కూలి పనుల ముసుగులొ చేసిన బలవంతపు వసూళ్ళ సొమ్ముని వినియోగించి, జనాలకి పైసలిచ్చి సమీకరించి, ఆ జన సమీకరణ అన్న వాపునే బలుపుగా భ్రమించి నిర్వహించిన తెలంగాణా మహా గర్జన ఆద్యంతం హాస్యాస్పదంగా రక్తి కట్టింది. తెలంగాణా న్యూస్ చానెల్లొ(రాజ్ న్యూస్) మరీ విచిత్రం! టీవీల్లొ ప్రత్యక్ష ప్రసారం చూడకుండా ఆంధ్రా నాయకులు తెలంగాణా జిల్లాల్లొ కరెంటు తీసేయించారట! హాజరైన అంతమంది జనాలని మూడు వేల మంది ఆంధ్రా పొలీసులు ఇబ్బందులు పాల్చేశారట! ఇంకా నయం. 9వ తారీఖున వాన ఆంధ్రా వాళ్ళే కురిపించారని అనలేదు. సంతోషం. జన సమీకరణ చూసి రాష్ట్రాన్ని ఇచ్చేయాలని అధినాయకుడైన ఆంధ్రా జిన్నా తీర్మానించారు. రాష్ట్రాన్ని ఇవ్వటం అంత తేలిక అని ఎలా అనుకుంటారొ అర్ధం కాదు. చిరంజీవి సభలకీ జనం వచ్చారు. జగన్ సభలకీ వస్తున్నారు. ఐనంత మాత్రాన వాళ్ళ ఆశలు, ఆశయాలు నెరవేరతాయా? తెలంగాణా వుద్యమం వున్మాదంగా మారటానికి 54 ఏళ్ళు పడితే ఆ వున్మాదాన్ని అడ్డుకోవటానికి ఆంధ్రా నాయకులు గంటలో ఏకమయ్యారని ఆంధ్రా జిన్నా గారు వాపోయారు. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు యాచకుల్లా తిరుగుతున్నారని ఎద్దేవా చేసిన ఇదే పెద్ద మనిషికి పదేళ్ళ క్రితం చంద్ర బాబు సరైన మంత్రి పదవి ఇస్తే నోరెత్తే వాడా? ఒక ప్రజా ప్రతినిధి అయి వుండి కూడా బాధ్యతా రాహిత్యంతో- భూకంపం సృష్టిస్తాం, అగ్ని గుండం చేస్తాం అని జనాల్ని రెచ్చ గొట్టెస్తున్నప్పుడు శాంతి భద్రతలకి బాధ్యత వహించాల్సిన డీ.జీ.పీ. అదనపు బలగాల్ని అడిగితే తప్పేమిటి? అయినా శ్రీక్రిష్ణ కమిటీ మరొ రెండు వారాల్లో రిపోర్టు ఇవ్వనుండగా ఇప్పుడీ బల ప్రదర్శనలూ, బాజా భజంత్రీల హంగామా జరిపించటంలో ఆంతర్యమేమిటి? కమిటీ రిపోర్టుని ప్రభావితం చేద్దామన్న పేరాశ కావచ్చు.
హా హా హా... మీ అఙ్ఞానానికి చింతిస్తూ.....
ReplyDeleteనీలాంటి నక్కలు ఎంత ఊళ పెట్టినా మహాగర్జనను తగ్గించి చూపలేరు. చిరంజీవి, జగన్ మీటింగులకి, దీనికి పోలిక చూపించడంలోనే నీ హ్రస్వ దృష్టి కనపడుతుంది. దేశంలో ఎక్కడా ఇప్పటివరకు కనీ వినీ ఎరుగనంత పెద్ద సభని చూసి నీకు మతి భ్రమించి ఉంటుంది.
ReplyDelete@శ్రీకాంతాచారి: పెద్ద సభే!కాదనలేదు..బలవంతపు వసూళ్ళ సొమ్ముతో జనాల్ని సమీకరించారని చెపుతున్నా. కొత్త రాష్త్రం వస్తే అప్పనంగా పదవులు కొట్టేసి మధు కోడాల్లాగా సొమ్ము చేసుకుందామనే వారే తప్ప చిత్త శుధ్ధి గల వారెవరూ ఆ వేదిక పై కనపడటంలేదు.
ReplyDeleteనువ్వు సూపర్ మమా!
