Saturday, August 27, 2011
Thursday, August 25, 2011
సాక్షి మూత పడకూడదు!
జగన్ సామ్రాజ్యం కూలుతోంది. సుప్రీం కోర్టు కూడా జగన్ కి బాసట గా నిలవలేదు. కనుక కేంద్రం ఖచ్చితంగా జగన్ పై చర్యల పదును పెంచుతుంది. జగన్ జైలుకి వెళ్ళ వచ్చు. ఆయన ఆస్తులన్నీ ప్రభుత్వ పరం కావచ్చు. ఇంకా ఏమైనా జరగ వచ్చు. కానీ ఎలాంటి పరిస్థితిలోనూ సాక్షి పత్రిక ప్రచురణ మాత్రం ఆగి పోకూడదని సగటు తెలుగు పాఠకుడి కోరిక. సాక్షి పత్రికలో రెండు పూర్తి పేజీలు జగన్ భజనకి వదిలేసినా మిగిలిన 14 పేజీల్లోనూ క్వాలిటీ తో కూడిన సమాచారం/శీర్షికలు అందిస్తున్నారనేది సత్యం. రాజకీయ వార్తల్లో కూడా ప్రజలకి ఒకే కోణంలో సమాచారం అందించ బడుతున్న రోజుల్లో రెండో కోణం కూడా ప్రజలకి చూపడం సాక్షి చేసింది. అంతే కాదు. ఇతర పత్రికలు కూడా క్వాలిటీ పెంచుకోవాల్సిన పోటీ వాతావరణం సాక్షి సృష్టించింది. ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉంటేనే వినియోగ దారునికి నాణ్యమైన సేవలు లభిస్తాయి. వార్తా పత్రికలైనా అంతే. అందరికీ గుర్తు వుండే వుంటుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించిన రోజుల్లో రూపాయికే పత్రిక ని అంద జేసింది. ఆ దెబ్బకి తెలుగు పత్రికలన్నీ కూడా అదే ధరకి దిగి వచ్చాయి. అలాగే వార్తా పత్రికల్లో పని చేసే జర్నలిష్టులకి, ఇతర ఉద్యోగులకి కూడా మంచి జీతాలు, భత్యాలు సాక్షి వచ్చాకే అందుతున్నాయని తెలిసిందే. అటువంటప్పుడు సాక్షి కనుక మూత పడితే పోటీ వాతావరణం అనేది వుండదు. ప్రజలకి ఇంక చాయిస్ అనేది వుండదు. జర్నలిష్టులకి కూడా ఉద్యోగ భద్రత అనుమానమే! కనుక జగన్ దారి ఎటైనా సాక్షి మాత్రం కొనసాగాలని ఆకాంక్షిద్దాం.
Wednesday, August 17, 2011
నో వర్క్...నో పే.. ఇది కూడా కోర్టులే చెప్పాలా?
పని చేయని ప్రభుత్వోద్యోగులకి జీతాలివ్వాల్సిన పని లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన 1617 జీవో ని కొట్టివేస్తూ జీవో 177 అమలు పరచాల్సిందే అంటూ కొరడా ఝుళిపించింది. ఏడాదికి ఉన్న 365 రోజుల్లో 52 ఆది వారాలు, 15 పండుగ సెలవులు, ఇంకా కాజువల్ లీవు, ఐచ్చిక సెలవులు, గట్రాలతో మూడో వంతు పైన రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రభుత్వోద్యోగులకి లభిస్తున్నాయి. ఇక మిగిలిన రెండు వందల రోజులైనా సక్రమంగా పని చేయకుండా బందుల పేరుతొ, సమ్మెల సాకుతో పని ఎగ్గొడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోటం శోచనీయం. ఉద్యోగులకి తాము ఉద్యోగంలో చేరేనాడు తెలియదా ..తాము ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వుద్యోగులమని? మరి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులుగా ఉంటూ రాని తెలంగాణా వంకతో విధులు ఎగ్గొడితే అప్పనంగా జీతాలు ఇవ్వాలా? ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కోదండరాం రెండేళ్లుగా ఏం చేస్తున్నారు? ఆయనకి కాన్దక్టు రూల్సు వర్తించవా? అంతే కాదు. ఈ తీర్పు కేవలం ఉద్యోగులకే కాక - పని చేయని మంత్రులకూ, శాసన సభ్యులకి కూడా వర్తింప జేయాలి. శాసన సభ్యులందరికీ తెలుసు తాము ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ఉన్నామని! అలాగే మంత్రులకి కూడా తెలుసు.. తాము 23 జిల్లాలకు సేవ చేయాల్సిన బాధ్యత తమకి వుందని! అటువంటిది ఉద్యమం పేరుతొ విధులు ఎగ్గొడుతున్న మంత్రి వర్యులకి జీతాలు ఆపాలి. సౌకర్యాలు తొలగించాలి. కోర్టు సు మోటో గా ఈ విషయంలో కలుగ జేసుకొని పని చేయని ప్రొఫెసర్లకి,రాజకీయులకి తగిన గుణ పాఠం చెప్పాలి.
