జైళ్ళనుండి విద్యార్ధుల విడుదల కోసం శాసన సభలో అన్ని పక్షాలు ఎలుగెత్తినా తొణకలేదు మన ముఖ్య మంత్రి! తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన ప్రతి పక్ష నాయకుడు వారం పాటు రైతుల కోసం చేసిన దీక్ష గురించి డోంట్ కేర్ అన్నారు! మందీ మార్బలంతో, మీడియా దన్నుతో చేసిన జగన్ దీక్షని కూడా ఆయన అసలు పట్టించుకోలేదు. అటువంటిది....కేవలం కొద్ది మంది తెలంగాణా ఎం.పీ.లు (తెలబాన్ నాయకుని భాషలో-చవటలు,దద్దమ్మలు) చేసిన ఒక్క రోజు దీక్షకే విద్యార్ధులని విడుదల చేస్తున్నట్లు ప్రకటించటం ఆశ్చర్యం! ఇది విద్యార్ధుల పై అభిమానంతో మాత్రమే అనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు. వారిని జైళ్ళనుంచి బైటకి రప్పించిన ఘనత తామే కొట్టేద్దామన్న యావ తప్ప మరేమీ కాదు. శ్రీ క్రిష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చాక గొడవలు చేయటానికి వారికి మళ్ళీ బలి పశువులు కావాలి. నాయకులు వెనక వుండి, ముందర వుండే ఇలాంటి అమాయక విద్యార్ధులని రెచ్చ గొట్టేస్తూ, జైళ్ళ పాలు చేస్తూ పబ్బం గడుపుకొవాలి కదా! అందుకే తెలబాన్ నాయకుడు కూడా వారితో చేరి సంఘీభావం తెలియ జేసారు. ఇక ఇప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సింది విద్యార్ధులే! యేడాది కాలంగా గుర్తుకి రాని విద్యార్ధులు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారో అని వాళ్ళు తెలబాన్లని, ఇంకా బూటకపు దీక్షలు చేసిన ఇతర నాయకుల్ని నిలదీయాలి. ప్రత్యేక రాష్ట్రం కన్నా కూడా విలువైనది వారి కరిగి పోతున్న విలువైన విద్యా సంవత్సరము అన్నది గుర్తెరిగి మసలుకోవాలి.
@aakasaramanna garu,
ReplyDeletewell said. but do you think these students learn a lesson by this. I don't think so, they still go along with KCR and are prepared to loose their valuable time in the education.
regards
S
chaala baaga chepparu...konni movies lo chupinchinattu neecha raajakeeya naayakulu students ni paavulugaa vaadukovatam kallara chusthunnam.
ReplyDeleteకానీ ఏం చేస్తాం? "గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది"
ReplyDeletevery well said! Excellent! students should keep their eyes open..
ReplyDeleteబాగా చెప్పారు. చిత్రం ఎమిటంటె చదువుకున్న విద్యార్ధుల బుద్ది ఒక్కొసరి పని చెయ్యదు. పరీక్ష హల్లొ మరియు రాజకీయల్లొ. ఈ రెండు ప్రదెశాల్లొ ఉంటె అస్సలు పనిచెయ్యదు.
ReplyDeleteతెలంగణా రాదు. వస్తె ఇలా ఉద్యమాలు చెసిన విద్యాసంవస్తరం దొబ్బించుకున్న వారి అందరికి పాస్ అని ఒక ప్రత్యెక లెటర్ ఇప్పించెస్తాడు ముక్కు కె.సి.ఆర్.
మల్లి దానికొసం ఒక ఉద్యమం చెయ్యలి. ఒక్క రొజు చాలు, వెంటనె వచ్చెస్తుంది.