Monday, March 29, 2010

పదవిని వదలని కే.సి.ఆర్.!

తెలంగాణా జైత్ర యాత్ర లేదా కే.సి.ఆర్. అంతిమ యాత్ర ఏదో ఒకటి తప్పదని ఆర్భాటం చేసి నిరాహార దీక్ష మొదలు పెట్టిన కే.సి.ఆర్. ఆ రెండింటిలో ఏదీ సాధించలేక పోయినా రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులకి మాత్రం పాడె కట్టి ఊరేగించారు. పాల పొంగులాగ వచ్చిన ఉద్యమ వేడిలో పార్టీ శాసన సభ్యులని బలి పశువులని చేసి రాజీనామాలు చేయించి.. తానూ, తన చెల్లి మాత్రం పదవులని అంటి పెట్టుకొని వున్నారు. పదవినే త్యాగం చేయలేని మనిషి ప్రాణ త్యాగం చేసేసి తెలంగాణా తెచ్చేస్తాడని నమ్మడం తెలివి తక్కువ పని. పైగా శ్రీ కృష్ణ కమిటీని ఫాల్తూ కమిటీ అని, గడ్డి పీకుతుందా అంటూ అపహాస్యం చేసిన ఆయన ఈ రోజు అదే కమిటీకి రిపోర్టు ఇవ్వడానికి తన పార్టీలో పది సబ్ కమిటీలు వేసారు. దీనర్ధం... అసలు తెలంగాణా విషయమై ఆయనకు ఎ మాత్రం అవగాహన లేదు. కేవలం ఉనికిని కాపాడుకోవటానికే ఉద్యమాల పేరున ప్రజలని రెచ్చ గొట్టారు. విద్యార్ధుల ప్రాణాలు బలి తీసుకున్నారు. తీరా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి కమిటీలు ఏర్పాటు చేసి కసరత్తులు మొదలు పెట్టారు. అయినా తెలంగాణా ప్రాంతంలోనే ఉన్న హైదరాబాదు నగర పాలక సంస్థ ఎన్నికల్లో కనీసం పోటీ చేయడానికి మొహం చెల్లని వారు ఎ ముఖం పెట్టుకొని తెలంగాణా సాధిస్తామని జనాల్ని మోసం చేస్తున్నారు?

5 comments:

  1. పాతబస్తీ అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉందా? పోలీసులే ఈ కోణంలో అనుమానిస్తున్నారు. ఘటనలు జరిగిన తీరు విస్తరించిన విధానం ఈ తరహా సందేహాలకు తావిస్తున్నాయని నిఘా వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలకు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. మరో మూడు రోజుల్లో అసెంబ్లిd సమావేశాలు ముగుస్తున్నాయి. మంత్రి వర్గ విస్తరణ జరగవచ్చనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. రేపో మాపో ముఖ్యమంత్రి
    ఢిల్లిd వెళ్ళవచ్చనే వార్తలొస్తున్నాయి. కొంతమంది సచివులకు ఉద్వాసన తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో వైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు గాలి జనార్ధన్‌ రెడ్డి కంపెనీలకు సంబంధించిన వ్యవహారం ముదురు పాకాన పడుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్‌గా ఉండటం కొంతమంది కాంగ్రెస్‌ సీనియర్లు కూడా ఈ అంశాన్ని అధిష్ఠానం వద్దకు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో చోటు కల్పించాలనే డిమాండ్‌పై ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లిd లాబీలో బాహాబాహీకి దిగారు. వీటన్నింటి పర్యవసానమే పాతబస్తీ అల్లర్లు కావచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ స్థాయిలో మత ఘర్షణలకు బలమైన కారణాలు కన్పించడం లేదని గతంలో జరిగిన సంఘటనలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉందని నగర పోలీసు కమిషనర్‌ ఎకె ఖాన్‌ తెలిపారు. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని పేర్కొంటూనూ ఇందుకు సంబంధించిన కుట్ర ఏమిటనేది బయటపెట్టలేదు. మొత్తం వ్యవహారంపై 'సిట్‌'తో దర్యాప్తు చేయిస్తున్నట్టు చెప్పారు. పాతబస్తీ అల్లర్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు పోలీసుల ఆందోళనే స్పష్టం చేస్తోంది. పదిమంది ఐపిఎస్‌ అధికారులను దక్షిణ మండలంలో శాంతి భద్రతలకు నియమించడం అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కొన్ని ప్రాంతాల నుంచి అందిన సమాచారం కూడా దీని వెనుక రాజకీయ హస్తం ఉందనే విషయాన్ని బయటపెడుతోందని పోలీసు అధికారులు అంటున్నారు. ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే బలపడుతున్న తరుణంలో వ్యూహాత్మకంగా మత ఘర్షణలకు తెర లేపారా? అనే కోణంలో పోలీసులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. రోశయ్యకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొన్ని శక్తులు ప్రమేయాన్ని కాదనలేమని ఓ సీనియర్‌ అధిికారి అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ముఖ్య అనుచరుడుగా పేరుండి రోశయ్య మంత్రివర్గంలో ముఖ్యమైన పోర్టు పోలియో నిర్వహిస్తున్న వ్యక్తి పాత్రపై పోలీసులు కూపీ లాగుతున్నారు. విస్తరణలో ఆయనకు ఉద్వాసన ఉండొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. అదీగాక ఆయన రాజకీయ ప్రత్యర్థికి ప్రభుత్వంలో ప్రాధాన్య లభించడం కూడా గమనించాల్సిన అంశమని నిఘా వర్గాలు అంటున్నాయి. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా పాతబస్తీలో అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారనేది పోలీసుల సమాచారం. వాళ్ళెవరనే విషయమై పోలీసుల వద్ద కచ్చితమైన వివరాలు లేవు. మొత్తం మీద ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతున్న అల్లర్లని పోలీసులు అంటున్నారు. దీన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రికి కూడా పోలీసులు చెప్పిన విషయానే వివరించినట్టు తెలిసింది. అధిష్ఠానంకు ఆయన సహచరులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలియవచ్చింది. Elanti kutralu evaru cheyincharu anukuntunnaru?

    ReplyDelete
  2. That foto reminds:

    వారెవ్వా ఏమి ఫేసు
    బొచ్చు హీరోలా వుంది బాసూ

    ReplyDelete
  3. ఇలాంటి వెకిలి రాతలు రాసి వెటకారపు కూతలు కూసే కెసిఆర్‌ను హీరోను చేసింది. కెసిఆర్‌కు తెలంగాణపై అవగాహన ఉందో లేదో గాని మీలాంటివారికైతే కనీసపు జ్ఞానం లేదని తేటతెల్లమైయింది.

    ReplyDelete
  4. inthakannaa important news shaky boobs sania marriage with pak cricketer, india lo magaallu lenattu pakistan ku poyi pelli chesukontondi

    ReplyDelete
  5. ఇందరికి నెత్తిన పెట్టిన చేయి
    కలియుగ భస్మాసుర కేసీఆరు చేయి

    ReplyDelete