జైళ్ళనుండి విద్యార్ధుల విడుదల కోసం శాసన సభలో అన్ని పక్షాలు ఎలుగెత్తినా తొణకలేదు మన ముఖ్య మంత్రి! తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ప్రతి పక్ష నాయకుడు వారం పాటు రైతుల కోసం చేసిన దీక్ష గురించి డోంట్ కేర్ అన్నారు! మందీ మార్బలంతో, మీడియా దన్నుతో చేసిన జగన్ దీక్షని కూడా ఆయన అసలు పట్టించుకోలేదు. అటువంటిది....కేవలం కొద్ది మంది తెలంగాణా ఎం.పీ.లు (తెలబాన్ నాయకుని భాషలో-చవటలు,దద్దమ్మలు) చేసిన ఒక్క రోజు దీక్షకే విద్యార్ధులని విడుదల చేస్తున్నట్లు ప్రకటించటం ఆశ్చర్యం! ఇది విద్యార్ధుల పై అభిమానంతో మాత్రమే అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. వారిని జైళ్ళనుంచి బైటకి రప్పించిన ఘనత తామే కొట్టేద్దామన్న యావ తప్ప మరేమీ కాదు. శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చాక గొడవలు చేయటానికి వారికి మళ్ళీ బలి పశువులు కావాలి. నాయకులు వెనక వుండి, ముందర వుండే ఇలాంటి అమాయక విద్యార్ధులని రెచ్చ గొట్టేస్తూ, జైళ్ళ పాలు చేస్తూ పబ్బం గడుపుకొవాలి కదా! అందుకే తెలబాన్ నాయకుడు కూడా వారితో చేరి సంఘీభావం తెలియ జేసారు. ఇక ఇప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సింది విద్యార్ధులే! యేడాది కాలంగా గుర్తుకి రాని విద్యార్ధులు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో అని వాళ్ళు తెలబాన్లని, ఇంకా బూటకపు దీక్షలు చేసిన ఇతర నాయకుల్ని నిలదీయాలి. ప్రత్యేక రాష్ట్రం కన్నా కూడా విలువైనది వారి కరిగి పోతున్న విలువైన విద్యా సంవత్సరము అన్నది గుర్తెరిగి మసలుకోవాలి.
Wednesday, December 29, 2010
Thursday, December 23, 2010
మళ్ళీ ఆమరణ దీక్షట! (టీ.పీ.ఎస్. రెడీగా వుందా?)
శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకి అనుకూలంగా లేక పోతే ఆంధ్ర జిన్నా మళ్ళీ అమరణ నిరాహార దీక్ష చేస్తారట! తెలబాన్లూ..ఆయనకి టీ.పీ.ఎస్. రెడీగ వుందో లేదొ ముందే చెక్ చేసుకోండి..(టీ.పీ.ఎస్. గురించిన ఇన్ ఫర్మేషన్ కర్టసీ: లగడపాటి రాజ గోపాల్). మిలిటరీ పోరాటానికి కూడా సిధ్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరింకేం? ఆయుధాలుకూడా రెడీ చేసుకోండి.... డిసెంబరు 31 తర్వాత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే అరెస్టే అని డీజీపీ గారు హెచ్చరించారని తొందర పడి ముందే గర్జనలు చేసేస్తున్నారేమో? అయినా కోర్టు తీర్పు రాక ముందే జడ్జీలని బెదిరించేలా ఈ గర్జనలు, గాండ్రిపులు, రెచ్చగొట్టటాలు ఏమిటి? నివేదికకి తుది మెరుగులు దిద్దుతున్న విజ్ఞులైన శ్రీ క్రిష్ణ కమిటీ వారు ఈ అప్రజాస్వామిక, అరాచక చర్యలని కూడ పరిగణనలోకి తీసుకోవాలి. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు వేర్పాటు తీవ్ర వాదుల దొంగ దీక్షలతో, వీధి పోరాటాలతో మోసపోయిన కేంద్ర ప్రభుత్వం తప్పు తెలుసుకొని ప్రకటన సవరించుకొంది. అదే స్ఫూర్తిని శ్రీ క్రిష్ణ కమిటీ వారు కూడ కొన సాగించి తెలుగు జాతి ముక్కలు కాకుండా విజ్ఞతగల తీర్పునిస్తారని ఆశిద్దాం.
Saturday, December 18, 2010
శభాష్ డీ.జీ.పీ.!
