Nellore Naadi, Anni Kalasina Telugunadu (Andhra Pradesh) manade manade manaderaa.
    Prantalu verina, mana antarangamokate nanna, yasalu veruga vunna, mana bhasha okate nanna, Vachhinidi Anna, Vacchadu Anna, Ha, ee vidhamga emani anna, mana Varala Telugu Okate Anna. Telugu Jati Manadi, Ninduga Velugu Jati Manadi.

    Mahabharatam puttindi Rajamahendravarmlo (Rajahmundry), Bhagavatam Velasindi ekasilanagaramlo (Warangal), Ee rentilona edi kadanna, Innalla sanskriti nindu sunna.

    ReplyDelete
  6. Great Mr Sastry, Whoever you are, you spoke gold. Yes I worked in so many T-Areas. T people are really good ones. The leaders who have the Dora DNAs in them are really dangerous and are also instigating other T- Congress and TDP leaders to speak their language. They are collecting parallel taxes from all business houses, and making the lovable T-people enemies to not only telugus but also to the entire India. The earlier my T-brothers and sisters realise this, the better.

    ReplyDelete
  7. Fairly balanced post overall. However the decision is not a "తప్పుడు నిర్ణయం" but a planned tactic by Sonia & her coterie in continuation of political management (SKC secret chapter). At the best, some or many Congress MLA's may withdraw the resignations. At worst, Delhi will gain time in their procrastination attempts.

    ReplyDelete
  8. స్పీకర్ నిర్ణయం రాజ్యంగవిరుద్దం - కోదండరామ్

    కోదండరామ్నీనొటి వెంట "రాజ్యంగ విరుద్దం" అన్నమాట వింటుంటే దయాలు వేదాలు వల్లించినట్టు గా వుంది.

    ReplyDelete