Sunday, August 14, 2011
ఇల్లలుకగానే పండుగ కాదు!
హైదరాబాద్.....23జిల్లాలతో కూడిన మన రాష్ట్రానికి రాజధాని... రాష్ట్రంలోని ప్రతి జిల్లా వారికి హైదరాబాద్ తో ఏదో ఒక విధమైన అనుబంధం/సంబంధం వుంది. ఆ విధమైన అనుబంధం ఉండబట్టే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి చెందిన వారు తమ మేధో సంపత్తిని, ఆర్ధిక వనరుల్ని వుపయోగించి ఈ నగరాన్ని దేశంలోనే ఐదో పెద్ద నగరంగా అభివృద్ది చేసారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో 8 లక్షల పై సంఖ్యలో ప్రజలు హైదరాబాదు నుండి స్వస్థలాలకి వెళ్లి వస్తారని వెల్లడి అవుతోంది. దీన్ని బట్టే చెప్పవచ్చు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి హైదరాబాదుతో గల అనుబంధమేమిటో! ఇలా అన్ని ప్రాంతాల వారి సమిష్టి కృషితో వచ్చిన అభివృద్ది ఫలాలని, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలని అన్ని ప్రాంతాల వారికి అందించటం న్యాయం. ధర్మం. కానీ తాజాగా తెలబాన్ల తల తిక్క ఆందోళనలకి లొంగి, రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ నియామకాల్లో 14-F నిబంధన రద్దుకి ప్రతిపాదించటం, దాన్ని రాష్ట్రపతి ఆదర బాదరాగా ఆమోదించేయటం దురదృష్టకరం. రాష్ట్రం మొత్తానికి అందాల్సిన వాటాని కేవలం ఆరో జోన్ కి మాత్రమె అందించ బూనటం అక్రమమే. పైగా రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడగానే తెలబాన్ శ్రేణులు పండగ చేసుకోవటం మరింత మూర్ఖత్వం. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మొత్తం తెలంగాణా ప్రాంతం జీడీపీ లో ఆరో వంతు కేవలం హైదరాబాదు నగరంనుంచే వస్తోంది. దీన్ని బట్టే హైదరాబాద్ పోటేన్సి ఏమిటో అర్ధం అవుతోంది. అంత ప్రాముఖ్యత గల హైదరాబాదుని అప్పనంగా కొట్టేయాలనే దుగ్ధతోనే కొన్ని వేర్పాటు వాద శక్తులు తెలంగాణా ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఆరో జోన్ లో వచ్చే ఎస్ ఐ ఉద్యోగాల సంఖ్య అతి స్వల్పం. ఇంకా ఆ కొద్ది పాటి ఉద్యోగాల కోసం ఆరాట పడాల్సిన అగత్యంకూడా లేదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే. స్వల్ప విషయాలకే రాద్ధాంతం చేసి మిగతా ప్రాంతాల వారికి అన్యాయం చేయ తలపెట్టిన వారు రేపు ఖర్మ కాలి ప్రత్యెక రాష్ట్రం ఇస్తే హైదరాబాదులో సీమాన్ధ్రులని బతకనిస్తారా?? ఖచ్చితంగా లేదు అని వారి ప్రకటనలు, చేష్టలు నిరూపించాయి. నిరూపిస్తున్నాయి. కేంద్రం ఇకనైనా తాత్సారం చేసే ధోరణి కట్టి పెట్టి, విశాలాంధ్ర హితంలో ఆలోచించి, వేర్పాటు వాద ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచి వేయాలి. తద్వారా దేశంలో మరెక్కడా ఇటువంటి అభివృద్ది నిరోధక ఉద్యమాలు తలెత్తకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
Wednesday, August 10, 2011
తెలబాన్ చెల్లెమ్మ చిలక పలుకులు!