డీజీపీ గారు లెస్స పలికారు.. డిసెంబరు 31 తరువాత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే అరెష్టులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఈ ప్రకటన చేసింది ఒంగోలులో! రాష్త్రం మొత్తాన్ని వుద్దేశించి ప్రకటన చేసినా భుజాలు తడుముకొని వుడికి పోతున్నది మాత్రం తెలబాన్లు.. పైగా డీజీపీ ప్రభుత్వ వుద్యోగి మాత్రమేననీ, ప్రభుత్వం చెప్పినట్లే వినాలి తప్ప ఇలా ప్రకటనలు చేయకూడదనీ ఫత్వాలు జారీ చేశారు. ప్రభుత్వం అడిగితే తప్ప అదనపు బలగాలు కేంద్రం నుండి రావనీ, ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా డీజీపీ స్థాయి అధికారి ఏ ప్రకటన చేయడన్న ఇంగిత జ్ఞానం తెలబాన్లకి లేకపోవటం శోచనీయం. తాము స్వయంగా ప్రజా ప్రతినిధులై వుండికూడా బాధ్యతా రహితంగా చవటలు, దద్దమ్మలు వంటి భాషను వాడుతూ- అంతర్యుధ్ధం తప్పదు, అగ్ని గుండం చేస్తాం అంటూ వెర్రి ప్రేలాపనలు చేస్తున్న తెలబాన్లకి శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత గల అధికారిని విమర్శించే హక్కు ఏ మాత్రం లేదు. అయినా ఒక్కటి మాత్రం నిజం. ప్రత్యేక తెలంగాణా వుద్యమం అన్నది గతించిన చరిత్ర. ఇప్పుడు తెర పై జరుగుతున్నది కేవలం తమ వునికిని కాపాడుకోవటానికో లేదా తమ స్వార్ధ ప్రయోజనాల కోసమో తెలబాన్లు ఆడుతున్న నాటకం మాత్రమే! వారి నాటకాల్ని రక్తి కట్టించటానికి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పణంగా పెట్టడానికి వీల్లేదు. ఇప్పటికే గత సంవత్సర కాలంగా అభివృధ్ధి అన్న మాట వినబడని మన రాష్ట్రం మరింత దిగజారితే కోలుకోవటం చాలా కష్టం. డీజీపీ గారూ.. గో ఎహెడ్.. మరో ఆపరేషన్ బ్లూ స్టార్ కి రెడీ అవ్వండి. రాష్ట్రాన్ని అగ్ని గుండం కాకుండా మీరు చేపట్ట బోయే చర్యలకి ప్రభుత్వ సహకారమే గాక ప్రజలందరి మద్దతు కూడా మీకు వుంటుంది...
Friday, December 17, 2010
మహా గర్జన కాదు అది..మహా మొరగటమే!
కూలి పనుల ముసుగులొ చేసిన బలవంతపు వసూళ్ళ సొమ్ముని వినియోగించి, జనాలకి పైసలిచ్చి సమీకరించి, ఆ జన సమీకరణ అన్న వాపునే బలుపుగా భ్రమించి నిర్వహించిన తెలంగాణా మహా గర్జన ఆద్యంతం హాస్యాస్పదంగా రక్తి కట్టింది. తెలంగాణా న్యూస్ చానెల్లొ(రాజ్ న్యూస్) మరీ విచిత్రం! టీవీల్లొ ప్రత్యక్ష ప్రసారం చూడకుండా ఆంధ్రా నాయకులు తెలంగాణా జిల్లాల్లొ కరెంటు తీసేయించారట! హాజరైన అంతమంది జనాలని మూడు వేల మంది ఆంధ్రా పొలీసులు ఇబ్బందులు పాల్చేశారట! ఇంకా నయం. 9వ తారీఖున వాన ఆంధ్రా వాళ్ళే కురిపించారని అనలేదు. సంతోషం. జన సమీకరణ చూసి రాష్ట్రాన్ని ఇచ్చేయాలని అధినాయకుడైన ఆంధ్రా జిన్నా తీర్మానించారు. రాష్ట్రాన్ని ఇవ్వటం అంత తేలిక అని ఎలా అనుకుంటారొ అర్ధం కాదు. చిరంజీవి సభలకీ జనం వచ్చారు. జగన్ సభలకీ వస్తున్నారు. ఐనంత మాత్రాన వాళ్ళ ఆశలు, ఆశయాలు నెరవేరతాయా? తెలంగాణా వుద్యమం వున్మాదంగా మారటానికి 54 ఏళ్ళు పడితే ఆ వున్మాదాన్ని అడ్డుకోవటానికి ఆంధ్రా నాయకులు గంటలో ఏకమయ్యారని ఆంధ్రా జిన్నా గారు వాపోయారు. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు యాచకుల్లా తిరుగుతున్నారని ఎద్దేవా చేసిన ఇదే పెద్ద మనిషికి పదేళ్ళ క్రితం చంద్ర బాబు సరైన మంత్రి పదవి ఇస్తే నోరెత్తే వాడా? ఒక ప్రజా ప్రతినిధి అయి వుండి కూడా బాధ్యతా రాహిత్యంతో- భూకంపం సృష్టిస్తాం, అగ్ని గుండం చేస్తాం అని జనాల్ని రెచ్చ గొట్టెస్తున్నప్పుడు శాంతి భద్రతలకి బాధ్యత వహించాల్సిన డీ.జీ.పీ. అదనపు బలగాల్ని అడిగితే తప్పేమిటి? అయినా శ్రీక్రిష్ణ కమిటీ మరొ రెండు వారాల్లో రిపోర్టు ఇవ్వనుండగా ఇప్పుడీ బల ప్రదర్శనలూ, బాజా భజంత్రీల హంగామా జరిపించటంలో ఆంతర్యమేమిటి? కమిటీ రిపోర్టుని ప్రభావితం చేద్దామన్న పేరాశ కావచ్చు.
