Thursday, July 14, 2011

అరాచకత్వానికి హద్దే లేదా?

రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది పని చేస్తోందా అని సందేహం వస్తోంది. వేర్పాటు వాదం వెర్రి తలకెక్కి  రైల్ రోకో అనగానే ప్రభుత్వమే ముందుగా రైళ్ళని రద్దు చేయటం చేతగాని తనమే.  రైళ్ళ రద్దు వల్ల ఏర్పడే కోట్లాది రూపాయల నష్టానికీ, ప్రయాణీకుల కష్టాలకీ బాధ్యత ఎవరిది? ముమ్మాటికీ ఈ చేతకాని ప్రభుత్వానిదే.. ఉద్యమం ముసుగులో తామేం చేసినా చెల్లి పోతుందన్న అభిప్రాయం ఇప్పటికే తెలబాన్ల నర నరాల్లో జీర్ణించుకు పోయింది.  దానికి తోడు ప్రభుత్వమే చేవ చచ్చిన రీతిలో ఇలా తోక ముడిచేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ముందు తన ఉద్యోగులనే కట్టడి చేయలేక పోతోంది. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజా సేవ చేయాల్సిన ఉద్యోగులు అర్ధం పర్ధం లేని డిమాండ్లతో ఆగష్టు ఒకటినుండి పని చేయ బోమని  బెదిరించటం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన అలుసే.  తెలుగు వారి చరిత్రకి సగర్వ సాక్ష్యాలైన టాంకు బండు విగ్రహాల్ని కూల్చిన వారిపై ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.   ఇక ఈ రోజు నల్గొండ జిల్లా చుట్టూ గోడ కట్టేస్తామని బెదిరించాడో మాజీ మంత్రి!   అసలు తెలంగాణా ఉద్యమ వాదంలో సహేతుకత ఎంత వుంది, ఈ సమస్యకి అత్యుత్తమ పరిష్కారం ఏమిటి తదితర విషయాలన్నీ శ్రీకృష్ణుడు ఏనాడో కుండ బద్దలు కొట్టేసాడు. అయినా కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే చోద్యం చూస్తూ కూచోటం క్షమార్హం కాదు.   కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వేచి చూసే ధోరణి మాని రాష్ట్రం లో పరిస్థితులు గాడిన పడే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలుకి చిత్త శుద్ధితో కార్యాచరణ సాగించాలి. తద్వారా దేశంలో ఇతర ప్రాంతాల్లో వేర్పాటు వాదాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.

7 comments:

  1. ఇలా దేబిరించాల్సిన అవసరం లేదు. తెలంగాణవాదుల అవమానాలకు రోజూ సీమాంధ్ర-తీరాంధ్ర ప్రజలు బిక్కుబిక్కుమనాల్సిన పనీ లేదు. మనదారి మనం చూసుకోవటం మంచిది (మీరు ఈ ప్రాంతానికి చెందితే). అలాగని భారతదేశములో రెండవ తరగతి పౌరులుగా ఉండాల్సిన అవసరమూ లేదు. మన దేశ నిర్మాణం గురించి ఆలోచించండి. సమైక్యవాదం అనేది ఎవరికీ చెందని బిడ్డ అని నా అభిప్రాయం.

    ReplyDelete
  2. Emi cheyyali ? vallani champeyalantara ?

    ReplyDelete
  3. వాల పొరాటం వాలు చెస్థున్నారు. మద్యలొ నీకు నాకు ఎందుకు నొప్పి. కంప్యుటర్ ఉంది కాదా అని రాయడమెనా... నాకు పని లెక నెను చధ్వుతున్న.

    ReplyDelete
  4. @ అచంగ: దేశ నిర్మాణం గురించిన అంశం మీదనే.. రాష్ట్ర విభజన అనేది సరి కాదని నా అభిప్రాయం. మఖలో పుట్టి పుబ్బలో పోయే జాతికి చెందిన రాజకీయ నాయకులు పదేళ్లకోసారి జై తెలంగాణా అంటూ రాష్ట్ర అభివృద్ధిని ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళేలా ఉద్యమాల పేరిట ఉన్మాద చర్యలు చేస్తుంటే ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చోడం సరి కాదు. ఈ రోజు తలా తోక లేని వీరి ఉన్మత్త చేష్టలకి తలొగ్గి రాష్ట్రాన్ని విభజిస్తే, దేశంలో మన్ను తిన్న పాముల్లా పడి ఉన్న మరెన్నో ప్రత్యెక ఉద్యమాలని నిద్ర లేపినట్లవుతుంది. ఇక్కడ ప్రభుత్వమైనా లేదా మనమైనా కూడా దేబిరించాల్సిన అవసరంలేదు. ప్రభుత్వమే ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ విస్తృత పరిశోధన తరువాత వేర్పాటు వాదం డొల్ల అని తెల్చేసాక కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోకుండా సమస్యని నానబెడుతున్న ప్రభుత్వ వైఖరినే నేను విమర్శించాను.

    ReplyDelete
  5. migata party la sangati sare, rendu prantallonu adhikaram lo undi kooda congress emi cheyyalekapotondante, vaalla pani tanam ento telisipotundi. kaneesam aa party leaders ayina andaroo kalisi koorchoni oka teermanam chesukolera? ika jaateeya party lo undi enduku? gudavatanika?

    ReplyDelete
  6. రెండు వారాల్లో వస్తుందంట, కచరా చెప్పిండు. మరీ అంత లేటా! మాకిప్పుడే గావాలె. ఎప్పుడిస్తరు సారూ? :P

    ReplyDelete
  7. ఏందిరా అరాచకత్వం లంజకొడకా? మీరుగూడ జేసిండ్రుగదరా బస్సులు బందూ, రైళ్ళ బందులూ సమైక్యం కోసం. మీరు జేస్తే అరాచకత్వం గాదుగానీ మేం జేస్తెనే అరాచక్త్వమార? ముందే ఎందుకు బంద్ జేసిండ్రో నీకు బుర్రుంటే ఆలోచించి చూడు. మా దెబ్బ ఎట్లా ఉంటదో ముందే ఊహించి -ల్లో రైళ్ళు పరుగెత్తి భూమ్మీద యెళ్ళే రైళ్ళను బంద్ జేసినారు. తెలుసుకోరా పిచ్చినా...................నీ.................

    ReplyDelete