తెలంగాణా వచ్చుడో..కే సి ఆర్ సచ్చుడో... అని తెలబాన్ నాయకుడు ప్రకటించి ఎన్ని ఏళ్ళు గడిచిందో తెలీదు కానీ ఈ రోజు వరకు ఏదీ జరగలేదు. జరిగే అవకాశం కూడా కను చూపు మేరలో కనపడట్లేదు. అయితే ఉద్యమం పేరిట అమాయకుల (ఆత్మ) బలి దానాలు మాత్రం జరిగి పోతున్నాయి. హఠాత్తుగా ఈ విషయం విజయ శాంతికి ఎలా గుర్తుకి వచ్చిందో కానీ నిన్న తెలబాన్ మహిళల సమావేశంలో ఆమె తెలంగాణా కోసం ఎవరినీ బలి దానాలు చేయద్దనీ, అవసరమైతే, తానూ, అన్న కే సి ఆర్ చస్తమనీ చిలక పలుకులు పలికేసారు. తామంతా రాజీనామాలు చేస్తే భూకంపం వచ్చేస్తుందన్న బిల్డప్ ఇచ్చి తీరా ఈ రోజుకి కనీసం ఆ రాజీనామాల్ని ఆమోదింప జేసుకోవడం చేతకాని వారు ఏకంగా బలి దానాలు చేస్తామంటే నమ్మే స్థితిలో ఎవరూ లేరు. తెలంగాణా ప్రాంతంలో ఆధిపత్య పోరు కోసం కృత్రిమంగా జరిపించబడుతున్న ఈ ఉద్యమ కారణంగా యావత్తు రాష్ట్ర ప్రజానీకం ఇబ్బందుల పాలు, నవ్వుల పాలు కావటమే గాక రాష్ట్ర అభివృద్ది కూడా దశాబ్దాల వెనక్కి వెళ్లి పోయింది. తెలుగు వారే తేల్చుకుంటే ఇంకా కేంద్రం, హోం మంత్రి ఎందుకు? చావటానికా అని ప్రశ్నించిన తెలబాన్ చెల్లి నోటి దురుసులో అన్నకి ఏ మాత్రం తీసి పోనని నిరూపించింది. ఎంత పార్లమెంటు సభ్యులైతే మాత్రం కేంద్ర హోం మంత్రి గురించి ఇలా మాట్లాడడం నేరమే! కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, రోజుకో విధంగా విధ్వంసకర వ్యాఖ్యలు చేస్తున్న తెలబాన్ నాయకులని కట్టడి చేయాలి. అలాగే మార్చిల పేరుతొ, బందుల వంకతో నిత్యం ప్రజానీకాన్ని వేధిస్తున్న తెలబాన్ అనుచర గణం కూడా హద్దులు దాటకుండా చర్యలు చేపట్టాలి.
నయన తార మతం..ఎవరి అభిమతం?
సినీ నటి నయన తార హిందూ మతం స్వీకరించటం పై ఓ క్రిష్టియన్ సంస్థ కారాలు మిరియాలు నూరటం అర్ధ రహితం. పెళ్లి అయి, పిల్లలు గల వాడని, ఆస్తి అంతా మాజీ భార్యా బిడ్డలకే రాసిచ్చాడని తెలిసి కూడా ప్రభు దేవాని వివాహం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకొన్న వ్యక్తికి, తాను ఏ మతం పాటించాలన్న విషయంలో కూడా నిర్ణయం తీసుకొనే విచక్షణ, స్వేచ్చ వుంటాయి. వ్యక్తిగత స్వేచ్చని మీరి, మత సంస్థలు చేసే ఇటువంటి ప్రకటనలు ఆక్షేపణీయం. అయినా గతంలో ఎంతో మంది హిందూ మతంనుంచి క్రిష్టియన్ మతానికి మారిన సంఘటనలున్నాయి. ఆ మార్పిడులన్నీ ఎటువంటి ప్రలోభాలు, ప్రేరణలు లేకుండానే జరిగాయని ఎవరైనా చెప్ప గలరా? మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్చ స్ఫూర్తిగా, పర మత సహనం పాటిస్తున్న హిందూ సమాజాన్ని రెచ్చ గొట్టే ఇటువంటి ధోరణులని కొనసాగించడం - మంచి తనాన్ని చేతగాని తనంగా తీసుకోవడమే అవుతుంది.
Friday, August 5, 2011
ఏమిటీ అరాచకత్వం?
