కేంద్రంలో యూ పీ ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి వెన్ను దన్నుగా మంది 33 మంది ఎంపీ లని అందించిన ఆంద్ర రాష్ట్రాన్ని ఏడాదిన్నర పాటు రావణ కాష్టంలా రగిలించాక, తీరిగ్గా ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబరు 9 ప్రకటన సమాచార లోపంతో ఇచ్చిన పొరపాటు ప్రకటనగా తేల్చేసారు. ఇదే విషయమై నేను రాసిన ఇంతకు ముందు టపా ఇక్కడ చదవచ్చు. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html
ఆంద్ర ప్రదేశ్ లో స్వపక్షం లేదా విపక్షం ఎవరు అధికారంలో వున్నా కూడా మన రాష్ట్రం పట్ల కాంగ్రేసుకి ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే! నిన్నటి వరకూ రాష్ట్ర విభజన విషయం తేల్చాల్సింది అధిష్టానమే-సోనియా నే అంటూ రాష్ట్ర నాయకత్వం భజన చేస్తుంటే చోద్యం చూస్తూ ఉండి....ఈ రోజు తెలుగు వారి సమస్యని తెలుగు వారే సామరస్యంతో పరిష్కరించుకోవాలంటూ సుద్దులు చెప్పటం కాల్చి వాత పెట్టి వెన్న రాసినట్లే ఉంది. ఇంతోటి పరిష్కారం చెప్పటానికి ఏడాదిన్నర సమయం తీసుకోవాలా? తదుపరి పరిణామాలు ఊహించకుండా తొందర పాటుతో డిసెంబరు 9 ప్రకటన చేసేసి, రాష్ట్రాన్ని తగల పెట్టి, అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టిన కాంగ్రేసు పార్టీని తెలుగు వారు ఎన్నటికీ క్షమించరు.
well said. తెలుగుదేశాన్ని, కాంగ్రెస్ ను తెలుగువారు క్షమించరు. రాబోయే కాలమంతా జగన్ దే.
ReplyDeleteజగన్ ఇంకొక 10 లక్షల కొట్లు తిని, రాష్టాన్ని కిరస్తానీ అడ్డాగా మార్చాలనా లేక పాకిస్తాన్ కు అమ్మివేయాలనా?
ReplyDeleteతెలంగాణ ఇస్తామని తీర్మానం చేసి, ఎన్నికల ప్రణాళికలో రాసిన తెగులు దోషం పార్టీని, yellow fever ఆంధ్రబాబుని క్షమిస్తారా?
ReplyDeleteAll andhera parties are the same.