(ఆంద్ర జ్యోతి, ఆగష్టు 5 , 2011 )
ఆంధ్రా ప్రాంత అధికారి నిర్బంధం :
నారాయణఖేడ్, ఆగస్టు4: తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా అధికారులు విధులు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామ పంచాయతీ భవనంలో ఆంధ్ర ప్రాంతాని కి చెందిన వ్యవసాయాధికారిని గురువారం రెండు గంటల పాటు నిర్బంధించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీధర్ ఇటీవల నారాయణ్‌ఖేడ్ వ్యవసాయాధికారిగా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా ర్యాకల్ గ్రామానికి వెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న తెలంగాణ నిరసనకారులు ఆంధ్రా అధికారుల వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ.. శ్రీధర్‌ను గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించారు. తెలంగాణ ప్రాంతంలో విధులు నిర్వహిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు హెచ్చరించారు. 14ఎఫ్‌ను తొలగించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమాచారాన్ని గ్రామస్థులు ఎస్ఐ రవీందర్‌రెడ్డికి అందజేయడంతో ఆయన కలుగజేసుకొని నిర్బంధం నుంచి విడిపించారు.
--------
జడ్చర్ల, న్యూస్‌లైన్: జడ్చర్ల సీఐ విఠల్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా.. ఏసీ బీ అధికారులు పట్టుకున్న సంఘటన జడ్చర్లలో తీవ్ర కలకలం రేపింది. విష యం తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, తదితర పార్టీలతో పాటు జే ఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐని కో స్తాంధ్రకు చెందిన హోటల్ యజమాని, ఓ టీవీ ఛానల్ కుమ్మక్కై అక్ర మంగా కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. సీఐకి మద్దతుగా తెలంగాణ నినాదాలు చేస్తూ పోలీస్‌స్టేషన్ లోపలికి చొచ్చుకు వెళ్లారు. సీఐ విఠల్‌రెడ్డి, ఏసీబీ అధికారులు ఉన్న క్వార్టర్‌పై దాడి చేసి, కి టికీల అద్దాలను పగులగొట్టారు. లోపలికి ప్రవేశించి, ఫైళ్లను చింపివేశారు. ఏసీబీ డీఎస్పీ రఘుపతిగౌడ్, తది తర ఇన్‌స్పెక్టర్లను బయటికి లాక్కొచ్చి, తీవ్రంగా కొట్టారు. దాడిలో డీఎస్పీ రఘుపతిగౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఏసీబీ అధికారులను పో లీస్‌స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. ఆందోళనకారులు అక్కడికి సైతం వెళ్లి, ఏసీ బీ అధికారుల పై దాడికి యత్నించారు. ఈ దశలో పోలీసు బలగాలు స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళనకారులను స్టేషన్ బయటికి పంపించివేశారు. దీంతో ఆందోళనకారులు రహదారిపై రాస్తారోకో దిగి సీఐ కి మద్దతుగా, ఏసీబీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ శాసనసభ్యులు మల్లురవి, ఎంపీపీ నిత్యానందం, తది తర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పోలీస్‌స్టేషన్‌లో మకాం వేసి, పరిస్థితిని సమీక్షిం చారు. గాయపడ్డ ఏసీబీ అధికారులను అతికష్టం మీద ఆస్పత్రికి తరలిస్తుడగా ఏసీబీ అధికారుల వాహనంపై రాళ్లతో దాడి చేయడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఎస్పీ సు ధీర్‌బాబు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి, పరిస్థితి ని సమీక్షించారు. పలువురు డీఎస్పీలు, సీఐల నే తృత్వంలో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
హోటల్‌పై దాడి: పథకం ప్రకారమే సీఐని ఏసీబీ అధికారులకు ప ట్టించారని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన త్రీ స్టార్ హోటల్ యజమాని రామ్మోహన్‌కు చెందిన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కొత్తబస్టాండ్‌లోని హోటల్‌పై దాడి చేసి, అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే సమీపంలోని త్రీస్టార్ హోటల్‌పై దాడికి యత్నించగా, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
హోటల్‌పై దాడి: పథకం ప్రకారమే సీఐని ఏసీబీ అధికారులకు ప ట్టించారని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన త్రీ స్టార్ హోటల్ యజమాని రామ్మోహన్‌కు చెందిన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కొత్తబస్టాండ్‌లోని హోటల్‌పై దాడి చేసి, అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే సమీపంలోని త్రీస్టార్ హోటల్‌పై దాడికి యత్నించగా, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
--------
(ఆంద్ర జ్యోతి, ఆగష్టు,5 , 2011 )
బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ధ్వంసం కేసులో 14 మందికి పదేళ్ల్ల జైలు
