భావోద్వేగాలలో చేసిన రాజీనామాలుగా చిత్రీకరిస్తూ తెలంగాణా ప్రాంత శాసన సభ్యుల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించటం సరైన చర్య కాదు. గతంలో కూడా స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి వున్నప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. దొంగ దీక్షలతో మభ్యపెట్టి, అన్ని పార్టీల అంగీకారం ఉందన్న తప్పుడు సమాచారం అందించి రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఒక్కసారిగా వచ్చిన భావోద్వేగ పరిణామమే సీమాంధ్ర శాసన సభ్యుల, ఎంపీల రాజీనామాలు! కానీ ఇప్పటి పరిస్థితి వేరు.. తెలంగాణా రావటంలేదన్న నిస్పృహ కావచ్చు.. లేదా నియోజక వర్గాల్లో తిరగనివ్వమన్న వేర్పాటు తీవ్ర వాదుల ఫత్వాలకి భయపడి కావచ్చు..రాజీనామా ఇచ్చిన వారంతా ఫలానా తేదీన ఇస్తామని ముందే చెప్పారు. ఆ విధంగానే చేసారు. ఇంక ఇందులో భావోద్వేగాలకు చోటెక్కడ? రాజీనామాలు తిరస్కరించటం అన్నది స్పీకర్ విచక్షణాదికారమే కావచ్చు. కానీ దానికి భావోద్వేగాల ముద్ర వేయటం తప్పు. ఇలా నిర్ణయించే ముందుగా శాసన సభ్యులందరినీ విడి విడిగా స్పీకర్ విచారించి వుంటే, వారిలో ఎందరు స్వచ్చందంగా రాజీనామా ఇచ్చారో, ఎంత మంది ఒత్తిడి కి లోనై ఇచ్చారో తేట తెల్లమయ్యేది! అలాగే కృత్రిమంగా కొనసాగింప బడుతున్న తెలంగాణా ఉద్యమం పట్ల ఆ ప్రాంత శాసన సభ్యుల నిబద్ధత కూడా బయట పడేది! రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలిస్తున్న ఉద్యమం పట్ల ఒక అంచనాకి వచ్చే అరుదైన అవకాశాన్ని స్పీకర్ చేజేతులా జార విడిచారనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
Sunday, July 24, 2011
Thursday, July 21, 2011
అసెంబ్లీ రౌడీలు!
పై అధికారుల ఆదేశానుసారం తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఏపీ భవన్ ఉద్యోగి పై, శాసన సభ్యుడినన్న అహంకారంతో ఒళ్ళు మదించిన తెలబాన్ మేనల్లుడు హరీష్ రావు చేసిన దౌర్జన్యం సహించరానిది. టీవీ కెమెరాల సాక్షిగా ఏపీ భవన్ ఓ ఎస్ డీ చంద్ర రావు పై హరీష్ రావు చేసిన దాడిని చూసిన దేశం మొత్తం నిర్ఘాంత పోయింది. చేసిన ఘన కార్యం చేసేసి, ఆనక తీరిగ్గా విచారిస్తున్నానంటూ క్షమాపణ చెప్పేస్తే చాలదు. ఇటువంటి అసెంబ్లీ రౌడీలని, అసెంబ్లీ రౌడీ సినిమాలో చూపించిన విధంగానే నడి వీధికి తెచ్చి, టీవీ కెమెరాల సాక్షిగా అదే ఉద్యోగి చంద్ర రావు చేత కుళ్ళ బొడిపించేయ్యటమే వారికి చెయ్యాల్సిన శాస్తి!
Wednesday, July 20, 2011
కాంగ్రేసు ని తెలుగు వారు క్షమించరు!
కేంద్రంలో యూ పీ ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి వెన్ను దన్నుగా మంది 33 మంది ఎంపీ లని అందించిన ఆంద్ర రాష్ట్రాన్ని ఏడాదిన్నర పాటు రావణ కాష్టంలా రగిలించాక, తీరిగ్గా ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబరు 9 ప్రకటన సమాచార లోపంతో ఇచ్చిన పొరపాటు ప్రకటనగా తేల్చేసారు. ఇదే విషయమై నేను రాసిన ఇంతకు ముందు టపా ఇక్కడ చదవచ్చు. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html
ఆంద్ర ప్రదేశ్ లో స్వపక్షం లేదా విపక్షం ఎవరు అధికారంలో వున్నా కూడా మన రాష్ట్రం పట్ల కాంగ్రేసుకి ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే! నిన్నటి వరకూ రాష్ట్ర విభజన విషయం తేల్చాల్సింది అధిష్టానమే-సోనియా నే అంటూ రాష్ట్ర నాయకత్వం భజన చేస్తుంటే చోద్యం చూస్తూ ఉండి....ఈ రోజు తెలుగు వారి సమస్యని తెలుగు వారే సామరస్యంతో పరిష్కరించుకోవాలంటూ సుద్దులు చెప్పటం కాల్చి వాత పెట్టి వెన్న రాసినట్లే ఉంది. ఇంతోటి పరిష్కారం చెప్పటానికి ఏడాదిన్నర సమయం తీసుకోవాలా? తదుపరి పరిణామాలు ఊహించకుండా తొందర పాటుతో డిసెంబరు 9 ప్రకటన చేసేసి, రాష్ట్రాన్ని తగల పెట్టి, అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టిన కాంగ్రేసు పార్టీని తెలుగు వారు ఎన్నటికీ క్షమించరు.
Sunday, July 17, 2011
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!
