Sunday, October 14, 2012

నందులు నవ్వి పోతున్నాయి!

 మన రాష్ట ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులకి ప్రాధాన్యత, పవిత్రత ఏనాడో గంగలో కలిసాయి. రాజకీయ కారణాల వల్లో లేదా సిఫార్సుల వల్ల మాత్రమె ఈ అవార్డులు ఇస్తున్నారన్నది నిష్టుర సత్యం.   తాజాగా 2011 సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించారు.  బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామ రాజ్యం ఉత్తమ చిత్రం గా ఎంపిక గావటంలో ఎటువంటి సందేహాలకి ఆస్కారం లేదు. అయితే ఆ ఉత్తమ చిత్రానికి పనిచేసిన దర్శకుడు ఉత్తమ దర్శకుడు కాక పోవటమే వింత!    హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.... పచ్చగా, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ఉత్తి పుణ్యానికి ముక్కలు చేయమనే తెలంగాణా ఉద్యమం ఆధారంగా తీసిన "జై బోలో తెలంగాణా" ఉత్తమ జాతీయ "సమైక్యతా" వాద చిత్రమట! ఆ సినిమా దర్శకుడు ఉత్తమ దర్శకుడట!  
 ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణా మూలాలు కలిగిన సినిమాలకి అవార్డులు కట్టబెట్టటం వెనుక ఉన్న ఆంతర్యం చిన్న పిల్ల వాడిని అడిగినా చెప్పేస్తాడు.   జ్యూరీ సభ్యులు ఎవరి మెప్పును పొంద గోరి ఈ అవార్డులు ప్రకటించారో లేదా ఎవరి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నారో అర్ధం కాదు.   ప్రైవేటు సంస్థలు ఇంకా చాలా అవార్డులు ప్రకటిస్తూ, ఇస్తూ వుంటాయి. అవి ఎవరికి, ఎందుకు ఇచ్చారన్నది మనకి అనవసరం. కానీ ప్రభుత్వ పరంగా ఇస్తున్న అవార్డుల విషయంలో వివాదాలకి తావు లేకుండా వ్యవహరించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం విస్మరించటం శోచనీయం.  

16 comments:

  1. అవి వేర్పాటువాదులకి వేసిన బిస్కెట్స్.. ఎగేసుకొని ఏరుకున్నారు.. గద్దర్ ఉత్తమ గాయకుడా? ఇంకా నయం.. కచర రాసిన పాటకి ఉత్తమ గే(హే)య రచయిత ఇవ్వలేదు.

    ReplyDelete
  2. గద్దర్ ఉత్తమ గాయకుడా?
    నంది అవార్డులా, బురద పంది అవార్డులా!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by a blog administrator.

      Delete

  3. జైబోలో తెలంగానని సమైక్యవాద సినిమా అనడం తెలబానుల మొహం మీద పడిన చెప్పు దెబ్బ. తెలంగాణ ద్రోహులైన ఆ చిత్ర దర్శకుడు, నిర్మాతలని తరి తరిమి కొట్టాల. రోడ్ల మీద బిరియానీ వండితే సెగ ఢిల్లీ తాకాల. బతుకమ్మను జాతీయ పండుగగా కేంద్రం వెంటనే ప్రకటించాల. ఆరోజు మద్యం దేశమంతా వుచితంగా పంచాల.

    ReplyDelete
  4. Hats off to director N. Shankar & singer Gaddar.

    ReplyDelete
    Replies
    1. కంగ్రాట్యులేషన్స్, జైగో. పార్టీ కబ్ దేరా? ;)

      ఫిలింఫేర్, ఫాల్కే అవార్డులు ఇవ్వాల అని డిమాండ్ చేయాల. అస్కార్ రావాలని మేము ఇక్కడ ఆశించుడు. గిన్నీస్ రికార్డు వచ్చేదాక గద్దర్ని, గోరేటి ఎంకన్నని అలా బేర్ మంటూనే వుండాలని చెప్పున్రి. :D

      SNKR

      Delete
  5. Irrespective of the politics, the movie inspired many students… Without a doubt , Gaddar is voice of people

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. నంనదులా పందులా! ఏడ్చి మొత్తుకుంటుంటే కొన్ని ఎంగిలి బొమికలు విదిలిచి వుంటారు, దొరకబుచ్చుకున్నోడికి దొరికినంత. ప్చ్.. పాపం. కోతిచేతివీణ సంబురాలు చూడండి, ఆ సూరి బావ కళ్ళలో ఆనందం సూడున్రి. :))
    అవార్డొచ్చిందా అన్నది వాళ్ళకే ఆశ్చర్యం, ఏమైనా సంతోషం ముఖ్యం. తెలగాన వచ్చుడు ఇంకో 20ఏళ్ళు రాకున్నా పరవాలేదు, ఇలాంటి ఫ్రీ బొమికలు విసురుతుంటే చాలు, దొరా.... మీ... :P

    ReplyDelete
  8. Now I understood the proverb "crying babies gets milk"

    ReplyDelete
  9. న్యూయార్క్ లో నాలుగు బస్సులు తగలేసి..వాషింగ్టన్ లో అర డజన్ విగ్రహాలు కూలదోస్తే...ఆస్కార్ అవార్డ్ కూడా రావచ్చేమో...'అంతర్జాతీయ సమైక్యతా అవార్డ్' మన దేశపు చిత్రానికి రావాలంటే ఈ పని చేయాల్సిందే..

    ReplyDelete
    Replies
    1. @john
      వాళ్ళు మన వాళ్ళ లాగ జోల పాట పాడరు. గుత్తి తెంపి చేతిలో పెడతారు.

      Delete