ప్రొద్దుటూరు, ఆగస్టు 5 : సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ధ్వంసం కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పద్నాలుగు మంది ఉద్యమకారులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2009లో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ధ్వంసం, లోపల పరికరాల కాల్చివేతపై కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో నిందితులు 14 మందికి పదేళ్ల జైలుశిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు సీనియర్ సివిల్ జడ్జి ఎ.శ్రీనివాసకుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే... సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకున్న క్రమంలో 2009 డిసెంబర్ 19న కొందరు ఉద్యమకారులు కొండాపురం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అడ్డుకుని లోనికి ప్రవేశించారు. కార్యాలయంలో అద్దాలు పర్నిచర్ ధ్వంసం చేసి, అక్కడ వున్న ట్రాన్స్‌మిషన్ పరికరంపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. దీంతో బీఎస్ఎన్ఎల్ సంస్థకు సుమారు 2 లక్షల 32 వేలు నష్టం వాటిల్లిందంటూ ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న బాలమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, కాల్చివేతపై చౌటపల్లె, పొట్టిపాడు, కొండాపురం, గండ్లూరు, రామచంద్రానగర్ తదితర గ్రామాలకు చెందిన 14 మందిపై అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రొద్దుటూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ముద్దాయిలు 14 మందిని ప్రత్యేక వాహనంలో కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
-------
ఒకే రోజు వచ్చిన పై మూడు వార్తలు చూస్తె ఏమనిపిస్తోంది? తెలబాన్లు ఉద్యమం ముసుగులో ఎన్ని అరాచకాలు చేసినా నిద్ర నటిస్తున్న ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు సమైక్యాంధ్ర వాదుల పై మటుకు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. విధ్వంసం చేసిన వారిని సమర్ధించటం నా ఉద్దేశ్యం కాదు. అయితే ఈ న్యాయం అందరికీ సమంగా వర్తింప జేయాలి. జాగో-భాగో...నాలుకలు కోస్తాం...ఆస్తులు లాక్కుంటాం... తరిమి కొడతాం...ఇంకా సవా లక్ష విధ్వంసకర ప్రకటనలు చేసిన నాయకుల పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అంతెందుకు..సాక్షాత్తు దేశ రాజధానిలో టీవీ కెమెరాల సాక్షిగా విధుల్లో ఉన్న దళిత ఉద్యోగిని చితక బాదిన తెలబాన్ మేనల్లుడికి ఇంత వరకు ఇంత వరకు ఏ శిక్షా పడలేదు! దాంతో మరింతగా రెచ్చి పోయి పాఠ్య పుస్తకాల్లో మా తెలుగు తల్లి పాట ఉన్న పేజీలు చించి తగల పెట్టమని వదరుతున్నాడీ వీరుడు! ఆ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించడం కాదా! సు మోటో గా న్యాయస్థానాలు ఇటువంటి ధిక్కార వైఖరులపై స్పందించవా? నానాటికీ వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదాన్ని ఏదో ఒక స్థాయిలో కట్టడి చేయక పొతే, మన రాష్ట్ర భవిష్యత్తు ఈశాన్య భారతంలో ఉన్న అత్యంత వెనుక బడ్డ రాష్ట్రాల కన్నా అధ్వాన్నంగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో వుండదు.
చిత్రమేమిటంటే, ఇలా ఆంధ్రా వాళ్ళని తిట్టేవారిలో కొందరు ఒకప్పుడు ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డవారే.
ReplyDeletePachha kamrala vedhavaki lokamantha pachhagaane kanipisthadi... adi enni varthalinaa. e vidhamgaa chusina.. ore akasa pachha kamarla vedava.
ReplyDeleteDrVvln Sastry:- Government in AP is sleeping on these issues. They need to act firm. They need to catch these culprits and put them behind bars. Only then there will be fear, otherwise these anti social elements are thinking that they can do what ever they want and get away. Kali Kaalam has come quite early in Andhra Pradesh.
ReplyDeleterakthacharithra
R R Krishna Kishore:- yes govt is sleeping..like gaing elephant.. where is the ankusham.
ReplyDeleterakthacharithra
DrVvln Sastry :- R R Krishna Kishore, Let us awaken the sleeping Law and Order. That is the only way to combat this wilder approach adopted by the disgruntled.
ReplyDeleterakthacharithra
తెలంగాణా/ ఎడ్చెర్ల /ఏసీబీ కేసులో తెలంగాణా అధికారిపై అన్యాయంగా కేసు పెట్టారంటూ తెలంగాణా ఉద్యమకారుల పేరుతో ఏసీబీ అధికారుల పై దాడి చేసి అధికారులను కొట్టి లంచగొండి అధికారికి వత్తసు పలికినప్పుడె ఈ వెధవలు తెలంగాణా పేరుతో దందా చేస్తున్నారన్న విషయం స్పష్టం అయ్యింది...ప్రతీ ఏసీబీ కేసు వెనుకా కొంత కధ జరిగాకనే బాధితులు ఏసీబీ ని ఆశ్రయిస్తారు... ఆ కధల్ని అడ్డు పెట్టుకుని ఏకంగా ఏసీబీ అధికారుల పై దాడి చెయడం...ఉద్యమం పేరుతో వీళ్ళు గూండాగిరీ చేస్తున్నారని స్పష్టం అయ్యింది...కాక పోతే విద్యార్ధులను రకరకాల మాయమాటలు చెప్పి వాళ్ళను బలి పశువులను చేయడం...శోచనీయం
ReplyDeleteకేవలం ఓట్ల రాజకీయం వల్లనే వీళ్ళను అధికారం లో ఉన్న వాళ్ళు ఉపేక్షిస్తున్నారన్నది నిజం...లేక పోతే్ వెధవల్ని తొక్క తీసి ఉండేవాళ్ళేమో??
ReplyDelete