(ఆంద్ర జ్యోతి, ఆగష్టు 5 , 2011 )
ఆంధ్రా ప్రాంత అధికారి నిర్బంధం :
నారాయణఖేడ్, ఆగస్టు4: తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రా అధికారులు విధులు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్ గ్రామ పంచాయతీ భవనంలో ఆంధ్ర ప్రాంతాని కి చెందిన వ్యవసాయాధికారిని గురువారం రెండు గంటల పాటు నిర్బంధించారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీధర్ ఇటీవల నారాయణ్‌ఖేడ్ వ్యవసాయాధికారిగా బాధ్యతలు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా ర్యాకల్ గ్రామానికి వెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న తెలంగాణ నిరసనకారులు ఆంధ్రా అధికారుల వల్ల తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ.. శ్రీధర్‌ను గ్రామ పంచాయతీ భవనంలో నిర్బంధించారు. తెలంగాణ ప్రాంతంలో విధులు నిర్వహిస్తే ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు హెచ్చరించారు. 14ఎఫ్‌ను తొలగించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమాచారాన్ని గ్రామస్థులు ఎస్ఐ రవీందర్‌రెడ్డికి అందజేయడంతో ఆయన కలుగజేసుకొని నిర్బంధం నుంచి విడిపించారు.
--------
జడ్చర్ల, న్యూస్‌లైన్: జడ్చర్ల సీఐ విఠల్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా.. ఏసీ బీ అధికారులు పట్టుకున్న సంఘటన జడ్చర్లలో తీవ్ర కలకలం రేపింది. విష యం తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, తదితర పార్టీలతో పాటు జే ఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐని కో స్తాంధ్రకు చెందిన హోటల్ యజమాని, ఓ టీవీ ఛానల్ కుమ్మక్కై అక్ర మంగా కేసులో ఇరికించారని వారు ఆరోపించారు. సీఐకి మద్దతుగా తెలంగాణ నినాదాలు చేస్తూ పోలీస్‌స్టేషన్ లోపలికి చొచ్చుకు వెళ్లారు. సీఐ విఠల్‌రెడ్డి, ఏసీబీ అధికారులు ఉన్న క్వార్టర్‌పై దాడి చేసి, కి టికీల అద్దాలను పగులగొట్టారు. లోపలికి ప్రవేశించి, ఫైళ్లను చింపివేశారు. ఏసీబీ డీఎస్పీ రఘుపతిగౌడ్, తది తర ఇన్‌స్పెక్టర్లను బయటికి లాక్కొచ్చి, తీవ్రంగా కొట్టారు. దాడిలో డీఎస్పీ రఘుపతిగౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఏసీబీ అధికారులను పో లీస్‌స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. ఆందోళనకారులు అక్కడికి సైతం వెళ్లి, ఏసీ బీ అధికారుల పై దాడికి యత్నించారు. ఈ దశలో పోలీసు బలగాలు స్టేషన్ వద్దకు చేరుకొని, ఆందోళనకారులను స్టేషన్ బయటికి పంపించివేశారు. దీంతో ఆందోళనకారులు రహదారిపై రాస్తారోకో దిగి సీఐ కి మద్దతుగా, ఏసీబీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ శాసనసభ్యులు మల్లురవి, ఎంపీపీ నిత్యానందం, తది తర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పోలీస్‌స్టేషన్‌లో మకాం వేసి, పరిస్థితిని సమీక్షిం చారు. గాయపడ్డ ఏసీబీ అధికారులను అతికష్టం మీద ఆస్పత్రికి తరలిస్తుడగా ఏసీబీ అధికారుల వాహనంపై రాళ్లతో దాడి చేయడంతో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఎస్పీ సు ధీర్‌బాబు జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి, పరిస్థితి ని సమీక్షించారు. పలువురు డీఎస్పీలు, సీఐల నే తృత్వంలో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
హోటల్‌పై దాడి: పథకం ప్రకారమే సీఐని ఏసీబీ అధికారులకు ప ట్టించారని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన త్రీ స్టార్ హోటల్ యజమాని రామ్మోహన్‌కు చెందిన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కొత్తబస్టాండ్‌లోని హోటల్‌పై దాడి చేసి, అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే సమీపంలోని త్రీస్టార్ హోటల్‌పై దాడికి యత్నించగా, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