Monday, December 13, 2010
అసలు విద్యార్ధుల పై కేసులు ఎందుకు ఎత్తి వేయాలి?
శాసన సభ సాక్షిగా-- తెలంగాణా వుద్యమం (?) లో ధ్వంస రచనకి పాల్పడిన విద్యార్ధులని నిష్పూచీగా విడుదల చేయాలని జరుగుతున్న రచ్చ పూర్తిగా అర్ధ రహితం. కష్ట పడి సంపాదించిన సొమ్ములు వెచ్చించి చదువుకుని బాగు పడమని తల్లి దండ్రులు విద్యాలయాలకి పంపితే, తిన్నది అరక్క రోడ్డెక్కి విధ్వంసం చేసిన వారికి కేసులనుండి విముక్తి కల్పించటం పాముకి పాలు పొయటమే అవుతుంది. చిన్న పిల్లలైతే వారిని బెంచీ ఎక్కించటమో లేదా గోడ కుర్చీ వేయించటమో చేస్తాం. అసలు ఒక విద్యార్ధి చదువుని పక్కన బెట్టి సిగరెట్లు తాగటం గట్రా దుర్వ్యసనాలకి లోనైతే ఆయా కర్మల ఫలితం ఆ విద్యార్ధే అనుభవిస్తాడు. అలాగే తమని కరివేపాకులా వాడుకుని పారేసే రాజకీయుల, సంఘ విద్రొహ శక్తుల మాటలకి ప్రభావితులై అరాచకాలకి పాల్పడితే వాటి ఫలితం కూడా వారే అనుభవించాలి. అది మిగతా విద్యార్ధి లోకానికి కనువిప్పు కావాలి. పైగా శాసన సభలో ఈ చర్చ సందర్భంగా విద్యార్ధులతొ పాటుగా మత కలహాల్లొ నిందితులైన వారిని కూడా విడుదల చేయాలని ఒవైసీ డిమాండు చేయటం మరింత ఆందొళన కలిగిస్తోంది. ఏమైనా రాష్ట్రంలో రాబోయె విపత్కర పరిస్థితుల్ని దృష్టిలొ వుంచుకొని, విధ్వంస కారుల్ని జైళ్ళలొనే వుంచటం శ్రేయస్కరమే గాక మిగతా బైట వున్న వారికి కూడా ఒక హెచ్చరికని చేసినట్లవుతుంది.
Saturday, December 11, 2010
శభాష్ జేపీ!
విద్యార్ధులపై కేసులు ఎత్తి వేసి వారిని విడుదల చేయాలంటూ అసెంబ్లీ లొ జరిగిన రభస సందర్భంగా లొక్ సత్తా నాయకుడు జయ ప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలు/డిమాండ్ బహుధా ప్రశంసనీయం. కేసుల తీవ్రతని బట్టి విడుదల విషయం ఆలోచించాలని ఆయన అన్నారే కానీ ఏ ఒక్క ప్రాంతాన్నీ, నాయకుడినీ ఆయన ప్రస్తావించలేదు. వుద్యమం ముసుగులో, విద్యార్ధులని అడ్డు పెట్టుకొని వారిని పావులుగా వాడుకుంటున్న వారికి జేపీ మాటలు రుచించక పోవటంలో ఆశ్చర్యం లేదు. కేవలం ఒకే ఒక ఎం.ఎల్.ఏ. చేసిన వ్యాఖ్య పై తెలబాన్లు గుమ్మడి కాయ దొంగల్లా ఇంతగా భుజాలు తడిమేసుకుంటున్నారంటే అర్ధమేమిటి? డిసెంబరు 31 వస్తోంది. శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చాక మళ్ళీ అల్ల కల్లోలం చేయాలంటే వారికి జైళ్ళలో వున్న విద్యార్ధులు కావాలి. అందుకే ఇన్నాళ్ళుగా గుర్తుకి రాని విద్యార్ధులు వారికి ఈరొజు జ్ఞప్తికి వచ్చారు. అసలు విద్యార్ధుల సంగతి పక్కన పెడితే, రాజ్యాంగ బధ్ధంగా ఎన్నికైన పాలనా వ్యవస్థలని, పరిపాలనా యంత్రాంగాలని వుత్తి పుణ్యానికి వారి పబ్బం గడుపుకోవటానికి స్తంభింప జేస్తున్న తెలబాన్ నాయకుల పైనా, శాసన సభ్యుల పైనా కేసులు బుక్ చేసి వారందర్నీశ్రీక్రిష్ణ జన్మ స్థానానికి పంపిస్తే గానీ రాష్ట్రం ప్రశాంతంగా వుండదు. విజ్ఞులైన శ్రీక్రిష్ణ కమిటీ వారి రిపోర్టులో ఇదే మొట్ట మొదటి రికమెండేషన్ గా వుండాలని కోరుకుందాం.
Subscribe to:
Posts (Atom)