Sunday, March 21, 2010

కోదండ రాం నాన్ స్టాప్ కామెడీ!


వెర్రి కుదిరింది..రోకలి తలకు చుట్టమన్నట్లు తయారయింది కోదండ రాం గారి పరిస్థితి. జాయింట్లు అన్నీ ఒక్కటొక్కటిగా ఊడి పోయేసరికి జే.ఎ.సి. చైర్మన్ గారికి మతి చెడిందన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో తెలంగాణా వారికి నలభై శాతం రిజర్వేషన్ కావాలని డిమాండు చేసారు. కళ అన్నది సృజనాత్మకతకి సంబంధించిన అంశం. ఎవరికీ టాలెంటు వుంటే వారు ఆ రంగంలో పైకి వస్తారు గాని రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనో, లేదా వారసత్వం వల్లనో ఎవరూ పైకి రారు. ఉదాహరణకి ఈ మధ్యనే వచ్చిన సుమన్(బాబు) నాన్ స్టాప్ కామెడీ ప్రజల్ని ఎంత నాన్ స్టాప్ గా హింసిన్చిందో చూసాం. సొంత మీడియాలో విపరీత ప్రచారం, బహుమతుల ఆశలు చూపినా ఆ కామెడీ జనం భరించలేక పోయారు. ఇక రిజర్వేషన్ ఇచ్చినా పరిస్థితి అంతే. అసలు సినీ రంగంలో ఒక ప్రాంతం వారికి రిజర్వేషన్ అన్నది ప్రాక్టికల్ గా సాధ్యం కానే కాదు. కేవలం సినీ రంగాన్ని దెబ్బ తీయాలన్న దురుద్దేశ్యం తోనే ఈ విధమైన ప్రకటనలు చేస్తున్నారేమో అనిపిస్తోంది.

7 comments:

  1. "కళ అన్నది సృజనాత్మకతకి సంబంధించిన అంశం." - general statement okay!

    "ఎవరికీ టాలెంటు వుంటే వారు ఆ రంగంలో పైకి వస్తారు గాని రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనో, లేదా వారసత్వం వల్లనో ఎవరూ పైకి రారు." - ఛా! నిజమా - చెవిలో బంతిపువ్వుకూడా కాదు ఏకంగా కాలీఫ్లవరే!

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిజమైన కళకు చోటు దొరుకుతుందా...? కోదండం అడగ్గానే కోటా అమలుచేసేస్తారా? వారసత్వపు లేక డబ్బుమదపు కొవ్వుతో కృత్రిమ కళను సృష్టించి ప్రజలను హింసించే అలవాటుతో వేళ్ళూనుకుని జడసత్వాలతో విర్రవీగే ఈ ఇండస్ట్రీ నిజమైన కళాకారులను ప్రోత్సహించడానికి కోటా అమలుచేయడం చాలా దూరం - ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నవారికి కనీసం ఇలాంటి సలహాను జీర్ణించుకునే దమ్ము ధైర్యం ఉందా?

    ReplyDelete
  2. శ్రీధర్ రాజు, చికాగో గారు అన్నట్లు సినిమా పరిశ్రమలో నిజమైన కళకు చోటు దొరుకుతోందా అన్నది వేరే టాపిక్. అయితే మేధావి వర్గంగా భావించబడే ప్రొఫెసర్ వృత్తిలో ఉన్న వ్యక్తి నుండి ఇటువంటి అర్ధం పర్ధం లేని డిమాండ్లు రావడమన్నది శోచనీయం. అమలుకి ఎ మాత్రం ఆవకాశం లేని ఇటువంటి చచ్చు సలహాలని పట్టించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఇక why not 50% అని ఒకాయన అన్నారు. 50% కాదు ఏకంగా 100% నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఉన్న సినీ పరిశ్రమని చేన్నైకో, వైజాగ్ కో తరిమేసి మొత్తం నూరు శాతం వారే తీసుకొని నూరు శాతం వారే చూసుకోవచ్చు.

    ReplyDelete
  3. వీడో బఫూన్ , వీడి మాటలెవరు పట్టించుకుంటున్నారు? కెసిఆర్ దృష్టిలో కూడా వీడో ' ఆటలో అరటిపండు ' :D
    ఏదో టివి లో ఫోటో చూపిస్తారని వాగుతుంటాడు , పాపం నాకు జాలేస్తుంది. కెసిఆర్ కనీసం చాయ్ పైసలైనా కోదండానికి ఇవ్వాలి! ఇదన్యాయం .

    Sankar

    ReplyDelete
  4. mari what about BCs, SC/STs. veellakkuda oka 30% each ichchesthey desham baagupadi potundi kada

    ReplyDelete
  5. తెలంగాణా రిజర్వేషన్ లో తిరిగి రిజర్వేషన్ అవసరం లేదంటారా? మహిళలు,S.C,S.T,B.C, E.B.C ల కు సబ్ కోటా ఉండడం అవసరం లేదంటారా?

    ReplyDelete
  6. Don't blame any one with out knowing about himself......

    Try to know about him first then blame...

    He spends 50% of his income to the poor students..

    He removed Reddy postfix to his name when it is braking him from the ppl like ST/SC

    ReplyDelete