ReplyDeletehttp://lh6.ggpht.com/_0ZUteTbeiEk/TQrv7GkrI0I/AAAAAAAAABA/SGT4AQffs2Q/we.jpg
ReplyDeleteపెట్టుబడిదార్ల బాకా ఊదే మీ లాంటి వారికీ తెలంగాణా వారి ఆకలికేకలు మొరుగుడు లా గే వినిపిస్తాయి
ReplyDeleteఓ అవకాశ హీన రామన్న...
ReplyDeleteమా గర్జన ఎవ్వరికో వ్యతిరేకం కాదు. మేము సీమాంద్ర వాళ్లని శత్రువులుగా భావించటంలేదు.వాళ్లు మా సోదరులు.
మీ లాంటి తెలంగాణ వ్యతిరేకులకు మాత్రమే మా గాండ్రింపు సెగ తాకుతుంది
చాల బాగా చెప్పారు. తన స్వార్థం తప్ప తెలంగాణా కాదు అ చెత్త కే సి ఆర్ ది. దేశాలు దేశాలే ఒకరికోకరుగా ఉంటున్న ఈ నవీన యుగములో మనము(తెలుగోల్లము) ప్రాంత బెధముతో కొట్టుకొని చస్తున్నాము.
ReplyDeleteగర్జనలు, ఓండ్ర పెట్టడాలు, వూళ వేయడం ఏమిటిదంతా?! మృగ/ఆటవిక సంస్కృతి. మనుషులమనే స్పృహ వేర్పాటు వాదులకు లేకపోవడం, శొచనీయము. కోతి నుండి మన్షి వచ్చాడంటుంటే వీళ్ళు మనిషి నుంచి మృగాలుగా పరిణామం చెందడం .. బాగా చెప్పావ్ ఆకాష్, కెసిఆర్ చెప్పినట్టు ఇది ఉన్మాదమే! :))
ReplyDeleteఅయ్యా snkr గారూ
ReplyDeleteమనిషి అనే స్పృహ అంటే ఏమిటి?
అవతల తోటి మనుషులు చంక నాకి పోతున్నా నేను విందు చేసుకోవాలనే యావా?
అవతల లక్షల మంది మనుషులు, కోట్లాది జంతువులూ నిర్వాసితులైనా, అడవులు మునిగి పోయినా నేను మాత్రం చక్కగా పొలాలు తడుపుకోవాలనే యావా?
లోకల్ గా ఉన్నవాడు ఏమైపోయినా ఫరవాలేదు, నేను మాత్రం ఫ్రీజోను పేరు జెప్పి అప్పనంగా ఉద్యోగాలు కొట్టేద్దాం అనే యావా?
అవతల కోట్లాది మంది మనుషుల న్యాయబద్ధమైన కోరికను కూడా గమనించ గలిగే స్పృహ కోల్పోయి ఏదో డబ్బులిస్తే జనం వచ్చినట్టుగా చెప్పే సదరు బ్లాగు మహాశయుడి పద్ధతా?
డబ్బులిస్తే కొంత జనం వస్తారేమో కాని ఈ పద్ధతిలో ఒక ప్రభంజనంలా కాదు. డబ్బులిస్తేనే వస్తే కాంగ్రసు, తెలుగుదేశం లాంటి బలిసిన పార్టీలు, జగన్ మోహన్ రెడ్డి ఇంతకూ పదింతలు తెప్పించగలరు జనాన్ని.
ఆచారి గారు,
ReplyDeleteఅవన్నీ కట్టుకథలు/అపోహలు. చంక ఎందుకు నాకిపోతున్నారు, దేశంలో ఎక్కడికైనా వెళ్ళి తేనె-వెన్న నాకండి బాబూ, ఎవరొద్దన్నారు? సత్తా లేని ఏడుపుగొట్టు బ్రతుకులు ఎన్నాళ్ళు బ్రతగ్గలరు? హైద్రాబాద్ రాజధాని కాకుంటే ఎలావుండేది? ఒక్క హైద్రాబాద్ కోసమే ఈ నాటకాలు, హైద్రాబాద్ తప్ప తక్కిన తెలంగాణాకు ఆత్మగౌరవమే లేదని ఎందుకనుకుంటున్నారు? మరి హైద్రాబాద్ లోకల్స్ మాట ఏమిటి? మీరంతా పడి పీక్కుతినరా? అది పరవాలేదా? అసలు తెలంగాణా సరిహద్దులు ఇవి అని ఎవడు గీచాడు? అర్థంలేని అపోహలు. ఒకసారి దేశంలో వున్నాక దేశపౌరుడు అంతే తెలంగాణా/రాయలసీమ/కోస్తా పౌరుడు అంటూ వుండదు. బ్రతికితే భారతీయుడిగా బ్రతకండి లేదా నిజాం ట్రై చేసినట్టు ఏ పాకిస్థాన్లోనో చేరుతామని పోరాడండి, తాడో పేడో తేలిపోతుంది. ఇదెక్కడి పితలాటకం, 10-15 ఏళ్ళకోసారి ఆత్మగౌరావాలు గుర్తొస్తాయా? పివి ప్రధానిగా 5ఏళ్ళూ వున్నప్పుడు చప్పుడుచేయలేదే!
