Saturday, March 6, 2010

అర్ధం పర్ధం లేని లాయర్ల ఆందోళన!


లాయర్లు తమ వాదనా పటిమని కోర్టుల్లో చూపించి కేసులు గెలిపిస్తే అర్ధవంతంగా వుంటుంది కానీ వుట్టి పుణ్యానికి రోడ్ల మీద చేరి పిడి వాదాలు చేస్తుంటే అసంబద్ధంగా వుంటుంది. అధిక ధరలకు నిరసనగా చంద్ర బాబు నాయుడు ఈ రోజు ఇందిరా పార్కు దగ్గర మీటింగు పెట్టి ప్రసంగిస్తుంటే అక్కడికి చేరిన కొంత మంది లాయర్లు అడ్డుకొని తెలంగాణా పై వైఖరి చెప్పమని అల్లరి పెట్టారట! ఎంత హాస్యాస్పదం? తెలంగాణా పై వైఖరి చెప్పాలా వొద్దా, ఎప్పుడు చెప్పాలి అన్నది చంద్ర బాబు ఇష్టం. ఆ విషయమై వొత్తిడి తెచ్చే హక్కు ఎవరికీ లేదు. అలా వొత్తిడి తెస్తున్న సమయంలో కార్య కర్తలకు, లాయర్లకి మధ్య ఘర్షణ అనివార్యం. అయితే దాన్ని కారణంగా చూపి ఇక చంద్ర బాబుని టార్గెట్ చేసేస్తున్నారు. అటువంటప్పుడు ఆ లాయర్ల వెనుక ఏదో ఒక రాజకీయ పార్టీ వుందని చంద్రబాబు అనుమాన పడటంలో అసహజం ఏముంది?

8 comments:

  1. పనీ పాటా లేని పిచ్చి నా.....లాయర్లు.

    ReplyDelete
  2. పనీ పాటా లేని పిచ్చి నా.....ramanna

    ReplyDelete
  3. I don't understand why these lawyers making agitations. are they really lawyers? if so what will they get with state separation. something very unclear

    ReplyDelete
  4. may be drama between kcr and naidu. both are sakuni and salya's. so, public only fools. i think so kcr hire the job less lawyers in hyd. and he may pravoke all of them againest whom he need. police,or any one affraid about lawyer's because bar bhind them. many cases file agianest un wanted reasons. this is the kcr cheap political trick. hail kcr may he also get the final reasult of hitler only.

    ReplyDelete
  5. ఇది చేయించింది కాంగ్రెస్ ,టియార్య్స్ అని స్పష్టంగా ఎంత తెలివిలేని వాడైనా
    గ్రహిస్తాడు.రాజీనామా చేస్తామని చెయ్యకుండా పదవులను అంటి పెట్టూకున్న
    వాళ్ళని వదలి ఏ అధికారమ్ లేని చంద్రబాబుని గొడవచేయడం ఏమిటి? రాజమండ్రి
    లో తోటి లాయర్ని కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఈ లాయర్లంతా ఏమి చర్య తీసుకొన్నారు?
    ఢిల్లీలో లాయర్లను తరిమికొడితే అప్పుడీ తెలంగాణా మంతృలేంచేసారు?

    ReplyDelete
  6. On and off we see Lawyers coming on roads and protesting for some reasons. It clearly says that even they do not have faith in our Judicial System. This should be given a serious thought and huge reforms should be done to change the Judicial system for good.