సీమాంధ్ర మంత్రి తోట నరసింహం పై తెలబాన్లు దౌర్జన్యం చేసిన దరిమిలా తమకు రక్షణ కరువైందని వాపోయిన మంత్రి టీజీ వెంకటేష్ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ హరీష్ రావు చేసిన ప్రకటన దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉంది. ఆయన పై సు మోటో గా కేసు బుక్ చేయాలనీ, మంత్రి పదవినుంచి తొలగించాలనీ ఇంకా చాల డిమాండ్లు చేసారు. గురువింద గింజ మాదిరిగా ఆరోపణలు చేసే ముందు తమ కింద ఎంత నలుపు వుందో తెలుసుకోక పోవటం ఆశ్చర్యకరం!
ఆంధ్రా వాలే భాగో....నాలుకలు కోస్తాం.. సీమాంద్రులని తరిమి కొడతాం... వారి ఆస్తుల్ని లాక్కుంటాం..ఇలా ఒకటా రెండా? ఎన్నెన్ని ప్రేలాపనలు! ఉద్యమం ముసుగులో ఏమి చేసినా, ఏమి వాగినా చెల్లి పోతుందన్న ధీమాలో చేసిన అకృత్యాలు ఎన్ని?
సు మోటో గా కేసులు బుక్ చేయాల్సి వస్తే ముందు తెలబాన్ల పైన బుక్ చేయాల్సిన కేసులు లెక్కకి అందవు.
గీతా ఆర్ట్స్ కార్యాలయాన్ని ఆక్రమించి తెలంగాణా బేనర్ కట్టటం... మర్యాద రామన్న షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో బలవంతంగా జై తెలంగాణా అనిపించటం...అదుర్స్ సినిమాని ఆడనివ్వబోమని బెదిరించడం...వాహనాలపై టీజీ స్టికర్లు వుండాలని హుకుం లు జారీ చేయటం...రాష్ట్రం రాకుండానే రాజ ముద్రని చలామణీ లోకి తేవటం..ఇలా చెప్పుకుంటూ పొతే కేసులు బుక్ చేయాల్సిన సంఘటనలు కోకొల్లలు.
అవన్నీ ఒకెత్తు. శాసన సభ్యుడైన నాగం ని (తెలుగు దేశంలో వుండగా) చితక్కొట్టటం, నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడినందుకు టీవీ కెమెరాల సాక్షిగా కొట్టండి రా వాణ్ని అంటూ జే పీ పై భౌతిక దాడికి దిగటం, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలని ద్వంసం చేయటం ఆటవిక చర్యలు కావా? వాటి పై చర్యలు తీసుకోకూడదా ?
అన్నిటికన్నా దారుణం..తెలుగు జాతి చరిత్రకి సగర్వ సాక్షులైన టాంకు బండ్ విగ్రహాల్ని ద్వంసం చేయటం. అందుకుగాను మిలియన్ మార్చ్ నిర్వాహకులని శిక్షించటం...ఆధ్వర్యం వహించిన పార్టీని నిషేధించటం చెయ్యాలి. కానీ అటువంటి చర్యలేమీ తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చో బట్టే నేడు తెలబాన్లు ఉద్యమం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలుసు పెచ్చు మీరటంతో, ప్రభుత్వంలో భాగమైన మంత్రినే వేలెత్తి చూపుతున్నారు. కానీ ఒక వేలెత్తి చూపితే, నాలుగు వేళ్ళు తమకేసే చూస్తాయన్న నిజం మూర్ఖ తెలబాన్లకి ఎప్పుడు అర్ధం అవుతుందో?
Thursday, July 14, 2011
అరాచకత్వానికి హద్దే లేదా?
రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది పని చేస్తోందా అని సందేహం వస్తోంది. వేర్పాటు వాదం వెర్రి తలకెక్కి రైల్ రోకో అనగానే ప్రభుత్వమే ముందుగా రైళ్ళని రద్దు చేయటం చేతగాని తనమే. రైళ్ళ రద్దు వల్ల ఏర్పడే కోట్లాది రూపాయల నష్టానికీ, ప్రయాణీకుల కష్టాలకీ బాధ్యత ఎవరిది? ముమ్మాటికీ ఈ చేతకాని ప్రభుత్వానిదే.. ఉద్యమం ముసుగులో తామేం చేసినా చెల్లి పోతుందన్న అభిప్రాయం ఇప్పటికే తెలబాన్ల నర నరాల్లో జీర్ణించుకు పోయింది. దానికి తోడు ప్రభుత్వమే చేవ చచ్చిన రీతిలో ఇలా తోక ముడిచేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ముందు తన ఉద్యోగులనే కట్టడి చేయలేక పోతోంది. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజా సేవ చేయాల్సిన ఉద్యోగులు అర్ధం పర్ధం లేని డిమాండ్లతో ఆగష్టు ఒకటినుండి పని చేయ బోమని బెదిరించటం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన అలుసే. తెలుగు వారి చరిత్రకి సగర్వ సాక్ష్యాలైన టాంకు బండు విగ్రహాల్ని కూల్చిన వారిపై ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక ఈ రోజు నల్గొండ జిల్లా చుట్టూ గోడ కట్టేస్తామని బెదిరించాడో మాజీ మంత్రి! అసలు తెలంగాణా ఉద్యమ వాదంలో సహేతుకత ఎంత వుంది, ఈ సమస్యకి అత్యుత్తమ పరిష్కారం ఏమిటి తదితర విషయాలన్నీ శ్రీకృష్ణుడు ఏనాడో కుండ బద్దలు కొట్టేసాడు. అయినా కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే చోద్యం చూస్తూ కూచోటం క్షమార్హం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వేచి చూసే ధోరణి మాని రాష్ట్రం లో పరిస్థితులు గాడిన పడే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలుకి చిత్త శుద్ధితో కార్యాచరణ సాగించాలి. తద్వారా దేశంలో ఇతర ప్రాంతాల్లో వేర్పాటు వాదాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
Subscribe to:
Posts (Atom)