snkr, meeru annadi correcte kani, state ni merge chesetappudu telvadaa peekaneeki chesukunnaraa oppandaalu..oppandaalu tungalo tokkinappudu em ledu..tappu chesinru ani chepte podusukostadi.naa
ReplyDelete---అవన్నీ కట్టుకథలు/అపోహలు...
ReplyDeleteఇక్కడి బాధలు మీకు అర్థం కావు, మీతో మాకు బంధం ఉంటే కదా మీరు అర్థం చేసుకో గలిగేది. బంధం లేక పోయినా కనీసం తోటి వాడు కూడా మనిషే అన్న స్పృహ ఉంటే కాదా అర్థం చేసుకో గలిగేది?
---సత్తా లేని ఏడుపుగొట్టు బ్రతుకులు ఎన్నాళ్ళు బ్రతగ్గలరు?
అంత సత్తా ఉన్నోరయితే మద్రాసు నుండి ఎందుకు లగెత్తుకొచ్చారు?
--- ఒక్క హైద్రాబాద్ కోసమే ఈ నాటకాలు
దొంగ నాటకాలు ఎవరివో అర్థం కావటం లేదూ? ఇరవై నాలుగ్గంటల్లో నాలుకలు తిప్పి మాటలు మార్చే వారివి కాదూ?
--- అసలు తెలంగాణా సరిహద్దులు ఇవి అని ఎవడు గీచాడు
ముందు మ్యాపు పెట్టుకొని చూడన్నా!
---ఒకసారి దేశంలో వున్నాక దేశపౌరుడు అంతే తెలంగాణా/రాయలసీమ/కోస్తా పౌరుడు అంటూ వుండదు
పోనీ అలా చేపియ్యి సామీ! దేశం మొత్తం ఒకటే రాష్ట్రం. ఆహా! బలే చెప్పోచ్చారండీ! ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు కదా మరి!
--- బ్రతికితే భారతీయుడిగా బ్రతకండి లేదా నిజాం ట్రై చేసినట్టు ఏ పాకిస్థాన్లోనో చేరుతామని పోరాడండి
మేమెక్కడా చేరం,మారాష్ట్రం లో మేముంటాం. అదీ నువ్వు చూస్తుండగానే!
---పివి ప్రధానిగా 5ఏళ్ళూ వున్నప్పుడు చప్పుడుచేయలేదే
అయ్యా ఉద్యమాల తీరు తెన్నులు ఎలా ఉంటాయో తమరికి తెలిసినట్టు లేదు. బ్రితీశోడు పరిపాలించిన రెందొందలేల్లు కూడా ప్రతీ రోజు స్వాతంత్ర పోరాటం లేదు సామీ. అలాగని చెప్పి మనకు స్వాతంత్రం అవసరం లేదు అనేలా ఉన్నారు తమరు!
This comment has been removed by the author.
ReplyDeleteచారి గారు,
ReplyDeleteఇక్కడ మీరు వ్రాసిన ప్రతి కామెంటు కనపడదు. బ్లాగు ఓనరుగారు తమకు అనుకూలమైన కామెంట్లనే వుంచుతారు. వాళ్లని మొరగనివ్వండి.
పైన ఎనానిమస్సుకో మనవి. నా బ్లాగులో ఇంత వరకు ఏనాడు ఒక్క కామెంటు కూడా డిలిట్ చేయలేదు. ఎందుచేత అన్నది నా బ్లాగుకి పది వేల హిట్లు తగిలినప్పుడే వివరించాను.
ReplyDeletehttp://andhraaakasaramanna.blogspot.com/2010/03/blog-post_6564.html
ఇంక ఇప్పుడు మొరుగుతున్నది ఎవరో పైనే చెప్పాను. మళ్ళీ వివరించనక్కరలేదు.