    ReplyDelete
  7. సచిన్ భారతరత్నా !?: హవ్వ
    ఏంటొ ఈ మధ్య ఈనాడు సచిన్ ను ఆకాసానికెత్తేస్తుంది భారతరత్న అనీ పలానా రత్న అనీ. దానికి ఊతంగా వివిధ ప్రముఖుల చేత ప్రకతనలు ఇప్పిస్తింది . ఇదంతా చూస్తుంటే సచిన్ కు భారతరత్న ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నట్లుంది . దానికి గానూ మీడియా జనాలను మానసికంగా సిద్దం చేస్తున్నట్లుంది . ఈ రోజు ఈనాడులో థాకరే ఏమన్నాడో తెలుసా? సచిన్ భారతరత్నమట ఆయనను మించిన రత్నాలు ఈ దేశంలో లేవట , అలాంటి రత్నాలు మహారాష్ట్రలోనే పుడతాయట .ఇక్కడ నేనేదో ప్రాంతీయాభిమానం రెచ్చగొడుతున్నానని అనుకోవద్దు ఎక్కడ పుట్టినా వాళ్ళు కూడా భారతీయులే కదా ! ఇక్కడ విషయం అదికాదు . గత కొద్ది కాలంగా (2001 నుండి ) భారతరత్న ప్రధానం జరగడం లేదు . అయితే మధ్యలో (2008) భీంసెన్ జోషి కి ప్రధానం జరిగింది . ఈ సంఘటనను మినహాయిస్తే దాదాపు తొమ్మిదేళ్ళుగా అవార్డు ప్రధానం జరగడం లేదు. అంటె ఆ అవార్డు పొందడానికి తగిన అర్హులు లేరు ఇప్పుడు సచ్చిన్ అనే క్రిడాకారుడు తన రికార్డులతో దేశం పరువును దిగంతాలకు వ్యాపింపజేస్తున్నాడట అందుకని భారతరత్న ను ఆయనకివ్వాలని కొంతమంది (microscopic minorities) డిమాండ్. గత అవార్డు గ్రహీతల ప్రతిభాపాటవాలను పరిశీలిస్తే వారి ప్రతిభ ( వ్యక్తిగత లేదా ప్రొఫెషనల్ ) ఈ దేశానికి ఏదొవిధంగా ఉపయోగపడింది. ఉదాహరణకు లతా మంగేష్కర్ నే తీసుకుంటే భారత - చైనా యుద్ద సమయంలో జవహర్ లాల్ నెహ్రు సమక్షంలో Ae Mere Watan Ke Logon ( " Oh, The People Of My Country ) అనే పాట పాడి వేలాది భారత సైనికులను ఉత్తేజ పరిచారు ఆ ఉత్తెజం తోనే వారు ఆ యుద్దంలో పాల్గొన్నారు ( ఆ యుద్దంలో భారత్ ఓటమి చెందడం వేరే సంగతి ). మరి సచిన్ సాధించిన ఆయన వ్యక్తిగత రికార్డులు ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆయనే చెప్పాలి. కనీసం తన ప్రతిభతో ఈ దేశానికి ప్రపంచ కప్ కూడా సాధించి పెట్టలేకపోయారు . బహుశా ఆయనకు ప్రపంచ కప్ కంటే వ్యక్తిగత రికార్డులే ముఖ్యం కావచ్చు. కప్ సాధిస్తే ఆ క్రెడిట్ జట్టు అందరికీ చెందుంతుది మరి వ్యక్తిగత రికార్డులు అలా కాదు కదా ! ఎప్పటికీ ఆయన పేరు మీదనే ఉంటాయి. మరి అలాంటి వ్యక్తికి అవార్డు ఇవ్వాలనడం ఏం సమంజసం ? ఇంత కంటె గొప్ప్ వాళ్ళు ఎంతమంది లేరు ! భారతదేశంలో హరిత విప్లవానికి ( Green Revolution ) ఆద్యుడైన M, S. స్వామినాధన్ ను అందరూ మరిచిపొయారు. దేశాన్ని ఆహార ధాన్యాల కొరత నుండి కాపాడిన స్వామినాధంకు దక్కింది ఒక్క వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవి . హరిత విప్లవం మూలంగానే దేశంలో వరి, గోధుమల దిగుబడి గణనీయంగా పెరిగాయి . 1961 లో ఆయన నార్మన్ బోర్లాగ్ ను దేశానికి ఆహ్వానించకపోయినట్టైతే పరిస్తితి వేరే రకంగా ఉండేది . ఇక పోతె వర్గీస్ కురియన్ సంగతి ... ఈయన్ White Revolution కి ఆద్యుడు . ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో గ్రామీన ప్రాంతాలలో కోపరేటివ్ సొసైటీలను స్తాపించి పాల విప్లవానికి నాంది పలికాడు. తద్వారా గ్రామీణ భారతాన్ని ఆర్ధిక పరిపుష్టం చెసాడు. ఇక మూడవ వ్యక్తి పి.వి. నరసిం హా రావు . ఈయన సంగతి అందరికీ తెలిసిందే . మరి ఇంతమందిని వదిలేసి సచిన్ కు భారతరత్న ఇవ్వడంలో ఏ లాబీయింగ్ పనిచేస్తుందో అర్ధం కావడం లేదు

    ReplyDelete
  8. చెట్టుకింద ప్లీడర్లు దాడి చేసిన్రు.
    నల్లకోట్లు తొడుక్కోని పచ్చ చొక్కాలమిందకి పోవుడెందుకో.
    చెట్లకింద చాయ్ తాగి చెమ్మచెక్క ఆడుకోకుండగ మీకెందుకే ఈ ముండమోపి ఉద్యమం?

    ReplyDelete