Saturday, December 11, 2010

శభాష్ జేపీ!

విద్యార్ధులపై కేసులు ఎత్తి వేసి వారిని విడుదల చేయాలంటూ అసెంబ్లీ లొ జరిగిన రభస సందర్భంగా లొక్ సత్తా నాయకుడు జయ ప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలు/డిమాండ్ బహుధా ప్రశంసనీయం.  కేసుల తీవ్రతని బట్టి విడుదల విషయం ఆలోచించాలని ఆయన అన్నారే కానీ ఏ ఒక్క ప్రాంతాన్నీ, నాయకుడినీ ఆయన ప్రస్తావించలేదు.  వుద్యమం ముసుగులో, విద్యార్ధులని అడ్డు పెట్టుకొని వారిని పావులుగా వాడుకుంటున్న వారికి జేపీ మాటలు రుచించక పోవటంలో ఆశ్చర్యం లేదు. కేవలం ఒకే ఒక ఎం.ఎల్.ఏ. చేసిన వ్యాఖ్య పై తెలబాన్లు గుమ్మడి కాయ దొంగల్లా ఇంతగా భుజాలు తడిమేసుకుంటున్నారంటే అర్ధమేమిటి? డిసెంబరు 31 వస్తోంది. శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చాక మళ్ళీ అల్ల కల్లోలం చేయాలంటే వారికి జైళ్ళలో వున్న విద్యార్ధులు కావాలి. అందుకే ఇన్నాళ్ళుగా గుర్తుకి రాని విద్యార్ధులు వారికి ఈరొజు జ్ఞప్తికి వచ్చారు.  అసలు విద్యార్ధుల సంగతి పక్కన పెడితే, రాజ్యాంగ బధ్ధంగా ఎన్నికైన పాలనా వ్యవస్థలని, పరిపాలనా యంత్రాంగాలని వుత్తి పుణ్యానికి వారి పబ్బం గడుపుకోవటానికి స్తంభింప జేస్తున్న తెలబాన్ నాయకుల పైనా, శాసన సభ్యుల పైనా కేసులు బుక్ చేసి వారందర్నీశ్రీక్రిష్ణ జన్మ స్థానానికి పంపిస్తే గానీ రాష్ట్రం ప్రశాంతంగా వుండదు.  విజ్ఞులైన శ్రీక్రిష్ణ కమిటీ వారి రిపోర్టులో ఇదే మొట్ట మొదటి రికమెండేషన్ గా వుండాలని కోరుకుందాం.

9 comments:

  1. well said sir.
    you are right and JP is always right.

    ReplyDelete
  2. he is the only perfect LEADER of the assembly

    long live JP saab and his party

    ReplyDelete
  3. Thats correct. 'Gummadakaya dongalevarante bhujalu tadumukunnattu vundi'
    Andhra dourbhayagyam kakapote KTR kuda leadere!!!

    ReplyDelete
  4. జేపి సరైన మాటలు సరైనవే....సమయం సరైనదే...కాని సందర్భం సరైంకాదు.....

    నావాదనే సరైందన్న భావన మితిమీరడం వల్ల ఇలా జరుగుతుంది....

    జేపిగారి అమాయకమైన నీతి మాటల వల్ల ...
    సంవత్సరం క్రితమే ఇచ్చిన మాట తప్పుతున్న,
    ఉద్దెశ్యపూర్వకంగా తాత్సారానికి పాల్పడుతున్న,
    వారిని విడుదల చేయడం వల్ల ఉద్యమం ఉదృతి పెరుగుతుందని భయపడుతున్న,
    ఈ చేతకాని సర్కారుకి ...నైతికంగా అనైతికమైన-ఊతాన్ని ఇచ్చినట్లయింది.....

    కొందరి కళ్ళలో కన్నీళ్ళు వస్తుంటే...

    కొందరి కళ్ళ మంట చళ్ళారి నట్లైంది...