హోటల్‌పై దాడి: పథకం ప్రకారమే సీఐని ఏసీబీ అధికారులకు ప ట్టించారని ఆరోపిస్తూ.. అందుకు కారణమైన త్రీ స్టార్ హోటల్ యజమాని రామ్మోహన్‌కు చెందిన హోటల్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కొత్తబస్టాండ్‌లోని హోటల్‌పై దాడి చేసి, అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అలాగే సమీపంలోని త్రీస్టార్ హోటల్‌పై దాడికి యత్నించగా, అక్కడ మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
--------
(ఆంద్ర జ్యోతి, ఆగష్టు,5 , 2011 )
బీఎస్ఎన్ఎల్ కార్యాలయ ధ్వంసం కేసులో 14 మందికి పదేళ్ల్ల జైలు
ప్రొద్దుటూరు, ఆగస్టు 5 : సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ధ్వంసం కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పద్నాలుగు మంది ఉద్యమకారులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2009లో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ధ్వంసం, లోపల పరికరాల కాల్చివేతపై కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి నేరం రుజువు కావడంతో నిందితులు 14 మందికి పదేళ్ల జైలుశిక్షతో పాటు 25 వేల రూపాయల జరిమానా విధిస్తూ ప్రొద్దుటూరు సీనియర్ సివిల్ జడ్జి ఎ.శ్రీనివాసకుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే... సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకున్న క్రమంలో 2009 డిసెంబర్ 19న కొందరు ఉద్యమకారులు కొండాపురం పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అడ్డుకుని లోనికి ప్రవేశించారు. కార్యాలయంలో అద్దాలు పర్నిచర్ ధ్వంసం చేసి, అక్కడ వున్న ట్రాన్స్‌మిషన్ పరికరంపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. దీంతో బీఎస్ఎన్ఎల్ సంస్థకు సుమారు 2 లక్షల 32 వేలు నష్టం వాటిల్లిందంటూ ఆ సమయంలో విధులు నిర్వర్తిస్తున్న బాలమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కొండాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, కాల్చివేతపై చౌటపల్లె, పొట్టిపాడు, కొండాపురం, గండ్లూరు, రామచంద్రానగర్ తదితర గ్రామాలకు చెందిన 14 మందిపై అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రొద్దుటూరు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో కోర్టు ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ముద్దాయిలు 14 మందిని ప్రత్యేక వాహనంలో కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
-------
ఒకే రోజు వచ్చిన పై మూడు వార్తలు చూస్తె ఏమనిపిస్తోంది? తెలబాన్లు ఉద్యమం ముసుగులో ఎన్ని అరాచకాలు చేసినా నిద్ర నటిస్తున్న ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు సమైక్యాంధ్ర వాదుల పై మటుకు తమ ప్రతాపం చూపిస్తున్నాయి. విధ్వంసం చేసిన వారిని సమర్ధించటం నా ఉద్దేశ్యం కాదు. అయితే ఈ న్యాయం అందరికీ సమంగా వర్తింప జేయాలి. జాగో-భాగో...నాలుకలు కోస్తాం...ఆస్తులు లాక్కుంటాం... తరిమి కొడతాం...ఇంకా సవా లక్ష విధ్వంసకర ప్రకటనలు చేసిన నాయకుల పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అంతెందుకు..సాక్షాత్తు దేశ రాజధానిలో టీవీ కెమెరాల సాక్షిగా విధుల్లో ఉన్న దళిత ఉద్యోగిని చితక బాదిన తెలబాన్ మేనల్లుడికి ఇంత వరకు ఇంత వరకు ఏ శిక్షా పడలేదు! దాంతో మరింతగా రెచ్చి పోయి పాఠ్య పుస్తకాల్లో మా తెలుగు తల్లి పాట ఉన్న పేజీలు చించి తగల పెట్టమని వదరుతున్నాడీ వీరుడు! ఆ ప్రకటన రాష్ట్ర ప్రభుత్వాన్ని అవమానించడం కాదా! సు మోటో గా న్యాయస్థానాలు ఇటువంటి ధిక్కార వైఖరులపై స్పందించవా? నానాటికీ వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదాన్ని ఏదో ఒక స్థాయిలో కట్టడి చేయక పొతే, మన రాష్ట్ర భవిష్యత్తు ఈశాన్య భారతంలో ఉన్న అత్యంత వెనుక బడ్డ రాష్ట్రాల కన్నా అధ్వాన్నంగా తయారయ్యే రోజు ఎంతో దూరంలో వుండదు.
Subscribe to:
Posts (Atom)