పొయిన సంవత్సరం భూములకి భూములే, అడవులకి అడవులే మింగాలనుకున్నాడు ఒకడు...
ReplyDeleteఆ నల్లడవే వాణ్ణి మింగేసింది....తేరగా దోచుకొనేటోళ్ళకి పట్టే గతి ఇట్లనే వుంటది....
ప్రతిసారీ కే.సి.ఆర్. సంవత్సరం క్రితం తెలంగాణా ఇస్తామని మాట ఇచ్చి తప్పారు అంటాడు.కానీ మాట ఇచ్చింది ఎవరు? చిదంబరం ఏదో వాగాడు. చిదంబరం కి ఏమి అధికారం ఉంది తెలంగాణా ఇస్తాను అని ప్రకటించటానికి. అలా అనుకుంటే ఇప్పుడు మరో ఇద్దరు మంత్రులచే తెలంగాణా ఇవ్వం అని ప్రకటిస్తే సరే అని మెదలకుండా ఉంటారా? ఆలోచించే పనిలేదా?
ReplyDelete@pureti:మంచి పాయింటు. బాగా చెప్పారు.
ReplyDeleteఆచారి, మీది అర్థంలేని ఏడ్పుగొట్టు ఆవేదన. సత్తావుంటే వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, తిరుపతి విజయవాడలో వెళ్ళి మీరూ దోచండి(ఇదో అర్థంలేని పదం ఐనా మీకు నచ్చేపదమని వాడుతున్నా). ఆ గవర్నమెంట్ చప్రాసీ నౌకరీలు ఎన్నొస్తున్నాయని? అదొక్కటి తప్ప విభజన వల్ల జరిగే నష్టాలు తప్ప లాభాలు లేవు. ఇదంతా మావోఇస్టులకు అనుకూలంగా రాజకీయ నిరుద్యోగులు చేసున్న కుట్ర పూరితమైన రగడ. మదరాసునుంచి నేను వేరు పడలేదు, నే పుట్టేటప్పటికే వేరుగా వుంది. నేను చరిత్రల్లోకి వెళ్ళి అచ్చు అలానే చరిత్ర పునరావృతం కావాలనుకునే వెర్రివాడ్ని కాను. ఆ పరిస్థితులు, కాలం వేరు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా నిర్ణయాలు వుండాలి. "గప్పుడట్ల చేసిరి, గిప్పుడూ అదే చేయున్రి" అనేది మూర్ఖ వాదం. అప్పుడు మావోలు లేరు, మరిపుడు వున్నారు. అప్పుడు నిజాం ధర్మ ప్రభువు బట్టలిప్పి బతుకమ్మ ఆడించిండు, గిప్పుడు ఆయన లేడు. గిప్పుడు ఈ ముక్కాయన మొత్తం ఫేమిలీని రాజకీయ వ్యాపారంలో దించిండు.
ReplyDeleteలేదు మాకియ్యాల్సిందే అంటే, మీ ఖర్మ. ఓ 10రాష్ట్రాలు చేసి, మావో పాలెగాళ్ళతో పాలించుకోండి. విభజిస్తే మరో జార్ఖండ్, చత్తీస్ ఘడ్ పుడతాయి, ఏదో సుఖసంపదలతో అగ్రరాజ్యమయిపోరు. ప్రజలు సెంటిమెంటు శాశ్వతం కాదు, మంచిదే అవ్వాలని లేదు. సెంటిమెంట్లు వస్తుంటాయ్, పొతుంటాయ్. వాటి మీద ఆధారపడి, ఒకసారి విరగ్గొడితే అతకడం అసాధ్యం.
53 ఏళ్ళ నుంచి మనోభావాలు 20ఏళ్ళకో ఇన్ స్టాల్మెంట్స్ మీద దెబ్బతింటున్నాయి ఈళ్ళకి. పివి నర్సింగ్రావ్ పెధాన మత్రి ఐనప్పుడు గిప్పుడే గిప్పుడే కావాల ఇచ్చేయ్ అనాల్సింది , ఎందుకనలేదు? మీ ప్రాంతం వాడే కదా. మీరు ఓడిస్తే రాయలసీమ వాళ్ళు నంద్యాల నుంచి అసెంబ్లీకి పంపించారు. వేర్పాటు వాదులు సిగ్గుతో రోజుకొకరు కాల్చుకుని చావాల్సిన విషయం ఇది
ReplyDeletesnkr,
ReplyDeleteమా ఆవేదన మీకు అర్థం కాదు అని ముందే చెప్పానుగా.మీకు అర్థం లేనట్టుగానే కనిపిస్తుంది. చెరువు ఒద్దు మీద కూచున్న వాడికి మునిగి పోతున్న వాడి బాధ తెలియనట్టు.