    ఈ బోడి వాదనలంతా మాట ఇవ్వముందు చేసిఊంటే బాగున్ను...
    పిల్లికి గంట కట్టటం ఏలా అని అలోచిం చే ఎలుకల చర్చలా ఉంది.

    ReplyDelete
  5. @satya:మాట ఇవ్వలేదు. పొరపాటు ప్రకటన చేశారు.ఏ పరిస్థితుల్లో చేశారో ఇక్కడ చదవచ్చు. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html

    ReplyDelete
  6. I was commenting about releasing the students...!

    ReplyDelete
  7. అయ్యా సత్య గారు,
    ప్రతి బలాగులు లో వచ్చి అదే కామెంట్ ఎత్తి పోతల పోస్తున్నారు,

    సంవత్సర క్రితం ఎవరు మాట ఇచ్చింది? ఏమని మాట ఇచ్చింది? బలవంతపు వసూళ్లు, బస్సులను, ఆస్తులను తగలబెట్టే వాళ్ల మీద కేసులు పెట్టము అని ఎవరయినా మాట ఇచ్చారా? మాట ఇచ్చినట్లు మీరే మయినా కల గన్నార? లేక మీ దొర గారు చెప్పారా మీ ఇటలీ నుండి దిగిన తెల్ల తోలు తెలంగాణా దేవత చెప్పింది అని?

    మాట గీట అంటూ ఇస్తే అది తెలంగాణా ఏర్పటు గురించి కాని, తిన్నది అరక్క ఆస్తులు తగలెట్టే వాళ్లమీద కేసులు ఎత్తివేసి, మళ్లీ తగలెట్టమని క్లీన్ చీటీ ఇవ్వటం కోసం కాదు కదా వాళ్లు ఏ ప్రాంతం వారు అయినా!!? తెలబానులు ఏమయినా అడగాలనుకొంటే, దాని గురించి అడగాలి కాని, తప్పుడు పనులు చేసే వాళ్ల మీద కేసులు ఎత్తేయవద్దు అని అన్న వాళ్ల మీద ఊళ్లొ తిరగనీయమని భుజాలు తడుముకొంటూ గొడవ పెట్టే దొర గారు వాళ్ల భజన పరుల గురించి ఎందుకండీ మీ బాధ!!

    అయినా మీ దొర గారికి కాల్మొక్కి, ఆయన కుటుంబం చెప్పినట్లు కాంగీని బలపరచటం లో బిజీ గా ఉండక, కేసుల గురించి ఎందుకు?

    ReplyDelete
  8. @anonymous

    avunu...meerannadi vaastavam...

    ReplyDelete
  9. అయ్యా ఎనానిమస్సూ!
    సొంత పేరుగూడ జెప్పుకుని కామెంట్ రాయలేని నీకెందుకు నాయనా తెలంగాణాపై ఆక్రోశం. ఇట్నే గదా మొదటినుండీ మేం డైరెక్ట్‌గా పోరాడుతుండం మీరు ఎదవ తెలివితేటలతో దొంగదెబ్బలు తీస్తాండ్రు.
    ఎంత మంచి -ళ్ళోడికైనా యాపకాయంత ఎర్రి ఉంటదన్నట్లు జేపీ గారికి కూడా ప్రతి యిసయంపై ఏదో ఒకటి మాట్లాడెయ్యాలన్న తీట బాగా యెక్కువ. లేకపోతే ఎత్తెయ్యడానికి ఈలైద్దో లేదో తెలవకుంటనే ఎత్తేత్తాం అని సెప్పిన సిదంబరం యెడ్డోడా? 'సంవత్సరం క్రితం ఎవరు మాట ఇచ్చింది? ఏమని మాట ఇచ్చింది?" అంటూ భలే గడుసుగా అడిగావు గానీ సిదంబరం కేసులెత్తేత్తామంటూ ప్రకటన జేసినప్పుడు ఏడ తొంగున్నావేంటి?

    ReplyDelete