సినీ నటి నయన తార హిందూ మతం స్వీకరించటం పై ఓ క్రిష్టియన్ సంస్థ కారాలు మిరియాలు నూరటం అర్ధ రహితం. పెళ్లి అయి, పిల్లలు గల వాడని, ఆస్తి అంతా మాజీ భార్యా బిడ్డలకే రాసిచ్చాడని తెలిసి కూడా ప్రభు దేవాని వివాహం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకొన్న వ్యక్తికి, తాను ఏ మతం పాటించాలన్న విషయంలో కూడా నిర్ణయం తీసుకొనే విచక్షణ, స్వేచ్చ వుంటాయి. వ్యక్తిగత స్వేచ్చని మీరి, మత సంస్థలు చేసే ఇటువంటి ప్రకటనలు ఆక్షేపణీయం. అయినా గతంలో ఎంతో మంది హిందూ మతంనుంచి క్రిష్టియన్ మతానికి మారిన సంఘటనలున్నాయి. ఆ మార్పిడులన్నీ ఎటువంటి ప్రలోభాలు, ప్రేరణలు లేకుండానే జరిగాయని ఎవరైనా చెప్ప గలరా? మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చ స్ఫూర్తిగా, పర మత సహనం పాటిస్తున్న హిందూ సమాజాన్ని రెచ్చ గొట్టే ఇటువంటి ధోరణులని కొనసాగించడం - మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకోవడమే అవుతుంది.
This comment has been removed by the author.
ReplyDeleteఎవరినైనా తమమతం లోకి మార్చటానికి వంద కుయుక్తులు పన్నే మిషనరీలకు
ReplyDeleteతమమతంనుంచి హిందూ మతంలోకి మారటం సహించరాని విషయం.అందునా ఒక పాపులారిటీ గలవ్యక్తి మారితే ఎంత కష్టం ...ఎంతనష్టం ?
ఇలా మార్చేగదా మనప్రచారాలు సాగుతున్నది మిషనరీ గురువులూ !!!
ప్రతి మతం లోను కొందరు మూర్ఖులు ఉంటారు , వారి మాటలకు విలువ ఉండదు . నాకు తెలిసి క్రైస్తవులు ఈ విషయమును పట్టించుకోవడం లేదు . ఎవరో ఒకరు అన్న మాటను తీసుకొని క్రైస్తవులు అందరు, ముఖ్యముగా మిషనరీలు అందరు ఇలాగే అంటారు అని అనుకోకండి. ఒక మతం వారు ఇంకొక మతం లోకి మారుతూనే ఉంటారు , గొడవ చేసే వారు చేస్తూనే ఉంటారు . ఎర్రంశెట్టి సాయి గారు ఒక నవలలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే సంభాషణను ఇలా వ్రాస్తాడు . ఒకడు కాలేజీ బ్యూటీని బంగారు నెక్లస్ ఇచ్చి పెండ్లి చేసుకుంటాడు , ఇప్పుడు ఆవిడ ఎలా ఉంది అని అడుగుతాడు . పెండ్లి ఐన తర్వాత మరొకడు రవ్వల నెక్లస్ ఇస్తే వాడితో వెళ్లి పోయింది అంటాడు . కాబట్టి ఆశ చూపి మతం మారిస్తే , ఇంకొకడు పెద్ద ఆశ చూపి వేరే మతం లోకి మారుస్తాడు . ఇలాంటి వారికి (మార్చే వాడికి ,మారే వాడికి) డబ్బే మతం కాని మతం ముఖ్యం కాదు
ReplyDelete