---సత్తావుంటే వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ, తిరుపతి విజయవాడలో వెళ్ళి మీరూ దోచండి
ఆ దోచుకునే సత్తా మాకెం వద్దు. మీరే ఉంచుకోండి. మీ రాష్త్రంల ఏం చేస్తుకుంటారో మీ ఇష్టం.
---విభజిస్తే మరో జార్ఖండ్, చత్తీస్ ఘడ్ పుడతాయి
అవి బాగానే ఉన్నాయి, తమరెం బాధ పడక్కర్లేదు.
---ఒకసారి విరగ్గొడితే అతకడం
మళ్ళా అతకడమా? ఎందుకు సామీ?
@శ్రీకాంతాచారి:తెలబాన్లది ఆవేదన కాదు..అరాచకత్వం..మునిగి పొతున్నది మన తెలుగు వారందరి పరువు,ప్రతిష్ఠ..చెరువు గట్టు మీద కూర్చున్నదెవరో తెలీదు కానీ కొత్త రాష్ట్రం వస్తే అధికారం చెలాయించటానికి గోతి కాడ గుంట నక్కల్లా కూర్చుంది మాత్రం తెలబాన్లే! జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ బాగానే వుంటాయి. ఎందుకంటే మధు కోడాలకి దొచుకొనే అవకాశం ఇచ్చాయిగా! అసలు విరగ్గొడితే కదా అతికించే విషయం ఆలోచించటానికి? చాలా ప్రిమెట్యూర్ స్టేట్ మెంట్ అది.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteమధుకోడాల కంటే మన ఆంద్ర ప్రదేశ్ బాబులేం తక్కువగాదని తెలుసు కోండి. ఒక్కొక్కడు వేల, లక్షల కోట్లు దిగమింగి, పైగా దేవుళ్ళం, రైతు బాంధవులం అని చెప్పుకొని చలామణి అవుతున్నారు.
ReplyDelete/అవి బాగానే ఉన్నాయి, తమరెం బాధ పడక్కర్లేదు./
ReplyDeleteమరి అక్కడికెళ్ళి నీకు నచ్చిన ఆ బూతులస్వర్గంలో ఆనందంగా బ్రతికేయ్ ఆచారి, ఎవరొద్దన్నారు? కావాలంటే అలా పైకి బీహార్కి ఫేమిలీ తోల్కపో, పరెషాన్ చేయకుండ, మస్తుగ మజా షేయున్రి. గేడనున్నా తెలుగోనిగా నీ సుఖమే కోరతాం, ఆచారి. అల్విదా.. ( అబ్బ.. చత్తీస్గఢ్, జార్ఖండ్ నచ్చేటోల్లు వుంటారని తెలిసి దిల్ ఖుష్ అయినాది)
ఎవడు ఉంటాడో, ఎవడు పోతాడో ఒక్క పది రోజులు ఆగితే అదే తెలుస్తది. అయినా ఎక్కడికో పోయి బతికే యావ నీది. నేను ఇక్కడే ఉంటా, తెలంగాణా సాధించుకుంటా, బాధ పడకు తమ్మీ.
ReplyDeleteఎవడు ఉంటాడో, ఎవడు పోతాడో...
ReplyDelete------------
well said :)
100ఏళ్ళు ఆగుతా, తీసుకురాన్నా. :)) నే పుట్టకముందునుంచి షెప్తున్నార్, షెప్తున్నార్.. గేదీ! కిరసాయిల్ పోసుకుని చావొద్దు, కాలిన శవాల్ టివిలా చూడనీకి పరేషానైతది.
ReplyDeleteఆచారి,
ReplyDeleteతెలంగాణ బాత్ చోడో, మీ ముక్కన్నకు షెప్పి 10రోజుల్లో ప్యాజ్ రేటు 20రూ/కిలోకి రప్పించు. నీ బాంచన్ కాల్మొక్తా.. కోస్తా, రాయలసీమ మొత్తం నీ తెలంగాణకు రాసిస్తా.. :)) Snkr